goutam reddy
-
రైతులకు ఉపయోగపడే విధంగా సీఎం నిర్ణయం
సాక్షి, విశాఖపట్నం: తాండవ షుగర్ ఫ్యాక్టరీలో మంగళవారం మంత్రులబృందం రైతులతో సమావేశమయ్యింది. తాండవ షుగర్ ఫ్యాక్టరీపై రైతుల అభిప్రాయాలను మంత్రుల బృందం అడిగి తెలుసుకుంది. అనంతరం మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ, ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతుల పక్షపాతి. సీఎం జగన్ చంద్రబాబులాగా ఎన్నికల కోసం పనిచేయరు. షుగర్ పరిశ్రమల్లో స్థితిగతులు ప్రత్యక్షంగా తెలుసుకోమని సీఎం కమిటీ వేశారు. రైతులకు నష్టం చేయడం కోసం కమిటీ వేయలేదు. మీరు చెప్పిన అభిప్రాయాలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం. అందరికి మేలు జరిగే నిర్ణయం సీఎం జగన్ తీసుకుంటారు’ అని వెల్లడించారు. అనంతరం పరిశ్రమల శాఖ మంత్రి గౌతం రెడ్డి మాట్లాడుతూ, ‘ రాష్ట్రంలో 12 షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. రైతులకు ఉపయోగపడే విధంగా నిర్ణయం తీసుకోమని సీఎం చెప్పారు. రైతులకు సీఎం జగన్ మేలు చేస్తారు. రైతులకు మేలు జరగాలన్నదే సీఎం జగన్ ఉద్దేశం’ అని తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ, ‘నాన్న ఒక అడుగు ముందుకు వేస్తే నేను రెండు అడుగులు ముందుకు వేస్తానని సీఎం జగన్ చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో రైతులకు అన్యాయం జరిగింది. రైతులకు మంచే జరుగుతుంది. మీ అభిప్రాయాలను సీఎం జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తాం’ అని పేర్కొన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, ‘వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి ఉన్నపుడు రైతులకు మేలు జరిగింది. రైతులకు సీఎం జగన్ ఏం చేశారో, చంద్రబాబు ఏం చేశారో అందరికి తెలుసు. రైతుల అభిప్రాయాలన్నింటిని సీఎం దృష్టికి తీసుకువెళ్తాం. రైతులకు మేలు చేయాలన్నదే సీఎం జనగ్ ఆలోచన. టీడీపీ హయాంలో చెరుకు రైతులకు బకాయి ఉన్న రూ.54 కోట్లును సీఎం జగన్ విడుదల చేశారు’ అని చెప్పారు. ఎంపీ వంగ గీత మాట్లాడుతూ, ‘ షుగర్ పరిశ్రమల స్థితిగతులు తెలుసుకోవాలని సీఎం కమిటీ వేశారు. నష్టం వస్తే ఎలా ముందుకు తీసుకువెళ్లాలనే దానిపై కమిటి చర్చిస్తోంది. చరిత్రలో ఎన్నడూలేని విధంగా చెరుకు రైతులకు బకాయిలు చెల్లించారు. రైతులకు మేలు జరగేలా మంత్రుల కమిటీ నిర్ణయం ఉంటుంది’ అని అన్నారు. చదవండి: ప్రధాని మోదీతో ముగిసిన సీఎం జగన్ భేటీ -
ఆర్టీసీని టీడీపీ నిర్వీర్యం చేస్తోంది
విజయవాడ: కార్మిక వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ఆర్టీసీని కూడా నిర్వీర్యం చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయని వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు పి.గౌతంరెడ్డి విమర్శించారు. లాభాలు లేవనే ఉద్దేశంతో ఆర్టీసీని మూసివేయాలని చూస్తున్నారని, కేశినేని నాని బస్సులను ఇందులో హైర్ బస్సులుగా ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారని ఆరోపించారు. ఆర్టీసీలోని ఏఎన్ఎల్ పార్శిల్ సర్వీసు భారీ లాభాలలో ఉంటే అది ప్రభుత్వానికి రూ.9 కోట్లే చెల్లిస్తున్నదన్నారు. ఈ పార్శిల్ సర్వీస్ కాంట్రాక్టు ఈ ఏడాదితో ముగుస్తున్నా దాన్ని కొనసాగించేందుకు పాలకులు ప్రయత్నిస్తున్నారన్నారు. కార్మికుల ఆసుపత్రి కోసం ప్రతి కార్మికుని నుంచి