Gold Bonds
-
గోల్డ్ కంటే గోల్డ్ బాండ్లు బెటరా? చివరి తేది.. దరఖాస్తు విధానం..
బంగారం కొనాలని అనుకుంటున్నారా? ఫిజికల్ గోల్డ్‌తో పాటు అంతే విలువ గల సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్జీబీ)లను కొనుగోలు చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ ఎస్జీబీ గోల్డ్ కోసం ఈ నెల 12 నుంచి 16 వరకు దరఖాస్తు చేసుకునేందుకు భారతీయ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అవకాశం కల్పించింది. భౌతిక బంగారంతో పోలిస్తే సావరిన్ గోల్డ్ బాండ్స్ కొనుగోలులో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. బంగారం కొనుగోలులో సాధారణంగా వర్తించే మేకింగ్, జీఎస్టీ వంటి అదనపు ఛార్జీలు గోల్డ్బాండ్ల విషయంలో ఉండవన్నది గమనించాలి. చోరీ భయం అసలే ఉండదు. కాబట్టి బంగారంలో పెట్టుబడి పెట్టేవారు గోల్డ్ బాండ్లను పరిశీలించొచ్చు. 20 కిలోల వరకూ కొనుగోలు గోల్డ్ సావరిన్ బాండ్లు కొనుగోలు చేసేవారు ఒక గ్రామ్ – ఒక యూనిట్ కింద కొనుగోలు చేయాలి. ఒక ఆర్థిక సంవత్సరంలో వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు అత్యధికంగా నాలుగు కిలోలు, ట్రస్టులు 20 కిలోల వరకూ కొనుగోలు చేయొచ్చు. ఈ బాండ్ గడువు ఎనిమిదేళ్లు ఉంటుంది. ఐదేళ్ల తర్వాత అవసరమనుకుంటే బాండ్ల కొనుగోలుదారులు తప్పుకోవచ్చు. ఫిజికల్ గోల్డ్ కొనుగోలుకు అమలులో ఉన్న ‘కేవైసీ’ నిబంధనలే బాండ్ల కొనుగోలుకు కూడా వర్తిస్తాయి. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2023-24 సిరీస్ 4 భారత ప్రభుత్వం సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్‌పై నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆ నోటిఫికేషన్ ప్రకారం.. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2023-24 సిరీస్ 4 ఫిబ్రవరి 12 నుంచి 16 వరకు కొనసాగనుంది. ఈ బాండ్స్ కోసం ధరఖాస్తు చేసుకున్న వారికి భారతీయ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బాండ్లు జారీ చేస్తుంది. ఆర్బీఐ ఇష్యూ చేసిన ధర యూనిట్‌కు రూ.6,213గా ఉంది. ఎక్కడ కొనుగోలు చేయాలంటే.. కమర్షియల్ బ్యాంకుల్లో ఈ సావరిన్ బాండ్లను కొనుగోలు చేయొచ్చు. వీటితో పాటు స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్‌హెచ్‌సీఐఎల్), క్లియర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సీసీఐఎల్), పోస్టాఫీసులు, గుర్తింపు పొందిన స్టాక్ ఎక్ఛేంజ్ సంస్థలు అంటే నేషనల్ స్టాక్ ఎక్ఛేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, బాంబే స్టాక్ ఎక్ఛేంజ్‌లలో కొనుగోలు చేయొచ్చు. ఆన్లైన్లో కొనుగోలు విధానం.. నెట్‌బ్యాంకింగ్‌కు లాగిన్ అవ్వాలి. మెనూలో ఈ-సర్వీసెస్/ ఇన్వెస్ట్మెంట్ అనే సెక్షన్లో ‘సావరిన్ గోల్డ్ బాండ్’ ఆప్షన్ క్లిక్చేయాలి. షరతులు, నియమాలు చదివి ప్రొసీడ్‌పై నొక్కాలి. సావరిన్ గోల్డ్ బాండ్‌కు అవరమైన వివరాలు అందులో నమోదు చేసి డిపాజటరీ పార్టిసిపేట్ (ఎన్ఎస్డీఎల్ లేదా సీడీఎస్ఎల్)ను ఎంచుకోవాలి. అనంతరం రిజిస్ట్రేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి. రిజిస్ట్రేషన్ తర్వాత పర్చేజ్ ఆప్షన్ వస్తుంది. ఇదీ చదవండి: ‘అవసరమైతే ఉద్యోగం మానేస్తాం.. కానీ..’ ఉద్యోగుల సంచలన నిర్ణయం మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న యూనిట్లు, నామినీ వివరాలు ఎంటర్ చేయాలి. తర్వాత మీ మొబైల్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయడంతో ప్రక్రియ ముగుస్తుంది. -
