ముంబై : నటి, మోడల్ గెహ్నా వశిష్ట్ పోర్న్ వీడియో రాకెట్ కేసులో అరెస్ట్ అయ్యారు. ఈ కేసుకు సంబంధించి ముంబై క్రై బ్రాంచ్ పోలీసులు శనివారం ఆమెను విచారణకు పిలిచారు. విచారణ అనంతరం.. పోర్న్ వీడియోల చిత్రీకరణ, ఆ వీడియోలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయటంలో గెహ్నా పాత్ర ఉన్నదన్న అనుమానంతో అరెస్ట్ చేశారు. దాదాపు 87 వీడియోలను ఆమె తన వెబ్‌సైట్లో ఉంచినట్లు ఆధారాలు లభించాయి. ఈ ఆదివారం ఆమెను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఈ కేసులో మరికొంతమంది మోడల్స్, నటీమణులు, ప్రొడక్షన్ హౌస్‌ల ప్రమేయం ఉన్నదని భావిస్తున్నారు.
‘ఫిల్మీ దునియా’ సినిమాతో హిందీ చిత్ర పరిశ్రమకు పరిచయమైన గెహ్నా పలు తెలుగు సినిమాల్లోనూ నటించారు. 2007లో వచ్చిన ఆపరేషన్ దుర్యోధనలో ఐటమ్ సాంగ్ చేశారు. ఆపరేషన్ దుర్యోధన 2, అనుకున్నది ఒకటి అయినది ఒకటి, నమస్తే, 33 ప్రేమ కథలు, ఐదు, ప్రేమించు పెళ్లాడు, బీటెక్ లవ్ స్టోరీ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ( మోడల్స్, నటీ, నటులతో పోర్న్ వీడియోలు )
కేసు వివరాలు.. ముంబై, మలద్‌లోని మల్వానీ ఏరియాలోని ఓ బంగ్లాలో పోర్న్ వీడియో చిత్రీకరణ జరుగుతోందని శుక్రవారం క్రైం బ్రాంచ్ పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో సదరు బంగ్లాపై పోలీసులు రైడ్ చేశారు. ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు నటులు, ఓ లైట్ మ్యాన్, మహిళా ఫొటోగ్రాఫర్, గ్రాఫిక్ డిజైనర్ ఇందులో ఉన్నారు. ఈ పోర్న్ వీడియో రాకెట్ నుంచి ఓ మహిళను సంరక్షించారు. నిందితులు మొబైల్ ఫోన్ల ద్వారా వీడియోలు తీస్తున్నట్లు గుర్తించారు. వారి వద్ద నుంచి ఐదు లక్షల రూపాయలు విలువ చేసే 6 మొబైల్ ఫోన్లు, ఒక లాప్‌ట్యాప్, కెమెరాను స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment