General Motors Company
-
అమెరికాలో అమెరికన్ కంపెనీకి దిమ్మదిరిగే షాక్..!
అమెరికన్ ఆటోమొబైల్ మార్కెట్లలో ప్రముఖ జపనీస్ ఆటోమొబైల్ దిగ్గజం టయోటా మోటార్స్ సంచలనం సృష్టించింది. 90 సంవత్సరాల తరువాత అమెరికాలో అత్యధికంగా అమ్ముడైన కార్ల బ్రాండ్‌గా టయోటా నిలిచింది. 2021లో భారీ అమ్మకాలు..! 2021గాను యుఎస్ ఆటోమొబైల్ మార్కెట్లలో అత్యధికంగా కార్లను విక్రయించిన కిరీటాన్ని టయోటా మోటార్స్ సొంతం చేసుకుంది. స్థానిక ఆటోమొబైల్ దిగ్గజం జనరల్ మోటార్స్ షాకిస్తూ టయోటా మోటార్స్ గత ఏడాది అమెరికాలో అత్యధిక కార్లను సేల్ చేసింది. 2021లో సుమారు 2.332 మిలియన్ వాహనాలను టయోటా విక్రయించింది. ఇక జనరల్ మోటార్స్ గత ఏడాదిలో 2.218 మిలియన్ యూనిట్ల అమ్మకాలను జరిపింది. అనూహ్యమైన పరిస్థితుల్లో..! ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సెమీకండక్టర్స్ సమస్య ఆటోమొబైల్ ఇండస్ట్రీని కుదేలయ్యేలా చేసింది. దీంతో ఆయా కంపెనీల ఉత్పత్తికి ఆటంకం ఏర్పడి అమ్మకాలపై భారీ దెబ్బ పడింది. ఇక అమెరికన్ దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీ జీఎం మోటార్స్ కూడా చిప్స్ కొరత తీవ్రంగా వేధించింది. దీంతో అమెరికాలో 2021గాను జీఎం మోటార్స్ అమ్మకాలు 13 శాతానికి తగ్గాయి. క్యూ 4లో ఏకంగా అమ్మకాలు 43 శాతానికి పడిపోయాయి. అయితే చిప్స్ కొరత ఉన్నప్పటీకి అనూహ్యంగా 2021గాను అమెరికాలో టయోటా మోటార్స్ 10 శాతం వాహన అమ్మకాలను పెంచుకోగలిగింది. చదవండి: నానో కారు కంటే చిన్న కారును లాంచ్ చేసిన టయోటా..! ధర ఎంతంటే..? -
జనరల్ మోటార్స్ కార్ల రేట్లు పెంపు
న్యూఢిల్లీ: జనరల్ మోటార్స్ కంపెనీ కూడా కార్ల ధరలను పెంచుతోంది. వచ్చే నెల నుంచి అన్ని మోడళ్ల ధరలను 2% వరకూ పెంచుతున్నామని జనరల్ మోటార్స్ తెలిపింది. పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలు, విదేశీ మారకద్రవ్య ఒడిదుడుకులను తట్టుకోవడానికి ధరలు పెంచక తప్పడం లేదని కంపెనీ పేర్కొంది. ఇటీవల మార్కెట్లోకి తెచ్చిన ప్రీమియం స్పోర్ట్స్ యుటిలిటి వెహికల్(ఎస్యూవీ) ట్రైల్బ్లేజర్కు ధరల పెంపు వర్తించదని పేర్కొంది. ఉత్పత్తి వ్యయాలు పెరుగుతుండడం, విదేశీ మారకద్రవ్య ఒడిదుడుకులను తట్టుకోవడానికి పలు కార్ల కంపెనీలు వివిధ మోడళ్ల ధరలను వచ్చే నెల నుంచి పెంచుతున్నాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టయోటా, మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ కంపెనీలు ధరలను పెంచనున్నట్లు పేర్కొన్నాయి. -
భారత్‌లో జనరల్ మోటార్స్