కొత్త గోల్డ్ బాండ్ స్కీమ్.. ఆన్లైన్లో కొనుగోలు చేస్తే డిస్కౌంట్
న్యూఢిల్లీ: సావరిన్ గోల్డ్ బాండ్ కొత్త ఇష్యూ ఈ నెల 11న (సోమవారం) ప్రారంభం కానుంది. 15వ తేదీ వరకూ అందుబాటులో ఉండే ఈ స్కీమ్ ఇష్యూ ధర గ్రాముకు రూ.5,923. ఆన్లైన్లో కొనుగోలు చేస్తే, రూ.50 డిస్కౌంట్ లభిస్తుంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఇది రెండవ విడత బాండ్ల జారీ. జూన్ 19న వెలువడిన మొదటి విడత బాండ్ జారీలో ధర గ్రాముకు రూ.5,926. గోల్డ్ బాండ్లు– షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నిర్దిష్ట పోస్టాఫీసులు, డీ–మ్యాట్ అకౌంట్‌తో గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్చేంజీల ద్వారా కొనుగోలు చేయవచ్చు. భౌతిక బంగారాన్ని కొనుగోలు చేయడానికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం తరపున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా సావరిన్ గోల్డ్ బాండ్లు జారీ చేస్తారు. 2015 నవంబర్‌లో ప్రవేశపెట్టిన సావరిన్ గోల్డ్ బాండ్లు.. భౌతిక బంగారం డిమాండ్‌ను తగ్గించడం, బంగారం కొనుగోళ్ల నుంచి దేశీయ పొదుపులో కొంత భాగాన్ని ఆర్థిక పొదుపులకు మళ్లించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. పెట్టుబడిదారులు ఇష్యూ ధరను నగదు రూపంలో చెల్లించాలి. మెచ్యూరిటీపై బాండ్లను నగదు రూపంలో రీడీమ్ చేసుకోవచ్చు. -
నేటి నుండి పసిడి బాండ్ల విక్రయం
న్యూఢిల్లీ: తదుపరి విడత సావరీన్ గోల్డ్ బాండ్ల (ఎస్జీబీ) విక్రయం సోమవారం ప్రారంభమై అయిదు రోజుల పాటు కొనసాగనుంది. ఇష్యూ ధరను గ్రాము బంగారానికి రూ. 5,091గా నిర్ణయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గోల్డ్ బాండ్ల విక్రయం చేపట్టడం ఇదే తొలిసారి. ఆన్లైన్ మాధ్యమం ద్వారా దరఖాస్తు చేసుకుని, డిజిటల్ విధానంలో చెల్లిస్తే గ్రాముకు రూ. 50 చొప్పున డిస్కౌంటు లభిస్తుంది. రిజర్వ్ బ్యాంక్ గణాంకాల ప్రకారం 2015 నవంబర్‌లో ప్రారంభమైనప్పట్నుంచీ ఈ స్కీము ద్వారా ప్రభుత్వం రూ. 38,693 కోట్లు (సుమారు 90 టన్నుల బంగారం విలువ) సమీకరించింది. కోవిడ్ వ్యాప్తి సమయంలో (2020–21, 2021–22) ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారం వైపు ఎక్కువగా మొగ్గు చూపారు. ఏకంగా రూ. 29,040 కోట్ల మేర బాండ్లను కొనుగోలు చేశారు. ఈ స్కీము ద్వారా ఇప్పటిదాకా ప్రభుత్వం సమీకరించిన నిధుల్లో ఇది దాదాపు 75 శాతానికి సమానం కావడం గమనార్హం. -
ప్రభుత్వ గోల్డ్ బాండ్.. ఆర్బీఐ పోర్టల్‌లో.. పూర్తి వివరాలు
