Gehna Vashisht
-
నటి గెహనా వశిష్ట్ ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరణ
సాక్షి, ముంబై : రాజ్‌కుంద్ర పోర్నోగ్రఫీ కేసులో నిందితురాలిగా ఉన్న నటి వందనా తివారీ అలియాస్ గెహనా వశిష్ట్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ముంబై సెషన్స్ కోర్టు గురువారం ఈ కేసుపై విచారణ జరిపింది. ఈ సందర్భంగా.. తాను గతంలో ఇలాంటి కేసులో అరెస్ట్ అయ్యాయని, తనకు సంబంధించిన లాప్‌ట్యాప్, ఫోన్లను క్రైమ్ బ్రాంచ్ సీజ్ చేసిందని గెహనా కోర్టుకు తెలిపింది. గతంలో ఆమె ఇలాంటి కేసులోనే అరెస్ట్ అవ్వటం కారణంగా ప్రస్తుతం పోలీస్ కస్టడీ అవసరం లేదని గెహనా తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే, వీడియోల చిత్రీకరణలో, ఫిర్యాదు చేసిన యువతిని బెదిరించటంలో గెహనా పాత్ర కీలకమని పోలీసులు కోర్టుకు తెలియజేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు గెహనా ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. కాగా, గత ఫిబ్రవరి నెలలో మొదటి సారిగా పోర్నోగ్రఫీ కేసులో ఆమెను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆమె బెయిల్‌పై విడుదల అయ్యారు. రెండవ సారి రాజ్‌కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో ఆమెపై కేసు నమోదైంది. జులై 19న రాజ్‌కుంద్రా అరెస్ట్ అయ్యారు. -
పోర్న్ రాకెట్: వాళ్లే ఈ నటి టార్గెట్!
ముంబై : పోర్న్ వీడియో రాకెట్ కేసులో నటి, మోడల్ గెహ్నా వశిష్ట్ శనివారం అరెస్టయిన సంగతి తెలిసిందే. క్రైం బ్రాంచ్ పోలీసులు ఆదివారం ఆమెను సిటీ కోర్టులో హాజరుపరచగా.. కోర్టు బుధవారం వరకు పోలీస్ కస్టడీ విధించింది. ఈ నేపథ్యంలో గెహ్నాను విచారించిన పోలీసులకు పలు కీలక విషయాలు తెలిశాయి. ఓ పోలీస్ అధికారి దీనిపై మాట్లాడుతూ.. ఆమె సినిమాల్లో అవకాశాల కోసం కష్టాలు పడుతున్న నటులను టార్గెట్ చేసేదని తెలిపారు. ఔత్సాహిక నటులను ట్రాప్ చేసి వారిని రూ.15 వేలు, రూ. 20 వేల కోసం పోర్న్ వీడియోలలో నటించేలా చేసేదని చెప్పారు. అలా 87 పోర్న్ వీడియోలను చిత్రీకరించిన ఆమె వాటిని తన వెబ్సైట్లో అప్లోడ్ చేసేదని, ఆ వీడియోలు చూడాలనుకునే వారి వద్ద నుంచి సబ్స్క్రిప్చన్ ఫీజు కింద రూ. 2 వేలు వసూలు చేసేదని వెల్లడించారు. సబ్స్క్రిప్చన్ల ద్వారా రూ. 36 లక్షల రూపాయలు సంపాదించిందని తెలిపారు. ( పోర్న్ వీడియో రాకెట్: నటి అరెస్ట్ ) దీనిపై గెహ్నా ప్రెస్, లీగల్ టీం స్పందిస్తూ.. ‘‘ గెహ్నా వశిష్ట్ అలియాస్ వందనా తివారీ అమాయకురాలు. పోర్న్ రాకెట్‌తో ఆమెకు ఎలాంటి సంబంధం లేదు. ప్రత్యర్థులు ఆమెను అపఖ్యాతిపాలు చేయటానికే ఈ కేసులో ఇరికించారు’’ అని పేర్కొంది. ( మోడల్స్, నటీ, నటులతో పోర్న్ వీడియోలు ) -
పోర్న్ వీడియో రాకెట్: నటి అరెస్ట్
