goats sales
-
నవీపేట మేకల సంతలో కోట్లల్లో క్రయవిక్రయాలు
నవీపేట(బోధన్): మండల కేంద్రంలో శనివారం జరిగిన వారాంతపు మేకల సంతలో క్రయవిక్రయాలు భారీగా జరిగాయి. రూ.కోటిన్నరకు పైగా లావాదేవీలు జరిగినట్లు సమాచారం. జిల్లాకేంద్రంలో ఆదివారం జరుగనున్న ఊర పండగ సంబరాలతో పాటు వన భోజనాల సందడితో మేకల సంతలో క్రయవిక్రయాలు జోరందుకున్నాయి. ఊర పండగకు ఆనవాయితీగా అమ్మవారికి మేకలను బలిఇవ్వడంతో అమ్మవారి భక్తులు మేకల కొనుగోళ్లు జరిపారు. గ్రామాలలో వన(విందు) భోజనాలకు మాంసాహారాన్ని భుజించడంతో మేకలకు మరింత గిరాకీ పెరిగింది. నిజామాబాద్, కరీంనగర్, నిర్మల్, కామారెడ్డి సరిహద్దు జిల్లాల నుంచి వచ్చిన కొనుగోలుదారులు అధిక ధరలు చూసి వాపోయారు. మనుపటికంటే అధిక ధరలకు విక్రయించడంతో విస్తుపోయారు. అవసరం నిమిత్తం కొనుగోలు చేయక తప్పలేదు. సీజన్‌ను గమనించిన మహారాష్ట్రలోని ధర్మాబాద్, పర్బణి, ముత్ఖేడ్, జాల్నాలతో పాటు కర్ణాటక సరిహద్దు ప్రాంతాలలోని వ్యాపారులు ఒకరోజు ముందుగానే నవీపేటకు వచ్చి విక్రయాలు జరిపారు. -
'బకరా'లను చేస్తున్నారు
యాదవుల అభ్యున్నతి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘గొర్రెల యూనిట్ల మంజూరు’ పథకం పక్కదారి పట్టిస్తున్నారు. దళారులు, పశు వైద్యులు కలిసి కాసులు దండుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కొన్న గొర్రెలనే పంపిణీ చేయాలనే నిబంధన అవకాశంగా మలుచుకొని రీసైక్లింగ్ దందాకు తెరతీశారు. ఇటు ఆంధ్ర, అటు తెలంగాణ రాష్ట్రాల్లోని గొర్రెల పెంపకందారులను బకరాలను చేస్తున్నారు. ప్రకాశం, గిద్దలూరు: తెలంగాణ రాష్ట్రంలో యాదవులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు అక్కడి కేసీఆర్ ప్రభుత్వం గొర్రెల యూనిట్లు మంజూరు చేసింది. ఇందుకు ఒక్కో యూనిట్‌కు రూ.1.11 లక్షలు కేటాయించింది. ఇందులో లబ్ధిదారుని వాటాగా రూ.31,250 చెల్లించాలి. యూనిట్‌కు 20 గొర్రెలు, ఒక పొట్టేలును కొనుగోలుచేయాల్సి ఉంది. గొర్రెలను సొంత రాష్ట్రంలో కాకుండా పక్క రాష్ట్రంలో కొనుగోలు చేసేలా నిబంధనలు విధించారు. దీని వల్ల కొత్త ప్రదేశంలోని గొర్రెలు బాగా అభివృద్ధి చెందుతాయని, అక్రమాలు జరక్కుండా ఉంటాయని ప్రభుత్వ ఉద్దేశం. కొనుగోలు చేసే ప్రాంతంలో గొర్రెలు ఆరోగ్యంగా ఉన్నాయా, ఉత్పత్తి పెరుగుదల ఉంటుందా అనే విషయాలను పశువైద్యాధికారి పరిశీలించి ధ్రువీకరించిన తర్వాతనే గొర్రెలను గొనుగోలు చేయాల్సి ఉంది. కానీ పశువైద్యాధికారులు కొనుగోలు ప్రదేశంలో ఎలాంటి ఆరోగ్య పరీక్షలు నిర్వహించకుండానే లబ్ధిదారులకు గొర్రెలను కట్టబెడుతున్నారు. 10రోజుల క్రితం వరకు వైద్యులు ఈప్రాంతంలోని కొందరిని మధ్యవర్తులుగా చేసుకుని గొర్రెలను కొనుగోలు చేసేవారు. వారి వద్ద పర్సంటేజీలు తీసుకుంటూ రూ.