జులన్, సుకన్య ఔట్
న్యూఢిల్లీ: ఐసీసీ మహిళల ప్రపంచ కప్ క్వాలిఫయర్స్‌కు ముందు భారత జట్టుకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే అగ్రశ్రేణి బ్యాట్స్‌విమన్ స్మృతి మందన దూరం కాగా, తాజాగా సీనియర్ బౌలర్ జులన్ గోస్వామి గాయం కారణంగా జట్టునుంచి తప్పుకుంది. జులన్‌తో పాటు సుకన్య పరీదాలను కూడా టీమ్‌నుంచి తొలగించారు.
14 మంది సభ్యుల జట్టులోకి ఎంపికైన తర్వాత వీరిద్దరు పూర్తి ఫిట్‌గా లేరని డాక్టర్లు నిర్ధారించడంతో మార్పు అనివార్యమైంది. గోస్వామి స్థానం లో సోని యాదవ్, పరీదా స్థానంలో మాన్సి జోషిలను జట్టులోకి తీసుకున్నారు.