ggh Superintendent
-
మీరు డాక్టరా.. లేకుంటే ఇంజినీరా..
నిజామాబాద్‌నాగారం: నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఇన్చార్జి సూపరింటెండెంట్‌గా డాక్టర్ ప్రతిమారాజ్ కొనసాగిన సమయంలో అనేక అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా జీజీహెచ్ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా సైతం సమీక్ష సమావేశంలో మండిపడ్డారు. ఈ క్రమంలో గత శుక్రవారం ఫిట్స్‌తో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చిన మహిళను, కుటుంబ సభ్యులను సిబ్బంది పట్టించుకోని తీరు వివాదాస్పదంగా మారింది. ఆస్పత్రి సిబ్బంది రోగికి స్కానింగ్ చేయకుండా, ప్రైవేట్‌కు వెళ్లమని సూచించారు.చివరికి ఆస్పత్రి నుంచి గెంటి వేయడంతో మహిళా రోగితో పాటు ఆమె భర్త, పిల్లలు సాయంత్రం నుంచి రాత్రి 11 గంటల వరకు ఆస్పత్రి ప్రధాన గేట్ బయట చలిలో గడపడం.. తదితర అంశాలు ఆస్పత్రి నిర్వహణ తీరుపై అందరిలో ఆగ్రహం తెప్పించాయి. ఆస్పత్రిలో ఇలా రోగులు ఇబ్బంది పడుతుండగా.. మరోవైపు సూపరింటెండెంట్ తన చాంబర్లో పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడంపై విమర్శలు వచ్చాయి. ఆస్పత్రిలో రోగులు ఇబ్బందులకు గురవుతున్న తీరు.. సిబ్బంది పట్టింపులేని తనంపై మంత్రి దామోదర రాజనర్సింహతో పాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో డాక్టర్ ప్రతిమారాజ్‌ను ఇన్చార్జి సూపరింటెండెంట్ బాధ్యతల నుంచి రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్థూ ఆదేశాలతో డీహెచ్ తొలగించారు. అంతేగాకుండా అవినీతి అక్రమాలపై విచారణకు ఆదేశాలు ఇచ్చారు.ఆరోపణలు ఇవే..రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లను బయట మార్కెట్లో అమ్ముకున్నారని పత్రికల్లో వార్తలు వచ్చాయి. దీనిపై ఆర్టీఐ కింద సమాచారం అడిగిన వారు పోలీసు కేసు పెట్టించారు. గత వైద్యారోగ్యశాఖమంత్రి జిల్లాకు వస్తున్న నేపథ్యంలో నాణ్యతా ప్రమాణాలు లేకుండా రూ. 28 లక్షలతో షెడ్డుతో పాటు, లిఫ్టు మరమ్మతులు, ఇతర పనులకు రూ. కోటికి పైగా వెచ్చించారు. దీంతో జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు సీరియస్‌గా స్పందించి మీరు డాక్టరా.. లేకుంటే ఇంజినీరా.. అని మండిపడడంతోనే ఇంజినీర్ పనుల్లో జోక్యం ఆగింది.