gorge in Himachal
-
ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది మృతి
హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చంబా జిల్లాలోని తీసా సబ్ డివిజన్ వద్ద బుధవారం ప్రైవేటు బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. చంబా నుంచి తీసాకు వెళ్తున్న బస్సు చంబా-ఖజ్జియార్ రహదారిపై ప్రమాదానికి గురైంది. మూల మలుపు వద్ద బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో అదుపు తప్పిందని తెలుస్తోంది. దీంతో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. మరో ఇద్దరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా చనిపోయారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 16 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. బస్సు లోయలో పడిందన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చంబాలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ ప్రమాదంపై హిమాచల్ ముఖ్యమంత్రి జయరాం ఠాగూర్ స్పందించారు. ఈ దుర్ఘటనకు గల కారణాలపై పూర్తి దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు. కాగా చాంబా జిల్లాలో తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. గత ఏడాది మార్చి నెలలోనూ హిమాచల్ ప్రదేశ్ రోడ్డు రవాణ సంస్థకు చెందిన బస్సు లోయలో పడి ఐదుగురు ప్రయాణికులు మరణించారు. -
హిమాచల్‌లో ఘోర బస్సు ప్రమాదం
సిమ్లా: కర్నాటకలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 30 మంది మరణించిన ఘటన మరువకముందే హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం సిర్మౌర్‌లో ఓ ప్రైవేటు బస్సు అనూహ్యంగా అదుపుతప్పి జలాల్ వంతెనపై నుంచి నదిలో పడడంతో 9 మంది ప్రయాణికులు మరణించారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోందని అడిషనల్ ఎస్పీ వీరేంద్ర సింగ్ ఠాకూర్ చెప్పారు. కాగా, ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రైవేటు బస్సు శ్రీ రేణుకాజీ ప్రాంతం నుంచి నాహాన్‌కు వెళుతున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగిందని తెలిసింది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన వారిని నాహాన్ మెడికల్ కళాశాల ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది. -
లోయలో పడిన బస్సు : 17 మంది మృతి
హిమాచల్‌ప్రదేశ్ సిమౌర్ జిల్లా మైలా గ్రామ సమీపంలో బుధవారం బస్సు లోయలో పడింది. ఆ దుర్ఘటనలో 17 మంది ప్రయాణికులు మరణించగా, 21 మంది తీవ్రంగా గాయపడ్డారని జిల్లా ఎస్పీ సుమేథా వెల్లడించారు. క్షతగాత్రులను సమీపంలోని పొనాట సాహిబ్ ఆసుపత్రికి తరలించి ప్రాధమిక చికిత్స అందించామని తెలిపారు. అనంతరం వారని మెరుగైన వైద్య చికిత్స కోసం షిల్లై ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. అయితే క్షతగాత్రులలో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉందని... చంఢీగఢ్లోని పీజీఐ ఆసుపత్రికి వారిని తరలించాలని వైద్యులు సూచించారని, ఈ నేపథ్యంలో అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రమాద ఘటనలో ఏడుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు ఆసుపత్రికి తరలిస్తుండగా.... ఇంకో ఎనిమిది మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారని వెల్లడించారు. బస్సు మిలా నుంచి పనోటా వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని ఎస్పీ సుమేధా వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. బస్సు ప్రమాద ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.