లక్షలు వసూలు చేస్తున్నారు. రీ సైక్లింగ్ జరుగుతోందిలా.. తెలంగాణలో మంజూరైన సబ్సిడీ యూనిట్లకు గొర్రెలను కొనుగోలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం, వైఎస్సార్, నెల్లూరు, గుంటూరు, కర్నూలు జిల్లాలకు ఎక్కువ యూనిట్లను కేటాయించారు. తెలంగాణకు చెందిన లబ్ధిదారులకు గొర్రెలను కొనుగోలు చేసేందుకు జిల్లాలోని గిద్దలూరు నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. గిద్దలూరుకు ప్రకాశం జిల్లాతో పాటు, కర్నూలు, వైఎస్సార్, నెల్లూరు జిల్లాల సరిహద్దులు ఉండటం వలన ఇక్కడి వ్యాపారులను మధ్యవర్తులుగా చేసుకుని గొర్రెలు కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడ కొనుగోలు చేసిన గొర్రెలను తెలంగాణలోని లబ్ధిదారులకు అందించినట్లు ఫొటోలు చూపి మరుసటి రోజే తిరిగి గిద్దలూరు పంపిస్తున్నారు. ఇలా ఒక్కో గొర్రెను 25 సార్లు రెండు రాష్ట్రాల మధ్య తిప్పినట్లు తెలుస్తోంది. తెలంగాణాకు చెందిన లబ్ధిదారులను లారీల్లో తీసుకొస్తున్న డాక్టర్లు ఒక్కడ ఒక రోజు అటూ ఇటూ తిప్పుతూ ఇబ్బందులకు గురిచేస్తారు. మరుసటి రోజు డాక్టర్ల ఆధీనంలో ఉన్న మధ్యవర్తుల వద్దకు తీసుకెళ్లి వారి గొర్రెలను కొనుగోలు చేసేలా చేస్తారు. ఇలా చేయడం వలన వ్యాపారులు మొద ట (రెండు నెలల క్రితం) యూనిట్‌కు రూ.5వేలు తీసుకునేవారు. ఇలా కొన్న గొర్రెలకు ఇన్సూరెన్స్ ట్యాగ్ వేయడం, తిరిగి తొలగిస్తూ రీ సైక్లింగ్ చేస్తున్నారు. గతంలో ఇనుప ట్యాగ్‌లను వేసేవారు. దీనివల్ల రీసైక్లింగ్ సమయంలో ట్యాగ్ తొలగించేందుకు చెవి కోయాల్సి వచ్చేది. గొర్రెకు చెవులు చిన్నవవుతున్నాయని పట్టుబడే ప్రమాదం ఉందంటూ ఇనుప ట్యాగ్ల స్థానంలో ప్లాస్లిక్ ట్యాగ్లు ఏర్పాటు చేసుకున్నారు. ప్లాస్టిక్ ట్యాగ్‌ను సులభంగా పగులకొట్టి, కొత్త ట్యాగ్లు వేస్తున్నారు. వైద్యులకు యూనిట్‌కు రూ.18వేలు... గొర్రెల యూనిట్లు ఎక్కువగా రావడంతో పశువైద్యులకు డిమాండ్ పెరిగింది. ప్రారంభంలో యూనిట్‌కు రూ.5వేలు తీసుకునే డాక్టర్లు ఇప్పుడు రూ.18వేలు తీసుకుంటున్నారు. అంతా మీరే తీసుకుంటే తమకేంటి లాభం అని మధ్యవర్తులు ప్రశ్నించడంతో అసలు గొర్రెలను మీదగ్గర ఎందుకు కొనుగోలు చేయాలంటూ సొంత వ్యాపారం ప్రారంభించారు. తెలంగాణలోని గొర్రెలను తామే కొనుగోలు చేసుకుని, ఆంధ్రాకు తెచ్చుకుని, ఇక్కడా తమ లబ్ధిదారుల ద్వారా తిరిగి కొనుగోలు చేస్తామంటున్నారు. గొర్రెల యూనిట్‌కు వచ్చే నగదును తమకు అనుకూలంగా ఉండే ఒక వ్యక్తి ఖాతాలో వేస్తూ అతనికి యూనిట్‌కు రూ.500 చొప్పున ఇచ్చి మిగతా లాభాలు డాక్టర్లే తీసుకుంటున్నారని గొర్రెల కాపరులు ఆరోపిస్తున్నారు. యూనిట్ గొర్రెలు రూ.64వేలు... రీ సైక్లింగ్ ద్వారా ఏపీ నుంచి తెలంగాణ, తెలం గాణ నుంచి ఏపీకి తిరుగుతున్న గొర్రెలు నీరసించి పోయాయి. గొర్రెలను కొనుగోలు చేసిన లబ్ధిదా రులు వాటిని పెంచుకునేందుకు అవకాశం లేనంతగా నడవలేకపోతున్నాయని గమనించి తిరిగి వైద్యుల ద్వారానే గొర్రెలను విక్రయించేస్తున్నారు. యూనిట్‌కు రూ.40 వేల ఆదాయం.. తెలంగాణలో 21గొర్రెల యూనిట్ ఖరీదు కేవలం రూ.64వేలకే విక్రయిస్తున్నారు. వాటిని తిరిగి ఏపీకి తీసుకొస్తున్న వైద్యులు తిరిగి రూ.1.11 లక్షలకు లబ్ధిదారులకు కట్టబెడుతున్నారు. ఇలా ఒక్కో యూనిట్ గొర్రెలకు పశువైద్యులు రూ.40వేల వరకు ఆదాయం పొందుతున్నారు. ఏపీలోని గొర్రెల కాపరుల వద్ద గొర్రెలను కొనుగోలు చేస్తే కొంతమేర గొర్రెల కాపరులు ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉండేది. తెలంగాణాలో గొర్రెలను తీసుకున్న లబ్ధిదారుడు గొర్రెలను పెంచుకుంటే వారు బాగుపడే వారు. అలా కాకుండా సబ్సిడీపై ఇచ్చిన గొర్రెల యూనిట్లు పశువైద్యులకు, మధ్యవర్తులకు వరంగా మారాయే తప్ప రెండు రాష్ట్రాలకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని గొ ర్రెల కాపరులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. గొర్రెల రీ సైక్లింగ్‌ను అడ్డుకోవాలి.. తెలంగాణ ప్రభుత్వం యాదవుల అభివృద్ధి కోసం ఇచ్చిన గొర్రెల యూనిట్లను గొర్రెల కాపరుల వద్దనే కొనుగోలు చేయాలి. అలా కాకుండా కొన్న గొర్రెలనే తిరిగి విక్రయించడం, వాటినే తిరిగి తెలంగాణ యాదవ లబ్ధిదారులకు ఇవ్వడం చేస్తున్నారు. దీనివలన రెండు రాష్ట్రాల్లోని యాదవులు నష్టపోతున్నారు. వైద్యులు, మధ్యవర్తులే లబ్ధి పొందుతున్నారు. అసలైన లబ్ధిదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీన్ని అధికారులు అడ్డుకోవాలి.– కుక్కా సాంబశివయాదవ్, యాదవ జేఏసీ జిల్లా ప్రధానకార్యదర్శి -
గొర్రెల పథకంలో... ‘భారీ కుంభకోణం’పై విచారణ
సాక్షిప్రతినిధి, కరీంనగర్: గొర్రెల కొనుగోళ్లు, పంపిణీలో చోటుచేసుకున్న అక్రమాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఇటీవల నిబంధనలకు విరుద్ధంగా, ఇష్టారాజ్యంగా కొనుగోళ్లు చేసిన వ్యవహారంపై ‘భారీ కుంభకోణం’ శీర్షికన బుధవారం ప్రచురితమైన ‘సాక్షి’ కథనం అన్నివర్గాల్లో చర్చకు దారి తీసింది. గొర్రెల పంపిణీ పథకంలో పెద్ద ఎత్తున సాగిన అవినీతి గుట్టు విప్పేందుకు ఓ వైపు విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్, మరోవైపు అవినీతి నిరోధక శాఖ అధికారులు గురువారం ఆరా తీయడం పశుసంవర్ధకశాఖ ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జిల్లాలోని 15 మండలాల్లో కొనసాగుతున్న గొర్రెల పంపిణీ జరుగుతుండగా.. ఎక్కడెక్కడ అక్రమాలు జరిగాయన్న వివరాలు స్పష్టంగా ఉండగా.. ఆ వివరాలను సేకరించిన విజిలెన్స్, ఏసీబీ అధికారులు గోప్యంగా కొందరు ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, లబ్ధిదారుల నుంచి వివరాలు సేకరిస్తుండటం కలకలం రేపుతోంది. ఓ వైపు విచారణలు, చర్యలు.. మరోవైపు కొనుగోళ్లు.. గొల్లకుర్మలను ఆర్థికపథంలో నడిపిచేందుకు ఉద్దేశించిన గొర్రెల పెంపక పథకం కొందరు పశుసంవర్ధకశాఖ అధికారులు, దళారులకు కాసులు కురిపిస్తోంది. గొర్రెల కొనుగోలు, పంపిణీ పథకంలో జరిగిన అవినీతి, అక్రమాలపై ఓవైపు విచారణ, సస్పెన్షన్ల పర్వం కొనసాగుతుండగా.. మరోవైపు కొనుగోళ్లు కూడా సాగుతున్నాయి. 