సుమారు నాలుగేళ్ల పాటు డిపార్ట్మెంట్ ఇచ్చిన ఫోన్‌ను సొంతంగా వినియోగించకుండా సూపరింటెండెంట్ తన పీఏకు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. జిల్లా అధికారులు, ప్రొఫెసర్లు, ఇతర వైద్యులు ఎవరు ఫోన్ చేసినా పీఏనే ఫోన్ ఎత్తి మాట్లాడేవారు, సమాధానాలు చెప్పేవారు. వైద్యుల అటెండెన్సులు వేస్తూ ప్రతి నెల కమీషన్లు తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ ఆస్పత్రి నుంచి రోగులను ప్రైవేట్ ఆస్పత్రులకు రిఫర్ చేసేవారని ఆరోపణలు ఉన్నాయి.విచారణకు ఆదేశాలు..జీజీహెచ్ ఇన్చార్జి సూపరింటెండెంట్‌గా డాక్టర్ ప్రతిమారాజ్ కొనసాగిన సమయంలో జరిగిన అవినీతి, అక్రమాలపై వైద్యారోగ్యశాఖ కార్యదర్శి ఆదేశాల మేరకు సమగ్ర విచారణ చేయనున్నారు. సుమారు ఐదేళ్ల పాటు జరిగిన లావాదేవీలు, రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లలో జరిగిన అవకతవలు, ఆరోగ్య శ్రీ నిధులు రూ.10 కోట్ల దుర్వినియోగం, తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్ఎంఎస్ఐడీసీ)కు సంబంధం లేకుండా నాసిరకంగా చేపట్టిన పనులు, మందుల కొనుగోళ్లపై క్షుణ్ణంగా విచారణ చేపట్టనున్నారు. అతి త్వరలోనే విచారణ కమిటీ ఏర్పాటు చేయనున్నారు. -
ఎలుకల మిత్రులందరికీ ఇదే నా ఆహ్వానం
మన ఎలుకల మిత్రులందరికీ ఇదే నా ఆహ్వానం. ఇప్పటికే పంట పొలాల్లో లింగాకర్షక బుట్టలు, మందులూ అంటూ రైతులు మన ఉసురు తీస్తున్నారు. భయపడుతూ అక్కడ బతకొద్దు. ఎలుకలకు సమృద్ధిగా ఆహారం, చక్కగా నివాసం, రక్షణ వంటి సదుపాయాలు కల్పిస్తున్న గుంటూరు సమగ్ర ప్రభుత్వాస్పత్రికి రండి. ఇక్కడ ఓ పసిపిల్లాడిని కొరికికొరికి చంపేసినా, ఎలుకల నివారణకు చర్యలు తీసుకోవాలని వైద్య శాఖా మంత్రివర్యులే సెలవిచ్చినా ఎవరూ సరిగ్గా పట్టించుకోవడం లేదు. అందుకే యథేచ్ఛగా వార్డులన్నీ తిరిగేస్తున్నాం. కావల్సిన రోగుల్ని పీక్కుతింటున్నాం. ఆస్పత్రిలో మనదే రాజ్యం. మిత్రులారా త్వరగా వచ్చేయండి. జీజీహెచ్‌లో హాయిగా జీవించేద్దాం. గుంటూరు మెడికల్: ‘అయ్యా డాక్టర్ గారూ వార్డులో చికిత్స కోసం వారం రోజుల క్రితం చేరాం.వార్డుల్లో పడకలపైకి సైతం ఎలుకలు వచ్చి కరుస్తున్నాయి. వార్డులో ఉండాలంటే భయంగా ఉంది అంటూ పలువురు రోగులు గుంటూరు జీజీహెచ్‌లో ఈ నెల పదో తేదీన ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు. అయితే ఎలుకలు తిరుగుతోంది క్యాన్సర్ వార్డు రోగులు కావడంతో సూపరింటెండెంట్ అవ్వాక్కయారు. ఈ ఫిర్యాదు అందిన ఐదు రోజుల్లోనే 15వ తేదీన ఆస్పత్రిలో జరిగిన ఇన్ఫెక్షన్ నియంత్రణ కమిటీ సమావేశంలో సైతం పలువురు వైద్యులు, వైద్య విభాగాధిపతులు ఎలుకల బెడత గురించి, దోమల మోత గురించి సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు. ప్రతి రోజూ 10 నుంచకి 20 వరకు ఎలుకలు పట్టుబడుతూ ఉన్నాయి. ఎలుకల నియంత్రణ అంతంతమాత్రమే గుంటూరు జీజీహెచ్‌లో 2015 ఆగష్టులో ఎలుకల దాడిలో పసికందు మృతి చెందటంతో ప్రభుత్వం అప్పటి వరకు ఉన్న కాంట్రాక్టర్‌ను తొలగించి పద్మావతి హాస్పిటల్ అండ్ ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అనే సంస్థకు సెక్యూరిటీ, శానిటేషన్, క్రిమి కీటకాల నియంత్రణ బాధ్యతలను టెండర్లు ద్వారా అప్పగించింది. గతంలో ఉన్న కాంట్రక్టర్కు రూ. 17 లక్షలు చెల్లించిన ప్రభుత్వం పద్మావతి సంస్థకు రూ. 40 లక్షలకుపైగా చెల్లించింది. అయినా ఎలుకలు, పాములు ప్రత్యక్షమవ్వటంతో ప్రభుత్వం పద్మావతి సంస్థకు టెండర్ రద్దు చేసింది. అనంతరం సెక్యూరిటీ జైబాలజీకి, శానిటేషన్ ఏ1కు అప్పగించి కేవలం క్రిమికీటకాల బాధ్యతలను పద్మావతి సంస్థకు అప్పగించింది. 2016 మే నుంచి ఆస్పత్రిలో ఎలుకలు, క్రిమికీటకాల నియంత్రణ బాధ్యతలు పద్మావతి సంస్థ నిర్వహిస్తోంది. ఈ సంస్థకు ప్రభుత్వం నెలకు రూ. 3,10,876 చెల్లిస్తోంది. అయితే సంస్థ పని తీరు సక్రమంగా లేకపోవటం వల్లే మళ్లీ నేడు ఎలుకలు వార్డులో తిరుగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. ప్రతిష్ట దిగజారినా ఎలుకల వల్లే 2015లో గుంటూరు జీజీహెచ్ ప్రతిష్ట మసకబారిపోయి దేశ వ్యాప్తంగా జీజీహెచ్ గురించి నెగిటివ్‌గా చర్చించుకున్నారు. ఎలుకల వల్ల దిగజారిన ప్రతిష్టను తిరిగి తెచ్చేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఆస్పత్రిలో మోకీలు మార్పిడి ఆపరేషన్ చేయించుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా అనేక సందర్భాల్లో సభల్లో ప్రస్తావించారు. ఆస్పత్రి అధికారుల వైఖరి వల్ల మరలా ఎలుకలు ఆస్పత్రిలో వీర విహారం చేస్తున్నాయి. ఎలుకల నియంత్రణ కోసం నిబంధనల ప్రకారం ఏర్పాటు చేయాల్సిన బుట్టలు కూడా అన్ని చోట్లా లేవు. దోమల నియంత్రణ కోసం ఫాగింగ్ కూడా రెగ్యులర్‌గా చేయకుండా మిన్నకుండి పోవటం వల్లే దోమలు విపరీతంగా పెరిగి రాత్రి వేళల్లో రోగులు వార్డులో ఉండలేని దుస్థితి నెలకొంది. రోగులు ఫిర్యాదులు చేసినా, వైద్యులు, వైద్య సిబ్బంది ఫిర్యాదులు చేసినా ఆస్పత్రి అధికారులు మాత్రం పద్మావతి సంస్థపై చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తూ ఉండటం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికైనా ఆస్పత్రి అధికారులు ఎలుకలు, క్రిమికీటకాల నియంత్రణ కోసం సరైన చర్యలు తీసుకోవాలని రోగులు కోరుతున్నారు. -
