Google firm
-
ప్రకృతి సాగుతో అబ్బురపరుస్తున్న టెక్కీ! ‘గూగుల్ ఫామ్స్’ ద్వారా మార్కెటింగ్..
సాక్షి, అమరావతి: కర్నూలు జిల్లా జొహరాపురానికి చెందిన బాలభాస్కరశర్మ పదేళ్ల పాటు సింగపూర్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేశారు. తండ్రి మరణంతో కర్నూలు వచ్చేసిన ఆయన బెంగళూరు కేంద్రంగా ఉన్న ఓ కంపెనీలో ఇంటినుంచే పని చేస్తున్నారు. కొలువును కొనసాగిస్తూనే.. కల్లూరు మండలం నాయకల్లు గ్రామంలో తనకున్న 8.50 ఎకరాల్లో 20 రకాల కూరగాయలు, ఆకు కూరలతో పాటు 10కి పైగా పండ్లను సాగు చేస్తూ వినూత్న రీతిలో మార్కెటింగ్ చేస్తున్నారు. ఎర్ర బెండ, నల్ల పసుపు, మామిడి అల్లం వంటి విభిన్న పంటలతో పాటు నిమ్మ, జామ, సీతాఫలం, మామిడి, అంజూర, నేరేడు, అరటి, మునగ, పాల సపోట, చెర్రీ, టమాటా, చెన్నంగి కొబ్బరి, ముల్లంగి, ఆకు కూరలను సాగు చేస్తున్నాడు. మధురై నుంచి ఎర్ర బెండ సీడ్‌ను, ఆయుర్వేద మందుల్లో ఎక్కువగా ఉపయోగించే నల్ల పసుపును మేఘాలయ నుంచి తెప్పించి నాటారు. గూగుల్ ఫామ్స్ ద్వారా బుకింగ్ బాలభాస్కరశర్మ పండించిన పంటలన్నిటినీ గూగుల్ ఫామ్స్ ద్వారా మార్కెటింగ్ చేస్తున్నారు. వారానికి రెండుసార్లు కూరగాయలు, ఆకు కూరలు కోతకు వస్తుండగా.. కోతకొచ్చే రెండ్రోజుల ముందుగానే గూగుల్ ఫామ్స్‌లో తాను పండించే పంటలు, వాటి ధరల వివరాలను వినియోగదారులకు లింక్ ద్వారా పంపిస్తున్నారు. తమకు అవసరమైన వాటిని ఏ మేరకు కావాలో ఎంచుకొని.. ఆ వివరాలను వినియోగదారులు సబ్మిట్ చేయగానే బాలభాస్కరశర్మకు మెయిల్ మెసేజి వస్తుంది. ఆ వివరాలను ఎక్సెల్ షీట్లో క్రోఢీకరించుకుని కోతలు పూర్తి కాగానే వాటి నాణ్యత కోల్పోకుండా ప్యాకింగ్ చేసి స్వయంగా డోర్ డెలివరీ చేస్తున్నారు. ఇలా కర్నూలులోని 3 అపార్ట్‌మెంట్స్‌లో నివసిస్తున్న వారికి తన పంటలను విక్రయిస్తున్నారు. గూగుల్ ఫామ్స్‌ను వినియోగించడం వల్ల సొంత వెబ్సైట్, ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ అవసరం లేకుండా, ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా మొత్తం పంటల్ని విక్రయిస్తున్నారు. సాగులో ఆధునికత కూరగాయలు, ఆకు కూరలను మల్చింగ్ విధానంలో భాస్కరశర్మ సాగు చేస్తున్నారు. మల్చింగ్ వల్ల భూమిలో తేమ ఆరిపోకుండా ఉండటమే కాకుండా నీరు ఆదా అవుతుంది. చీడపీడల బెడద కూడా ఉండదు. కూరగాయలు, ఆకు కూరలు మంచి నాణ్యతతో ఉంటాయి. మామిడి, ఇతర పండ్ల తోటలకు వేరుశనగ పొట్టుతో మల్చింగ్ చేస్తున్నారు. సాగులో ఎరువులు, పురుగుల మందులు వాడరు. పూర్తిగా గో ఆధారిత వ్యవసాయం కోసం 5 దేశీవాళీ ఆవులను పోషిస్తున్నారు. వాటిద్వారా వచ్చే జీవామృతం మొక్కలకు వేస్తారు. రసం పీల్చే పురుగుల నివారణకు వావిలాకు కషాయం, గొంగళి పురుగుల నివారణకు అగ్ని అస్త్రం, దశపర్ణి కషాయం, పుల్లటి మజ్జిగ, చీడపీడలకు నీమాస్త్రం, వేప, సీతాఫలం నూనెలు వాడుతున్నారు. పండ్ల తోటలకు నష్టం కలిగించే పండు ఈగల నివారణకు సోలార్ ట్రాప్స్, తెలుపు, పసుపు జిగురు అట్టలు ట్రాప్స్‌ను ఉపయోగిస్తున్నారు. రసాయన అవశేషాలు లేని పంటల సాగే లక్ష్యం రసాయన అవశేషాలు లేకుండా పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేస్తున్నాను. వారానికి ఐదు రోజులు వ్యవసాయ క్షేత్రంలోనే ఉంటాను. క్షేత్రంలో ఓ కుటుంబానికి ఉపాధి కల్పిస్తున్నాను. మొదట్లో పండ్ల మొక్కలు నాటాను. ఆరు నెలలుగా కూరగాయలు, ఆకు కూరలు సాగు చేస్తున్నాను. వారానికి రెండుసార్లు ఆపార్ట్మెంట్స్లో విక్రయిస్తున్నాను. మంచి ఆదరణ లభిస్తోంది. పెట్టుబడికి తగినట్టుగా ఆదాయం వస్తుంది. – బాలభాస్కరశర్మ, సాఫ్ట్వేర్ ఇంజనీర్, కర్నూలు -
నిఘా నీడలో నెటిజన్లు!
