బుజ్జి- బాజ్జీల ప్రేమకథ | Bujji Bajji is an upcoming Telugu love film | Sakshi
Sakshi News home page

బుజ్జి- బాజ్జీల ప్రేమకథ

Published Tue, Aug 20 2013 12:03 AM | Last Updated on Fri, Sep 1 2017 9:55 PM

బుజ్జి- బాజ్జీల ప్రేమకథ

బుజ్జి- బాజ్జీల ప్రేమకథ

లక్కీ, గెహనా వశిష్ట్ జంటగా ఎస్.ఎఫ్. క్రియేషన్స్‌పై సాయికళ్యాణ్‌బాబు నిర్మిస్తున్న ‘బుజ్జి-బాబ్జీ’ చిత్రం ఇటీవల ప్రారంభమైంది. యం.డి. ఫారూక్ దర్శకుడు. తణుకు, భీమవరంలో ఈ చిత్రం షెడ్యూల్స్‌ని ప్లాన్ చేశారు. 
 
 దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఇప్పటివరకు వచ్చిన ప్రేమకథా చిత్రాలకు భిన్నంగా ఉండే చిత్రం ఇది. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అన్ని వర్గాలవారిని ఆకట్టుకునే విధంగా ఉంటుంది’’ అని చెప్పారు. ‘‘ప్రేక్షకులకు ఓ మంచి చిత్రం ఇవ్వాలనే సంకల్పంతో మంచి కథతో ఈ సినిమా చేస్తున్నాం.
 
 లక్కీ, గెహనా వశిష్ట్‌ల పాత్రలు యూత్‌ని ఆకట్టుకుంటాయి’’ అన్నారు నిర్మాత. అలీ, రఘుబాబు, కృష్ణభగవాన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రాజ్‌కిరణ్, కెమెరా: ఇ.ఎస్.హెచ్ ప్రసాద్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement