giridhar reddy
-
తమ్ముడి రాజకీయ భవిష్యత్తు కోసమేనా..?
రాజకీయ ఉద్ధండులకు, వ్యూహ ప్రతివ్యూహాలకు పెట్టిన పేరు సింహపురి. అలాంటి జిల్లాలో ప్రస్తుతం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి హాట్‌టాపిక్‌గా మారారు. తాజాగా అధికార పక్షంలో ఉంటూ రాజకీయ చర్చకు, రచ్చకు తెరలేపుతున్నారు. నూతన ప్రభుత్వం ఏర్పడి ఆర్నెల్లు కాలేదు. అప్పుడే నయా పాలి‘ట్రిక్స్’తో ముందుకు ఉరుకుతున్నారు. మంత్రి పదవి ఆశించి భంగపడిన కోటంరెడ్డి భవిష్యత్తు ప్రణాళికలకు సిద్ధమవుతున్నారని కొందరు భావిస్తుంటే.. తన సోదరుడి రాజకీయ భవిష్యత్తుకు లైన్ క్లియర్ చేస్తున్నారని మరికొందరు అంటున్నారు.సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సోదరుడు గిరిధర్‌రెడ్డి వచ్చే నెల నుంచి నియోజకవర్గంలో గడప గడపకు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. అధికార పార్టీలో ఉన్న గిరిధర్‌రెడ్డికి పార్టీ పరంగా ఎలాంటి పదవులు దక్కలేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడి ఆర్నెల్లు కూడా గడవలేదు. ఎన్నికలకు ఎంతో గడువున్నా, అప్పుడే ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమానికి గిరిధర్‌రెడ్డి శ్రీకారం చుట్టడం వెను క రాజకీయ వ్యూహంతో పాటు సంకేతాలూ ఉన్నా యనే అంశం తెలుస్తోంది. అధికార పార్టీ అను మతి లేకుండానే గిరిధర్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని నిర్వహించే యత్నంలో గల ఆంతర్య మేమిటనే ఆసక్తికర చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. తమ్ముడి రాజకీయ భవిష్యత్తు కోసమేనా..? ఇప్పటి వరకు ఎమ్మెల్యే కార్యాలయ ఇన్చార్జిగా తెరవెనుక రాజకీయ వ్యవహారాలు నడిపిన గిరిధర్‌రెడ్డి ఇక తెరపైకి రావడం వెనుక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి రాజకీయ వ్యూహం ఉందనే ప్రచారం జరుగుతోంది. ‘గడప గడపకు గిరిధర్‌రెడ్డి’ కార్యక్రమాన్ని డిసెంబర్ 4 నుంచి నిర్వహించేందుకు కోటంరెడ్డే రూపకల్పన చేశారని తెలుస్తోంది. టీడీపీలో కార్యకర్తగా ఉన్న గిరిధర్‌రెడ్డి ఆ పార్టీ అధిష్టాన అనుమతి లేకుండానే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. రాజకీయంగా ఎలాంటి హోదా లేకుండానే ఆయన ప్రజల్లోకి ఎలా వెళ్తారనే ప్రశ్న ఆ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇప్పటి వరకు తన సోదరుడితో కలిసి గిరిధర్‌రెడ్డి అధికార కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎమ్మెల్యే హోదాను అనధికారికంగా అనుభవిస్తున్నారు. ఎమ్మెల్యే తరహాలో అధికార కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం, సమీక్షలు నిర్వహించడం, మంత్రులు నిర్వహించే సమీక్షల్లోనూ పాల్గొంటున్నారు. జమిలి ఎన్నికల ప్రచార నేపథ్యంలో..ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తన సోదరుడ్ని ప్రజల్లోకి తీసుకెళ్లడాన్ని బట్టి జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉందనే సంకేతాలున్నాయని ఆయన అభిమానులు భావిస్తున్నారు. 2026లో నియోజకవర్గాల పునరి్వభజన ఉంటుందని, మరుసటి ఏడాదిలోనే జమిలి ఎన్నికలు జరుగుతాయనే ప్రచార నేపథ్యంలో ఇప్పటి నుంచే తానే ఎమ్మెల్యే అభ్యర్థనని చెప్పుకొనేందుకు గిరిధర్‌రెడ్డి ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారని తెలుస్తోంది.