Global Business
-
వినియోగ విశ్వాసం బలోపేతంతోనే వృద్ధి
ముంబై: ఆర్థికాభివృద్ధి అంశంలో వినియోగదారుని విశ్వాసం, మనోభావాలే కీలక పాత్ర పోషిస్తాయని ఫిక్కీ ప్రెసిడెంట్, అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతారెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఈ అంశాల్లో బలహీనత నెలకొందని ఆమె అన్నారు. వినియోగ విశ్వాసం పటిష్టతే ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తుందని పేర్కొన్నారు. ఈ దిశలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇక్కడ జరిగిన ఒక గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ సందర్భంగా జరిగిన చర్చ గోష్టిలో ఆర్థిక అనిశ్చిత పరిస్థితిపై ఆమె మాట్లాడారు. ఆమె ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► కరోనా మహమ్మారి ప్రేరిత అంశాలతో దాదాపు 20 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. పూర్తి అనిశ్చితి, భయాందోళనకర పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఆర్థిక పురోగతికి ప్రభుత్వం నుంచి మరింత వ్యయాలు అవసరం. ► కరోనా ముందటి పరిస్థితితో పోల్చితే ఉత్పత్తి ప్రస్తుతం 60 నుంచి 70 శాతం స్థాయికి చేరిందని కర్మాగారాల నుంచి వార్తలు వస్తున్నాయి. రుణ లభ్యత బాగుంది. ఎగుమతులు దారిలోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం డిమాండ్ పెంపు పరిస్థితులపై ఆలోచించాలి. ఎందుకంటే వినియోగదారు విశ్వాసం ఇంకా బలహీనంగానే ఉంది. వారి మనోభావాలు మెరుగుపడకుండా వృద్ధిని మళ్లీ పట్టాలపైకి ఎక్కించడం అసాధ్యం. ఇందుకుగాను ప్రభుత్వం నుంచి ప్రత్యక్ష నగదు బదలాయింపులు మరింత జరగాలి. పండుగల సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో ఆర్థిక వృద్ధిలో ప్రత్యక్ష నగదు బదలాయింపు ఎంతో కీలకమవుతుంది. ► ఫిక్కీ ఇప్పటికే ప్రభుత్వానికి కన్జూమర్ వోచర్ విధానాన్ని సిఫారసు చేసింది. ప్రభుత్వం వ్యయాల కింద 30 నుంచి 50 శాతం డిస్కౌంట్‌తో కన్జూమర్ వోచర్ విధానాన్ని అమలు చేయడం వల్ల వ్యవస్థలో డిమాండ్ మెరుగుపడే అవకాశం ఉంటుంది. ► విధానాన్ని ఇకమీదట ఏ మాత్రం అనుసరించకూడదు. పూర్తి సాధారణ పరిస్థితులు నెలకొనాలి. ఏ విభాగంలోనూ ఇకపై లాక్డౌన్ నిబంధనలను ఏ మాత్రం అమలు చేయకూడదు. ► వేదాంతా గ్రూప్ సీఈఓ సునీల్ దుగ్గల్, టాటా మోటార్స్ సీఈఓ బషెక్, యాక్సెంచర్ సీఈఓ పీయూష్ సింగ్ తదితరులు ఈ చర్చలో పాల్గొన్నారు. వారి అభిప్రాయాలను చూస్తే... ద్రవ్యోల్బణంపై ఆందోళన అక్కర్లేదు వృద్ధిని తిరిగి పట్టాలు ఎక్కించే విషయానికి సంబంధించిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం ద్రవ్యోల్బణంపై ఆందోళన చెందనక్కర్లేదు. ఎకానమీలోకి మరింత నగదు లభ్యత జరిగేలా చూడ్డం ఇప్పడు ముఖ్యం. ముఖ్యంగా మౌలిక రంగంలో వ్యయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. దీనితోపాటు