కనీసం 24 గంటలు పరిశీలనలో ఉండాలి
-
సేవలపై ఆరా.. సమస్యలపై దృష్టి
తెల్లకోటు.. చేతిలో మైకు ఉభయగోదావరి జిల్లాల నుంచి నిత్యం 2,000 మందికి పైగా రోగులు వచ్చే కాకినాడ ప్రభుత్వాస్పత్రి (జీజీహెచ్) అది. శనివారం ఉదయం 10.15 గంటల సమయంలో తెల్లకోటు వేసుకుని, చేతిలో ‘సాక్షి’ మైకు పట్టుకుని ఒక పెద్దాయన వార్డుల్లో కలయతిరుగుతూ రోగులను ఆప్యాయంగా పలకరిస్తూ, సాధకబాధకాలు ఆరా తీస్తున్నారు. వైద్యులను, సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. ‘చూస్తే డాక్టర్లా ఉన్నారు. చేస్తున్నదేమో విలేకరి డ్యూటీలా ఉంది’ అని అంతా ఆశ్చర్యపోతుండగానే పీడియాట్రిక్, పీడియాట్రిక్ డెంగీ, న్యూ బోరన్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు, ప్రసూతి, మెడికల్, ఎనస్తీషియా, ఆర్థోపెడిక్, డెంగీ ప్రత్యేక వార్డులను చుట్టేశారు. ఆయనే డాక్టర్ పి.వెంకటబుద్ధ. ‘సాక్షి’ అభ్యర్థన మేరకు ‘వీఐపీ రిపోర్టింగ్’కు సమ్మతించిన ఆయన ఉదయం 10.15 గంటల నుంచి 11 గంటల వరకు ఆ పాత్రను పోషించారు. రోగుల సమస్యలను సావధానంగా ఆలకించారు. కేవలం ఆస్పత్రి అధిపతిగానే కాక ఒక వైద్యుడిగా స్పందించారు. ఆ వివరాలు... సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటబుద్ధ : ఏంటయ్యా.. నీ బాధ.. ఏమైంది? రోగి బంధువు : సార్ నా పేరు లక్ష్మయ్యండి. మా అన్నయ్య పేరు అక్కయ్య. మాది గుంటూరు జిల్లా చిలకలూరిపేట. మా అన్నయ్యకు ఆరోగ్యం బాగా లేదు. 25 రోజుల కిందట ఈ ఆస్పత్రికి తీసుకొచ్చాం సార్. మీరు సూపరింటెండెంట్ అని ఎవరో చెబితే పరుగెత్తుకు వచ్చాను సార్. నా అన్నకు ఏమైందని అడుగుతున్నా డాక్టర్లు ఏమీ చెప్పడం లేదు. మీరే ఏదైనా సాయం చేయండి సార్. సూపరింటెండెంట్ : (ఏఎస్‌ఆర్‌ఎంఓ డాక్టర్ కె.లక్ష్మోజీనాయుడును ఉద్దేశించి)ఆ వివరాలు ఏమిటో చూడండి. (లక్ష్మయ్యను ఉద్దేశించి) డాక్టర్ గారికి వివరాలు చెప్పి వైద్యం చేయించుకోండి. సూపరింటెండెంట్ : అనస్థీషియా మేడమ్ గారూ.. బాగున్నారా? రోజుకు ఎన్ని ఎలక్టోరల్ సర్జరీలు చేస్తున్నారు? అనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ సౌభాగ్యలక్ష్మి : బాగున్నాను సార్. రోజూ 19 నుంచి 25 సర్జరీలు జరుగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో 50కి పైగా సర్జరీలు చేస్తున్నాం. సూపరింటెండెంట్ : సమస్యలేమైనా ఉన్నాయా? డాక్టర్ : ఆర్ఐసీయూకి ఎమర్జెన్సీ మెడిసిన్స్ సకాలంలో అందుబాటులోకి రావడం లేదు. ఆ ఒక్క