ముంబై : నటి, మోడల్ గెహ్నా వశిష్ట్ పోర్న్ వీడియో రాకెట్ కేసులో అరెస్ట్ అయ్యారు. ఈ కేసుకు సంబంధించి ముంబై క్రై బ్రాంచ్ పోలీసులు శనివారం ఆమెను విచారణకు పిలిచారు. విచారణ అనంతరం.. పోర్న్ వీడియోల చిత్రీకరణ, ఆ వీడియోలను వెబ్సైట్లో అప్లోడ్ చేయటంలో గెహ్నా పాత్ర ఉన్నదన్న అనుమానంతో అరెస్ట్ చేశారు. దాదాపు 87 వీడియోలను ఆమె తన వెబ్సైట్లో ఉంచినట్లు ఆధారాలు లభించాయి. ఈ ఆదివారం ఆమెను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఈ కేసులో మరికొంతమంది మోడల్స్, నటీమణులు, ప్రొడక్షన్ హౌస్‌ల ప్రమేయం ఉన్నదని భావిస్తున్నారు. ‘ఫిల్మీ దునియా’ సినిమాతో హిందీ చిత్ర పరిశ్రమకు పరిచయమైన గెహ్నా పలు తెలుగు సినిమాల్లోనూ నటించారు. 2007లో వచ్చిన ఆపరేషన్ దుర్యోధనలో ఐటమ్ సాంగ్ చేశారు. ఆపరేషన్ దుర్యోధన 2, అనుకున్నది ఒకటి అయినది ఒకటి, నమస్తే, 33 ప్రేమ కథలు, ఐదు, ప్రేమించు పెళ్లాడు, బీటెక్ లవ్ స్టోరీ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ( మోడల్స్, నటీ, నటులతో పోర్న్ వీడియోలు ) కేసు వివరాలు.. ముంబై, మలద్‌లోని మల్వానీ ఏరియాలోని ఓ బంగ్లాలో పోర్న్ వీడియో చిత్రీకరణ జరుగుతోందని శుక్రవారం క్రైం బ్రాంచ్ పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో సదరు బంగ్లాపై పోలీసులు రైడ్ చేశారు. ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు నటులు, ఓ లైట్ మ్యాన్, మహిళా ఫొటోగ్రాఫర్, గ్రాఫిక్ డిజైనర్ ఇందులో ఉన్నారు. ఈ పోర్న్ వీడియో రాకెట్ నుంచి ఓ మహిళను సంరక్షించారు. నిందితులు మొబైల్ ఫోన్ల ద్వారా వీడియోలు తీస్తున్నట్లు గుర్తించారు. వారి వద్ద నుంచి ఐదు లక్షల రూపాయలు విలువ చేసే 6 మొబైల్ ఫోన్లు, ఒక లాప్‌ట్యాప్, కెమెరాను స్వాధీనం చేసుకున్నారు. -
బిటెక్ లవ్‌స్టోరీ మూవీ స్టిల్స్
-
బుజ్జి- బాజ్జీల ప్రేమకథ
లక్కీ, గెహనా వశిష్ట్ జంటగా ఎస్.ఎఫ్. క్రియేషన్స్‌పై సాయికళ్యాణ్బాబు నిర్మిస్తున్న ‘బుజ్జి-బాబ్జీ’ చిత్రం ఇటీవల ప్రారంభమైంది. యం.డి. ఫారూక్ దర్శకుడు. తణుకు, భీమవరంలో ఈ చిత్రం షెడ్యూల్స్‌ని ప్లాన్ చేశారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఇప్పటివరకు వచ్చిన ప్రేమకథా చిత్రాలకు భిన్నంగా ఉండే చిత్రం ఇది. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్ని వర్గాలవారిని ఆకట్టుకునే విధంగా ఉంటుంది’’ అని చెప్పారు. ‘‘ప్రేక్షకులకు ఓ మంచి చిత్రం ఇవ్వాలనే సంకల్పంతో మంచి కథతో ఈ సినిమా చేస్తున్నాం. లక్కీ, గెహనా వశిష్ట్ల పాత్రలు యూత్‌ని ఆకట్టుకుంటాయి’’ అన్నారు నిర్మాత. అలీ, రఘుబాబు, కృష్ణభగవాన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రాజ్‌కిరణ్, కెమెరా: ఇ.ఎస్.హెచ్ ప్రసాద్.