మంత్రి పదవి దక్కలేదనేనా..? రాజకీయ నాయకులు ఎన్నికలకు ఏడాది ముందు నుంచి హడావుడి చేయడం సహజం. అయితే ఎన్నికలు పూర్తయి ఆర్నెల్లు గడవకముందే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సరికొత్త రాజకీయ వ్యూహా నికి తెరతీశారు. వైఎస్సార్సీపీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన మంత్రి పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అది దక్కకపోవడంతో అసంతృప్తికి గురయ్యారు. టీడీపీలో చేరితే అధికారంలోకి వచ్చాక మంత్రి పదవి ఇస్తామనే హామీతో ఎన్నికలకు ఏడాదిన్నర క్రితం ఆ పారీ్టలో చేరి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే కోటంరెడ్డికి తన చిరకాల వాంఛగా ఉన్న మంత్రి పదవి కోసం లోకేశ్ కోటరీ ద్వారా ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. తనను నమ్మించి వంచించారనే మనస్తాపంతో ఉన్న ఎమ్మెల్యే వైరాగ్యంలో కూరుకుపోయారు. జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులతో సాన్నిహిత్యంగా ఉన్నా, ప్రస్తుతం వారితో పొసగడం లేదు. నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఆయువుపట్టుగా ఉన్న నగర కార్పొరేషన్లో మంత్రి నారాయణ పెత్తనంతో కోటంరెడ్డికి ప్రాధాన్యం తగ్గింది. ఈ పరిణామాలూ ఆయనకు రుచించడం లేదు. వైఎస్సార్సీపీలో ఉన్న స్వేచ్ఛా వాతావరణం టీడీపీలో లేకపోవడంతో ఆయన మానసిక సంఘర్షణకు గురవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. భవిష్యత్తులో చేపట్టే మంత్రివర్గ విస్తరణలోనైనా అవకాశం లభిస్తుందనే యత్నంలో భాగంగానే తన సోదరుడితో నయా పాలి‘ట్రిక్స్’ సాగిస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. అది సాధ్యం కానప్పుడు తన సోదరుడి రాజకీయ భవిష్యత్తుకు మార్గాన్ని సుగమం చేసేందుకు.. ప్రజల్లో పరపతిని పెంచే యత్నం కావొచ్చని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. అధిష్టానం అనుమతి లేకున్నా.. కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కుదురుకోలేదు. ఎన్నికల హామీలను నెరవేర్చలేక ప్రజాగ్రహానికి గురవుతోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి తన సోదరుడ్ని ప్రజల్లోకి పంపే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రతినిధిగా వ్యవహరిస్తున్న గిరిధర్‌రెడ్డి ఈ సమయంలో ప్రజల్లోకి వెళ్తే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని వారి నుంచి వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ పరిణామాలు రాష్ట్రం మొత్తంలో చర్చకు దారి తీసే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే జరిగితే కూటమి ప్రభుత్వానికి గడ్డు పరిస్థితులు ఎదురుకానున్నాయి. ఈ పరిస్థితుల్లో గిరిధర్‌రెడ్డి కార్యక్రమానికి అనుమతి ఇచ్చే సాహసాన్ని పార్టీ అధిష్టానం చేయకపోవచ్చు. పార్టీ అనుమతి చ్చినా.. ఇవ్వకపోయినా.. గిరిధర్‌రెడ్డి ఈ కార్యక్రమానికి సిద్ధమైతే పరిస్థితులు, పరిణామాలు ఒక్కసారిగా మారే అవకాశం ఉంది. -
నగరంలో ఐటీ దాడుల కలకలం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లోని కాంగ్రెస్ నాయకులు, వారి బంధువుల ఇళ్లలో ఐటీ అధికారులు గురువారం విస్తృత సోదాలు నిర్వహించారు. ఎన్నికల ప్రచారం ఊపందుకుంటున్న సమయంలో జరిగిన తనిఖీలు నగరంలో కలకలం రేపుతున్నాయి. ఉదయం 5 గంటల నుంచే ప్రత్యేక బృందాలు దాడులు ప్రారంభించాయి. కోకాపేటలోని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తోడల్లుడు, రియల్ ఎస్టేల్ వ్యాపారి గిరిధర్‌రెడ్డి ఇంట్లో సోదాలు