ముంబై: సావరిన్ గోల్డ్ బాండ్ ఇకపై ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ పోర్టల్లోనూ లభ్యం కానుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎనిమిదవ సిరీస్ ఈ నెల మూడవ తేదీతో (శుక్రవారం) ముగియనున్న సంగతి తెలిసిందే. 29వ తేదీన ఈ సిరీస్ ప్రారంభమైంది. ప్రస్తుతం ప్రభుత్వ గోల్డ్ బాండ్స్ నిర్దిష్ట బ్యాంకులు, పోస్టాఫీసులు, ఎన్ఎస్ఈ, బీఎస్ఈ, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా కొనుగోలు చేసే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గత నెల్లో ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ స్కీమ్‌ను ప్రారంభించారు. వ్యక్తులు నేరుగా ట్రెజరీ బిల్లులు, డేటెడ్ సెక్యూరిటీలు, సావరిన్ గోల్డ్ బాండ్లు (ఎస్జీబీ) స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ (ఎస్డీఎల్) ప్రైమరీ, సెకండరీ మార్కెట్ నుండి నేరుగా కొనుగోలు చేసే సౌలభ్యతను ఈ స్కీమ్ కల్పిస్తోంది. https://rbiretaildirect.org.in లో ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ పోర్టల్ ఇందుకు వేదికగా ఉంది. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లకు అనుసంధానం ఈ స్కీమ్ కింద రిటైల్ ఇన్వెస్టర్లు (వ్యక్తిగతంగా) ఆన్లైన్ రిటైల్ డైరెక్ట్ గిల్ట్ అకౌంట్ (ఆర్డీజీ అకౌంట్)ను ప్రారంభించవచ్చు. ఈ అకౌంట్లను ప్రత్యక్షంగా తమ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లకు అనుసంధానించవచ్చు. స్క్రీన్ ఆధారిత ఎన్డీఎస్–వోఎం ద్వారా సెకండరీ మార్కెట్ ఆపరేషన్స్, ప్రభుత్వ సెక్యూరిటీల జారీ వంటి కార్యకలాపాల్లో పాల్గొనేందుకు వ్యక్తిగత ఆర్డీజీ అకౌంట్లను వినియోగించుకోవచ్చు. ఎన్డీఎస్–వోఎం అనేది ప్రభుత్వ సెక్యూరిటీలకు సంబంధించి సెకండరీ మార్కెట్ ట్రేడింగ్ కోసం ఉద్దేశించిన ఒక స్క్రీన్ ఆధారిత ఎలక్ట్రానిక్ వ్యవస్థ. ఆర్బీఐ నియంత్రణలో ఇది పనిచేస్తుంది. ఇప్పటి వరకూ ఇది బ్యాంకులు, ప్రైమరీ డీలర్లు, బీమా కంపెనీలు, మ్యూచువల్ ఫండ్స్‌కు మాత్రమే అందుబాటులో ఉంది. సెక్యూరిటీల కొనుగోళ్లకు సేవింగ్స్ బ్యాంక్ ఖాతా ద్వారా ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ (ఏకీకృత చెల్లింపుల విధానం) తదితర మార్గాల్లో సులభతరంగా చెల్లింపులు చేయవచ్చు. ఇతరత్రా ఏవైనా సహాయం కావాలంటే పోర్టల్‌లో అన్ని వివరాలు ఉంటాయి. టోల్ ఫ్రీ టెలిఫోన్ నంబరు 1800–267–7955 (ఉదయం 10 గం. నుంచి సాయంత్రం 7 గం. దాకా), ఈమెయిల్ కూడా అందుబాటులో ఉంటాయి. ఈ స్కీము కింద అందించే సదుపాయాలకు ఎటువంటి చార్జీలు ఉండవని ఆర్బీఐ తెలిపింది. దేశీయంగా సేవింగ్స్ ఖాతా, పాన్, కేవైసీ కోసం అధికారికంగా చెల్లుబాటయ్యే పత్రం, ఈమెయిల్ ఐడీ, రిజిస్టర్ మొబైల్ నంబరుతో రిటైల్ ఇన్వెస్టర్లు నమోదు చేయించుకోవచ్చు. కొనుగోలు చేసిన సెక్యూరిటీలు.. సెటిల్మెంట్ రోజున ఆర్డీజీ ఖాతాలోకి జమవుతాయి. -
పెరిగిన బంగారం ధరలు.. లాభపడదామా..?
బంగారం ధరలు గడిచిన ఏడాది కాలంలో 40 శాతానికి పైగా ర్యాలీ చేశాయి. ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోలో బంగారానికి తప్పకుండా చోటు ఇవ్వాలన్నది నిపుణుల సూచన. ఆ దిశగా బంగారంలో పెట్టుబడులు పెడితే మంచిదే. కానీ, ప్రత్యేక అవసరాల కోసం, స్వల్ప కాల అవసరాల కోసం బంగారంలో ఇన్వెస్ట్ చేసే వారూ ఉన్నారు. ప్రస్తుత విపత్తు సమయంలో ప్రతికూలతలను గట్టెక్కేందుకు... సార్వభౌమ బంగారం బాండ్లలో (గోల్డ్ బాండ్స్/ఎస్జీబీ) పెట్టుబడులను తీసేసుకోవాలని అనుకునే వారు లేకపోలేదు. బంగారం ఈటీఎఫ్‌ల్లో ఇన్వెస్ట్ చేసిన వారు వాటిని విక్రయించుకోవడం ఎంతో సులభం. కానీ, భారత ప్రభుత్వం జారీ చేసే సౌర్వభౌమ బంగారం బాండ్లలో ఇన్వెస్ట్ చేసిన వారికి మాత్రం ఆప్షన్లు పరిమితం. ∙ ఈ ఏడాది ఇప్పటి వరకు చూస్తే నిఫ్టీ ప్రధాన సూచీ 21 శాతం మేర నష్టపోతే, ఇదే సమయంలో బంగారం ధరలు 17 శాతం మేర ప్రియంగా మారాయి. దీంతో గోల్డ్ ఈటీఎఫ్‌లు, ఈ బంగారం, బంగారంలో ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్, ఎస్‌జీబీలో పెట్టుబడులపై లాభాల వర్షం కురిసింది. ముఖ్యంగా ఎస్‌జీబీల్లో గడిచిన ఐదేళ్ల కాలంలో ఇన్వెస్ట్ చేసిన వారి పంట పండింది. భౌతిక బంగారంలో పెట్టుబడులను నిరుత్సాహపరచడం, బంగారంలో పెట్టుబడులకు డిజిటల్ దిశగా మళ్లించడమే ఎస్జీబీని తీసుకురావడంలోని ఉద్దేశ్యం. ఈ ప్రయోజనం కొంత వరకు నెరవేరిందనే చెప్పుకోవాలి. భాతిక బంగారంతో పోలిస్తే ఎస్‌జీబీలో పెట్టుబడులపై వార్షికంగా 2.50% వడ్డీ లభిస్తుంది. అదే సమయంలో బంగారం ధరలు పెరిగితే రెండు విధాలుగా ప్రయోజనం కలుగుతుంది. ఎస్జీబీ మొదటి ఇష్యూ 2015 నవంబర్‌లో సిరీస్–1 పేరుతో వచ్చింది. అప్పటి నుంచి చూస్తే బంగారం ధరల్లో ర్యాలీ కారణంగా పెట్టుబడి 84 శాతం వృద్ధి చెందింది. అదే విధంగా 2019–20 ఆర్థిక సంవత్సరం జూన్ మాసంలో ఎస్జీబీ ఇష్యూలో ఇన్వెస్ట్‌మెంట్‌పైనా రాబడి 48 శాతంగా ఉంది. విక్రయించడానికి సరైన సమయమేనా..? చరిత్రను పరిశీలిస్తే.. ప్రతీ మార్కెట్ సైకిల్ (వివిధ సందర్భాలు)లోనూ బంగారం ర్యాలీ చేసినట్టు ఆధారాల్లేవు. బంగారానికి సురక్షిత పెట్టుబడి సాధనమనే ప్రత్యేక గుర్తింపు ఉంది. అందుకే ఆర్థిక సంక్షోభాలు, స్టాక్ మార్కెట్ల పతనాల్లో బంగారంలో ఇన్వెస్ట్ చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు పోటీపడతారు. ఫలితంగా ఆయా సందర్భాల్లో బంగారం ధరల్లో ర్యాలీ నడుస్తుంటుంది. 2019 మధ్య భాగం నుంచి బంగారంలో ర్యాలీ రావడానికి తోడ్పడిన పరిణామం.. అమెరికా–చైనా మధ్య వాణిజ్య యుద్ధమనే చెప్పుకోవాలి. దాంతో బంగారానికి డిమాండ్ పెరిగింది. ఆ తర్వాత కరోనా వైరస్ ప్రపంచ దేశాలపై పంజా విసరడం, ఆర్థిక వ్యవస్థలు సంక్షోభాల్లోకి జారిపోవడం చూస్తూనే ఉన్నాం. ప్రపంచదేశాలు, కేంద్ర బ్యాంకులు అన్ని చేతులతోనూ నిధులను పంప్ చేసే కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ.. సహజ శక్తి తిరిగి ఆర్థిక వ్యవస్థల్లోకి వచ్చి చేరాలంటే అందుకు కొంత కాలం పడుతుందని.. 2021 వరకు ఒత్తిళ్లు కొనసాగుతాయన్న అంచనాలు నిపుణుల నుంచి వస్తున్నాయి. కనుక బంగారంలో ర్యాలీ మరికొంత కాలం పాటు ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇన్వెస్టర్లు పెట్టుబడుల్లో 5–10 శాతాన్ని బంగారానికి కేటాయించుకోవచ్చు. కనుక పెట్టుబడుల కోణంలో ఎస్‌జీబీల్లో ఇన్వెస్ట్ చేసుకుని ఉంటే వాటిని కొనసాగించుకోవచ్చు. ఒకవేళ ప్రస్తుత లాక్డౌన్ కారణంగా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న వారు.. లేదా కొంత మేర పెట్టుబడులను దీర్ఘకాలానికి ఈక్విటీల కోసం కేటాయించుకోవాలనుకుంటే.. ఎస్‌జీబీల నుంచి కొంత మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు. సెకండరీ మార్కెట్... సార్వభౌమ బంగారం బాండ్ (ఎస్జీబీ)లో పెట్టుబడులకు 8 ఏళ్ల కాలవ్యవధి. కాకపోతే 5వ ఏట చివరి నుంచి వైదొలిగేందుకు అవకాశం ఉంటుంది. కానీ, ఆ లోపు విక్రయించాలంటే అందుకు సెకండరీ మార్కెట్ ఒక్కటే అవకాశం. 