ప్రాబ్లమ్‌ను రెక్టిఫై చేయండి సార్ చాలు. సూపరింటెండెంట్ : మెడికల్ ఆఫీసర్‌కు బాధ్యతలు అప్పగించండి. అన్నీ హెచ్ఓడీ చూసుకోవాలంటే కష్టం కదా. మెడిసిన్ విషయంలో డ్యూటీలో ఉండే మెడికల్ ఆఫీసర్‌ను కూడా ఇన్వాల్వ్ చేయండి. మీ సమస్య తీరిపోతుంది. వారు బాధ్యత తీసుకోకపోతే బాధ్యతలేని చోటకు పంపించేద్దాం ఓకేనా! సూపరింటెండెంట్ : -ఏమిటి.. ఆ గోడలపై పిచ్చిమొక్కలు అలా పెరిగిపోయాయి.. మీరేం చేస్తున్నారు? హెల్త్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు : ఆ మొక్కలు పీకించమని చెప్పాను సర్. సూపరింటెండెంట్ : -మొక్కలను పీకేయడం కాదు, మళ్లీ పెరగకుండా కిరోసిన్ పోసి కాల్చండి. వెంకటేశ్వరరావు : అలాగే సర్. సూపరింటెండెంట్ : -ఇదేమిటి నేను వస్తున్నానని తెలిసి పీడియాట్రిక్ వార్డులో ఫినాయిల్ చల్లి శుభ్రం చేస్తారా.. ఎన్నిసార్లు చెప్పినా మీరు మారరు? ఎప్పటికప్పుడు పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడండి. శానిటేషన్ సిబ్బంది : అన్నీ సక్రమంగా చూసుకుంటాం సార్. సూపరింటెండెంట్ : ఏమ్మా..! నీ పేరు ఏమిటి? ఎక్కడి నుంచి వచ్చారు. చిన్నారి తల్లి : మమత సార్! ఆకివీడు నుంచి వచ్చామండి. సూపరింటెండెంట్ : ఎందుకు వచ్చారు? ఏమైంది. మమత : మా 12 నెలల బాబు కృపావరుణ్కు మెదపువాపు వ్యాధి వచ్చింది సార్. 15 రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నామండి. సూపరింటెండెంట్ : వైద్యం బాగా అందుతోందా? మమత : ఫర్వాలేదు సార్.. బాగానే చూస్తున్నారు. సూపరింటెండెంట్ :(స్టాఫ్ నర్సును ఉద్దేశించి) ఇక్కడ మెడికల్ ఆఫీసర్ ఎవరు? మెడికల్ ఆఫీసర్ ఎన్ఐసీయూలో ఉండాలి కదా. ఎక్కడికి వెళ్లిపోయారు. పిలవండి. సూపరింటెండెంట్ :ఏమ్మా! మీ పేరు ఏమిటి? ఎక్కడి నుంచి వచ్చారు? చిన్నారి బంధువు : దారా శ్రీలక్ష్మి అయ్యా, కడియం నుంచి వచ్చామండి సూపరింటెండెంట్ : ఎందుకొచ్చారు? బిడ్డ ఆరోగ్యం ఎలా ఉంది? శ్రీలక్ష్మి : నాకు మొదటి కాన్పులోనే బిడ్డ బలహీనంగా పుట్టాడండి. మా ఊళ్లో డాక్టర్లు కాకినాడ తీసుకెళ్లమంటే తీసుకొచ్చాం. ఇప్పుడు ఫర్వాలేదండి. సూపరింటెండెంట్ : డాక్టర్లు బాగా చూస్తున్నారా? శ్రీలక్ష్మి : చూస్తున్నారండి. సూపరింటెండెంట్ : ఇబ్బందులేమైనా ఉంటే నా చాంబర్‌కు వచ్చి చెప్పుకోవచ్చు. సరేనామ్మా..! (పీడియాట్రిక్ వైద్యురాలిని ఉద్దేశించి) మీకేమైనా సమస్యలున్నాయా చెప్పండి మేడమ్! పీడియాట్రిక్ డాక్టర్ మాణిక్యాంబ : సార్.. పీడియాట్రిక్ వార్డులో