చేశాయి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి (కేఎల్ఆర్)కి చెందిన ఇళ్లు, విల్లా, ఫామ్‌హౌసుల్లో తనిఖీలు చేపట్టాయి. బాలాపూర్‌లోని బడంగ్పేట్ మేయర్, పీసీసీ ప్రధాన కార్యదర్శి చిగురింత పారిజాత నర్సింహారెడ్డి, వారి బంధువులు, అనుచరుల ఇళ్లలో, బాలాపూర్ గణపతి లడ్డూను వేలంలో కొనుగోలు చేసిన వంగేటి లక్ష్మారెడ్డి ఇంట్లో కూడా తనిఖీలు చేశారు. సీఆర్పిఎఫ్ బలగాల బందోబస్తు మధ్య దాదాపు 14 ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగాయి. ఇవి శుక్రవారం సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఏకకాలంలో ఇద్దరి ఇళ్లపై దాడి తుక్కుగూడ సమీపంలో కేఎల్ఆర్ అక్బర్ ఫాం హౌస్‌లోని ఇంట్లో, ఆయన సొంత గ్రామమైన రంగారెడ్డి జిల్లా మాసానిగూడ గ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలో, చర్లపల్లి, మొయినాబాద్ ఫామ్ హౌసుల్లో, గచ్చిబౌలి ఎన్సీసీలోని విల్లాలో ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఉదయం ఐదు గంటలకు మూడు ప్రైవేటు వాహనాల్లో ఐటీ అధికారులు కేఎల్ఆర్ నివాసానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఆయన ఇంట్లోనే ఉన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు తనిఖీలు కొనసాగాయి. కొద్దిపాటి నగదు సహా కీలక డాక్యుమెంట్లు స్వాదీనం చేసుకున్నట్లు తెలిసింది. కేఎల్ఆర్ పలు రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం అందడంతో పాటు, ఆదాయం, పన్ను చెల్లింపుల్లో భారీ వ్యత్యాసం కనిపించడం, ఆయన వ్యాపార లావాదేవీలకు సంబంధించి పలు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఈ సోదాలు జరిగినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో పారిజాత నర్సింహారెడ్డి ఇంట్లోనూ ఐటీ అధికారుల సోదాలు కొనసాగాయి. ఆ సమయంలో పారిజాత, ఆమె భర్త నర్సింహారెడ్డి ఇంట్లో లేరు. పారిజాత తిరుపతికి వెళ్లగా, నర్సింహారెడ్డి ఢిల్లీలో ఉన్నట్టు తెలిసింది. ఇంట్లో ఉన్న కుమార్తె నుంచి మొబైల్ ఫోన్‌ను అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. పారిజాత, నర్సింహారెడ్డికి సమాచారం ఇచ్చారు. ఇంట్లో లభించిన బ్యాంక్ పాస్‌బుక్కులు, డాక్యుమెంట్లను పరిశీలించారు. మరోవైపు కొందరు అధికారులు మేయర్‌ను తిరుపతిలో అదుపులోకి తీసుకుని చెన్నై మీదుగా సాయంత్రానికి నగరానికి తీసుకొచ్చారు. సాయంత్రం 4.56కు శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన నర్సింహారెడ్డిని కూడా అదుపులోకి తీసుకుని ఇంటికి తీసుకువచ్చి విచారణ మొదలుపెట్టారు. గత కొంతకాలంగా వారు చేసిన ఆర్థిక లావాదేవీలపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది. పొద్దుపోయే వరకు సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. కొంత నగదుతో పాటు కీలక డాక్యుమెంట్లు లభ్యమైనట్లు సమాచారం. కాగా మహేశ్వరం కాంగ్రెస్ టికెట్ ఆశించిన వారిలో పారిజాత కూడా ఉన్నారు. మహేశ్వరం టికెట్ కోసం భారీ ఎత్తున లాబీయింగ్ జరగడంతో కేఎల్ఆర్, పారిజాతల ఆర్థిక లావాదేవీలపై ఐటీ నిఘా పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. కోకాపేట హిడెన్ గార్డెన్లో.