విజయవాడలోని ఆంధ్రా ఆసుపత్రిలో ఓ యువకుడికి బ్రెయిన్ డెడ్ అయింది.
విజయవాడ: విజయవాడలోని ఆంధ్రా ఆసుపత్రిలో ఓ యువకుడికి బ్రెయిన్ డెడ్ అయింది. తీవ్ర జ్వరంతో ఆస్పత్రిలో చేరిన వంశీకృష్ణ (29) అనే యువకుడు కోమాలోకి వెళ్లినట్టు ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. అయితే బ్రెయిన్ డెడ్ అని వైద్యులు చెప్పడంతో జీవన్‌దాన్ ద్వారా అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు సిద్ధమైనట్టు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో వంశీకృష్ణ గుండె, కాలేయాన్ని హైదరాబాద్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బెజవాడ ఆంధ్రా ఆసుపత్రి నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టు వరకు గ్రీన్ ఛానెల్‌ను ఏర్పాటు చేశారు. ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల మధ్యలో గ్రీన్ ఛానెల్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తునట్టు సమాచారం.