Gopal Nagar colony
-
వినాయక చవితి రోజు షాకింగ్ ఘటన.. సోషల్ మీడియాలో వైరల్
సాక్షి, రాజన్న సిరిసిల్ల జిల్లా: సిరిసిల్ల గోపాల్‌నగర్‌లో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. మండపం నుండి వినాయకుని ప్రతిమను దొంగలు ఎత్తుకెళ్లారు. వీధిలోని చిన్న పిల్లలు తొలిసారి ప్రతిష్ఠించిన గణనాథుడి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. రాత్రి 12 గంటల వరకూ జనాలు, పిల్లలు అక్కడే ఉండగా, అర్థరాత్రి తర్వాత ప్రతిమ చోరీకి గురైంది. ఘటన పట్ల కాలనీ కాలనీ వాసుల విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో సైతం దొంగతనం వ్యవహారం వైరల్‌గా మారింది. మరో చోట తాళం వేసిన ఇంటి తలుపులు పగులకొట్టి చోరీకి విఫలయత్నం చేశారు. గోపాల్ నగర్లో చోరీ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. చదవండి: గణేష్ ఉత్సవాలు షురూ.. ఈ జాగ్రత్తలు, సూచనలు మర్చిపోకండి! -
యువతి ఇంటిముందు ధర్నా; ప్రేమికుడి మృతి..!
-
యువతి ఇంటిముందు ధర్నా; ప్రేమికుడి మృతి..!
సాక్షి, ఒంగోలు : పట్టణంలోని గోపాల్‌నగర్‌లో ఉద్రికత్త చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారం కారణంగా ఓ యువకుడు మృతి చెందాడు. ప్రేమిస్తున్నానని చెప్పి నిన్న (శనివారం) ఓ ఇంటి ఎదుట అవినాష్‌రెడ్డి ఆందోళన చేశాడు. ఆదివారం ఉదయం తిరుపతమ్మ గుడివద్ద మృతిచెంది ఉన్నాడు. యువతి బంధువులే అవినాష్‌ను హత్యచేసి ఉంటారని అతని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రేమించిన యువతి దక్కదనే కారణంగా యువకుడు ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
332 కేజీల భారీ సమోసాను చూశారా!
-
332 కేజీల భారీ సమోసాను చూశారా!
గోరక్ పూర్: భారతీయుల ప్రియమైన చిరుతిండి(స్నాక్)గా సమోసా.. మరే ఇతర వంటకానికి అందనంత ఎత్తుకు ఎదిగింది. గల్లీ నుంచి ఢిల్లీ దాకా స్నాక్స్ సెంటర్లలో సమోసాలకు విపరీతమైన గిరాకి. సమోసాకు దక్కిన ఆ క్రేజ్ ను ఇంకాస్త పెంచడంతోపాటు తమకు కూడా ప్రచారం లభిస్తుందన్న ఉద్దేశంతో ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ యువకుల బృందం 332 కిలోల భారీ సమోసాను తయారుచేసింది. మహారాజ్ గంజ్ జిల్లాలోని గోపాల్ నగర్ కాలనీకి చెందిన రితేశ్ సోని.. ఇంటర్ పూర్తిచేసి సొంత ఊళ్లోనే చిన్నపాటి సమోసాల దుకాణం నడుపుతున్నాడు. గిరాకిని పెంచుకోవడానికి కొత్తగా ఏం చేయాలా? అని ఆలోచిస్తోన్న క్రమంలో 'పెద్ద సమోసా' ఐడియా తట్టింది. ఇంటర్నెట్ లో సెర్చ చేయగా.. ఇంగ్లాడ్ లోని బ్రాడ్ ఫోర్డ్ కాలేజీ విద్యార్థులు రూపొందించిన 110 కేజీల సమోసాదే రికార్డని తెలిసింది. దానికంటే పెద్ద సమోసచేసి గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కాలనుకున్న రితేశ్.. స్నేహితుల సహాయంతో పని మోదలుపెట్టాడు. 90లీటర్ల రిఫైన్డ్ ఆయిల్, 1.75 క్వింటాల గోధుమపిండి, రెండు క్వింటాల ఆలుగడ్డలు వినియోగించి 332 కేజీల భారీ సమోసాను తయారుచేశాడు. మూడు మీటర్ల ఎత్తు, రెండు మీటర్ల పొడవు, రెండు మీటర్ల ఎత్తున్న ఈ సమోసాను రూపొందించేందుకు రూ.40 వేలు ఖర్చయ్యాయని రితిశ్ చెప్పాడు. 15 రోజుల సన్నాహక కార్యక్రమాల అనంతరం మంగళవారం ఉదయానికి సమోసా సిద్ధమైందని, గిన్నిస్ రికార్డు అధికారులకు సమాచారం అందించామని పేర్కొన్నాడు. ఇది 'ప్రపంచంలో అతిపెద్ద సమోసగా' గుర్తింపు పొందాలని రితేశ్ బృందానికి ఆల్ ది బెస్ట్ చెబుదామా!