బాత్రూమ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. రోగులు, అంతా ఇబ్బంది పడుతున్నాం. ఏదైనా పరిష్కారం ఆలోచించండి సార్. సూపరింటెండెంట్ : వాటికి మరమ్మతులు చేయించాలి. ఏపీఎంఐడీసీ అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటాం లెండి. నేను వాళ్లకు చెబుతాను. వాళ్లు వచ్చి చూసి సమస్యను పరిష్కరిస్తారు. సూపరింటెండెంట్ : (ఓ బాలికను ఉద్దేశించి) ఏరా తల్లీ..నీ పేరు ఏంటి? ఏ ఊరు నుంచి వచ్చారు? బాలిక : స్రవంతి సర్, వాసాలరేవు నుంచి వచ్చాం. సూపరింటెండెంట్ : ఏమైంది నీకు? స్రవంతి : జరమొచ్చింది. సూపరింటెండెంట్ : ఇప్పుడు తగ్గిందా? స్రవంతి : తగ్గింది సర్ సూపరింటెండెంట్ : మందులు వేసుకుంటున్నావా? స్రవంతి : ఏసుకుంటున్నాను సర్ సూపరింటెండెంట్ : ఆస్పత్రిలో ఎవరైనా డబ్బులు అడిగారా? స్రవంతి తల్లి : లేదు సార్ (సూపరింటెండెంట్ : డెంగీ వార్డుకు వెళ్లారు) ఆ వార్డు వైద్యురాలుశ్రీదేవి : -సర్ మొత్తం 13 పాజిటివ్ కేసులున్నాయి. మిగిలిన వాటిని మరోసారి చూసి చెబుతాం. నర్సులు లేక ఇబ్బందులు పడుతున్నాం సర్. సూపరింటెండెంట్ : -నర్సులు కావాల్సినంత మంది లేరు. డెంగీ వార్డుకు ప్రత్యేకంగా నర్సులు కేటాయిస్తే మిగిలిన విభాగాల్లో రోగులు ఇబ్బందులు పడతారు. వైద్య ఆరోగ్యశాఖ నుంచి నర్సులను పంపించాలని కోరదాం. (అక్కడి నుంచి ఆయన బాలింతల వార్డుకు వెళ్లారు) సూపరింటెండెంట్ : ఏమ్మా.. నీపేరేంటి? బాలింత : లక్ష్మీదుర్గ సార్ సూపరింటెండెంట్ : డెలివరీ ఎప్పుడు అయింది? లక్ష్మీదుర్గ : నాలుగు రోజుల క్రితం సార్. మగ బిడ్డ పుట్టాడు. సూపరింటెండెంట్ : ఆపరేషన్ చేశారా? లక్ష్మీదుర్గ : లేదుసార్.. నార్మల్ డెలివరీనే. సూపరింటెండెంట్ : సమస్యలేమైనా ఉన్నాయా? లక్ష్మీదుర్గ : ఏమీ లేవు సార్. సూపరింటెండెంట్ : ఆస్పత్రిలో 1500 మంది రోగులు ఉంటారు. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లి సమస్యలు అడగడం సాధ్యం కాదు. మీ సమస్యలేమైనా ఉంటే నా ఆఫీసుకు వచ్చి చెప్పుకోవచ్చు. మిమ్మల్ని ఎవరైనా డబ్బులు అడిగినా, సరిగా వైద్యం చేయకపోయినా నాకు ఫిర్యాదు చేస్తే విచారణ నిర్వహించి చర్యలు తీసుకుంటాను. సరేనా... (అక్కడి నుంచి ఆయన మెడికల్ వార్డుకు వెళ్లారు) సూపరింటెండెంట్ : ఏమిటది.. ఆమెను అలా వీల్‌చైర్‌పై మోసుకెళుతున్నారేమిటి? అలా అయితే రోగులు ఇబ్బందులు పడతారు కదా? ఆస్పత్రి సిబ్బంది : లిఫ్ట్ పనిచేయడం లేదు సర్, మేం కూడా మోయలేకపోతున్నాం సర్. లిఫ్ట్ బాగు చేయించండి. సూపరింటెండెంట్ : ఏపీఎంఐడీసీ ఇంజనీర్లతో మాట్లాడి, కొత్త లిఫ్ట్ ఏర్పాటు చేయిస్తాను. ట్రాలీతో పాటు కలిపి వెళ్లేలా ట్రాలీ లిఫ్ట్ ఏర్పాటు చేయిద్దాం. (అక్కడి నుంచి ఆర్థోపెడిక్ వార్డుకు వెళ్లారు) సూపరింటెండెంట్ : ఏమిటయ్యా.. ఇలా పగిలిపోయింది. అంతగా పై నుంచి నీరు కారిపోతోంది. ఏమిటిదంతా.. శానిటేషన్ కాంట్రాక్టర్ ప్రతినిధి : శ్లాబ్ దెబ్బ తింది.. సరి చేస్తాం సర్. సూపరింటెండెంట్ : ఏమయ్యా! నీ పేరు ఏంటి? ఎక్కడి నుంచి వచ్చావు? నీ బాధ ఏంటి? రోగి : తుమ్మలపల్లి దానియేలు సర్, ప్రత్తిపాడు మండలం రాచపల్లి నుంచి వచ్చానండి, కాలికి ఆపరేషన్ చేశారండి. సూపరింటెండెంట్ : ఎలా చూస్తున్నారమ్మా? దానియేలు భార్య రాజామణి : ఏం చూస్తున్నారయ్యా, రెండు రోజుల నుంచి ఇంజక్షన్ చేయడం లేదండి. సూపరింటెండెంట్ : అవసరమైతేనే ఇంజక్షన్ చేస్తారమ్మా, మందులిస్తున్నారు కదా అవి వాడండి. ప్రజెంటర్స్ : లక్కింశెట్టి శ్రీనివాసరావు, మంత్రి సతీష్ ఫొటోలు : గరగ ప్రసాద్ -
మందుల్లేవ్!
నో స్టాక్ - గుంటూరు జీజీహెచ్‌లో మందుల్లేక రోగుల ఇక్కట్లు - ఆస్పత్రి ప్రారంభించినప్పటి బడ్జెట్టే నేటికీ అమలు.. - రోగులు పెరుగుతున్నా బడ్జెట్ పెంచని ప్రభుత్వం - తక్కువ ధర మందులైతేనే.. లేదంటే బయట కొనాల్సిందే! - టెండర్లు పిలిచే వరకు రోగులకు తప్పని అవస్థ సాక్షి, గుంటూరు : అపర సంజీవనిగా పేరొందిన ఆస్పత్రిలోనే మందుల కొరత వెంటాడుతోంది. కోస్తాంధ్ర ప్రజలకు ఉచిత వైద్య సేవలందిస్తున్న గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో మందులు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓపీ విభాగంలో చూపించుకుని వెళ్దామని వచ్చిన వారికి కూడా మందులు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఇక వార్డుల్లో చేరిన వారి పరిస్థితి మరింత దారుణం. మందుల కొనుగోలుకు ఆస్పత్రి ప్రారంభమైనప్పుడు కేటాయించిన బడ్జెట్‌నే ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. అప్పటికీ ఇప్పటికీ ఎన్నో రెట్లు రోగులు పెరిగినా సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి ఆ స్థాయిలో మందులు రాక పోవడంతో వైద్యాధికారులు సైతం ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారు. ధర తక్కువైతే ఇక్కడ.. లేదంటే బయట.. జీజీహెచ్‌కి వివిధ సమస్యలతో నిత్యం వేలాది మంది పేద రోగులు వస్తుంటారు. ఆస్పత్రిలో 1175 పడకలు ఉన్నప్పటికీ అవి కూడా చాలక ఒక్కొక్క బెడ్‌కు ఇద్దరు చొప్పున రోగులను ఉంచి వైద్యసేవలు అందిస్తున్నారు. వార్డుల్లో రోగులకు వైద్యుల సూచనల మేరకు మందులు వేయాల్సిన స్టాఫ్ నర్సులు అవి తమ వద్ద లేవని బయట కొనుక్కోమంటూ ఉచిత సలహా ఇస్తున్నారు. ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్లే ఆర్థిక స్తోమత లేక ఉచిత వైద్యం అందుతుందనే ఆశతో ప్రభుత్వాస్పత్రికి వచ్చిన పేద రోగులు, వారి బంధువులు మందులు బయట కొనుగోలు చేయలేక అవస్థలు పడుతున్నారు. ఏవో తక్కువ ధరకు దొరికే మందులు మాత్రం ఆసుపత్రిలో ఉంటున్నాయని, అధిక ధరవైతే స్టాక్ లేవని చెబుతున్నారని రోగులు వాపోతున్నారు. సూపర్ స్పెషాలిటీ వార్డుల్లో మరింత తీవ్రం.. సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి సరఫరా కాని మందులను హెచ్‌డీఎస్ నిధుల ద్వారా కొనుగోలు చేసే వీలుంటుంది. కానీ అవి టెండర్ల ద్వారా మాత్రమే కొనుగోలు చేయాలి. ఈ టెండర్లు ఏడు నెలలుగా పిలవకపోవడంతో ఆసుపత్రిలో మందుల కొరత తీవ్రమయింది. ముఖ్యంగా సూపర్‌స్పెషాలిటీ వైద్య సేవలైన కార్డియాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జన్ వంటి విభాగాల్లో మందుల కొరత క్కువగా ఉందని చెబుతున్నారు. వీటిని బయట కొనుగోలు చేయాలంటే అధిక ధరలు ఉంటాయని, దీంతో పేద ప్రజలకు భారంగా మారుతుందని పలువురు ఆక్షేపిస్తున్నారు. మందులపై పర్యవేక్షణ కరవు... మందుల స్టాక్ రూమ్ నుంచి వివిధ వార్డులకు రోజూ మందులు సరఫరా అవుతుంటాయి. ఆ మందులు ఎవరికి వేశారనేది ఎప్పటికప్పుడు రికార్డు చేయాలి. ఆ మందులు ఏ రోగికి వినియోగించారో రోజూ ఆసుపత్రి ఉన్నతాధికారులకు తెలియజేస్తే కావాల్సిన మందులను సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి తెప్పించే వీలు ఉంటుంది. ఏ వార్డులో ఎన్ని మందులు ఉన్నాయి. ఏయే మందులు ఉన్నాయి అనే విషయం ఎవ్వరికీ తెలియడంలేదు. రోజూ ఎవరో ఒక ఉన్నతాధికారి వార్డులను పరిశీలించి అక్కడ ఏయే మందులు అందుబాటులో ఉన్నాయో తెలుసుకునే వీలుంటుంది. రోగులకు అందుబాటులేని మందులను కొనుగోలు చేసి అందించే అవకాశం ఉంటుంది. కొరత గుర్తించి కొనుగోలు చేస్తున్నాం.. జీజీహెచ్‌లో మందుల కొరత తలెత్తుతూనే ఉంది. వాటిని గుర్తించి వెంటనే కొనుగోలు చేస్తున్నాం. సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి కొన్ని మందులు రానప్పుడు టెండర్ల ద్వారా కొనుగోలు చేస్తున్నాం. కొన్ని నెలలుగా టెండర్లు పెండింగ్‌లో పడ్డాయ్. దీనిపై కలెక్టర్‌కు లేఖ రాస్తాం. రోగుల సంఖ్యకు అనుగుణంగా ప్రభుత్వం బడ్జెట్ పెంచాలి.- డాక్టర్ వేణుగోపాలరావు, జీజీహెచ్ సూపరింటెండెంట్