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తోడల్లుడు, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఎంపీపీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం కో ఆర్డినేటర్ గిరిధర్‌రెడ్డి ఇంట్లోనూ ఐటీ సోదాలు కొనసాగాయి. ఈయన రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నారు. హైదరాబాద్ కోకాపేటలోని హిడెన్ గార్డెన్లో ఆయన నివాసం ఉంటున్నారు. గిరిధర్ రెడ్డి గత కొంతకాలంగా చేసిన ఆర్థిక లావాదేవీలపై ఐటీ అధికారులు దృష్టి పెట్టినట్టు తెలిసింది. మరోవైపు బాలాపూర్‌కు చెందిన వ్యాపారవేత్త వంగేటి లక్ష్మారెడ్డి ఇంట్లో కూడా తనిఖీలు కొనసాగాయి. ఈ సమయంలో లక్ష్మారెడ్డితో పాటు కుటుంబసభ్యులు.. లక్ష్మారెడ్డి అన్న కొడుకు 3 రోజుల క్రితం మరణించడంతో అస్తికలు గంగలో కలిపేందుకు బయలుదేరుతున్నారు. దీంతో లక్ష్మారెడ్డితో కొద్దిసేపు మాట్లాడిన అధికారులు ఓ కాగితంపై సంతకం తీసుకుని ఆయన బయటకు వెళ్లేందుకు అనుమతించినట్లు తెలిసింది. రాజకీయ కక్షలో భాగంగానే..: కేఎల్ఆర్ ♦ రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తన ఇల్లు, కార్యాలయాలు, తన బంధువుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారని కేఎల్ఆర్ అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్లు కలిసి కుట్రపన్ని ఐటీ దాడులు చేయిస్తున్నాయని ఆరోపించారు. మహేశ్వరం కాంగ్రెస్ టికెట్ తనకు కేటాయించిన తరువాత, ఉద్దేశపూర్వకంగా ఈ సోదాలు చేస్తున్నారని చెప్పారు. మంత్రి సబిత ప్రోద్బలంతోనే..: మేయర్ పారిజాత కాంగ్రెస్ పార్టీ బీ ఫాం కోసం ఎదురు చూస్తున్నా. ఈ సమయంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు ఐటీ రైడ్స్ చేస్తున్నారు. రాజకీయ కుట్రలో భాగంగా, మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రోద్బలంతోనే ఇదంతా జరుగుతోంది. మంత్రిగా ఆమె వేల కోట్లు సంపాదించారు. ఎన్నో ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జా చేశారు. ఆమె ఇంటిపై దాడులు చేయకుండా కేవలం కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్న నాపై దాడులు చేయడం ఎంతవరకు సమంజసం?. -
గిరిధర్‌రెడ్డి రాక.. టీడీపీలో చిచ్చు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి చేరిక తెలుగుదేశంలో కొత్త సమస్యలు తెచ్చింది. ఆయన్ను టీడీపీలోకి ఆహ్వానించడాన్ని వ్యతిరేకించినా పట్టించుకోకుండా చేర్చుకోవడంతో వర్గాల మధ్య విభేదాలు మరింత పెరిగాయి. గిరి చేరిక కార్యక్రమానికి పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, జిల్లాలో సీనియర్ నేత అయిన సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు, నెల్లూరు రూరల్ ఇన్చార్జి అబ్దుల్ అజీజ్‌తోపాటు సీనియర్లు హాజరుకాకపోవడం చూస్తే ఆ పార్టీ లో పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. అన్నీ తానై.. జిల్లాలో లోకేశ్ టీంగా ప్రస్తుతం వ్యవహారాలు నడిపిస్తున్న మాజీ మంత్రి నారాయణ ముఖ్య అనుచరుడు పట్టాభి టీడీపీలోకి గిరిధర్‌రెడ్డి చేరిక విషయంలో అన్నీ తానై వ్యవహరించాడు. పార్టీ జిల్లా అధ్యక్షుడికే వ్యతిరేకంగా అంతర్గత విషయాల్లో పట్టాభి తలదూర్చడంపై కూడా సీనియర్లు గుర్రుమంటున్నారు. ఆయన గురించి నారాయణ వద్ద తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయంలో పంచాయితీ కూడా పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఎంట్రీకి ముందే ఫ్లెక్సీ వివాదం గిరిధర్‌రెడ్డి టీడీపీలో చేరికకు ముందే ఫ్లెక్సీల వివాదం మొదలైంది. కోటంరెడ్డి బ్రదర్స్ నగరంలో ఏర్పాటు చేయించిన ఫ్లెక్సీల్లో ఎక్కడా జిల్లాలోని సీనియర్ నేతల ఫొటోలు వేయలేదు. కేవలం