government fraud
-
దగా పడ్డ రైతన్న
పరిహారం.. మాయాజాలం - ఇష్టారాజ్యంగా వాతావరణ బీమా వర్తింపు - ప్రకటించిన మొత్తం కన్నా తక్కువగా బ్యాంకుల్లో జమ - సమాధానం చెప్పే అధికారులు కరువు - చేతులెత్తేస్తున్న బ్యాంకర్లు - కార్యాలయాల చుట్టూ అన్నదాతల చక్కర్లు వాతావరణ బీమా పథకం మాయాజాలంలో రైతులు దారుణంగా మోసపోతున్నారు. చంద్రబాబు సర్కారు రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకోవడమే తప్పిస్తే.. కరువు రైతు కన్నీళ్లు తుడిచే విషయంలో ఎలాంటి కనికరం చూపని పరిస్థితి. ఈ విషయంలో అధికార పార్టీ నేతలు కూడా అన్నదాతకు అండగా నిలిచే ప్రయత్నం చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. అనంతపురం అగ్రికల్చర్: వ్యవసాయ శాఖ.. లీడ్ బ్యాంకు.. జిల్లా అధికార యంత్రాంగం.. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తుండటం రైతులకు శాపంగా మారింది. వాతావరణ బీమా పరిహారం పంపిణీ విషయంలో చోటు చేసుకుంటున్న పొరపాట్లు అన్నదాతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. బొమ్మనహాల్, పామిడి, పెద్దవడుగూరు, పుట్లూరు, కనగానపల్లి, గోరంట్ల, బత్తలపల్లి.. ఇలా 40 నుంచి 45 మండలాల్లో ప్రకటించిన మొత్తం కన్నా తక్కువ పరిహారం రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఇదేమంటే.. ఎంత వచ్చిందో అంతే జమ చేశామంటూ బ్యాంకర్లు చేతులెత్తేస్తున్నారు. బీమా పథకం ఎంత లోపభూయిష్టంగా అమలవుతుందనేది గత ఆరేళ్లుగా మంజూరైన పరిహారాన్ని చూస్తే అర్థమవుతోంది. బజాజ్ అలయెంజ్ కంపెనీ నుంచి మండలాల వారీగా వాతావరణ బీమా పరిహారం మంజూరు జాబితాను జూన్ 18న వ్యవసాయశాఖ అధికారులు విడుదల చేశారు. ఆ ప్రకారం 5,07,658 మంది రైతులకు రూ.419.05 కోట్ల పరిహారం మంజూరయింది. రైతుల వాటాతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా కింద బజాజ్ కంపెనీకి ప్రీమియం కింద రూ.280 కోట్లు జమ అయ్యాయి. గతేడాది తీవ్ర వర్షాభావం వల్ల 80 నుంచి 90 శాతం మేర పంట నష్టం జరిగినట్లు అధికారిక నివేదికలు స్పష్టం చేస్తున్నా.. బీమా పథకం కింద కేవలం రూ.419 కోట్లు ఇవ్వడంపై రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కనీసం ప్రకటించిన మొత్తమైనా ఇచ్చారా అంటే అదీ లేదు. చాలా మండలాల్లో రైతులకు అత్తెసరు పరిహారం జమ అవుతోంది. అత్యధికంగా గోరంట్ల మండలంలో 9,684 మంది రైతులకు రూ.20.45 కోట్లు ఇచ్చారు. ఇక్కడ హెక్టారుకు రూ.14,633 వర్తింపజేశారు. అంటే ఎకరాకు రూ.5,853 ప్రకారం రైతులకు జమ చేయాలి. అత్యల్పంగా వచ్చిన చెన్నేకొత్తపల్లి మండలాన్ని తీసుకుంటే ఇక్కడ హెక్టారుకు రూ.1,679 అంటే ఎకరాకు రూ.670 ప్రకారం వర్తింపజేశారు. అగళి, అమరాపురం, బొమ్మనహాల్, చిలమత్తూరు, గోరంట్ల, హిందూపురం, కదిరి, కంబదూరు, నల్లచెరువు, నల్లమాడ, ఓడీ చెరువు, పరిగి, పుట్టపర్తి, రొళ్ల, తలుపుల, తనకల్లు తదితర 23 మండలాల రైతులకు కొంత బాగానే పరిహారం ఇచ్చినట్లు కనిపిస్తున్నా.. మిగతా 40 మండలాలకు ముష్టి వేసినట్లు దారుణమైన పరిహారం వర్తింపజేయడం గమనార్హం. ఫిర్యాదు చేస్తే న్యాయం తక్కువ పరిహారం జమ చేస్తున్నట్లు ఇప్పటి వరకు ఎవ్వరూ ఫిర్యాదు చేయలేదు. బీమా కంపెనీ నుంచి విడతల వారీగా పరిహారం జమ కావడం వల్ల రైతుల ఖాతాల్లో వేయడానికి కొంత ఆలస్యమవుతోంది. ఫిర్యాదులు వస్తే పరిశీలించి న్యాయం చేస్తాం. - ఎల్.జయశంకర్, ఎల్డీఎం -
కోర్టుకు లాగారు!
