అమెరికన్ ఆటోమొబైల్ మార్కెట్లలో ప్రముఖ జపనీస్ ఆటోమొబైల్ దిగ్గజం టయోటా మోటార్స్ సంచలనం సృష్టించింది. 90 సంవత్సరాల తరువాత అమెరికాలో అత్యధికంగా అమ్ముడైన కార్ల బ్రాండ్‌గా టయోటా నిలిచింది.
2021లో భారీ అమ్మకాలు..!
2021గాను యుఎస్ ఆటోమొబైల్ మార్కెట్లలో అత్యధికంగా కార్లను విక్రయించిన కిరీటాన్ని టయోటా మోటార్స్ సొంతం చేసుకుంది. స్థానిక ఆటోమొబైల్ దిగ్గజం జనరల్ మోటార్స్ షాకిస్తూ టయోటా మోటార్స్ గత ఏడాది అమెరికాలో అత్యధిక కార్లను సేల్ చేసింది. 2021లో సుమారు 2.332 మిలియన్ వాహనాలను టయోటా విక్రయించింది. ఇక జనరల్ మోటార్స్ గత ఏడాదిలో 2.218 మిలియన్ యూనిట్ల అమ్మకాలను జరిపింది.
అనూహ్యమైన పరిస్థితుల్లో..!
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సెమీకండక్టర్స్ సమస్య ఆటోమొబైల్ ఇండస్ట్రీని కుదేలయ్యేలా చేసింది. దీంతో ఆయా కంపెనీల ఉత్పత్తికి ఆటంకం ఏర్పడి అమ్మకాలపై భారీ దెబ్బ పడింది. ఇక అమెరికన్ దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీ జీఎం మోటార్స్ కూడా చిప్స్ కొరత తీవ్రంగా వేధించింది. దీంతో అమెరికాలో 2021గాను జీఎం మోటార్స్ అమ్మకాలు 13 శాతానికి తగ్గాయి. క్యూ 4లో ఏకంగా అమ్మకాలు 43 శాతానికి పడిపోయాయి. అయితే చిప్స్ కొరత ఉన్నప్పటీకి అనూహ్యంగా 2021గాను అమెరికాలో టయోటా మోటార్స్ 10 శాతం వాహన అమ్మకాలను పెంచుకోగలిగింది.
చదవండి: నానో కారు కంటే చిన్న కారును లాంచ్ చేసిన టయోటా..! ధర ఎంతంటే..?
Comments
Please login to add a commentAdd a comment