రూ.6,400 కోట్ల పెట్టుబడులు ♦ ప్రధానితో కంపెనీ ప్రతినిధుల భేటీ ♦ ఐదేళ్లలో పది కొత్త మోడళ్లు న్యూఢిల్లీ : అమెరికాకు చెందిన జనరల్ మోటార్స్ కంపెనీ భారత్‌లో వంద కోట్ల డాలర్లు(రూ.6,400 కోట్లు) పెట్టుబడులు పెడుతోంది. 20 ఏళ్లుగా భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పటికీ, తగినంత మార్కెట్ వాటా సాధించలేకపోయిన ఈ కంపెనీ తాజాగా ఈ స్థాయిలో ఇన్వెస్ట్ చేయనున్నది. టర్న్అరౌండ్ ప్రణాళికలో భాగంగా ఐదేళ్లలో దేశీయంగా తయారయ్యే పది కొత్త మోడళ్లను అందించనున్నామని, గుజరాత్‌లోని హలోల్ ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిపి వేస్తామని జనరల్ మోటార్స్ సీఈఓ మేరీ బర్రా చెప్పారు. మోదీతో కంపెనీ సీఈఓ సమావేశం.. మేరీ బర్రా కంపెనీ ఇతర ప్రతినిధులతో కలసి బుధవారం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. తమ ప్రణాళికలను ఆయనకు వివరించారు. బర్రాతో పాటు జనరల్ మోటార్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ (జనరల్ మోటార్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కూడా) స్టెఫాన్ జాకొ బి, జనరల్ మోటార్స్ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ అర్వింద్ సక్సేనా కూడా మోదీని కలిశారు. నష్టాలొస్తున్నా, ముందుకే.. 1996లో కార్యకలాపాలు ప్రారంభించిన జనరల్ మోటార్స్ భారత్‌లో ఇప్పటిదాకా వంద కోట్ల డాలర్ల వరకూ పెట్టుబడులు పెట్టింది. అప్పటి నుంచి ఈ కంపెనీకి రూ.2,740 కోట్ల నష్టం వచ్చింది. నష్టాలు వస్తున్నప్పటికీ, భారత్ ముఖ్యమైన మార్కెట్ కాబట్టి ఇంత భారీస్థాయిలో పెట్టుబడులు పెడుతున్నామని మేరీ బర్రా పేర్కొన్నారు. భారత్, చైనా, మెక్సికో, బ్రెజిల్ వంటి వృద్ధి చెందుతున్న మార్కెట్లలో వ్యాపారాన్ని పటిష్టం చేసుకోవడానికి 500 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టాలని మాతృకంపెనీ జనరల్ మోటార్స్ నిర్ణయించిందని తెలిపారు. దీంట్లో ఐదవ వంతు (వంద కోట్ల డాలర్లు) భారత్‌లో ఇన్వెస్ట్ చేయనున్నామని వివరించారు. వీటిల్లో అధిక భాగం తెలగావ్ ప్లాంట్‌పై ఖర్చు చేస్తామని ఆమె తెలిపారు. అక్టోబర్‌లో ట్రైల్బ్లేజర్ పదేళ్లలో ఐదు కొత్త మోడళ్లను భారత్‌లో అందించనున్నామని బర్రా తెలిపారు. దీంట్లో భాగంగా ట్రైల్బ్లేజర్ ఎస్‌యూవీని ఈ ఏడాది అక్టోబర్‌లో, షెవర్లే బ్రాండ్ కింద స్పిన్ మల్టీ పర్పస్ వెహికల్‌ను 2017లో అందించనున్నామని పేర్కొన్నారు. మహారాష్ట్రలోని తెలగావ్ ప్లాంట్ లో ఉత్పత్తి కార్యకలాపాలను కన్సాలిడేట్ చేసేందుకుగాను గుజరాత్‌లోని హలోల్ ప్లాం ట్లో ఉత్పత్తిని నిలిపేస్తున్నామని వివరించారు. హలోల్ ప్లాంట్‌లో వచ్చే ఏడాది జూన్ తర్వాత ఉత్పత్తి నిలిపివేస్తామని పేర్కొన్నారు. హలోల్ ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిపేయడం వల్ల 1,100 మంది ఉద్యోగులపై ప్రభావం పడుతుందని, తెలగావ్ ప్లాంట్‌పై పెట్టుబడుల వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 12,000 కొత్త ఉద్యోగాలొస్తాయని వివరించారు. -