కార్మిక సంస్కరణల విషయంలో కూడా ప్రభుత్వం ముందడుగు వేయాలి. పరిశ్రమ ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలి. – సునీల్ దుగ్గల్, సీఈఓ, వేదాంతా గ్రూప్ డిమాండ్ పటిష్టతకు మరో 9 నెలలు ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ విభాగంలో డిమాండ్ ఊరటకలిగించే స్థాయిలో మెరుగుపడింది. అయితే అన్ని విభా గాల్లో డిమాండ్ పూర్తి పునరుత్తేజానికి ఆరు నుంచి తొమ్మిది నెలల సమయం పడుతుంది. – పీయూష్ సింగ్, సీనియన్ ఎండీ, యాక్సెంచర్ ఆటో... పన్ను రాయితీలు కావాలి కరోనా ప్రేరిత అంశాలతో ఆటో పరిశ్రమ దారుణంగా దెబ్బతింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ రంగం 2010–11 స్థాయికి క్షీణిస్తుందన్నది అంచనా. పన్ను రాయితీలు ఈ రంగానికి తక్షణ అవసరం. – బషెక్, ఎండీ, సీఈఓ, టాటా మోటార్స్ -
సంస్కరణల అమలు పెద్ద సమస్య
ముంబై: సంస్కరణల అమలు భారత్‌కు ప్రధాన సవాల్ అని అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం వార్బర్గ్ పింకస్ సీఈవో చార్లెస్ కేయ్ తెలిపారు. సహజంగా అవకాశాలతోపాటే సవాళ్లూ ఉన్నాయని చెప్పారు. వ్యవసాయం, కార్మికులకు సంబంధించి భారత్ చేపట్టిన సంస్కరణల నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. బుధవారం జరిగిన గ్లోబల్ బిజినెస్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు. ‘అధిక వృద్ధి కలిగిన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు భారత్‌కు జనాభా వంటి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ఇందుకు జనాభా ఒక్కటే సరిపోదు. ఈ స్థాయి వృద్ధికి నిరంతర చర్యలు, నిఘా ఉండాలి. 1995లో భారత్‌లో తొలిసారిగా హెచ్‌డీఎఫ్‌సీలో పెట్టుబడి చేశాం. నాటి నుంచి పోలిస్తే ఇప్పుడు చాలా మెరుగ్గా ఉంది పరిస్థితి. అయితే సంస్కరణల అమలే సవాల్. సవాళ్లు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. అవి భారత్‌కు బహిరంగ ప్రశ్నలు. ప్రస్తుత మహమ్మారి విస్తృతి నేపథ్యంలో ప్రభుత్వం స్పందించిన తీరు ఆహ్వానించదగ్గది. ప్రభుత్వం సరిగా స్పందించలేదంటూ దేశీయంగా పెద్ద చర్చే జరుగుతోంది. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే బాధ్యతను బ్యాంకింగ్ రంగానికి వదిలేశారు. ఆర్బీఐ, మారటోరియం ద్వారా వ్యవస్థకు మద్ధతు ఇచ్చారు. దీని ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి’ అని అన్నారు. ‘‘లాక్డౌన్ ముందుగానే విధించడం వల్ల ఆరోగ్య రంగం బలపడింది. దీంతో కేసులు పెరుగుతున్నా ఈ రంగం నిలబడింది’’ అని ఆయన విశ్లేషించారు. -
ఏ దేశమూ అందరినీ ఆహ్వానించదు
