GIC
-
ప్రభుత్వ సంస్థ అమ్మకంపై కేంద్రం యూటర్న్, ఆర్థికశాఖ సహాయ మంత్రి కీలక ప్రకటన!
జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (జీఐసీ)ని ప్రైవేటీకరించే ప్రతిపాదన ఏదీ ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో లేదని ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్ కే కరాద్ రాజ్యసభలో తెలిపారు. 2021 మార్చి 31వ తేదీ నాటికి ఎల్ఐసీ, జీఐసీ మొత్తం ఆస్తుల విలువ వరుసగా రూ. 38.04 లక్షల కోట్లు, రూ. 1.35 లక్షల కోట్లుగా ఉన్నాయని కరాద్ స్పష్టం చేశారు. బ్యాంకుల్లో డిపాజిటర్లకు ఎక్కువ రక్షణ కల్పించాలనే ఉద్దేశ్యంతో డీఐసీజీసీ కింద బ్యాంకులలో డిపాజిటర్లకు బీమా కవర్ పరిమితిని ఒక్కో డిపాజిటర్‌కు రూ. 1 లక్ష నుండి రూ. 5 లక్షలకు పెంచడం జరిగిందని మంత్రి వివరించారు. 2020 ఫిబ్రవరి 4వ తేదీ నుంచి ఇది అమల్లోకి వచ్చిందని పేర్కొన్నారు. డిపాజిట్ ఇన్సూరెన్స్ కవర్ అన్ని ‘బీమా చేయబడిన’ బ్యాంకులు, వాటి డిపాజిటర్లకు ఒకే విధంగా వర్తిస్తుందని ఆయన చెప్పారు. ‘‘దీనితోపాటు డిపాజిట్ ఇన్సూరెన్స్– క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (సవరణ) చట్టం, 2021 గత ఏడాది ఆగస్టు 13వ తేదీన రాష్ట్రపతి ఆమోదాన్ని పొందింది. అదే ఏడాది సెప్టెంబర్ నుంచి అమల్లోకి వచ్చింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 ప్రకారం బ్యాంకులపై ఆంక్షలు విధించిన సందర్భాల్లో డీఐసీజీసీ మధ్యంతర చెల్లింపుల ద్వారా డిపాజిట్ ఇన్సూరెన్స్ కవర్ మేరకు డిపాజిటర్లు తమ డిపాజిట్లను సులభంగా, తగిన కాలపరిమితితో పొందేందుకు ఈ సవరణలు వీలు కల్పిస్తున్నాయి’’ అని మంత్రి ఈ సందర్భంగా వివరించారు. -
రిలయన్స్‌లో జీఐసీ, టీపీజీ పెట్టుబడి
హైదరాబాద్, బిజినెస్‌బ్యూరో: రిలయన్స్ గ్రూప్‌నకు చెందిన రిటైల్ వ్యాపార దిగ్గజ కంపెనీ రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌లో (ఆర్ఆర్వీఎల్) పెట్టుబడుల వరద కొనసాగుతోంది. తాజాగా మరో రెండు పెట్టుబడులు వచ్చి చేరనున్నాయి. అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ సంస్థ జీఐసీ రూ.5,512.5 కోట్లు ఇన్వెస్ట్ చేయనుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ శనివారం ప్రకటించింది. తద్వారా ఆర్ఆర్వీఎల్లో 1.22 శాతం వాటాను జీఐసీ చేజిక్కించుకోనుంది. డీల్‌లో భాగంగా ఆర్‌ఆర్‌వీఎల్‌ను రూ.4.285 లక్షల కోట్లుగా విలువ కట్టారు. మరో అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ సంస్థ టీపీజీ తాజాగా రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌లో రూ.1,837.5 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. తద్వారా ఆర్ఆర్వీఎల్లో 0.41 శాతం వాటాను టీపీజీ దక్కించుకోనుంది. ఈ ఏడాది ప్రారంభంలో జియో ప్లాట్‌ఫామ్స్‌లో టీపీజీ రూ.4,546.8 కోట్లు పెట్టుబడి చేసింది. -
రిలయన్స్ రిటైల్‌లో పెట్టుబడుల వెల్లువ