అమెరికాలానే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు తమ పౌరుల వ్యక్తిగత సమాచారం కోసం గూగుల్‌కు దరఖాస్తులు పంపుతున్నాయి. అమెరికా తర్వాతి స్థానంలో భారత్ ఉంది. భారత్ నుంచి గూగుల్‌కు 2,691 దరఖాస్తులు వెళ్లాయి. వాటిలో 64శాతం దరఖాస్తుల వివరాలను గూగుల్ అందజేసింది. భారత్ తర్వాత జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్, బ్రెజిల్ ఉన్నాయి. పక్కవారి జీవితాల్లోకి తొంగిచూడడం కొందరికి సరదా.. కొందరికి అలవాటు.. ఇంకొందరికి అదో వ్యసనం... ఎవ రెంత గోలచేసినా వారికి పట్టదు. తమ ధోరణి తమదే. వ్యక్తిగత విషయాలు, అలవాట్లు, బలహీనతలు, ఆలోచన లు, ప్రణాళికలు.. ఇలా అవతలివారికి సంబంధించిన అన్ని వివరాలూ తెలుసుకుని తాము ఏదో సాధించామని సంబరపడుతుంటారు. వ్యక్తుల సంగతలా ఉంచితే ఇలాం టి వ్యసనం ప్రభుత్వాలకే ఉంటే.. ఇక ఆ దేశాలలోని పౌరుల పరిస్థితి ఏమిటో...! అంతులేని అభద్రతాభావం వెంటాడుతుంటే వారి మనఃస్థితి ఎలా ఉంటుందో.. ఇంటర్నెట్ ఉపయోగిస్తున్న వ్యక్తుల (నెటిజన్లు) వ్యక్తి గత సమాచారాన్ని అనేక దేశాలు అవసరానికి మించి తెలు సుకోవడం ఇటీవల పెరిగిపోయింది. ఉగ్రవాద బూచిని ఇందుకు సాకుగా చూపిస్తున్నాయి. ఇలాంటి దేశాలలో అగ్రరాజ్యం అమెరికా అందరికన్నా ముందుంది. ఆ తర్వాతి స్థానం మనదే. ఈ విషయాన్ని ఇటీవలే ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్ వెల్లడించింది. పారదర్శక నివేదిక పేరుతో గూగుల్ సంస్థ ఈ వివరాలను బైటపెట్టింది. ఇలా నివేదికలు వెల్లడించడం గూగుల్ 2010లో మొదలు పెట్టింది. తాజా నివేదిక (2013 జనవరి-జూన్) ఆ క్రమం లో 8వది. దేశాలు నెటిజన్ల వివరాలు అడగడం, తాము వాటిని ఇవ్వడం గురించి గూగుల్ ఎందుకు బయటపెడు తుందన్న సందేహం మనకు కలగవచ్చు. వారడిగిన సమా చారం ఇచ్చి ఊరుకుంటే సరిపోతుంది కదా అని కూడా అనిపించవచ్చు. కానీ తాము నెటిజన్ల పక్షమని నిరూపిం చుకునేందుకు గూగుల్ అనుక్షణం తపిస్తుంటుంది. తమ సేవలను ఉపయోగించుకుంటున్న వారి పక్షానే తాము పనిచేస్తున్నామని, ప్రభుత్వాలకు ఏజెంట్ కాదని చెప్పు కునేందుకు గూగుల్ ఈ పారదర్శక నివేదికలను ఉప యోగించుకుంటున్నది. ఇక నివేదికలోని అంశాలను పరిశీలిద్దాం... నెటిజన్ల వివరాలను ప్రభుత్వాలు కోరడం గతంతో పోల్చితే ఇపుడు 100శాతం పెరిగింది. 2013 తొలి ఆరునెలల్లో అమెరికా ప్రభుత్వం గూగుల్‌కు 10,918 అభ్యర్థనలను పంపించింది. వాటిలో 83శాతం దరఖాస్తులకు గూగుల్ నుంచి సమా ధానాలు అందాయి కూడా. అమెరికా రాజమార్గంలో ఇలా సమాచారాన్ని అడిగి తీసుకోవడమే కాదు... రహస్యంగా గూగుల్ ఫైబర్ లైన్లను ట్యాప్ చేసి కూడా చాలా సమా చారాన్ని దొంగిలిస్తున్నదని ఇటీవలే బైటపడింది. అమెరికాకు చెందిన ఫెడరల్ నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ ఈ దుర్మార్గానికి ఒడిగట్టిందని తేలింది. అమెరికా మాజీ గవర్నమెంట్ కాంట్రాక్టర్ ఎడ్వర్డ్ స్నోడెన్ ఈ విషయాలను మీడియాకు ససాక్ష్యంగా వెల్లడించారు. అందరికీ నీతులు చెప్పే అమెరికా ఇలా అక్రమాలకు తెగబడడం కొత్తేమీ కాదు గానీ ప్రభుత్వాలే సక్రమ, అక్రమ పద్ధతులన్నీ ఉప యోగించుకుని సామాన్యుల వివరాలిలా కాజేయడం క్షమార్హం కాదు. అమెరికాలానే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు తమ పౌరుల వ్యక్తిగత సమాచారం కోసం గూగుల్‌కు దరఖాస్తులు పంపుతున్నాయి. అమెరికా తర్వాతి స్థానంలో భారత్ ఉంది. భారత్ నుంచి గూగుల్‌కు 2,691 దరఖాస్తులు వెళ్లాయి. వాటిలో 64శాతం దరఖాస్తుల వివ రాలను గూగుల్ అందజేసింది. భారత్ తర్వాత జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్, బ్రెజిల్ ఉన్నాయి. గూగుల్ మాత్రమే కాదు ఫేస్‌బుక్‌కు కూడా ప్రభుత్వాల నుంచి ఇలాంటి దరఖాస్తులు అందుతున్నాయి. ఇం దులోనూ అమెరికా తర్వాత స్థానంలో భారత్ ఉంది. భార త ప్రభుత్వం సమాచారం కోసం 3,245 దరఖాస్తులను, యూజర్లు/అకౌంట్ల వివరాల కోసం 4,144 దరఖాస్తులను పంపించిందట. అందులో 50 శాతం దరఖాస్తులకు ఫేస్ బుక్ సమాధానాలు అందజేసింది. అలాగే ఫలానా వీడి యోలు తీసేయాలంటూ యూట్యూబ్‌కి కూడా భారత ప్రభుత్వం నుంచి ఎక్కువ దరఖాస్తులు అందుతున్నాయి. గూగుల్ పారదర్శక నివేదిక (2012 జనవరి-జూన్) ప్రకా రం యూట్యూబ్‌కు దరఖాస్తుల సంఖ్య 100కి లోపే ఉం డగా అదే ఏడాది జులై-డిసెంబర్ మధ్య 2540 దరఖా స్తులు అందాయి. ఆ కాలంలో ‘ఇన్నోసెన్స్ ఆఫ్ ఇస్లాం’ సినిమా విడుదల ఈ హాఠాత్ పెరుగుదలకు కారణం. ఆ సినిమాకి సంబంధించిన క్లిప్పింగులు, వీడియోలు తీసే యాలంటూ దరఖాస్తులు ఎక్కువ వెళ్లాయి. 2011తో పోల్చితే 2012లో యూట్యూబ్‌కి భారత్ నుంచి అందిన దరఖాస్తుల సంఖ్య 90శాతం పెరిగింది. ప్రజల భద్రత కోసం, ఉగ్రవాద ముష్కరుల ఆనుపా నులు తెలుసుకోవడం కోసం ఆయా దేశాలు ఇంటర్నెట్లో వ్యక్తుల సమాచారం సేకరించడం అర్దం చేసుకోవలసిన అంశమే. అయితే ఇలా సేకరించిన సమాచారాన్ని ఏ విధం గా ఉపయోగిస్తున్నారో.. దానిని ఉపయోగించుకుని ఏఏ ఫలితాలను సాధించారో వెల్లడించకపోతే అనుమానించ డం సహజమేకదా..? ఏ దేశమూ ఈ సమాచారం విష యంలో పారదర్శకంగా వ్యవహరించక పోవడం ఆందోళ న కల్గించే అంశం. ప్రజాస్వామ్యవ్యవస్థ ఉన్న దేశాలు కూ డా తమ పౌరుల ప్రాథమిక హక్కులను గుర్తించకపోవ డం, వారిపై కనీస విశ్వాసముంచకపోవడం విచారకరం. గూగుల్ లీగల్ డెరైక్టర్ రిచర్డ్ సల్గాడో కోరుతున్నట్లు ఇప్ప టికైనా ప్రభుత్వాలు సామాన్యుల వ్యక్తిగత సమాచారం వి షయంలో మరింత పారదర్శకంగా వ్యవహరించాలి. సేక రించిన సమాచారాన్ని సమాజహితానికే ఉపయోగించాలి. - పోతుకూరు సాయిచరణ్