2017 జూన్ 20 ప్రారంభమైన ఈ పథకం ద్వారా ఇప్పటివరకు జిల్లాలో ఇప్పటికీ 7,589 యూనిట్లను లబ్ధిదారులకు అందజేశారు. కడప, పొద్దుటూరు, మైదుకూరు, పులివెందుల తదితర ప్రాంతాలను నుంచి కొనుగోలు చేశారు. 298 యూనిట్లకు సంబంధించిన గొర్రెలు మాయం కావడంతో పలువురిపై వివిధ ప్రాంతాలో కేసులు నమోదు చేశారు. కరీంనగర్ జిల్లా నుంచి వెళ్లి పెద్దపల్లి జిల్లాలో అక్కడి ఓ ఉన్నతాధికారి సహకారంతో చేసిన కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై విచారణ జరపాలని ఏకంగా ఆ జిల్లా అప్పటి ఇన్చార్జి కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఏసీబీకి లేఖ రాశారు. సదరు ఉన్నతాధికారి తన పలుకుబడిని ఉపయోగించి ఆ విచారణ నుంచ్చి తప్పించుకున్నారు. అదే సమయంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొలనూర్ గొర్రెల కాపరులకు కడప జిల్లాలో కొనుగోలు చేసిన రుద్రంగి పశువుల డాక్టర్ మనోహర్ జీవాలకు ట్యాగ్లు (పోగులు) వేయకుండా పంపిణీ చేశారు. ఇది నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ వద్ద చెక్‌పోస్టులో అధికారుల తనిఖీలు చేయగా.. కొలనూర్ గొర్రెలకు ట్యాగ్లు వేయలేదని గుర్తించారు. గొర్రెల కొనుగోలు పథకంలో రూపొంధించింన నిబంధనలను రాజన్న సిరిసిల్ల జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారులు పాటించడం లేదని పేర్కొంటూ రాష్ట్ర పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ వెంకటేశ్వర్లు జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి డాక్టర్ కాంతయ్యసేన, రుద్రంగి డాక్టర్ మనోహర్‌ను సస్పెండ్ చేశారు. కరీంనగర్ జిల్లాకు వచ్చే సరికి పోలీసు కేసులతో సరిపెట్టేశారు. దీంతో కొందరు పశువైద్యాధికారులు గొర్రెల పంపిణీ పథకం లాభసాటిగా భావించి డిప్యూటేషన్లు, సెలవులపై వెళ్లి గ్రౌండింగ్ చేస్తున్నారు. ఇవే అంశాలు విజిలెన్స్, ఏసీబీ అధికారుల విచారణలో తేలినట్లు సమాచారం. విచారణలో సరికొత్త అంశాలు...వెలుగుచూస్తున్న పలు ఉదంతాలు పశుసంవర్ధకశాఖలో కొందరు అధికారుల సహకారంతోనే ఈ బాగోతం సాగుతున్నట్లు అవగతమవుతోంది. గొర్రెల పంపిణీ పథకంపై ఇటీవల ఆ శాఖ జిల్లాస్థాయి అధికారుల సమావేశం జరిగింది. అన్ని స్థాయిల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్న ఈ సమావేశంలో ‘గొర్రెల కొనుగోళ్లు, పంపిణీ పథకం సంబంధించిన నాపై ఆరోపణలు వచ్చాయి.. విచారణకు ఆదేశించారు.. అయినా నాకేమవుతుంది.. మనకూ ఖర్చులుంటాయి.. తమ్ముళ్లు ఇదంతా ఏమయ్యేది కాదు’ అంటూ ఓ సీనియర్ అధికారి చేసిన వ్యాఖ్యలు కూడానిఘా సంస్థలు సేకరించాయి. అంతేగాకుండా గొర్రెల కొనుగోళ్లపై ఒక్కో యూనిట్ (21 గొర్రెలు)కు రూ.6 వేలు కమీషన్ తీసుకున్న కొందరు ఇప్పుడా రేటును రూ.10వేల నుంచి రూ.12వేలకు పెంచిన విషయాన్ని కూడా విచారణలో పరిగణనలోకి తీసుకున్నారు. ఓ పశు వైద్యాధికారి