సాక్షి, ముంబై: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) గ్రూప్ కంపెనీల్లో వరుస పెట్టుబడులు పెడుతున్న సంస్థల జాబితాలో మరో రెండు విదేశీ దిగ్గజాలు చేరాయి. తాజాగా సింగపూర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ జీఐసీ, గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ టీపీజీ క్యాపిటల్ రిలయన్స్ రిటైల్ యూనిట్లో భారీ పెట్టుబడులు పెట్టబోతున్నాయి. జీఐసీ రూ .5,512.5 కోట్లు, టీపీజీ 1,837.5 కోట్ల రూపాయలను ఇన్వెస్ట్ చేయనున్నాయని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో రిలయన్స్ తెలిపింది. ఆర్ఆర్విఎల్లో వరుసగా 1.22 శాతం, 0.41 శాతం ఈక్విటీ వాటాను సొంతం చేసుకోనున్నాయి. తాజా పెట్టుబడులతో పాటురిలయన్స్ రిటైల్ ఇప్పటివరకూ 7.28 శాతం వాటాల విక్రయం ద్వారా రూ.32,197 కోట్ల పెట్టుబడులను సాధించింది. జియో తరువాత వరుస పెట్టుబడులతో దూసుకుపోతున్న రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లో ఇవి వరుసగా ఆరో, ఏడు పెట్టుబడుల ఒప్పందాలు కావడం విశేషం జీఐసీ ప్రపంచ నెట్వర్క్, దీర్ఘకాలిక భాగస్వామ్యాలు భారత రిటైల్ వ్యవస్థను మెరుగుపరుస్తూ, మరింతగా మారుస్తాయని ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. రిలయన్స్ రిటైల్ తన సప్లై చైన్, స్టోర్ నెట్వర్క్స్, లాజిస్టిక్స్, డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కొనసాగిస్తూ కస్టమర్లు, వాటాదారులకు మరింత ప్రయోజనం కలగనుందని జీఐసీ సీఈఓ లిమ చౌ కియాత్ తెలిపారు. కాగా సిల్వర్ లేక్ ఆ తర్వాత కేకేఆర్, జనరల్ అట్లాంటిక్, ముబదాల కూడా పెట్టుబడులు పెట్టాయి. మూడు వారాల్లో ఆరు డీల్స్ సొంతం చేసుకుంది. అమెరికాకు చెందిన ప్రముఖ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ జనరల్ అట్లాంటిక్ 0.84 శాతం వాటాకుగాను 3,675 కోట్ల రూపాయలు, సిల్వర్ లేక్ పార్ట్నర్స్ 1,875 కోట్ల రూపాయల పెట్టుబడులను ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే ఆర్‌ఆర్‌విఎల్ 3.38 బిలియన్ల డాలర్లతో ఫ్యూచర్ గ్రూప్ రిటైల్ వ్యాపారాన్ని సొంతం చేసుకుంది. రిలయన్స్ రిటైల్ ఇండియాలో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న, అత్యంత లాభదాయక సంస్థ. 12,000 స్టోర్లతో, 64 కోట్ల వినియోగదారులతో భారతదేశపు అతిపెద్ద రీటైలర్ గా ఉన్న సంగతి తెలిసిందే. -
జనరల్ ఇన్సూరెన్స్- గెయిల్.. జూమ్
ప్రపంచ మార్కెట్ల బలహీనతలు, జూన్ ఎఫ్‌అండ్‌వో కాంట్రాక్టుల ముగింపు నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు ఆటుపోట్లకు లోనవుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 177 పాయింట్లు క్షీణించి 34,692కు చేరగా.. 54 పాయింట్ల వెనకడుగుతో నిఫ్టీ 10,251 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో సాధించిన ఫలితాల కారణంగా పీఎస్‌యూ కౌంటర్లు జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(జీఐసీ ఆర్ఈ), గెయిల్ ఇండియా లిమిటెడ్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి ప్రస్తావించదగ్గ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. జీఐసీ ఆర్ఈ గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో జీఐసీ ఆర్ఈ నికర లాభం 98 శాతం జంప్‌చేసి రూ. 1197 కోట్లను తాకింది. పన్నుకు ముందు లాభం మాత్రం నామమాత్ర వెనకడుగుతో రూ. 1101 కోట్లకు పరిమితమైంది. స్థూల ప్రీమియం ఆదాయం 14 శాతం పుంజుకుని రూ. 