Giddalur constituency
-
అక్కా, తమ్ముళ్ళ మధ్య వార్.. మరోసారి పరాభవం తప్పదా?
అక్కా, తమ్ముళ్ళ మధ్య జరుగుతున్న వార్ ఆ నియోజకవర్గంలో టీడీపీని అట్టడుగుకు నెట్టేస్తోందా? పచ్చ పార్టీలో వరుసకు అక్కా తమ్ముళ్ళయ్యే నేతల తీరుతో అక్కడి కేడర్‌ను అయోమయానికి గురి చేస్తోంది. కత్తులు దూసుకుంటున్న ఆ ఇద్దరి కారణంగా ముచ్చటగా మూడోసారి కూడా ఓడిపోవడం ఖాయమని డిసైడవుతున్నారు. ఇంతకీ ఆ నియోజకవర్గం ఎక్కడుంది? ఆ అక్కా తమ్ముడు ఎవరు? ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఉపాధ్యక్షురాలు పిడితల సాయికల్పనారెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ ముత్తుమూల అశోక్ రెడ్డిల మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఆగేలా కనిపించడంలేదు. 2014లో వైయస్సార్సీపి నుంచి గెలుపొంది తర్వాత టిడిపీలో చేరిన అశోక్ రెడ్దిని 2019లో గిద్దలూరు ప్రజలు భారీ తేడాతో తిరస్కరించారు. పిడితల సాయికల్పనరెడ్దికి అశోక్‌రెడ్డి వరుసకు తమ్ముడవుతారు. గిద్దలూరు టీడీపీ ఇన్చార్జ్గా అశోక్ రెడ్డి చేపడుతున్న కార్యక్రమాలకి సాయి కల్పన రెడ్డి దూరంగా వుంటున్నారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణలో అశోక్ రెడ్డి అందరినీ కలుపుకుని వెళ్ళడంలేదని సాయికల్పనా రెడ్డి వర్గం విమర్శిస్తోంది. దీనికి తోడు అశోక్ రెడ్డి కూడా సాయికల్పనా రెడ్డిని ఆహ్వానించడకుండా తనపని తాను చేసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని ఇద్దరు నేతల తీరుపై పచ్చ పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. ఇటీవల చంద్రబాబు గిద్దలూరు వచ్చిన సందర్భంలో కూడా సాయికల్పనా రెడ్డి దూరంగానే వున్నారు. చంద్రబాబు నియోజకవర్గానికి వస్తున్నా నియోజకవర్గ ఇంచార్జ్ ఆశోక్ బాబు తనను ఆహ్వానించకపోవడంతో సాయికల్పనా రెడ్డి ఆగ్రహంగా ఉన్నారు. ముఖ్యనేతలు వెళ్ళి చంద్రబాబు సభకు హజరుకావాలని కోరినా..సాయికల్పనా రెడ్డి మాత్రం రానని తెగేసిచెప్పారు. అంతటితో ఆగకుండా చంద్రబాబుకు ఆహ్వనం పలుకుతూ తన వర్గం కట్టిన ఫ్లెక్సీలను కూడా తొలగించి వేశారు. దీంతో వీరిద్దరి వ్యవహరశైలి చంద్రబాబును సైతం అసహనానికి గురిచేసింది. వచ్చే ఎన్నికల్లో టికెట్ విషయంపైనే ఇద్దరి మధ్య గ్యాప్ ఏర్పడిందనే చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో గిద్దలూరు నుంచి సాయికల్పన లేదా ఆమె తనయుడు అభిషేక్ రెడ్డి బరిలో ఉండాలని పిడతల కుటుంబం భావిస్తోంది. తనకు టీడీపీ టిక్కెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గానైనా పోటీ చేస్తానని సాయికల్పనారెడ్డి తన సన్నిహితుల వద్ద చెప్పినట్లు సమాచారం. అయితే సాయి కల్పన ఎప్పుడూ కార్యకర్తలకు అందుబాటులో ఉండకపోవడం.. ఫోన్ ద్వారా పలకరించేందుకు ప్రయత్నించినా స్పందించకపోవడం వంటి అంశాలు ఆమెకు పరిస్థితులు ప్రతిబంధకంగా మారాయనే టాక్ నడుస్తోంది. సాయికల్పన ఇండిపెండెంట్‌గా బరిలో దిగితే తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంక్ దెబ్బ తిని మరోసారి ఓటమి తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే పార్టీ ప్రతిష్ట మసకబారిపోవడం, నేతల మధ్య అంతర్యుద్ధం వంటివి వైఎస్ఆర్ కాంగ్రస్ అభ్యర్థికి గెలుపు నల్లేరు మీద నడకే అని చెబుతున్నారు. ఓ వైపు అధికార పార్టీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు స్పీడ్ పెంచారు. సౌమ్యుడుగా పేరున్న రాంబాబు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో దూకుడు మీదున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలను నేరుగా కలుసుకోవడం పార్టీలకు అతీతంగా సంక్షేమ పధకాలు అందిస్తూ అందరివాడుగా పేరు తెచ్చుకున్నారు. చదవండి: అయ్యా పవనూ.. ఊహించలే.. మరీ ఇంత ఘోరంగా దిగజారాలా? -
వైఎస్ఆర్సీపీలో టీడీపీ నేతల చేరిక
ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కంభం మండలం పెద్ద నల్లకాల్వ గ్రామానికి చెందిన 50 మంది వరకు నేతలు, కార్యకర్తలు మంగళవారం నాడు వైఎస్ఆర్సీపీలో చేరారు. నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసేందుకు నియోజకవర్గ ఇన్చార్జి ఐవీ రెడ్డితో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు వాళ్లు తెలిపారు. నాయకులకు ఐవీ రెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కంభం మండల పార్టీ కన్వీనర్ రామిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కంభం మండల వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
జంబ లకిడి పంబ
అధికార పార్టీ నాయకులు ఆడిందే ఆట.. పాడిందే పాటగా తయూరైంది జిల్లాలో పరిస్థితి. అధికారులకు సైతం వారు చెప్పిందే వేదంగా మారింది. టీడీపీ నేతలు కుక్కను చూపించి, అది గాడిద అంటే అధికారులు అవునంటూ డూ డూ బసవన్నల్లా తలాడించేస్తున్నారు. అలాగే నిర్ధారించేస్తున్నారు. మగ మహారాజులను మహిళలుగా మార్చడమే కాదు.. ఏకంగా వారికి పింఛను సైతం మంజూరు చేశారు. భర్తలు బతికుండగానే స్త్రీలను వితంతువులను చేశారు. నడి వయస్కులను వృద్ధుల్ని చేశారు. శ్రీమంతులను కడుబీదలుగా చిత్రీకరించారు. ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబసభ్యులకు సామాజిక పింఛన్లు మంజూరు చేశారు. గిద్దలూరు మండలంలో వెలుగు చూసిన ఈ తతంగాన్ని చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే! గిద్దలూరు రూరల్ గిద్దలూరు మండలంలో తాజాగా లబ్ధిదారులకు సామాజిక పింఛన్లు మంజూరయ్యూయి. మొత్తం 18 పంచాయతీలకు గాను 495 (వృద్ధాప్య, వితంతువు, వికలాంగుల) పింఛన్లను శనివారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో పంపిణీ చేసేందుకు సిద్ధం చేశారు. పింఛను పుస్తకాలపై శుక్రవారం అధికారుల సంతకాలు కూడా పూర్తయ్యూయి. వీటిలో భాగంగా సంజీవరాయుడుపేట గ్రామ పంచాయతీకి 28 పింఛన్లు మంజూరు కాగా అందులో 13 తప్పుల తడకలుగా ఉన్నాయి. మరికొన్ని గ్రామాల్లోనూ అనర్హుల పేర్లతోనూ మంజూరయ్యూయి. టీడీపీ నేతలు, జన్మభూమి కమిటీ సభ్యుల సిఫార్సుల మేరకు పింఛన్లు మంజూరు చేసి, స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి చేతుల మీదుగా వీటిని పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. సంజీవరాయుడుపేట గ్రామంలో చాగం పెద్దకోటిరెడ్డికి వితంతు పింఛను మంజూరు చేస్తూ పుస్తకం తయారు చేశారు. దీనిపై అధికారుల సంతకాలు కూడా పూర్తయ్యూరుు. అందులో కోటిరెడ్డి వయస్సు 55 ఏళ్లుగా పేర్కొన్నారు. దీని ప్రకారం వృద్ధాప్య పింఛనుకు కూడా ఆయన అనర్హుడే. ఇదే గ్రామానికి చెందిన పెల్లురి లక్షీదేవి, పందరబోయిన గురవమ్మ, ఎం.సైదాబీ ముగ్గురికి భర్తలు బతికి ఉండగానే వితంతువు పింఛన్లు మంజూరు చేశారు. మార్తాల సుబ్బారెడ్డి, వేములపాటి కేశవులు, రాజుపాలెం బాలమ్మ, ముత్యాలపాటి చెన్నయ్య, శిరిగిరి పోలయ్య, పెల్లురి కువ్వన్న, చాగం ఎలమందారెడ్డి ఈ ఏడుగురూ 40 నుంచి 55 ఏళ్ల వయసు లోపు వారే. వీరందరికీ 60 ఏళ్లు పైబడినట్లు చూపి వృద్ధాప్య పింఛను మంజూరు చేశారు. ఇదే గ్రామంలో ఆర్మీ ఉద్యోగి అవివాహిత కుమార్తె ముత్యాలపాటి చెన్నమ్మకు వికలాంగుల పింఛను మంజూరు చేశారు. 8 ఎకరాల భూమి ఉన్న పొందుగుల చెన్నమ్మకు వితంతు పింఛను మంజూరు చేశారు. మండలంలోని ఆదిమూర్తిపల్లి గ్రామ పంచాయతీలో రిటైర్డ్ వీఆర్వో శింగరరెడ్డి భార్యకు వృద్ధాప్య పింఛను మంజూరు చేశారు. ముండ్లపాడు గ్రామ పంచాయతీలో నడి వయస్కులకు రికార్డుల్లో ఎక్కువ వయసు నమోదు చేసి వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేస్తూ పుస్తకాలు పంపిణీకి సిద్ధం చేశారు. వీటన్నిటిపై ఎంపీడీఓ జె.రాజశేఖరరావును వివరణ కోరగా డీఆర్డీఏ నుంచి తప్పులు వచ్చినట్లు సమాధానం చెప్పడం గమనార్హం. -
