General insurance industry
-
స్థూల ప్రీమియం ఆదాయం 12 శాతం అప్!
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జనరల్ ఇన్సూరెన్స్ పరిశ్రమ స్థూల ప్రత్యక్ష ప్రీమియం ఆదాయం (జీడీపీఐ) 10–12 శాతం మేర వృద్ధి నమోదు చేయవచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా రేటింగ్స్ ఒక నివేదికలో వెల్లడించింది. ఆరోగ్య బీమాపై అవగాహన పెరుగుతుండటం, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటూ ఉండటం తదితర అంశాలు ఇందుకు దోహదపడగలవని వివరించింది. ప్రభుత్వ రంగ బీమా సంస్థల (పీఎస్‌యూ) జీడీపీఐ వృద్ధి 4–6 శాతానికి పరిమితం కావచ్చని, ప్రైవేట్ రంగ ఇన్సూరెన్స్ సంస్థలు 13–15 శాతం మేర వృద్ధి చెందవచ్చని .. తద్వారా మార్కెట్ వాటాను మరింత పెంచుకునే అవకాశం ఉందని నివేదిక తెలిపింది. 2022లో ప్రైవేట్ రయ్.. 2021 ఆర్థిక సంవత్సరంలో జీడీపీఐ వృద్ధి 4 శాతానికే పరిమితం కాగా కోవిడ్–19పరమైన ప్రతికూల పరిస్థితులు తగ్గి, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడంతో 2022 ఆర్థిక సంవత్సరంలో జీడీపీఐ మెరుగుపడి 11 శాతానికి చేరిందని అంచనా వేస్తున్నట్లు ఇక్రా పేర్కొంది. పీఎస్‌యూ బీమా సంస్థల జీడీపీఐ వృద్ధి అయిదు శాతంగా ఉండొచ్చని, ప్రైవేట్ రంగ బీమా సంస్థల ప్రీమియం ఆదాయం మాత్రం 14 శాతం మేర పెరిగి ఉంటుందని తెలిపింది. దేశవ్యాప్తంగా పాక్షికంగా లాక్డౌన్లు ఉన్నప్పటికీ 2021–22 తొలి 11 నెలల్లో హెల్త్ సెగ్మెంట్లో స్థూల ప్రీమియం ఆదాయాలు ఏకంగా 26 శాతం పెరగ్గా, అగ్నిప్రమాదాల బీమా విభాగం ప్రీమియం ఆదాయాలు 8 శాతం స్థాయిలో పెరిగాయని ఇక్రా వివరించింది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో మొత్తం హెల్త్ క్లెయిమ్స్‌లో కోవిడ్ క్లెయిమ్‌ల వాటా 6 శాతంగా నమోదైంది. 2021–22లో ఇది 11–12 శాతంగా ఉంటుందని అంచనా. -
లిస్టింగ్‌లోనే జీఐసీ నేలచూపులు
న్యూఢిల్లీ: రీఇన్సూరెన్స్ సంస్థ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (జీఐసీ) షేర్లు లిస్టింగ్ రోజున నష్టాలు చవిచూశాయి. ఇష్యూ ధర రూ. 912తో పోలిస్తే 4.5 శాతం క్షీణించి ఇన్వెస్టర్లను నిరాశపర్చాయి. బుధవారం బీఎస్ఈలో ఇష్యూ ధర కన్నా దాదాపు 7 శాతం తక్కువగా రూ. 850 వద్ద జీఐసీ షేర్లు లిస్ట్ అయ్యాయి. ఆ తర్వాత ఒక దశలో 14.44 శాతం మేర పడిపోయి రూ. 780.25కి కూడా క్షీణించాయి. చివరికి 4.56 శాతం నష్టంతో రూ. 870.40 వద్ద ముగిశాయి. కంపెనీ వేల్యుయేషన్ రూ. 76,351 కోట్లుగా నిలిచింది. రూ.855–912 ధరల శ్రేణితో పబ్లిక్ ఇష్యూకి వచ్చిన జీఐసీ రూ.11,370 కోట్లు సమీకరించింది. -
సాధారణ బీమా పరిశ్రమ ప్రీమియంలో 16 శాతం వృద్ధి
ముంబై: ముగిసిన ఏప్రిల్ నెలలో సాధారణ బీమా పరిశ్రమ ప్రీమియం వసూళ్లలో 16 శాతం వృద్ధి సాధించింది. ఇది గతేడాది ఇదేనెలలో పోలిస్తే రూ. 10,500 కోట్ల నుంచి రూ. 12,206 కోట్లకు పెరిగినట్లు ఐఆర్డీఏ డేటా వెల్లడిస్తోంది. 2017 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఈ ప్రీమియం వసూళ్లు 30 శాతం వృద్ధిచెందాయి. అయితే ఏప్రిల్ నెల గణాంకాల్లో పంట బీమా విభాగం లేనందున వృద్ధి తక్కువగా కన్పిస్తోంది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో ఈ విభాగం నుంచి రూ. 18,000 కోట్ల ప్రీమియం వసూళ్లు జరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఖరీఫ్ సీజన్ మొదలయ్యాక, పంట బీమా ప్రీమియం వసూళ్లు జరుగుతాయి. ఇక ఏప్రిల్ నెల ప్రీమియం వసూళ్లకు సంబంధించి ప్రైవేటు రంగ సాధారణ బీమా కంపెనీల వృద్ధి ప్రభుత్వ కంపెనీలను దాటింది. ముగిసిన నెలలో ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీల ప్రీమియం వసూళ్లు 5.42 శాతం వృద్ధితో రూ. 5,906 కోట్లకు చేరగా, ప్రైవేటు రంగ కంపెనీల వసూళ్లు 27.88 శాతం వృద్ధిచెంది రూ. 6,302 కోట్లకు పెరిగాయి. ఏప్రిల్ 1 నుంచి థర్డ్‌పార్టీ మోటార్ ఇన్సూరెన్స్ ప్రీమియం పెరిగిన నేపథ్యంలో ఈ వసూళ్లు అత్యధికంగా 23 శాతం వృద్ధిచెందాయి. ఆరోగ్య బీమా ప్రీమియం వసూళ్లు 9 శాతం పెరగ్గా, ఏవియేషన్, మెరైన్ విభాగాలు ప్రతికూల వృద్ధిని నమోదుచేసినట్లు ఐఆర్డీఏ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.