9217 కోట్లకు చేరగా.. పూర్తిఏడాదికి 15 శాతం అధికమై రూ. 51,030 కోట్లుగా నమోదైంది. ఈ నేపథ్యంలో జీఐసీ ఆర్ఈ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 4.5 శాతం జంప్‌చేసి రూ. 160 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 165ను సైతం అధిగమించింది. గెయిల్ ఇండియా గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో గెయిల్ ఇండియా నికర లాభం మూడు రెట్లు ఎగసి రూ. 3018 కోట్లను తాకింది. పన్నుకు ముందు లాభం 47 శాతం జంప్‌చేసి రూ. 2556 కోట్లకు చేరింది. అయితే మొత్తం ఆదాయం 5 శాతం క్షీణించి రూ. 17,753 కోట్లకు పరిమితమైంది. ఈ నేపథ్యంలో గెయిల్ ఇండియా షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం .5 శాతం లాభపడి రూ. 105 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 107 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. బుధవారం సైతం ఈ షేరు దాదాపు 3 శాతం బలపడింది. -
1.37 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయిన జీఐసీ ఐపీఓ
న్యూఢిల్లీ: జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రీ ఇన్సూరెన్స్ (జీఐసీ రీ) ఐపీఓ 1.37 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది. రూ.855–912 ధరల శ్రేణితో ఈ నెల 11న ప్రారంభమైన ఈ ఐపీఓ ద్వారా జీఐసీ రూ.11,370 కోట్లు సమీకరించనుంది. ఈ ఐపీఓలో భాగంగా 12.47 కోట్ల షేర్లను జారీ చేయనున్నారు. ఐపీఓ చివరి రోజైన శుక్రవారం నాటికి మొత్తం 17.06 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. సంస్థాగత ఇన్వెస్టర్లకు కేటాయించిన వాటా 2.25 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్లకు కేటాయించిన వాటా 0.22 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల వాటా 0.48 రెట్లు చొప్పున ఓవర్ సబ్‌స్క్రైబయ్యాయి. ఈ ఐపీఓకు యాక్సిస్ క్యాపిటల్, సిటీగ్రూప్, డాయిష్ ఇండియా, హెచ్ఎస్బీసీ సెక్యూరిటీస్, కోటక్ క్యాపిటల్ సంస్థలు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి. ఈ కంపెనీ షేర్లు ఈ నెల 25న స్టాక్ మార్కెట్లో లిస్టయ్యే అవకాశాలున్నాయి. కోల్ ఇండియా ఐపీఓ(రూ.15,200 కోట్లు),రిలయన్స్ పవర్ ఐపీఓ(రూ.11,700 కోట్ల) తర్వాత ఇదే అతి పెద్ద ఐపీఓ. ఐపీఓ నిధులను వ్యాపార వృద్ధికి, ప్రస్తుత సాల్వెన్సీ స్థాయిలను కొనసాగించడానికి, సాధారణ వ్యాపార కార్యకలాపాలకు వినియోగించుకోవాలని కంపెనీ యోచిస్తోంది. 2015–17 కాలానికి కంపెనీ స్థూల ప్రీమియమ్ 25 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించింది. -
గ్రీన్కో ఎనర్జీలో రూ.1,530 కోట్ల పెట్టుబడులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పునరుత్పాదక ఇంధన రంగంలో ఉన్న గ్రీన్కో ఎనర్జీలో సింగపూర్‌కు చెందిన ఇన్వెస్ట్మెంట్ కంపెనీ జీఐసీతోపాటు అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీలకు చెందిన కంపెనీలు సుమారు రూ.1,530 కోట్లు పెట్టుబడి పెట్టాయి. దీంతో గ్రీన్‌కోలో మెజారిటీ వాటాదారుగా జీఐసీ నిలిచింది. 1,000 మెగావాట్లకుపైగా పవన, జల విద్యుత్ ప్రాజెక్టులను గ్రీన్కో నిర్వహిస్తోంది.