2015 నవంబర్ నుంచి ఇప్పటి వరకు 37 సిరీస్‌ల ఎస్జీబీ ఇష్యూలు ముగిశాయి. ఇవన్నీ కూడా బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో క్యాష్ విభాగంలో ట్రేడవుతున్నాయి. కాకపోతే సెకండరీ మార్కెట్లో ఎస్జీబీలను విక్రయించాలన్నా లేదా ఇన్వెస్ట్ చేయాలన్నా అందుకు ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాలు ఉండడం అవసరం. అదే విధంగా ఎన్ఎస్ఈ, బీఎస్ఈల్లో తగినంత లిక్విడిటీ (ట్రేడింగ్ పరిమాణం) ఉంటేనే వీటిని సరైన ధరలకు విక్రయించుకోవడం వీలవుతుంది. కానీ, చాలా వరకు ఎస్జీబీ ఇష్యూలకు ట్రేడింగ్ వ్యాల్యూమ్ చాలా తక్కువగా ఉంటోంది. ఎన్ఎస్ఈలో గడిచిన ఏడాది కాలంలో సగటు రోజువారీ ట్రేడింగ్ విలువ రూ.1.2 కోట్లుగానే ఉండడం గమనార్హం. కొన్నింటిలో మాత్రం ఈ ఇబ్బం ది లేదు. మొత్తం 37 సిరీస్‌లలో 12 సిరీస్‌ల్లో.. గడిచిన 3 నెలల్లో చూస్తే రోజువారీ ట్రేడింగ్ 100 యూనిట్లు, అంతకంటే ఎక్కువగానే నమోదవుతున్నాయి. ఎస్జీబీఏయూజీ27 (ఎన్ఎస్ఈ కోడ్), ఎస్జీబీఎన్వోబీ24, ఎస్జీబీఏయూజీ24, ఎస్జీబీఎంఏవై25, ఎస్జీబీఎస్ఈపీ24ల్లో రోజువారీ ట్రేడింగ్ వ్యాల్యూమ్ 801–340 యూనిట్ల మధ్య ఉండడాన్ని గమనించాలి. కాకపోతే ప్రతీ రోజూ ఇంతే స్థాయిలో ట్రేడింగ్ పరిమాణం ఉండడం లేదు. ముఖ్యంగా ఎక్కువ మంది బ్రోకర్లు ఎస్బీజీల క్రయ విక్రయాలకు అనుమతించడం లేదు. ఎందుకంటే రెండు డిపాజిటరీల మధ్య (ఎన్ఎస్డీఎల్, సీడీఎస్ఎల్) ఈ బాండ్లకు సంబంధించి సెటిల్మెంట్ అవకాశం లేదు. అయితే, అటువైపు విక్ర యించేవారు, ఇటు కొనుగోలు చేసే వారు ఒకే డిపాజిటరీ పరిధిలో (అయితే ఎన్ఎస్డీఎల్ లేదా సీడీఎస్ఎల్) ఉంటే క్రయ విక్రయాలకు ఇబ్బంది లేదు. అమ్మే వ్యక్తి, కొనుగోలు చేసే వ్యక్తి డీమ్యాట్ ఖాతాలు వేర్వేరు డిపాజిటరీల్లో ఉంటేనే సమస్య. ప్రముఖ బ్రోకింగ్ సంస్థలు... హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్, జెరోదా ఎస్జీబీ యూనిట్ల కొనుగోలు, అమ్మకాలకు అవకాశం కల్పిస్తున్నాయి. ప్రతీ రూ.100 విలువపై 10 పైసల నుంచి 50 పైసల వరకు బ్రోకరేజీ చార్జీలుగా చెల్లించాలి. ఎస్జీబీ అంటే... ఎనిమిదేళ్ల కాల వ్యవధి కలిగిన బంగారం బాండ్. ఇందులో ఒక ఇన్వెస్టర్ ఒక గ్రాము నుంచి 4 కిలోల వరకు కొనచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని, ఆన్లైన్లో చెల్లింపులు చేసిన వారికి రూ.50 డిస్కౌంట్. ఏ ఇష్యూలో అయినా రిటైల్ ఇన్వెస్టర్లు ఆన్లైన్ చెల్లింపులు చేయడం ద్వారా గ్రాముపై రూ.50 డిస్కౌంట్ పొందొచ్చు. గడువు తీరే నాటికి మార్కెట్ రేటు ప్రకారం చెల్లింపులు జరుగుతాయి. అదే విధంగా బాండ్లో పెట్టుబడి విలువపై వార్షికంగా 2.50 శాతం వడ్డీని చెల్లించడం జరుగుతుంది. దీర్ఘకాల లక్ష్యాల కోసం బంగారాన్ని కొద్ది కొద్దిగా సమకూర్చుకోవాలని అనుకునే వారికి, బంగారంలో ఇన్వెస్ట్ చేద్దామనుకునే వారికి అందుబాటులో ఉన్న సాధనాల్లో ఇది మెరుగైనదని నిపుణుల విశ్లేషణ. ఇందులో పెట్టుబడులకు