కేవలం ఎక్కువ యూనిట్లున్న ప్రాంతానికి డిప్యూటేషన్ వేయించుకోవడం, కేవలం నెల వ్యవధిలో 160 యూనిట్ల వరకు గ్రౌండింగ్ చేయడం.. లబ్ధిదారుల వద్ద ఏమేరకు గొర్రెలు ఉన్నాయన్న కోణంలో కూడా అధికారులు ఆరా తీసినట్లు తెలిసింది. జిల్లాకు చెందిన ఓ పశు వైద్యాధికారి ఇక్కడ సెలవు పెట్టి పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో మూడు రోజుల వ్యవధిలో సుమారు 200 యూనిట్లకు చెందిన గొర్రెలను కొనుగోలు చేశారు. ఇక్కడ ప్రభుత్వ నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు సమాచారంతో ఈ సంఘటనపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది. పెద్దపల్లి జిల్లాకు చెందిన ఓ ఉన్నతాధికారి ఇచ్చిన భరోసాతో కొనుగోళ్లకు వెళ్లిన పశువైద్యాధికారి వ్యవహారం కూడా దీంతో వివాదాస్పదమైంది. పశుసంవర్ధకశాఖలో జరిగిన అక్రమాలపై సమగ్ర దర్యాప్తునకు దిగిన నిఘా సంస్థలు పలు కోణాల్లో విచారణ చేస్తుండగా.. విచారణ పూర్తయ్యే వరకు వివరాలు వెల్లడించలేమన్న సదరు అధికారులు పేర్లు తెలపడానికి కూడా అంగీకరించలేదు. -
ఆ ఎస్సైకి మేకలంటే తెగ ఇష్టం..!
నల్లగొండ: పోలీస్‌స్టేషన్ ఆవరణలోకి మేకలు వస్తున్నాయని వాటిని తన సిబ్బందితో అమ్మించేశాడు నల్లగొండ జిల్లా సంస్థాన్ నారాయణపురం ఎస్ఐ దూది రాజు. ఈ తంతు ఏడాదిన్నర కాలంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఓ మహిళ ఫిర్యాదుతో ఎట్టకేలకు వీరి బాగోతం బయటపడింది. ఎస్ఐతోపాటు ముగ్గురు హోంగార్డులపై జిల్లా ఎస్పీ వేటు వేశారు. బయటపడిందిలా.. గ్రామానికి చెందిన రాపర్తి జయమ్మకు నాలుగు మేకలు ఉన్నాయి. అవి పోలీస్‌స్టేషన్ ఆవరణలోకి వస్తుండటంతో ఎస్ఐ వాటిని బంధించి, ఓ కానిస్టేబుల్, హోంగార్డు సాయంతో రూ.20 వేలకు అమ్మించాడు. దీంతో బాధితురాలు జిల్లా ఎస్పీని ఆశ్రయించింది. ఎస్పీ ఆదేశాల మేరకు మూడు రోజులుగా పోలీసు అధికారులు విచారణ జరిపారు. బుధవారం ఎస్ఐ రాజు, బాధితులను ఎస్పీ తన కార్యాలయానికి పిలిపించుకొని, స్వయంగా విచారణ చేయడంతో విషయం రూఢీ అయింది. దీంతో ఎస్సైతోపాటు ఆయనకు సహకరించిన ముగ్గురు హోం గార్డులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సై పెళ్లిలో విందుకు కూడా ఇక్కడి మేకలే.. సంస్థాన్ నారాయణపురం పోలీసులు మేకలను అమ్ముకోవటం ఏడాదిన్నర కాలం నుంచే జరుగుతున్నట్టు తెలుస్తోంది. రాపర్తి జయమ్మ మేకలను పోలీసులు అమ్ముకున్న విషయం బయటికి రావడంతో, తమ మేకలు కూడా కనిపించటం లేదంటూ పలువురు బాధితులు బయటికొస్తున్నారు. ఇప్పటి వరకు సంస్థాన్ నారాయణపురంలో కనిపించని మేకల సంఖ్య 30కిపైగానే ఉన్నట్టు అంచనా. ఇటీవల జరిగిన గ్రామజ్యోతి గ్రామసభలో కూడా గ్రామస్తులు మేకలు పోతున్న విషయమై ప్రత్యేక తీర్మానం చేయించారు. ఎస్ఐ రాజు ఇక్కడ రెండేళ్ల కాలంగా పనిచేస్తున్నారు. నల్లగొండలో జరిగిన తన పెళ్లికి, విందులకు కూడా ఇక్కడి నుంచే మేకలను తరలించినట్టు ఆరోపణలొస్తున్నాయి.