న్యూఢిల్లీ: ప్రపంచంలోని ఏ దేశమూ అందరినీ ఆహ్వానించదని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. ఎకనామిక్ టైమ్స్ గ్లోబల్ బిజినెస్ సమిట్‌లో సీఏఏ వ్యతిరేక వాదనలపై అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించారు. ‘ఏ దేశానికీ చెందని వారిని పౌరులుగా గుర్తించేందుకు ఈ చట్టం చేశాం. దేశం ఎదుర్కొంటున్న శరణార్థుల సమస్యను పరిష్కరించేందుకు ఇది ఉపయోగపడుతుంది. పౌరసత్వంపై దేశానికో నిర్వచనం, విధానం ఉంటాయి. ప్రపంచంలో అందరినీ స్వాగతించే దేశమేదైనా ఉంటే చూపండి. అలా ఎవరూ చూపలేరు. అమెరికాను చూడండి. యూరోపియన్లను చూడండి. యూరప్‌లో అయితే ఒక్కో దేశానికీ ఒక్కో విధానం ఉన్నాయి’ అని వ్యాఖ్యానించారు. సీఏఏ విషయంలో భారత్ ప్రపంచాన్ని ఒప్పించలేకపోయిందా అన్న ప్రశ్నకు ఆయన.. బ్రస్సెల్స్‌లో 27 దేశాల మంత్రులతో జరిగిన సమావేశంలో సీఏఏపై వాస్తవాలను వివరించానన్నారు. ఈ విషయంలో భారత్ తన స్నేహితులను కోల్పోతుందా అన్న ప్రశ్నపై.. వాస్తవ మిత్రులెవరో కూడా ఇప్పుడే తెలిసే అవకాశం ఉంది కదా? అని ప్రశ్నించారు. ‘ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం భారత్. మూడో ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోంది. గతంలో మాదిరిగా నేడు రక్షణాత్మకంగా వ్యవహరించ లేదు. ప్రతి ఒక్కరితోనూ సంబంధాలు కలిగి ఉండాలి. ప్రతి సమస్యకూ పరిష్కారం కనుగొనాల్సిందే. భారత్‌లో జరుగుతున్న పరిణామాలను కొందరు అంగీకరించవచ్చు. మరికొందరు అంగీకరించక పోవచ్చు. ఈ రెంటినీ ఒకే గాటన కట్టలేం. ఇందుకు తగినట్లుగా ఆయా దేశాలతో మనం వ్యవహారం సాగించాల్సి ఉంది’అని తెలిపారు. కశ్మీర్లో పరిస్థితులపై ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కౌన్సిల్ (యూఎన్హెచ్ఆర్సీ) డైరెక్టర్ వ్యక్తం చేసిన అభ్యంతరాలపై ఆయన స్పందిస్తూ.. గతంలోనూ యూఎన్హెచ్ఆర్సీ ఇటువంటి తప్పుడు అభిప్రాయాన్నే వ్యక్తం చేసింది. కశ్మీర్లో పొరుగుదేశం ప్రేరేపిస్తున్న సీమాంతర ఉగ్రవాదంపై యూఎన్హెచ్ఆర్సీ ఏమీ చేయలేకపోయింది’ అని పేర్కొన్నారు. -
బ్యాంకులను ప్రైవేటీకరించబోం
న్యూఢిల్లీ: పీఎన్బీ బ్యాంకు కుంభకోణం నేపథ్యంలో ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణపై వస్తున్న వార్తలను ఆర్థిక మంత్రి జైట్లీ తోసిపుచ్చారు. రాజకీయంగా ఆమోదయోగ్యంకాని ఈ నిర్ణయాన్ని తమ ప్రభుత్వమూ తీసుకోబోదన్నారు. ఢిల్లీలో జరుగుతున్న గ్లోబల్ బిజినెస్ సమ్మిట్‌లో జైట్లీ శనివారం ప్రసంగించారు. ‘ప్రైవేటీకరణకు రాజకీయ ఏకాభిప్రాయం అవసరం. దీంతోపాటుగా బ్యాంకింగ్ నియంత్రణ చట్టానికి సవరణలు చేయాలి. నా అభిప్రాయం ప్రకారం భారతీయ రాజకీయాలు ఈ ఆలోచనకు అంగీకరించవు. ఇది సవాలుతో కూడుకున్న నిర్ణయం’ అని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సర్కారు వాటా 50 శాతానికన్నా తక్కువకు తగ్గించుకోవాలని ఫిక్కీ, అసోచామ్‌లు సూచిస్తున్నాయి. తద్వారా డిపాజిటర్లు, భాగస్వాములపై బ్యాంకుల జవాబుదారీ పెరుగుతుందంటున్నాయి. ఈ నేపథ్యంలోనే జైట్లీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉన్నతస్థాయి ఉదాసీనతే.. పీఎన్బీ కుంభకోణానికి బ్యాంకులు, వాటి