పూర్తి రక్షణ ఉంటుంది. వడ్డీ ఆదాయం లభిస్తుంది. పూర్తి కాలం ఉంచుకుంటే లాభాలపై పైసా పన్ను కట్టక్కర్లేదు. ఇవన్నీ సానుకూలతలు. ఇన్వెస్ట్ చేసిన ధర కంటే బం గారం ధరలు కిందకు పడిపోయి దీర్ఘకాలం పాటు అదే స్థాయిల్లో కొనసాగితే నష్టాలు ఎదుర్కోవాలి. ఆర్బీఐ విండో.. ఎస్జీబీలకు ఐదేళ్లు లాకిన్. ఐదవ ఏట, ఆరవ ఏట, ఏడవ ఏట చివర్లో ఈ బాండ్లలో పెట్టుబడులను వెనక్కి తీసుకోవచ్చు. ఇందుకోసం 30 రోజుల ముందుగా ఆర్బీఐ బైబ్యాక్ విండో ప్రారంభమవుతుంది. పన్ను బాధ్యత ఎస్‌జీబీల్లో పెట్టుబడులను పూర్తి ఎనిమిదేళ్లు కొనసాగించితే మూలధన లాభాల పన్ను నుంచి మినహాయింపుంటుంది. గడువులోపే సెకండరీ మార్కెట్ లేదా ఆర్బీఐ బైబ్యాక్ విండో ద్వారా విక్రయించినట్టయితే పన్ను చెల్లించాలి. 36 నెలల్లోపు విక్రయించడం వల్ల లాభం సమకూరితే.. ఆ మొత్తాన్ని వ్యక్తిగత వార్షిక ఆదాయంలో చూపించి, నిర్ణీత శ్లా్లబు రేటు ప్రకారం పన్ను చెల్లించాలి. -
14 నుంచి బంగారం బాండ్ల విక్రయం
ముంబై: సార్వభౌమ బంగారం బాండ్ల మలి విడత విక్రయం ఈ నెల 14న ప్రారంభం కానుంది. 18వ తేదీ వరకు కొనసాగుతుంది. ఓ గ్రాము బంగారం ధర రూ.3,214గా ఆర్బీఐ ఖరారు చేసింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని, డిజిటల్ రూపంలో చెల్లించే వారికి గ్రాము బంగారంపై రూ.50ను తగ్గింపు ఇవ్వనున్నట్టు తెలిపింది. దీంతో గ్రాము బంగారాన్ని రూ.3,614కే ఇవ్వనుంది. బ్యాంకులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్, ఎంపిక చేసిన పోస్టాఫీసులు, ఎన్ఎస్ఈ, బీఎస్ఈ ద్వారా వీటిని కొనుగోలు చేయవచ్చు. ఒక వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా 500 గ్రాముల వరకు కొనుగోలు చేసుకునేందుకు అవకాశం ఉం ది. కనీస పెట్టుబడి ఒక గ్రాము. సార్వ భౌమ బం గారం బాండ్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం మొదటిసారిగా 2015 నవంబర్‌లో ప్రారంభించింది. -
పసిడి బాండ్ల విక్రయం ప్రారంభం
న్యూఢిల్లీ: 2018–19 సావరీన్ గోల్డ్ బాండ్స్ స్కీమ్‌లో నాలుగో సిరీస్ కింద బాండ్ల విక్రయం సోమవారం ప్రారంభమైంది. ఇది ఈ నెల 28న ముగుస్తుంది. జనవరి 1న బాండ్ల జారీ ఉంటుంది. కొత్తగా జారీ చేసే పసిడి బాండ్ల సిరీస్‌కు సంబంధించి గ్రాముకు రూ.3,119 ధరను కేంద్రం నిర్ణయించింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే వారికి, డిజిటల్ విధానంలో చెల్లింపులు జరిపేవారికి ఇష్యూ ధరలో గ్రాముపై రూ.50 డిస్కౌంట్ ఉంటుంది. ఈ కేటగిరీకి చెందిన వారికి గ్రాము రూ.3,069 ధరకే లభిస్తుంది. అక్టోబర్‌తో ప్రారంభమైన పసిడి బాండ్ల జారీ వచ్చే ఏడాది ఫిబ్రవరి దాకా ప్రతి నెలా ఉంటుంది. బ్యాంకులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌హెచ్‌సీఐఎల్), పోస్టాఫీసులు, స్టాక్ ఎక్సే్చంజీల ద్వారా వీటిని కొనుగోలు చేయొచ్చు. భౌతిక రూపంలో బంగారానికి డిమాండ్ తగ్గించేందుకు, పసిడి కొనుగోళ్లకు వెచ్చిస్తున్న మొత్తాన్ని ఆర్థిక సాధనాల్లోకి మళ్లించేందుకు 2015 నవంబర్‌లో సావరీన్ గోల్డ్ బాండ్ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించిన సంగతి తెలిసిందే. -
గోల్డ్ బాండ్స్, ఈటీఎఫ్‌ల్లో ఏవి బెటర్?
