Global Position System
-
జీపీఎస్ ఏర్పాటుతో మరింత భద్రత
నల్లగొండ క్రైం : జీపీఎస్ (గ్లోబల్ పొజిషన్ సిస్టమ్) వ్యవస్థ ఏర్పాటుతో భద్రతను కట్టుదిట్టం చేయవచ్చని డీఐజీ అకున్ సబర్వాల్ అన్నారు. మంగళవారం నల్లగొండ పట్టణంలో ఏఆర్ భవనానికి భూమి పూజ నిర్వహించి క్లూస్ టీమ్ కార్యాలయం, కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఎస్పీ ప్రకాశ్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని డీసీఆర్బీ, పాస్‌పోర్టు, ఎస్.బి, ఆయుధగారం, ఏ.ఆర్. మోటర్ వెహికిల్, డాగ్‌స్కాడ్, పోలీసు ఆస్పత్రి, వెల్ఫేర్ స్టోర్, క్లూస్ టీమ్ విభాగాల్లోని రికార్డులను పరి శీలించారు. అంతకుముందు పోలీసు సిబ్బందితో గౌరవ వందనాన్ని స్వీకరించారు. పోలీసు వాహనాలకు ఏర్పాటు చేసిన రాపిడ్ కాప్ సాప్ట్వేర్ మొబైల్ యాప్‌తో అనుసంధానం చేసిన జీపీఎస్ పనిచేసే విధానాన్ని, ఫైన్ సాఫ్ట్వేర్ ద్వారా నేరస్తులను గుర్తించే విధానాన్ని ఎస్పీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేశారు. ఏదైనా రోడ్డు ప్రమాదం, ఘర్షణలు, ధర్నాలు జరిగినప్పుడు సంబంధిత ప్రాంతంలో ఉన్న పోలీసు వాహనాన్ని జీపీఎస్ ద్వారా గుర్తించి ఘటన స్థలానికి చేరే విధానం, జరిగిన సంఘటనలను యాప్ ద్వారా ఫొటో తీసి అనుసంధానం చేయడం, ఆందోళన చేయడానికి ఎంత మంది పోలీసులు అవసరమవుతారో వెంటనే తెలిసి పోతుందని వివరించారు. ఫైన్ సాప్ట్వేర్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి నేర సంఘటనలో సంబంధమున్నా గుర్తిస్తామని అన్నారు. అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తుల వేలిముద్రలను సాప్ట్‌వేర్‌తో గుర్తించి నేరస్తులను అదుపులోకి తీసుకోవచ్చని అన్నారు. అనంతరం డీఐజీ మీడియాతో మాట్లాడుతూ అన్ని జిల్లాల్లో కంటే మాబ్ కంట్రోల్ డిల్ ఆపరేషన్ చాలా బాగా చేశారని ప్రశంసించారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ జిల్లా ప్రజలకు భద్రతను, భరోసాను కల్పించేందుకు జిల్లా పోలీసులు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. జీపీఎస్, ఫైన్, 100 నంబర్ అనుసంధానం చేసి జిల్లా కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షించడం ద్వారా వెంటనే ఏమి జరిగిందో తెలిసి పోతుందని పేర్కొన్నారు. ప్రమాద రహిత జిల్లాగా ఉండాలి రోడ్డు ప్రమాద రహిత జిల్లాగా నల్లగొండ ఉండాలని డీఐజీ అకున్ సబర్వాల్ అన్నారు. మంగళవారం ఎన్జీ కాలేజీలో ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి, డీటీసీ చంద్రశేఖర్‌గౌడ్, జేసీ నారాయణరెడ్డితో కలిసి 28వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. రోడ్డు భద్రత వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరించి విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15 రోజుల పాటు పిల్లలు, విద్యార్థులు, వ్యాపారస్తులు, ట్రాన్స్‌పోర్టు రవాణా అధికారులు ఉద్యోగులు కలిసి ప్రమాదాల నివారణపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అజాగ్రత్త వలన 80శాతం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అభిమానం కోసం మైనర్లకు వాహనాలను ఇవ్వొద్దని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. రోడ్డు ప్రమాదంలో ప్రాణం పోతే ఆ కుటుంబం వీధిన పడుతుందని, అలాంటి పరిస్థితి ఎవ్వరికి రావద్దని విజ్ఞప్తి చేశారు. వాహనం నడిపేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. డీటీసీ చంద్రశేఖర్‌గౌడ్ మాట్లాడుతూ రహదారి భద్రత ప్రతిపౌరుడి బాధ్యత అని జాగ్రత్తతోనే ప్రమాదాలను నివారించవచ్చన్నారు. రవాణా, పోలీసుశాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. మానవ తప్పిదాల వల్లనే అధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు శ్రీనివాస్‌రావు, శ్రీనివాస్, సుధాకర్, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. -
నిమిషం ఆలస్యమైతే నో ఎంట్రీ
సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు జిల్లావ్యాప్తంగా 63,636 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందుకోసం తగిన ఏర్పాట్లు చేశారు. మారుమూల గ్రామాల నుంచి విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్న దృష్ట్యా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్టు ఇంటర్మీడియెట్ రీజినల్ పర్యవేక్షణ అధికారి సీపీ గ్లాడిస్ తెలిపారు. మాస్ కాపీయింగ్ జరగకుండా గ్లోబల్ పొజిషన్ సిస్టమ్(జీపీఎస్) తో అన్ని పరీక్షా కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఉదయం 9 గంటలకే పరీక్షలు ప్రారంభం అవుతున్న దృష్ట్యా విద్యార్థులు పరీక్ష కేంద్రానికి ఉదయం 8.45 గంటల లోపు చేరుకోవాలని సూచించారు. పరీక్ష సమయానికి నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని ఆయన స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, సమీప ప్రాంతాల్లోని జిరాక్సు సెంటర్లను మూసివేసేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. పరీక్ష కేంద్రాలకు సెల్ఫోన్లు, ఇతర ఎల క్ట్రానిక్ పరికరాలను తీసుకు రావద్దని సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు తక్షణ వైద్యం అందించేందుకు ఒక ఏఎన్ఎంను నియమిస్తున్నామన్నారు. అలాగే తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నట్లు గ్లాడిస్ తెలిపారు. ప్రథమ సంవత్సరంలో 23,886 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరంలో 33,943, ఒకేషనల్ ప్రథమ సంవత్సరంలో 2,298 , ద్వితీయ సంవత్సరంలో 3,509 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షలను జిల్లాస్థాయిలో డీఈసీ హెచ్‌పీసీల కమిటీలు పర్యవే క్షిస్తున్నాయి. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ఆర్ఐఓ తెలిపారు. -
ఆర్టీసీ బస్సులో జీపీఎస్
సాక్షి, ముంబై: బస్సు ప్రమాదాలను తగ్గించేందుకు ఎంఎస్ఆర్టీసీ చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు మరింత మెరుగైన బస్సులను అందుబాటులోకి తీసుకురావడమేకాక వాటిలో అన్ని బస్సుల్లోనూ గ్లోబల్ పొజిషన్ సిస్టం (జీపీఎస్)ను ఏర్పాటుచేయడానికి రవాణాశాఖ యోచిస్తోంది. ఇప్పుడున్న బస్సుల స్థానంలో అల్యూమినియమ్, మైల్డ్ స్టీల్, గాల్వనైజ్ స్టీల్‌ల కలయికతో రూపొందించిన బస్సులను వినియోగించనున్నారు. ఎంఎస్ఆర్టీసీకి సంబంధించి గత ఆరేళ్లలో 9,910 బస్సు ప్రమాదాలు జరిగాయి. నగర శివారు ప్రాంతాల వరకు సేవలందిస్తున్న బస్సులే ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నాయి. ఈ పరిస్థితిని మెరుగుపరిచేందుకు రవాణా శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కొత్త బస్సులను ప్రవేశపెట్టడమే కాక వాటిలో జీపీఎస్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు. బస్సుల్లో జీపీఎస్ వ్యవస్థను ఏర్పాటుచేయడం ద్వారా అవి ప్రయాణ సమయంలో ప్రమాదానికి లోనైన స్థలం వివరాలు వెంటనే తెలుసుకోవచ్చని ఒక అధికారి తెలిపారు. అయితే అన్ని బస్సుల్లో ఈ వ్యవస్థను అమర్చేందుకు చాలా సమయం పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే, ప్రమాదాల నివారణకు డ్రైవర్లకు కూడా మరింత మెరుగైన శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ అధికారి తెలిపారు. తాము ఇంతకుముందే 142 మంది డ్రైవర్లను శిక్షణ నిమిత్తం పంపించామని చెప్పారు. నిటారుగా, వక్రంగా ఉన్న రోడ్లపై వాహనాలను ఎలా నడపాలన్న అంశంపై వారికి శిక్షణ అందిస్తున్నామన్నారు. వాహనాలను మితిమీరిన వేగంతో కాకుండా నెమ్మదిగా, ఇతర వాహనాలను ఓవర్టేక్ చేయకుండా నడపాలని డ్రైవర్లను సూచనలు, సలహాలు ఇస్తున్నామని చెప్పారు. ఓవర్ టేక్ చేసే సమయంలో వాహన గేర్‌ను మార్చడం ద్వారా ఇంధనం వృథా అవుతుంది కాబట్టి సాధ్యమైనంతమేరకు ఓవర్టేక్ చేద్దామనే ఆలోచనను వదిలేయాలని డ్రైవర్లకు చెబుతున్నామన్నారు. ఎస్టీ బస్సు ప్రమాదాలు.. ఇదిలా వుండగా 2010-11 మధ్య కాలంలో 3,400 ఎస్టీ బస్సు ప్రమాదాలు జరుగగా, ఇందులో 445 మంది మరణించారు. 2,211 మంది తీవ్రంగా, 744 మందికి స్వల్పంగా గాయాలయ్యాయి. 2011-12 మధ్య కాలంలో 3,435 బస్సు ప్రమాదాలు జరుగగా, 445 మంది మరణించారు. 2,274 మందికి తీవ్రంగా గాయపడగా, 716 మంది స్వల్పంగా గాయాలతో బయటపడ్డారు. 2012-13 మధ్య కాలంలో 3,075 ఎస్టీ బస్సు ప్రమాదాలు జరగ్గా 369 మంది మరణించారు. 2,110 మంది తీవ్రంగా, 596 మంది స్పల్పంగా గాయపడ్డారు.