ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన మంత్రులు
ఉట్నూరు: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రులు ఆదివారం సందర్శించారు. మండల పరిధిలో ప్రబలుతున్న విషజ్వరాల పై ఏర్పాటు చేయనున్న సమీక్షా సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన మంత్రులు సామాజిక ఆరోగ్య కేంద్రంలోని రోగులతో మాట్లాడారు. వైద్యం ఎలా అందుతుందని ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీష్ రెడ్డి, అటవీశాఖ మంత్రి జోగురామన్న, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డితో పాటు ఆదిలాబాద్ ఎంపీ గెడెం నగేష్ పాల్గొన్నారు.