నేను బీఎస్‌ఎల్‌ఐ డ్రీమ్ ఎండోమెంట్ ప్లాన్‌లో 2010 నుంచి ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాను. ఇప్పటివరకూ రూ.3,95,000 ఇన్వెస్ట్ చేశాను. ఈ ఇన్వెస్ట్మెంట్ విలువ ప్రస్తుతం రూ.4,10,000గా ఉంది. ఈ ప్లాన్‌లో కొనసాగమంటారా? లేక వైదొలగమంటారా? –రవికాంత్, విశాఖపట్టణం బీఎస్‌ఎల్‌ఐ డ్రీమ్ ఎండోమెంట్ ప్లాన్ అనేది ఒక యూనిట్ లింక్డ్లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్(యులిప్). బీమా, మదుపు కలగలపిన ప్లాన్ ఇది. కానీ ఈ తరహా ప్లాన్లు తగిన బీమా కవర్‌ను, కనీసం ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే రాబడులను కూడా ఇవ్వలేవు. ఈ తరహా ప్లాన్‌ల్లో ఎప్పుడూ ఇన్వెస్ట్ చేయకూడదు. పైగా వీటిల్లో చార్జీల వ్యయాలు అధికంగా ఉంటాయి. మీరు చెల్లించే ప్రీమియమ్ నుంచి ఈ చార్జీలను మినహాయించుకొని మిగిలిన మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తారు. ఎలా చూసినా ఇవి ఇన్వెస్ట్‌మెంట్‌కు తగినవి కావు. బీమా కోసం టర్మ్ బీమా ప్లాన్లను ఎంచుకోవాలి. వీటిల్లో ప్రీమియమ్‌లు చాలా తక్కువగానూ, బీమా కవరేజ్ అధికంగానూ ఉంటుంది. ఇక దీర్ఘకాలిక ఇన్వెస్ట్మెంట్ అవసరాల కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయాలి. ఇక మీ విషయానికొస్తే, మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై సగటున ఏడాదికి 1 శాతం కంటే తక్కువగానే రాబడులు వచ్చాయి. మీరు బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలో ఇన్వెస్ట్ చేసినా ఇంతకుమించి రాబడులు వచ్చేవి.మీరు ఈ ప్లాన్ తీసుకొని ఐదేళ్లు పూర్తయినందున మీరు ఎలాంటి సరెండర్ చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. మీరు పొందే సరెండర్ వేల్యూపై కూడా ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పనిలేదు. అందుకని ఈ ప్లాన్‌ను సరెండర్ చేయండి. ఈ ప్లాన్ కోసం చెల్లించే ప్రీమియమ్ నుంచే కొంత మొత్తాన్ని టర్మ్ బీమా పాలసీ కోసం, మిగిలిన దానిని ఒకటి లేదా రెండు మంచి ఈక్విటీ ఫండ్స్‌ను ఎంచుకొని వాటిల్లో ఇన్వెస్ట్ చేయండి. నేను ఇటీవలే గోల్డ్ బాండ్‌ల్లో ఇన్వెస్ట్ చేశాను. అయితే వీటి కంటే కూడా గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి ప్రయోజనాలు వస్తాయని మిత్రులంటున్నారు. గోల్డ్ బాండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం సరైన నిర్ణయం కాదా ? –బాబూరావు, వరంగల్ సావరిన్ గోల్ట్ బాండ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయడం సరైన నిర్ణయమే. గోల్డ్ ఇటీఎఫ్ల్లో కన్నా గోల్డ్బాండ్స్లో ఇన్వెస్ట్ చేయడం మూడు విధాలుగా ప్రయోజనకరం. మొదటిది.. గోల్ట్ బాండ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై మీకు 2.75 శాతం చొప్పున వార్షిక వడ్డీ లభిస్తుంది. ఆరు నెలలకొకసారి చెల్లిస్తారు. రెండవది.. గోల్ట్ ఈటీఎఫ్‌లు 1 శాతం చొప్పున మేనేజ్మెంట్ చార్జీలు విధిస్తాయి. గోల్డ్ బాండ్స్ ఎలాంటి చార్జీలు విధించవు. మూడవది గోల్డ్ బాండ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకుంటే మీరు ఎలాంటి మూలధన లాభాల పన్నులు చెల్లించాల్సిన పనిలేదు. ఇక ఈటీఎఫ్‌ల ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసహరించుకుంటే మీరు స్వల్ప కాలిక, దీర్ఘకాలిక మూలధన లాభాలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక గోల్ట్ బాండ్స్ విషయానికొస్తే, వీటి కాలపరిమితి 8 సంవత్సరాలు. ఐదేళ్ల తర్వాత ఈ బాండ్ల నుంచి కావాలనుకుంటే వైదొలిగే అవకాశముంది. వీటిని డి–మ్యాట్లోకి మార్చుకోవచ్చు. ఇవి స్టాక్ ఎక్సే్ఛంజ్‌ల్లో లిస్ట్ అవుతాయి. ఫలితంగా మెచ్యురిటీకి ముందే ఈ బాండ్ల నుంచి వైదొలగవచ్చు. ఈ బాండ్ల ఆధారంగా రుణాలు కూడా తీసుకోవచ్చు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే గోల్ట్ ఈటీఎఫ్‌ల కన్నా, సావరిన్ గోల్డ్‌బాండ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం సరైన నిర్ణయమేనని చెప్పవచ్చు. నేను మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. మిత్రుల దగ్గర తక్కువ వడ్డీకి రుణం తీసుకొని, ఈ మొత్తంతో 3–15 ఏళ్ల కాలానికి మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనేది నా ఆలోచన. లాక్–ఇన్ పీరియడ్, పన్ను తదితర అంశాలు పరిగణనలోకి తీసుకొని నాకు కొన్ని మంచి ఫండ్స్‌ను సూచించండి? –సూరజ్, హైదరాబాద్ అప్పు చేసి పప్పు కూడా వద్దని పెద్దలు ఆనాటి నుంచి చెపుతూనే ఉన్నారు. ఇది మ్యూచువల్ ఫండ్స్‌తో సహా అన్ని ఇన్వెస్ట్‌మెంట్స్‌కు వర్తిస్తుంది. తక్కువ వడ్డీకైనా సరే, మిత్రుల దగ్గర రుణం తీసుకొని మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం సరైన నిర్ణయం కాదు. దీనివల్ల ఆర్థిక ఊబిలో కూరుకుపోవడమే కానీ ఎలాంటి ప్రయోజనాలు మీరు పొందలేరు. చాలా ఫండ్స్ రాబడులు ఊరిస్తూ ఉంటాయి. దీంతో చేతిలో డబ్బుల్లేకపోయినా, అప్పు చేసైనా సరే వాటిల్లో ఇన్వెస్ట్ చేయాలని మనం టెంప్ట్ అవుతూ ఉంటాము. కానీ ఇది సరైన విధానం కాదు. స్టాక్మార్కెట్లో ఒక్కోసారి సుదీర్ఘ బేర్ దశలు నడుస్తూ ఉంటాయి. ఒకసారి ఆ దశ వస్తే మీ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ హరించుకుపోతాయి, రాబడులు రాకపోగా, వడ్డీ భారం అంతకంతకూ పెరిగిపోతూ ఉంటుంది. అందుకని అప్పు చేసి ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనే ఆలోచనకు స్వస్తి చెప్పండి. మీ సొంత డబ్బులనే ఇన్వెస్ట్ చేయండి. ఏవైనా రెండు, మూడు డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంచుకోండి. వాటిల్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయండి. సంపద సృష్టికి ఇదొక చక్కని మార్గం. ఈ ఫండ్స్‌కు ఎలాంటి లాక్–ఇన్ పీరియడ్ ఉండదు. మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఈ ఫండ్స్ యూనిట్లను విక్రయించుకోవచ్చు. ఈ ఫండ్స్‌లో ఏడాదికి పైగా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగిస్తే, మీరు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పని కూడా ఉండదు. -
27 నుంచి ఏడో విడత బంగారు బాండ్ల విక్రయం
న్యూఢిల్లీ: సౌర్వభౌమ బంగారు బాండ్ల ఏడో విడత జారీకి కేంద్రం నిర్ణయించింది. ఈ నెల 27న ప్రారంభం కానుండగా మార్చి 3 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో భాగంగా ఒక్కరు 500 గ్రాముల బంగారం విలువకు సరిపడా సెక్యూరిటీలను కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది. రూ.20వేల వరకు నగదు రూపంలో చెల్లించడానికి అవకాశం ఉంది. అంతకుమించితే డీడీ లేదా చెక్ లేదా నెట్ బ్యాంకింగ్ విధానంలో చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇదే చివరి విడత జారీ. ‘‘ఆర్బీఐతో ప్రభుత్వం సంప్రదించిన అనంతరం సౌర్వభౌమ బంగారు బాండ్లు 2016–17 ఏడో సిరీస్ విడుదల చేయాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 3 వరకు దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుంది’’ అని కేంద్ర ఆర్థిక శాఖ గురువారం వెల్లడించింది. అర్హులైన దరఖాస్తుదారులకు మార్చి 17న బంగారు బాండ్లను కేటాయిస్తారు. బంగారంపై పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి ప్రత్యామ్నాయ సాధనంగా సౌర్వభౌమ బంగారు బాండ్ల పథకాన్ని ప్రభుత్వం 2015 నవంబర్‌లో తొలిసారిగా ప్రారంభించింది. ఇప్పటి వరకు ఆరుసార్లు బాండ్లను జారీ చేసింది. ప్రభుత్వం తరఫున ఆర్బీఐ వీటిని జారీ చేస్తుంది. వీటిపై వార్షికంగా 2.50 శాతం వడ్డీని ఆరు నెలలకోసారి ప్రభుత్వం చెల్లిస్తుంది. బాండ్ల కాల వ్యవధి 8 ఏళ్లు కాగా, ఐదో ఏట నుంచి వైదొలగేందుకు అవకాశం ఉంది. ఈ బాండ్లు స్టాక్ ఎక్సేS్చలలో ట్రేడ్ అవుతాయి.