చంద్రబాబు, లోకేశ్, బాలకృష్ణ ఫొటోలు మాత్రమే పెట్టారు. సీనియర్ నేతలు లేకపోవడంతో ఆ పార్టీ కార్యకర్తలు నోరెళ్లబెట్టారు. ఇప్పటికే.. రానున్న ఎన్నికల్లో జిల్లాలో లోకేశ్ వర్గంగా చెప్పుకునే కొత్త ముఖాలే బరిలో ఉంటాయని చెబుతున్నారు. గతంలో పలుసార్లు పోటీ చేసి ఓటమి పాలైన వారిని పక్కన పక్కకు తప్పించేయత్నం జరుగుతున్నట్లు సమాచారం. దీంతో తమకు అవకాశం వస్తుందో రాదో తెలియక సీనియర్లు ఆందోళనలో ఉన్నారు. దీనికితోడు కోటంరెడ్డి బ్రదర్స్ విషయంలో వారి మాటను పట్టించుకోకపోవడంతో బాధలో మునిగిపోయారు. ► సోమవారం టీడీపీ సీనియర్ నాయకులు బీద రవిచంద్ర, నారాయణ, అబ్దుల్ అజీజ్ చంద్రబాబును హైదరాబాద్‌లో కలిశారు. ఈ పరిణామాలు ఇలా ఉండగానే గిరిధర్‌రెడ్డిని చినబాబు వర్గం యువగళం పాదయాత్రకు తీసుకెళ్లింది. ప్రత్యేకంగా లోకేశ్‌ను కలిపించడంతో సీనియర్లకు పుండు మీద కారం చల్లినట్లయింది. కీలకంగా చినబాబు వర్గం కోటంరెడ్డి బ్రదర్స్ వ్యవహారశైలి తెలిసిన టీడీపీ సీనియర్ నేతలు ఆది నుంచి వారిని పార్టీలోకి ఆహ్వానించడాన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు. ఎమ్మెల్యేగా రెండు దఫాలు అవకాశం కల్పించిన వైఎస్సార్సీపీకి వెన్నుపోటు పొడిచిన శ్రీధర్‌రెడ్డిని అక్కున చేర్చుకుంటే టీడీపీలో అదే సీన్ రిపీట్ చేయరని నమ్మకం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. నెల్లూరు సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులను టార్గెట్ చేసి ముప్పుతిప్పలు పెట్టడమే కాకుండా ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టిన బ్రదర్స్‌ను సీనియర్, ద్వితీయ శ్రేణి నాయకులు వ్యతిరేకిస్తూ వచ్చారు. టీడీపీ అధికారంలో ఉన్నా, లేకున్నా కష్టపడిన వారి మాటను తోసిపుచ్చి కేవలం ఒక ఎమ్మెల్సీ ఓటు కోసం వారికి ఎంట్రీ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతోనే గిరి జాయినింగ్ కార్యక్రమానికి టీడీపీ కార్యకర్తలు ఎవరూ వెళ్లొద్దని సీనియర్ నేతలు హుకుం జారీ చేశారు. చాలావరకు టీడీపీ కార్యకర్తలు వెళ్లకపోవడంతో రోజువారీ పనులు చేసుకునే వారికి కోటంరెడ్డి బ్రదర్స్ రూ.500 చొప్పున పంపిణీ చేసి కార్యకర్తలుగా చూపించినట్లు నాయకులే చెబుతున్నారు. -
కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డికి సీఎం జగన్ ఆత్మీయ పలకరింపు
సాక్షి, నెల్లూరు: కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్‌కు సీఎం జగన్మోహన్రెడ్డి ఆదివారం విచ్చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డిని సీఎం ఆప్యాయంగా పలకరించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. చదవండి: (విక్రమ్‌రెడ్డి మెజార్టీ చరిత్రలో నిలవాలి: ఆర్కే రోజా) -
ఆంధ్ర సీనియర్ వన్డే జట్టుకు గిరినాథ్‌రెడ్డి
అనంతపురం సప్తగిరి సర్కిల్ : ఆంధ్ర సీనియర్ వన్డే జట్టుకు జిల్లా క్రీడాకారుడు గిరినా«థ్‌రెడ్డి ఎంపికయ్యాడు. చెన్నైలో జరిగే బీసీసీఐ విజయ్‌హజారే ట్రోఫీలో పాల్గొనే ఆంధ్ర సీనియర్ వన్డే జట్టులో గిరినాథ్రెడ్డికి చోటు దక్కింది. అండర్–23 అంతర్ రాష్ట్ర క్రికెట్ పోటీల్లో ప్రతిభ చూపడంతో గిరినాథ్‌రెడ్డిని ఆంధ్ర సీనియర్ వన్డే జట్టుకు ఎంపిక చేశారు. జరుగనున్న పోటీల్లో కూడా రాణించాలని జిల్లా క్రికెట్ సంఘం అ«ధ్యక్ష, కార్యదర్శులు మాంచో ఫెర్రర్, బీఆర్ ప్రసన్నలు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా గిరినాథ్‌రెడ్డిని అభినందించారు.