ఆడిటర్లు, రెగ్యులేటర్లు వ్యవహరించిన తీరే కారణమని జైట్లీ మండిపడ్డారు. వీరి ఉదాసీనత వల్లే రూ.11,400 కోట్ల భారీ మోసం జరిగిందన్నారు. కుంభకోణాలకు పాల్పడిన వారిపై కఠినచర్యలు తీసుకోవటంలో ఉపేక్షించబోమన్నారు. ‘బ్యాంకుల్లోని కొన్ని విభాగాల్లో విలువల్లేకపోవటం, వివిధ దశల్లో పనిచేసే ఆడిటింగ్ వ్యవస్థ సీరియస్‌గా లేకపోవటం వల్లే ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఉన్నత స్థానాల్లో పనిచేసే వారు కూడా వ్యవస్థలో ఏం జరుగుతుందో గుర్తించలేకపోవటం దారుణం. ఆర్థిక వ్యవస్థలో రెగ్యులేటర్ల పాత్ర కీలకం. బ్యాంకుల్లో ఏక్షణం, ఎక్కడ ఏమేం జరుగుతుందో మూడోకన్నుతో చూడాల్సిన బాధ్యత వీరిది. కానీ భారత వ్యవస్థలో రెగ్యులేటర్ల బదులు రాజకీయ నేతలు జవాబుదారీగా మిగిలిపోతున్నారు’ అని జైట్లీ పేర్కొన్నారు. వ్యాపారస్తులు నీతి, నిజాయితీతో ఉండాల్సిన అవసరాన్ని గుర్తించాలన్నారు. తప్పుచేసిన వారెవరినీ వదలబోమని ఆయన స్పష్టం చేశారు. -
స్కామ్‌స్టర్స్‌పై ఉక్కుపాదం
న్యూఢిల్లీ: దేశాన్ని కుదిపేస్తున్న పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) కుంభకోణంపై ప్రధాని మోదీ తొలిసారి పెదవి విప్పారు. నీరవ్, పీఎన్బీల పేర్లను ప్రస్తావించకుండా మోదీ మాట్లాడారు. ఆర్థిక అవకతవకలకు పాల్పడే వారిపై తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఇలాంటి కుంభకోణాలను గుర్తించేందుకు ఆర్థిక సంస్థలు, వాటి పర్యవేక్షక విభాగాలు∙శ్రద్ధతో పనిచేయాలన్నారు. ఆంగ్ల దినపత్రిక ఎకనమిక్ టైమ్స్ నిర్వహించిన ప్రపంచ వాణిజ్య సదస్సులో శుక్రవారం మోదీ మాట్లాడారు. ‘ఆర్థిక అవకతవకలపై మా ప్రభుత్వం ఇప్పటికే కఠిన చర్యలు తీసుకుంటోందనీ, ఇకపై కూడా అలాగే వ్యవహరిస్తామని నేను స్పష్టంచేస్తున్నాను’ అని అన్నారు. 2011 నుంచి 2017 మధ్య నీరవ్ మోదీ బ్యాంకు అధికారులతో కుమ్మక్కై అక్రమంగా ఎల్వోయూలు జారీ చేయించుకుని బ్యాంకును రూ.11,400 కోట్లకు మోసగించడం తెలిసిందే. ‘నిబంధనలు, విధానాలను రూపొందించేవారు తమ పనిని జాగ్రత్తగా చేయాలని నేను కోరుతున్నాను’ అని మోదీ అన్నారు. జీఎస్టీ వల్ల పన్ను ఆదాయం పెరిగిందనీ, గతంలో 60 లక్షల మంది పన్నులు కడుతుండగా ఇప్పుడు ఆ సంఖ్య కోటికి చేరిందని ఆయన అన్నారు. ఆర్థిక లోటు, ద్రవ్య లోటుల్లో తగ్గుదల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రాక తదితరాలే భారత వృద్ధి గురించి చెబుతాయని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత వాటా 3.1 శాతానికి పెరిగిందనీ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో 21 శాతం భారత్‌దేనని మోదీ వెల్లడించారు. -
భారత్ నంబర్ 2