డ్వాక్రా మహిళలకు సర్కార్ మోసం రుణమాఫీ పేరుతో దగా చేసిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత చేతులెత్తిసిన వైనం మాఫీ అవుతుందనుకున్న మహిళలకు నిరాశ తేరుకునే లోపు కోర్టు నుంచి నోటీసులు గౌరవంగా బతుకుతున్న తమను బజారుకీడుస్తారా? ‘జీవనోపాధుల కోసం తీసుకున్న రుణాలను ఏ ఒక్కరూ చెల్లించకండి. టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే మీ రుణాలన్నీ మాఫీ చేస్తాను’ అంటూ ఎన్నికలకు ముందు మహిళా సంఘాలకు చంద్రబాబు ఇచ్చిన హామీలో డొల్లతనం బయటపడింది. అప్పటి వరకూ రుణాలు సక్రమంగా చెల్లిస్తూ వచ్చిన మహిళా సంఘాలు సైతం చంద్రబాబు హామీతో చెల్లింపులపై మిన్నకుండి పోయారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీపై పూటకోమాట మాట్లాడుతూ వచ్చిన సర్కార్... చివరకు మహిళలను కోర్టుకు లాగింది. తీసుకున్న రుణాలను నయాపైసాతో సహా చెల్లించాలంటూ కోర్టు ద్వారా పంపిన బ్యాంకర్లు నోటీసులతో మహిళలు ఒక్కసారిగా కుదేలయ్యారు. ఇంత కాలం గుట్టుచప్పుడు కాకుండా సంసారం నెట్టుకు వస్తున్న తమను బజారు కీడ్చారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. - ఉరవకొండ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఓ వెలుగు వెలిగిన మహిళా సంఘాలు.. చంద్రబాబు రుణమాఫీ మాయాజాలంలో చిక్కుకుని బ్యాంక్‌లలో డీఫాల్డ్ గ్రూపులుగా మారాయి. 2012 నుంచి 2014 వరకూ ఉరవకొండ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 4,567 మహిళా సంఘాల్లోని 46,107 మంది సభ్యులకు జీవనోపాధుల కోసం ప్రభుత్వాలు రుణాలు మంజూరు చేశాయి. వీటి కంతులను సకాలంలో ఆయా మహిళా సంఘాలు చెల్లిస్తూ వచ్చాయి. సంఘానికి రూ. 10 వేల ప్రకారం రెండు విడతలుగా రూ. 30.18 కోట్ల పెట్టుబడి నిధిని బ్యాంకర్లు మంజూరు చేయగా... వీటిలో అత్యధిక శాతాన్ని మహిళా సంఘాలు చెల్లించాయి. ప్రస్తుతం బ్యాంక్‌లకు మహిళా సంఘాలు రూ. 14.90 కోట్లు బకాయి ఉన్నట్లు తెలుస్తోంది. ఇది కూడా రుణమాఫీ ప్రకటనతో నిలిచిపోయిన సొమ్ము కావడం గమనార్హం. అధికారం దక్కించుకోవడంలో భాగంగా మహిళా సంఘాలను మభ్యపెట్టి కంతులు చెల్లించకుండా అప్పట్లో చంద్రబాబు నిలువరించి ఉండకపోయి ఉంటే ఈ బకాయి కూడా ఉండేది కాదని పలువురు ఈ సందర్భంగా పేర్కొంటున్నారు. తీసుకున్న రుణాలు చెల్లించాల్సిందే తీసుకున్న రుణాలను చెల్లించాలంటూ కోర్టు ద్వారా వందలాది మహిళా సంఘాలకు బ్యాంకర్లు నోటీసులు జారీ చేశారు. ఉరవకొండ, వజ్రకరూరు, విడపనకల్లు మండలాలకు చెందిన 670 మహిళా సంఘాలకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్‌ల నుంచి ఈ నోటీసులు జారీ అయ్యాయి. దీంతో మహిళా సంఘాల సభ్యుల్లో గగ్గోలు మొదలైంది. ఏనాడూ కోర్టు మెట్టు ఎక్కని మహిళలు... న్యాయస్థానంపై గౌరవంతో రెండ్రోజుల క్రితం కోర్టుకు హాజరయ్యారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ హామీని నమ్మి తాము మోసపోయామంటూ కన్నీటి పర్యాంతమయ్యారు. వడ్డీతో రుణాలు చెల్లించలేమని, అసలు మాత్రమే చెల్లిస్తామని, ఇందుకు