గోపాలపురంలో గోపీచంద్, సింధు
గోపాలపురం(రావులపాలెం) :
రావులపాలెం మండలం గోపాలపురంలో ఉన్న పాకలపాటి గురుదేవులు(శ్రీబాబు) ఆశ్రమాన్ని గురువారం ఇండియ¯ŒS బ్యాడ్మింట ¯ŒS చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, ఒలింపిక్ రజిత పతక విజేత పీవీ సింధు సందర్శించారు. బాబావారిని కలసి, ఆశీర్వా దం పొందారు. వీరి వెంట సింధు తండ్రి అర్జున వార్డు గ్రహీత పీవీ రమణ కూడా ఉన్నారు. వీరంతా కొద్దిసేపు ఆశ్రమంలో గడిపారు. ఏదైనా అంతర్జాతీయ పోటీలకు వెళ్లేముందు గోపీచంద్ గోపాలపురం బాబాను కలుస్తుంటారని, ఈసారి కూడా సింధుతో కలసి వచ్చారని తెలిసింది.