'జీమెయిల్ యాప్'కు గూగుల్ న్యూ లుక్!
న్యూఢిల్లీ: ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా న్యూలుక్ తో జీమెయిల్ యాప్ కు గూగుల్ కొత్త హంగుల్ని అందించడానికి సిద్ధమైంది. అయితే అప్ డేటెడ్ వెర్షన్ జీమెయిల్ యాప్ ఇంకా గూగూల్ ఇండియా ప్లే స్టోర్ లో అందుబాటులోకి రాలేదు. దశల వారిగా జీమెయిల్ యాప్ ను రీడిజైన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ యాప్ త్వరలోనే భారతీయ యూజర్లకు అందుబాటులోకి రానుందని గూగుల్ కంపెనీ వెల్లడించింది.
ప్రతి మెసెజ్ కు అనువైన రిప్లై బటన్ పై గూగుల్ దృష్టి పెట్టినట్టు సమాచారం. అంతేకాకుండా వినియోగానికి చాలా సులభంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోనుంది. ఆండ్రాయిడ్ టాబ్లెట్ లో యాప్ ను వినియోగిస్తే.. ఇన్ బాక్స్ లో వివిధ కేటగిరిలో మార్పులు గమనిస్తారని ఓ బ్లాగ్ పోస్ట్ లో గూగుల్ పేర్కొంది. కొత్త యాప్ ద్వారా అన్ని ఈమెయిల్ ప్రొవైడర్లు యాహూ మెయిల్, అవుట్ లుక్.కామ్ ఈమెయిల్ ను పీంఓపి/ఐఎంఏపీ ద్వారా వినియోగించుకోవచ్చని గూగుల్ తెలిపింది. Follow @sakshinews