నెల రోజుల గడవు తీసుకుని వచ్చారు. రుణమాఫీ అయివుంటే తమకు ఆర్థికంగా కొంత ఉపశమనం దొరికేదని, అయితే ముఖ్యమంత్రి తమను ఇలా దగా చేస్తారని ఊహించలేదంటూ ఈ సందర్భంగా పలువురు మహిళలు వాపోయారు. అవమానపరిచారు రుణాలు చెల్లించాలంటూ బ్యాంకు అధికారులు కోర్టు ద్వారా నోటీసులు పంపి మమ్మల్ని అవమానపరిచారు. సంఘంలో మొత్తం 10 మంది రోజూ కూలీలుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాం. చంద్రబాబు రుణమాఫీ చేయకపోవడంతో ఒక్కసారిగా వడ్డీ భారం పెరిగిపోయింది. దీంతో రుణం చెల్లించలేని దుస్థితి నెలకొంది. - ముత్యాలమ్మ,, షెక్షానుపల్లి సీఎం సమాధానం చెప్పాలి రుణమాఫీ చేస్తానంటూ హమీ ఇచ్చిన సీఎం సార్ సమాధానం చెప్పాలి. ఆయన చెప్పిన మాట విని మేము డబ్బు కట్టలేదు. అయినా రుణాలు మాఫీ చేయడం చేతకానప్పుడు ఎందుకు హమీ ఇవ్వాలి? మమ్మల్ని బజారుకీడ్చడానికా? - రామాంజినమ్మ, షెక్షానుపల్లి -
అదనులో అందేనా?!
జూన్ 2 నుంచి ఇన్పుట్ సబ్సిడీ పంపిణీ చేస్తామని ప్రభుత్వ ప్రకటన ఇప్పటి వరకూ జిల్లాకు చేరని పరిహారం వివరాలు రూ.1,032.69 కోట్లతో ప్రతిపాదనలు పంపిన అధికారులు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోంది రూ.82.34 కోట్లు మాత్రమే ఇన్పుట్, ఇన్సూరెన్స్‌కు ముడిపెట్టి రైతులకు అన్యాయం! ప్రభుత్వ మోసపూరిత చర్యలతో అన్నదాతలకు రూ.434 కోట్ల మేర నష్టం ముందస్తు వర్షాలతో రైతులు సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఇదే తరుణంలో పెట్టుబడి కోసం అవస్థలు పడుతున్నారు. వారికి హక్కుగా దక్కాల్సిన ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీని ప్రభుత్వం ఇప్పటి వరకూ అందజేయలేదు. ఖరీఫ్‌లో రైతులు పంటసాగుకు సిద్ధమయ్యేలోపు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని ఇటీవల పామిడి సభలో సీఎం చంద్రబాబు ప్రకటించారు. కానీ ఇప్పటికీ అతీగతీ లేదు. పైగా అధికారులు రూ.1,032.69 కోట్లతో ఇన్‌పుట్‌సబ్సిడీ ప్రతిపాదనలు పంపగా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేవలం రూ.82.34 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకోనుంది. గడిచిన ఖరీఫ్(2016)లో జిల్లా రైతులు 6.07 లక్షల హెక్టార్లలో వేరుశనగ సాగు చేశారు. ఎకరాకు రూ.18 వేల చొప్పున వెచ్చించారు. వర్షాభావం కారణంగా పంట తుడిచిపెట్టుకుపోయింది. పెట్టుబడులు, దిగుబడుల రూపంలో దాదాపు రూ.3 వేల కోట్ల మేర నష్టం వాటిల్లింది. అలాగే కంది, జొన్న, పత్తి తదితర పంటల ద్వారా మరో రూ.700 కోట్ల మేర నష్టపోయారు. మొత్తమ్మీద రైతులకు రూ.3,700 కోట్ల మేర నష్టం వాటిల్లింది. అధికారులు నష్టం వివరాలను తెప్పించుకుని రూ.1,070 కోట్లతో ప్రాథమిక నివేదికను సిద్ధం చేశారు. చివరకు రూ.1,032.69 కోట్లతో తుది నివేదికను ప్రభుత్వానికి పంపారు. ఇందులో రూ.516.345 కోట్లను కేంద్రం కేటాయించింది. రాష్ట్రం కూడా ఈ మేరకు కేటాయించాలి. కానీ రూ.82.34 కోట్లను మాత్రమే ఇస్తోంది. తక్కిన రూ.434 కోట్లను ఇన్సూరెన్స్ ద్వారా వచ్చే సొమ్ము