న్యూఢిల్లీ: భారత్ మరో విషయంలో ముందడుగు వేసింది. ఇప్పటికే వ్యాపార సులభతర నిర్వహణ, వినియోగదారుల విశ్వాస సూచీల్లో తన స్థానాలను మెరుగుపరచుకున్న భారత్, తాజాగా వ్యాపార ఆశావాదంలోనూ ప్రపంచంలో నంబర్ 2 స్థానానికి చేరుకుంది. విధానపరమైన సంస్కరణలు, త్వరలోనే జీఎస్టీ పట్టాలెక్కనుండటం వంటి సానుకూలతలతో సూచీలో ఓ మెట్టు పెకైక్కింది. ఈ మేరకు గ్రాంట్ థార్న్టన్ ఇంటర్నేషనల్ బిజినెస్ ఓ నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం జూలై - సెప్టెంబర్ త్రైమాసికంలో ఆశావహ సూచీలో భారత్ రెండో స్థానంలో ఉంది. అంతకుముందు త్రైమాసికంలో మన దేశం మూడో స్థానంలో ఉండగా ఒక స్థానం మెరుగుపడింది. ఇండోనేసియా తాజాగా మొట్టమొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఆశావహ సూచీలో భారత్ ముందంజ వేయడంపై గ్రాంట్ థార్న్టన్ ఇండియా ఎల్ఎల్పీ పార్ట్నర్ హరీష్ మాట్లాడుతూ... ఇది ప్రభుత్వ సంస్కరణల అంజెడాను, వ్యాపార వాతావరణం మెరుగుపరిచే విషయంలో తీసుకునే చర్యల్ని ప్రతిఫలిస్తోందన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు, చర్యలు, బలమైన ఆర్థిక వ్యవస్థలతో సంబంధాల మెరుగుపై దృష్టి సారించడం వంటి చర్యలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్‌ను ఆశాకిరణంగా మార్చాయని హరీష్ పేర్కొన్నారు. ఉద్యోగుల అంచనాలు పెరగడం కూడా వ్యాపార ఆశావాదం మెరుగుపడడానికి తోడ్పడింది. ఉద్యోగుల అంచనాల విషయంలో సెప్టెంబర్ త్రైమాసికంలో భారత్ రెండో స్థానం నుంచి మొదటి స్థానానికి చేరుకుంది. 36 దేశాల్లో 2,500 మందిపై సర్వే నిర్వహించి, వచ్చిన అభిప్రాయాల ఆధారంగా థార్న్టన్ ఈ నివేదికను రూపొందించింది. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే వ్యాపార ఆశావాదం 33 శాతంగా ఉంది. జూలై త్రైమాసికంతో పోల్చితే ఒక శాతం మెరుగుపడింది. కానీ, గతేడాదితో పోల్చి చూస్తే 11 శాతం పారుుంట్ల మేర తగ్గినట్టు తెలుస్తోంది. -
బెంగాల్లో అభివృద్ధి వాతావరణం కావాలి: జైట్లీ
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత సీఎం మమతా బెనర్జీపై ఉందని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం పూర్తిగా సాయం చేస్తుందన్నారు. ఆయన బుధవారమిక్కడ ప్రారంభమైన పశ్చిమ బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సదస్సులో ప్రసంగించారు. రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించడానికి అభివృద్ధికి అనుకూలమైన వాతావరణం ఉండాలన్నారు. రాష్ట్రం నుంచి బయటికి తరలిపోతున్న పరి శ్రమలను తిరిగి రప్పించాలని అన్నారు. జైట్లీకి ముందు సదస్సును ప్రారంభించిన మమత.. రాష్ట్రాభివృద్ధికి రాజకీయ విభేదాలు అడ్డురావని చేసిన వ్యాఖ్యలపై జైట్లీ స్పందించారు. బెంగాల్ అభివృద్ధి కోసం అండగా నిలుస్తామన్నారు. కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక మమత, ఓ కేంద్ర మంత్రితో వేదిక పంచుకోవడం ఇదే తొలిసారి. కాగా, శారదా చిట్ స్కామ్‌లో తృణమూల్ నేతలు పట్టుబడుతున్నందువల్లే ఆ పార్టీ రాజ్యసభ కార్యకలాపాలను అడ్డుకుంటోందని జైట్లీ హౌరాలో అన్నారు.