సమస్యల పరిష్కారంపై అలసత్వం వద్దు
గోపాలపురం: విద్యుత్ వినియోగదారుల సమస్యలపై వెంటనే స్పందించకపోతే చర్యలు తప్పవని కన్సూ్యమర్ గ్రీవెన్సెస్ రిడ్రసల్ ఫోరం (సీజీఆర్ఎఫ్) చైర్పర్సన్ ఆర్.శ్రీనివాసరావు అన్నారు. స్థానిక ఏఎంసీ కార్యాలయ ఆవరణలో శుక్రవారం విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ముఖ్యఅతిథిగా చైర్పర్సన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, మీటరు మార్పు, పేరు మార్పు, విద్యుత్ బిల్లుల విషయంలో హెచ్చుతగ్గులపై విద్యుత్ అధికారులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వినియోగదారులకు ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తప్పవరి సిబ్బందిని హెచ్చరించారు. దేవరపల్లి మండలం యర్నగూడెం, చిన్నాయిగూడెం, సంగాయిగూడెం రైతులు మాట్లాడుతూ విద్యుత్ సబ్సేష్టన్ పరిధిలో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయినా, కరెంట్ ఆయిల్ కావల్సినా తాము కొనుగోలు చేయాల్సి వస్తోందని ఫిర్యాదు చేశారు. ఫోరం సభ్యుడు పీఎస్ కుమార్ మాట్లాడుతూ విద్యుత్ పనిముట్లను రైతులు కొనుగోలు చేయాల్సిన అవసరం లేదన్నారు. సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తే టోల్ ఫ్రీ నంబర్ 1972కు ఫోను చేయాలని సూచించారు. మరో సభ్యుడు ఎంవై కోటేశ్వరావు మాట్లాడుతూ విద్యుత్ సరఫరాలో ఎటువంటి సేవా లోపాలున్నా ఫోరానికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. కన్సూ్యమర్ గీవెన్సెస్ రిడ్రసల్ ఫోరంలో సమస్య పరిష్కారం కాకపోతే విద్యుత్ అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ఎంపీపీ గద్దే వెంకటేశ్వరావు, ఏఎంసీ చైర్మన్ ముళ్లపూడి వెంకట్రావు, ఏడీఈ కె.చంద్రశేఖర్, ఏఈలు చిలకా వెంకట్రావు, టి. ఈశ్వరరావు, కేవీ కష్ణారావు తదితరులు పాల్గొన్నారు.