GO 22
-
జీవో 22 పరిధి మరింత విస్తరణ!
* కాంట్రాక్టర్లకు మరింత అదనంగా చెల్లించడానికి వీలుగా ప్రతిపాదనలు * మరో జీవో తెచ్చేందుకు రంగం సిద్ధం * రేపు కేబినెట్ ఆమోదించే అవకాశం * కమీషన్లు దండుకోవడానికేనని నీటిపారుదలశాఖలో చర్చ సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్టర్లకు అదనపు చెల్లింపులు చేయడానికి అవకాశం కల్పిస్తున్న జీవో-22ను మరింతగా విస్తరించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ఈ జీవో పరిధిలోకి రాని కాంట్రాక్టర్లకు కూడా అదనపు చెల్లింపులు చేయడానికి, జీవో-22 అమలు చేసినా తమకు గిట్టుబాటు కావట్లేదంటూ ప్రభుత్వాన్ని ఆశ్రయించిన అధికారపార్టీ కాంట్రాక్టర్లకు అడిగినంత సొమ్ము దోచిపెట్టడానికి వీలుగా మరో జీవో తీసుకురావడానికి రంగం సిద్ధం చేసింది. మరింత అదనంగా చెల్లింపులు చేసి అందుకు అనుగుణంగా కమీషన్లు దండుకోవడానికి ప్రభుత్వ పెద్దలు సమాయత్తమవుతున్నారని నీటిపారుదలశాఖలో చర్చ జరుగుతోంది. జీవో-22 విస్తరణపై బుధవారం రాజమండ్రిలో జరగనున్న మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశముంది. కేబినెట్లో చర్చించడానికి వీలుగా నీటిపారుదలశాఖ ప్రతిపాదనను సిద్ధం చేసింది. మంత్రివర్గ ఎజెండాలో చేర్చాలంటే.. ఆర్థికశాఖ ఆమోదం తీసుకోవాలనే నిబంధన ఉంది.ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆమోదం కూడా అవసరం. ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్‌తోపాటు, సీఎస్ ఐవైఆర్ కృష్ణారావులిద్దరూ ప్రస్తుతం రాజమండ్రిలో ఉన్నారు. దీంతో అక్కడే ప్రతిపాదనకు ఆమోదముద్ర వేయించే అవకాశాలను నీటిపారుదలశాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. ఎజెండాలో చోటుదక్కితే మంత్రివర్గం ఆమోదిస్తుందని అధికారవర్గాల సమాచారం. -
జీవో 13ను సవరించాల్సిందే!
ఎస్కలేషన్ కమిటీకి తేల్చి చెప్పిన బిల్డర్స్ అసోసియేషన్ హైదరాబాద్: రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల్లో పెరిగిన ధరలకు అనుగుణంగా ధరల పెంపు (ఎస్కలేషన్) చేయాలని కోరుతున్న కాం ట్రాక్టర్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇచ్చిన జీవో 13ను అమలు పరుస్తూనే దానిలో మార్పులు చేయాలని కోరుతున్నారు.ఇదే సమయంలో ఏపీలో చిన్నపాటి మార్పులు చేస్తూ కొత్తగా ఇచ్చిన జీవో 22ను అమలు చేసినా తమకు ప్రయోజనం చేకూర్చలేదని స్పష్టం చేస్తున్నారు. ఎస్కలేషన్‌పై గత ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన జీవో 13 అమలుతో ఎదురయ్యే పరిణామాల అధ్యయనానికి తెలంగాణ ప్రభుత్వం రిటైర్డ్ ఇంజనీర్ బి.అనంతరాములు చైర్మన్‌గా, ఇరిగేషన్ ఈఎన్సీ మెంబర్ కన్వీనర్‌గా, మరో ఇద్దరు రిటైర్డ్ ఇంజనీర్లు ఎస్.చంద్రమౌళి, జి.ప్రభాకర్‌లు సభ్యులుగా ఉన్న కమిటీ మంగళవారం బిల్డర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశమైంది. జీవో 13 అమలు అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రస్తుతం పనులు చేయలేమని ప్రతినిధులు స్పష్టం చేశారు. దాదాపు అన్ని ప్రాజెక్టుల్లోనూ పనులు చేయడం కాంట్రాక్టర్లకు భారంగా మారిందని కమిటీ దృష్టికి తెచ్చారు. జీవో 13లో సమూల మార్పులు అవసరమని స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో 22ను అమలు చేసినా ప్రయోజనం ఉండదని అభిప్రాయపడినట్లు తెలిసింది. ఇక సబ్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ తరఫున కొందరు ప్రతినిధులు మాట్లాడుతూ జీవో 13ను అమలు చేసినా గౌరవెల్లి, తోటపల్లి వంటి ప్రాజెక్టుల పనుల్లో కాంట్రాక్టర్లు పనిచేసే పరిస్థితి లేదని, అక్కడ 60(సి) కింద సబ్ కాంట్రాక్టర్లకు పనులు అప్పగించాలని కోరినట్లుగా సమాచారం. -
జీవో 22ను ఎలా అమల్లోకి తెస్తారు: ధర్మాన
హైదరాబాద్ : అభయన్స్‌లో ఉన్న జీవో 22ను తెలుగుదేశం సర్కార్ ఎందుకు అమల్లోకి తెచ్చిందో చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు. ఆయన శుక్రవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ నీటిపారుదల ప్రాజెక్ట్‌లలో రూ.22వేల కోట్ల దోపిడీకి బరితెగించారా ధ్వజమెత్తారు. గవర్నర్ నిలుపుదల చేసిన జీవోను మంత్రివర్గంలో చర్చించకుండా ఎలా అమల్లోకి తెస్తారని ధర్మాన సూటిగా అడిగారు. ప్రతిపక్షం ఉన్నప్పుడు ప్రజాధనం దుర్వినియోగం అయిందని గగ్గోలు పెట్టిన టీడీపీ...ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అదే పని చేస్తోందని ధర్మాన ప్రసాదరావు అన్నారు. రాజధాని నిర్మాణంలో రెండు ప్రయివేట్ కంపెనీలకు 10వేల ఎకరాల భూమి ఇస్తున్నట్లు పత్రికల్లో కథనాలు వస్తున్నాయని, దీని వెనుక మతలబు ఏంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంటర్నేషనల్ బిడ్డింగ్‌లకు ప్రభుత్వం ఎందుకు వెళ్లడం లేదని ధర్మాన ప్రశ్నించారు. పవన్ కల్యాణ్‌కు అవగాహన లేదన్న టీడీపీ నేతలు ఎన్నికల ముందు పొత్తు ఎందుకు పెట్టుకొన్నారో చెప్పాలన్నారు. -
జీవో 22ను ఎలా అమల్లోకి తెస్తారు: ధర్మాన