Geevadhan
-
హైదరాబాద్ కు వంశీకృష్ణ అవయవాలు
హైదరాబాద్ : విజయవాడలోని ఆంధ్రా ఆసుపత్రిలో ఓ యువకుడికి బ్రెయిన్ డెడ్ అయింది. తీవ్ర జ్వరంతో ఆస్పత్రిలో చేరిన వంశీకృష్ణ కోమాలోకి వెళ్లినట్టు ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. బ్రెయిన్ డెడ్ అని వైద్యులు చెప్పడంతో జీవన్‌దాన్ ద్వారా అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. దీంతో ఆంధ్రా ఆసుపత్రిలో ఆపరేషన్ నిర్వహించారు. వంశీకృష్ణ గుండెను హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రికి.. లివర్‌ను యశోద ఆసుపత్రికి తరలించారు. అవయవాల తరలింపు సందర్భంగా విజయవాడ నగరంలో పోలీసులు గ్రీన్ ఛానల్ చేపట్టి... బెంజి సర్కిల్ నుంచి గన్నవరం వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో అవయవాలను హైదరాబాద్‌కు తరలించారు. వంశీకృష్ణ.. మూత్రపిండాలు, కళ్లు విజయవాడలోని వివిధ ఆస్పత్రుల్లో బాధితులకు వినియోగించనున్నారు. -
'ఆంధ్రా ఆసుపత్రి'లో యువకుడికి బ్రెయిన్‌డెడ్..
-
ఆంధ్రా ఆసుపత్రిలో యువకుడికి బ్రెయిన్‌డెడ్..
-
ఆంధ్రా ఆసుపత్రిలో యువకుడికి బ్రెయిన్‌డెడ్..
విజయవాడ: విజయవాడలోని ఆంధ్రా ఆసుపత్రిలో ఓ యువకుడికి బ్రెయిన్ డెడ్ అయింది. తీవ్ర జ్వరంతో ఆస్పత్రిలో చేరిన వంశీకృష్ణ (29) అనే యువకుడు కోమాలోకి వెళ్లినట్టు ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. అయితే బ్రెయిన్ డెడ్ అని వైద్యులు చెప్పడంతో జీవన్‌దాన్ ద్వారా అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వంశీకృష్ణ గుండె, కాలేయాన్ని హైదరాబాద్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బెజవాడ ఆంధ్రా ఆసుపత్రి నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టు వరకు గ్రీన్ ఛానెల్‌ను ఏర్పాటు చేశారు. ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల మధ్యలో గ్రీన్ ఛానెల్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తునట్టు సమాచారం.