1.5 లక్షల జనరల్ మోటార్స్ వాహనాల రీకాల్
న్యూఢిల్లీ: జనరల్ మోటార్స్ కంపెనీ 2007-14 మధ్యలో తయారైన దాదాపు 1.55 లక్షల వాహనాలను (బీట్, ఎంజాయ్, షెవర్లే స్పార్క్ మోడళ్లతో కలుపుకొని) రీకాల్ చేసింది. రిమోట్ కీలెస్ ఎంట్రీ యాక్సిసరి ఫిటింగ్ సమస్య కారణంగా ఈ కార్లను రీకాల చేస్తున్నామని తెలిపింది. ఎలాంటి చార్జీలు వసూలు చేయకుండా ఉచితంగానే ఈ సమస్యను సరిచేస్తామని తెలిపింది. -
జనరల్ మోటార్స్ ఎంజాయ్.. కొత్త వేరియంట్
ధరలు రూ.6.24-8.79 లక్షల రేంజ్లో న్యూఢిల్లీ: జనరల్ మోటార్స్ కంపెనీ మల్టీ పర్పస్ వెహికల్ ఎంజాయ్‌లో అప్డేటెడ్ వెర్షన్‌ను సోమవారం మార్కెట్లోకి తెచ్చింది. ఈ వేరియంట్ ధరలను రూ.6.24 లక్షల నుంచి రూ.8.79 లక్షల(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) రేంజ్లో నిర్ణయించామని జనరల్ మోటార్స్ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ అరవింద్ సక్సేనా చెప్పారు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, డోర్ ఆర్మ్‌రెస్ట్‌లపై గ్లాసీ బ్లాక్ ఫినిష్ వంటి వివిధ ఫీచర్లతో ఈ వేరియంట్లను రూపొందించామని వివరించారు. -
జనరల్ మోటార్స్ భారీ డిస్కౌంట్స్
రూ.55,000 నుంచి రూ.85,500 రేంజ్లో చెన్నై: జనరల్ మోటార్స్ కంపెనీ తన కార్లపై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. క్యాప్టివా ఎస్యూవీ మినహా ఇతర కార్లపై రూ.55,000 నుంచి రూ.85,500 వరకూ డిస్కౌంట్‌ను ఇస్తున్నామని జనరల్ మోటార్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్(సేల్స్ అండ్ మార్కెటింగ్) రాజేశ్ సింగ్ చెప్పారు. నగదు డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్/లాయల్టీ బోనస్, కార్పొరేట్ బోనస్‌ల రూపంలో ఈ డిస్కౌంట్లను అందిస్తామని వివరించారు. సెయిల్ సెడాన్, షెవర్లే తవేర పై రూ.55,000, షెవర్లే క్రూజ్‌పై రూ.60,000, షెవర్లే స్పార్క్‌పై రూ.68,000, బీట్ మోడల్‌పై రూ. 83,000, షెవర్లే ఎంజాయ్పై రూ.85,500 చొప్పున డిస్కౌంట్లనందిస్తామని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 255 సేల్స్ అవుట్లెట్లు, 272 సర్వీస్ అవుట్లెట్ల ద్వారా వినియోగదారులకు సేవలు అందిస్తున్నా మని.. ఈ ఆఫర్ పరిమితకాలమే అందుబాటులో ఉంటుందని రాజేశ్‌సింగ్ తెలిపారు.