నెలనెలా రూ.100 లు వసూలు చేస్తున్నారని, అంటే ఏడాదికి వసూలయ్యే రూ.7 కోట్లు డబ్బు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. పని గంటలను సడలిస్తూ స్ల్పిట్ డ్యూటీల పేరుతో ఎవరితోనూ చర్చలు జరపకుండా విజయవాడ విద్యాధరపురం డిపోనుంచి ప్రారంభిస్తున్నారని, దీంతో కార్మికులు సమ్మెలు చేస్తారని సాకుగా చూపి ఆర్టీసీని నిర్వీర్యం చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం వ్యవహరిస్తోందంటూ ఆర్టీసీ ఆస్తులను ప్రభుత్వ పెద్దలు ప్రైవేటు వారికి కట్టబెడుతున్నారని గౌంతరెడ్డి అన్నారు. -
ఆర్టీసీని టీడీపీ నిర్వీర్యం చేస్తోంది
-
వైఎస్ వర్ధంతి సందర్భంగా ఉల్లిపాయల పంపిణీ
దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరో వర్ధంతిని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. పలు జిల్లాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించారు. పలుచోట్ల ఆస్పత్రుల్లో ఉన్న రోగులకు పళ్లు పంపిణీ చేశారు. అయితే విజయవాడలో మాత్రం ఆయన అభిమానులు కాస్త విభిన్నంగా ఆలోచించారు. ప్రస్తుతం ప్రజలకు అత్యంత అవసరంగా ఉండి, ఏమాత్రం అందుబాటులో లేకుండా పోయిన ఉల్లిపాయలు అందిస్తే బాగుంటుందని భావించారు. దాంతో, విజయవాడ సీతారాపురం కొత్త వంతెన వద్ద ఉల్లిపాయల పంపిణి చేశారు. స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు మానం వెంగయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్ రెడ్డి చేతుల మీదుగా ఉల్లిపాయల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. -
తెలంగాణలో నేరం చేసి ఏపీలో దాక్కుంటారా?
విజయవాడ: టీడీపీ దొంగల పార్టీ అని, హైదరాబాద్లో నేరం చేసి ఆంధ్రప్రదేశ్లో దాక్కుంటున్నారని వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతంరెడ్డి ధ్వజమెత్తారు. విజయవాడలోని తన కార్యాలయంలో గౌతంరెడ్డి శనివారం విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు ఏడాది పాలనను దోపిడీ పాలనగా అభివర్ణించారు. జీవో నంబరు 22 ద్వారా పారిశ్రామికవేత్తలకు రూ. 2,070 కోట్లు, గ్యాస్ బేస్డ్ విద్యుత్ కేంద్రాలకు రాయితీల పేరిట రూ. 2,500 కోట్లు, పట్టిసీమ ద్వారా రూ.600 కోట్ల కమీషన్ దోపిడీ జరిగిందన్నారు. ఇవికాకుండా 10 వేల ఎకరాల భూమిని సింగపూర్ సంస్థకు ఇచ్చి లక్షల కోట్లలో దోపిడీకి తెరలేపారని దుయ్యబట్టారు. ఓటుకు కోట్లు కేసు నుంచి బయట పడేందుకు టీఆర్ఎస్ నాయకుల కాళ్లు పట్టుకునే స్థాయికి టీడీపీ నేతలు దిగజారారని ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలోనే జరిగిన కృష్ణాజలాల అథారిటీ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం 299 టీఎంసీల కృష్ణా నీటిని ఎక్కడ కావాలంటే అక్కడ వాడుకోవడానికి అంగీకరించారని చెప్పారు. దీనివల్ల రాయలసీమ, కృష్ణాడెల్టాకు నీరు రాదని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే కర్ణాటక, మహారాష్ట్రలు మన రాష్ట్రానికి నీరందకుండా ప్రాజెక్టులు నిర్మించాయని, దీనివల్ల రైతాంగానికి తీరని ద్రోహం చేశారని గుర్తుచేశారు. కేసుల నుంచి బయటపడడానికి తెలంగాణ ప్రభుత్వం ముందు మోకరిల్లిన చంద్రబాబు రైతాంగానికి మళ్లీ ద్రోహం చేశారన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి తన నిజాయితీ నిరూపించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.