ఇన్çపుట్‌సబ్సిడీ లెక్కల్లో కలిపి అందజేయనుంది. ఈ మోసపూరిత చర్యతో రైతులకు రూ.434కోట్ల మేర నష్టం వాటిల్లుతోంది. వాతావరణ బీమా కింద వేరుశనగకు రూ.367 కోట్లు, ఇతర పంటలకు రూ.67కోట్లు మంజూరైంది. ఈ సొమ్ముపై ప్రభుత్వానికి ఎలాంటి హక్కూ లేదు. అయినా ఇన్పుట్లో కలిపేసి రైతులను దగా చేస్తోంది. దీనివల్ల 6,25,050 మంది వేరుశనగ, 3,635 మంది ఇతర పంటలు సాగు చేసిన రైతులకు అన్యాయం జరగనుంది. చరిత్రలో తొలి మోసం ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ మంజూరులో వేటికవే లెక్కలు కట్టి ప్రభుత్వాలు రైతులకు అందజేసేవి. చరిత్రలో తొలిసారిగా రైతులకు, బీమా కంపెనీకి మాత్రమే సంబంధించిన ఇన్సూరెన్స్ వ్యవహారంలో ప్రభుత్వం తలదూర్చింది. తనకు ఏమాత్రమూ సంబంధం లేని సొమ్మును సొంతమన్నట్లు భావించి రైతులను దగా చేస్తోంది. ఎకరాకు రూ.6 వేల ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే.. ఈ మొత్తాన్ని ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ రెండింటినీ కలిపి లెక్కగట్టి ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇలా అసంబద్ధ విధానాలతో రైతులను మోసం చేస్తున్న మొట్టమొదటి ప్రభుత్వం ఇదే! ఖరీఫ్ మొదలైనా... ఏప్రిల్‌లో పామిడికి విచ్చేసిన చంద్రబాబు ఖరీఫ్ మొదలయ్యేలోపు పరిహారాన్ని రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే ఖరీఫ్ పనులు మొదలయ్యాయి. రైతులు పంటల సాగుకు ఉపక్రమిస్తున్నారు. ఈ నెల మొదటి నుంచి బ్యాంకర్లు పంట రుణాలను ఇస్తున్నారు. రైతులు విత్తనకాయలు కొనుగోలు చేస్తున్నారు. కళ్యాణదుర్గంతో పాటు పలుచోట్ల పొలాల్లో విత్తు కూడా వేస్తున్నారు. కానీ ఇప్పటి వరకూ ఇన్‌పుట్‌సబ్సిడీ, ఇన్సూరెన్స్ రైతులకు అందలేదు. నిజానికి గతేడాది అక్టోబరు 10లోపే ఇన్సూరెన్స్ సొమ్మును రైతులకు అందజేయాలి. ఈ సొమ్మును బజాజ్ అలయంజ్ కంపెనీ అక్టోబరులోనే జమ చేసినట్లు తెలుస్తోంది. పంపిణీ చేయకుండా ప్రభుత్వమే పెండింగ్‌లో పెట్టినట్లు సమాచారం. దీంతో పాటు గతేడాది ఖరీఫ్ ఇన్పుట్ సబ్సిడీని ఇప్పటికీ ఇవ్వకపోవడం శోచనీయం. జూన్ 2 నుంచి పంపిణీ చేస్తామని ఇటీవల ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. కానీ మొదటి విడతలో ఎంత మొత్తాన్ని, ఎంతమంది రైతులకు ఇవ్వబోతున్నారు? ఎప్పటిలోగా జమ చేస్తారనే వివరాలను వెల్లడించలేదు. కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమైన రైతులు ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్‌కు లంకెపెట్టి పరిహారం పంపిణీ చేస్తే వెంటనే పూర్తి ఆధారాలతో కోర్టును ఆశ్రయించేందుకు రైతులు సిద్ధమయ్యారు. రూ.1,032 కోట్లతో అధికారులు పంపిన నివేదికలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా, ఇన్సూరెన్స్ సొమ్మును ఇందులో కలపడం వంటి రికార్డులను పూర్తిస్థాయిలో సేకరించి హైకోర్టును ఆశ్రయిస్తామని పలువురు రైతులు ‘సాక్షి’తో తెలిపారు. వ్యవసాయాధికారులు, జిల్లా కీలక అధికారులు, ప్రభుత్వాన్ని కేసులో చేరుస్తామని చెబుతున్నారు.