girl harassed
-
అత్యాచారం చేశారని ఫిర్యాదు కోసం వస్తే.. స్టేషన్లో పోలీసులు..
లలిత్పూర్: మూడు రోజులుగా నలుగురు తనపై అత్యాచారం చేస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వచ్చిన 13ఏళ్ల బాలికపై సదరు స్టేషన్ అధికారి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. బాధితురాలిని నలుగురు వ్యక్తులు ఏప్రిల్ 22న భోపాల్ తీసుకువెళ్లారని, మూడు రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె తల్లి తెలిపింది. నిందితుల్లో ఒకరు బాలికను పాలి పోలీస్ స్టేషన్ దగ్గర విడిచి వెళ్లగా స్టేషన్ అధికారి కూడా ఆమెపై అఘాయిత్యం చేశాడని వాపోయింది. వివరాలను బాలిక ఓ స్వచ్ఛంద సంస్థకు వెల్లడించడంతో ఆమెను జిల్లా ఎస్పీ దగ్గరికి తీసుకెళ్లింది. ఎస్పీ ఆదేశాలతో ఎస్‌హెచ్‌ఓతో పాటు బాలిక అత్త తదితరులపై ఎఫ్ఐఆర్ నమోదైంది. స్టేషన్లో డ్యూటీ చేస్తున్నవారందరినీ ప్రభుత్వం విధుల నుంచి తప్పించింది. డీఐజీ ఆధ్వర్యంలో 24 గంటల్లో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. నిందితులపై జాతీయ భద్రతా చట్టం కింద కేసు పెట్టి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా విచారిస్తామని ఉప ముఖ్యమంత్రి బ్రజేశ్ పాఠక్ చెప్పారు. యూపీలో మహిళలకు పోలీసుల నుంచే రక్షణ లేదని విపక్షాలు దుయ్యబట్టాయి. ఎస్హెచ్ఓ అరెస్టు పరారీలో ఉన్న ఎస్హెచ్ఓ తిలక్‌ధర్ సరోజ్‌ను అరెస్టు చేసినట్టు ఏడీజీ భాను భాస్కర్ చెప్పారు. అతన్ని సస్పెండ్ చేశామన్నారు. బాలికను తిలక్‌ధర్ తొలుత ఆమె అత్తకు అప్పగించాడని, తర్వాత స్టేట్మెంట్ రికార్డు చేయాలంటూ పిలిచి అత్యాచారం చేశాడని పోలీసులు తెలిపారు. అత్తను కూడా అరెస్టు చేశామన్నారు. సమాజ్‌వాదీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించారు. యోగి ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా విమర్శలు గుప్పించారు. ఇది సిగ్గుచేటని, వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని బీఎస్పీ చీఫ్ మాయావతి అన్నారు. దీన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించింది. 4 వారాల్లో నివేదిక ఇవ్వాలంటూ యూపీ ప్రభుత్వానికి నోటీసులిచ్చింది. ఇది కూడా చదవండి: పెళ్లి చేసుకో.. లేకపోతే ఫోటోలు, వీడియోలు బయటపెడతా.. -
అమ్మాయిలపై వేధింపులు: ముగ్గురి హత్య
బిజ్నూర్ : ఎన్నికల ముంగిట ఉత్తరప్రదేశ్ లో మరో మతకల్లోలం చెలరేగింది. బిజ్నూర్ పట్టణంలో స్కూలుకు వెళుతున్న విద్యార్థినులను ఓ వర్గానికి చెందిన యువకులు వేధించడంతో మొదలైన గొడవ చివరికి ముగ్గురి హత్యకు దారితీసింది. శాంతి భద్రతల విభాగం అదనపు డీజీ దల్టీత్ చౌదరి తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. బిజ్నూర్ లో ఒక వర్గానికి చెందిన విద్యార్థినులు శుక్రవారం స్కూల్ కు వెళుతున్న సమయంలో మరో వర్గానికి చెందిన యువకుల బృందం వేధింపులకు పాల్పడింది. స్కూల్ కు వెళ్లాల్సిన ఆ అమ్మాయిలు ఏడ్చుకుంటూ ఇళ్లకు వెళ్లి.. వేధింపుల విషయాన్ని చెప్పారు. దీంతో కోపోద్రిక్తులైన కుటుంబసభ్యులు.. యువకులను నిలదీసేందుకు వారి ఇళ్ల వద్దకు వెళ్లారు. అక్కడ ఇరువర్గాలు తీవ్రంగా వాదులాడుకున్నాయి. ఒక దశలో యువకుల తరఫు బంధువుల్లో ఒకరు తుపాకి బయటికితీసి.. యువతి తరఫున మాట్లాడుతోన్న వారిపై కాల్పులు జరిపాడు. బుల్లెట్ గాయంతో ఒక యువకుడు అక్కడికక్కడే కుప్పకూలిపోగా, మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. తమ వాళ్ల మరణవార్త తెలుసుకున్న ఆ వర్గాలు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి ఆందోళనలు నిర్వహించారు. ఇటు వైరివర్గం కూడా వారిని ఎదుర్కొనేందుకు పెద్ద ఎత్తున గుమ్మికూడింది. బిజ్నూర్ వ్యాప్తంగా నెలకొన్ని ఉద్రిక్తత సమాచారం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఇరుపక్షాలను చెదగొట్టారు. ప్రస్తుతానికి శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని ప్రకటించారు. చనిపోయిన యువకులను అహసాన్, సర్తాజ్, అనీస్ లుగా గుర్తించామని, పోస్ట్ మార్టం అనంతరం కుటుంబసభ్యులను మృతదేహాలను అందజేస్తామని పోలీసులు పేర్కొన్నారు. యూపీ డీజీపీ జావెద్ అహ్మద్ సౌతం బిజ్నూర్ కల్లోలంపై ప్రత్యేక దృష్టిసారించారు. వేధింపులు, కాల్పుల వ్యవహారంలో ఇప్పటివరకు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అసలే కుల, మత తారతమ్యాలు అధికంగా ఉండే ఉత్తరప్రదేశ్ లో తాజా ఉదంతం ఎలాంటి మలుపు తీసుకుంటుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అల్లర్లను అణిచివేశామని పోలీసులు చెబుతున్నప్పటికీ.. ఎన్నికల దృష్ట్యా ఈ హత్యాకాండ రాజకీయరంగు పులుముకునే అవకాశం లేకపోలేదు!