గిద్దలూరు నియోజకవర్గంలో వాటర్‌గ్రిడ్
అర్ధవీడు (కంభం రూరల్) : గిద్దలూరు నియోజకవర్గంలోని ఆరు మండలాలకు వెలిగొండ ప్రాజెక్టులో అంతర్భాగమైన కాకర్ల గ్యాప్ నుంచి తాగునీటిని అందించనున్నట్లు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి చెప్పారు. ఇందుకుగాను 600 కోట్ల వ్యయంతో వాటర్‌గ్రిడ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బుధవారం అర్ధవీడు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఎంపీపీ రవికుమార్ యాదవ్ అధ్యక్షతన ప్రజాసదస్సు నిర్వహించారు. మండలంలోని అన్ని పంచాయతీల ప్రజలు తాగునీటి సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వర్షాభావం వల్ల వేసవిలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంటున్న విషయాన్ని రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. కాకర్ల గ్యాప్ నుంచి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు పైప్లైన్లు వేసి తాగునీటిని అందించే వాటర్‌గ్రిడ్‌ను త్వరలో ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వం ైరె తుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టు నిర్మాణం త్వరితగతిన పూర్తయ్యేందుకు ప్రత్యేక నిధులు విడుదల చేయాలని కోరారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన వెంటనే గ్రామాలకు తాగునీరు అందించే వాటర్‌గ్రిడ్ ను అధికారులు ప్రారంభిస్తారని చెప్పారు. నిధులను దుర్వినియోగం చేయొద్దు మండల అభివృద్ధికి మంజూరయ్యే నిధులను అధికారులు దుర్వినియోగం చేయకుండా అత్యవసర సేవలకు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి సూచించారు. మండల ప్రజలు తాగునీటి సమస్యను ఎక్కువగా ప్రస్తావించడంతో.. ఎంపీడీఓ శామ్యూల్‌తోపాటు ఇతర అధికారులపై ఆగ్రహవ వ్యక్తం చేశారు. గ్రామాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. మండలానికి మంజూరైన నిధుల్లో తాగునీటికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేదిలేదని చెప్పారు. యాచవరంలో 40 చెంచు కుటుంబాలు వారు ఎమ్మెల్యేను కలిసి తమకు పక్కా గృహాలు, వ్యవసాయ భూములు మంజూరు చేయించాలని కోరగా తాను జనవరి మొదటి వారంలో శ్రీశైలం ఐటీడీఏ అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. మాగుటూరులో టీడీపీ నేత కర్ణం కాశయ్య వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడులు చేయిస్తూ తప్పుడు కేసులు పెట్టిస్తున్నాడని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. కాశయ్య నుంచి తమకు ప్రాణ హాని ఉందని, రక్షించాలని కోరగా.. ఎస్పీతో మాట్లాడతానని చెప్పారు. కార్యక్రమంలో ఇన్చార్జి ఎంపీడీఓ శామ్యూల్, తహశీల్దార్ ప్రసాద్, ఎంపీపీ రవికుమార్ యాదవ్, జెడ్పీటీసీ వెంకటలక్ష్మి, మండల కన్వీనర్ ఏరువ రంగారెడ్డి, నారు అశోక్‌రెడ్డి, జెడ్పీటీసీ వెంకటలక్ష్మి, మొహీద్దీన్పురం సర్పంచ్ బండారు రంగారావు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు బాలిరెడ్డి, అయ్యవారిపల్లి సర్పంచ్ బాలరంగాచారి, తహశీల్దార్ ప్రసాద్, ఎంపీడీఓ శామ్యూల్, రమేష్‌రెడ్డి, పశువైధ్యాధికారి హరిబాబు పాల్గొన్నారు.