Government land kabja
-
టీడీపీ హయంలో ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన గీతం వర్సిటీ
-
హద్దులు దాటిన ఆక్రమణ.. 136 కోట్ల సర్కార్ భూమికి ఎసరు!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ప్రభుత్వ భూములకు రక్షణ కల్పించాల్సిన ప్రజాప్రతినిధులే వాటి ఆక్రమణలకు పాల్పడుతున్నారు. మున్సిపల్ కార్పొరేషన్, హెచ్ఎండీఏ ఇతర ప్రభుత్వ సంస్థల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా భూమిని ప్లాట్లుగా మార్చి.. హద్దురాళ్లు నాటి అమ్మకానికి పెట్టారు. అధికార పార్టీకి చెందిన ఓ కార్పొరేటర్ భర్త ఈ భూ ఆక్రమణలో ప్రధాన పాత్రదారుగా ఉండటంతో స్థానిక మున్సిపాలిటీ టౌన్‌ప్లానింగ్ అధికారులు, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. విలువైన స్థలాలు అన్యాక్రాంతమవుతున్నా.. అధికారులు కిమ్మనకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రూ.156 కోట్ల భూమిపై కన్ను రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం కుర్మల్‌గూడ రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 80/1లో 5.32 ఎకరాలు, సర్వే నం. 80/2లో 7.07 ఎకరాలు సర్కారు భూమిగా నమోదైంది. దీనిని ఆనుకుని ఉన్న సర్వే నంబర్ 80/3లోని 4.23 ఎకరాల భూమి ప్రభుత్వం మోడల్ గ్రేవీ యార్డ్ (క్రిస్టియన్ శ్మశాన వాటిక)కు, సర్వే నం. 80/19లోని 10.27 ఎకరాల భూమిని మోడల్ గ్రేవీ యార్డ్ (ముస్లిం శ్మశాన వాటిక)గా నమోదై ఉంది. భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ధరణి’ వెబ్సైట్లోనూ ఇదే స్పష్టం చేస్తోంది. బహిరంగ మార్కెట్లో ఈ 13 ఎకరాల విలువ రూ.156 కోట్ల పైమాటే. విలువైన ఈ ప్రభుత్వ భూములపై బడంగ్పేట్ నగరపాలక సంస్థ పరిధిలోని అధికార పారీ్టకి చెందిన ఓ కార్పొరేటర్ భర్త కన్నేశారు. వీటిపై తమకే హక్కులు ఉన్నాయని పేర్కొంటూ ఆక్రమణలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే సర్వే నం. 80/1లోని కొంత భూమిని ఆక్రమించారు. ఆ భూమిని చదును చేశారు. ప్లాట్లుగా చేసి అమ్మకానికి రంగం సిద్ధం చేశారు. మూడు ఎకరాలు గుర్తించాం ప్రభుత్వ భూములను ఆక్రమించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. సర్వే నం. 80/1, 80/2లోని ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనట్లు ఫిర్యాదు కూడా అందింది. గురువారం ఉదయం ఆర్ఐ సహా ఇతర సిబ్బంది క్షేత్రస్థాయికి చేరుకుని పరిశీలించారు. మూడు ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైనట్లు గుర్తించి, ఆ మేరకు జేసీబీతో నాటిన హద్దు రాళ్లను కూడా తొలగించాం. ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ ఓ బోర్డును కూడా నాటించాం. ఈ భూములను ఎవరు ఆక్రమించారనే అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు. వచి్చన వెంటనే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తాం. – జనార్దన్, తహసీల్దార్, బాలాపూర్ -
అయ్యన్న పాత్రుడు ఇంటి ముందు టీడీపీ నాయకుల డ్రామా
-
కుప్పంలో టీడీపీ నేత బరి తెగింపు..
సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీకి చెందిన మైనింగ్ మాఫియా బరి తెగించింది. అనుమతులు ఉండవు.. నిబంధనలు పాటించరు.. చేసే దంతా దందానే.. అడ్డు చెప్పే వారి మీద దాడులు.. ఇది చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో పచ్చ నేతల బరితెగింపు.. అక్రమంగా మైనింగ్ నిర్వహించడమే కాకుండా పేదలకు మంజూరు చేసిన ఇండ్ల స్థలాలను సైతం దర్జాగా ఆక్రమించి, అడ్డు వస్తున్న వారిపై దాడులకు పాల్పడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు అండతో రెచ్చిపోయిన పచ్చ నేతలు ఇప్పుడు కూడా బరి తెగింపుకు పాల్పడుతున్నారు. శాంతిపురం మండలంలో టీడీపీకి చెందిన నేత మైనింగ్ మాఫియా అవతారం ఎత్తారు. ముళ్ళూరు కృష్ణాపురంలో టీడీపీకి చెందిన జయరామి రెడ్డి చాలా సంవత్సరాలు గా మైనింగ్ నిర్వహిస్తున్నారు. తనకు గ్రామంలోని సర్వే నెంబర్ 11/4 లో 3.54 ఎకరాల్లో మైనింగ్ కు అనుమతి ఉందని చెప్పు కొంటాడు.. అది కూడా అనుమానమే. అయితే ఆస్థలం ప్రభుత్వ ఆసుపత్రి కి కేటాయించాలని దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో నిర్ణయించారు.. అయిన ఇప్పటికి టీడీపీ నేత ఆస్థలంలో అక్రమంగా మైనింగ్ నిర్వహిస్తున్నారు. గత టీడీపీ పాలనలో ఏకంగా పది ఎకరాలు ఆక్రమించి మైనింగ్ నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఆ స్థలంలో తమకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని స్థానిక పేదలు.. అధికారులను కోరారు.. దీంతో 28 మందికి అధికారులు ఇంటి స్థలాలు కేటాయించారు.. చదును కార్యక్రమాలు కూడా చేస్తుండగా టీడీపీ నేత జయరామి రెడ్డి తన అనుచరులతో కలిసి అడ్డుకోవడంతో స్థానికులు ధర్నాకు దిగారు.. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ముళ్ళూరు కృష్ణాపురంలో పేదలకు ఇంటి స్థలాలు కేటాయించారని, కానీ కొందరు అడ్డుకొంటున్నారని శాంతిపురం ఎమ్మారో విజయలక్ష్మి అన్నారు. టీడీపీ నేత జయరామి రెడ్డి అక్రమంగా నిర్వహిస్తున్న క్వారీలో గతంలో ఇద్దరు కార్మికులు చనిపోయారు. అయిన పట్టించు కోలేదు.. ఇప్పుడు స్థానికులనే బెదిరిస్తూ దాడులకు ఉసి గొల్పుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇతడికి చంద్రబాబు కు ప్రధాన అనుచరుడు ఎమ్మెల్సీ గౌరవాని శ్రీనివాసులు అండదండలు ఎక్కువగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. -
ప్రభుత్వ భుములను కొట్టేసిన రెవెన్యూ సింబ్బంది
-
దీపం ఉండగానే.. ఇల్లు చక్కబెట్టుకున్న తమ్ముళ్లు!
టీడీపీ నేతలకు సర్కార్ భూములు మేతగా మారుతున్నాయి. గత ప్రభుత్వంలో అధికారం అడ్డు పెట్టుకుని సర్కార్ భూములు ఆక్రమించుకుని ఏకంగా చెరువులు తవ్వారు. అంతేకాకుండా మట్టి, ఇసుక విక్రయాలతో పాటు తవ్విన ఆ చెరువులను చేపల పెంపకానికి లీజుకిచ్చి అక్రమార్జనతో లక్షల రూపాయలు అప్పనంగా ఆర్జిస్తున్నారు. ఇదంతా అద్దంకి నియోజకవర్గం అద్దంకి, కొరిశపాడు మండలాల్లో యథేచ్ఛగా కొనసాగుతోంది. ఇంత జరుగుతున్నా అదంతా తమకేమీ తెలియదన్నట్లు అధికారులు వ్యవహరిస్తుడటం గమనార్హం. సాక్షి, అద్దంకి/మేదరమెట్ల: అధికారం అడ్డం పెట్టుకుని గత ప్రభుత్వ హయంలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. సర్కార్ భూములను సైతం ఆక్రమించుకుని చెరువులుగా మార్చారు. చెరువులు తవ్వే క్రమంలో వచ్చిన మట్టి, ఇసుకను వదలకుండా అమ్ముకుని రూ.లక్షలకు లక్షలు ఆర్జించి జేబులు నింపుకుంటున్నారు. అంతటితో ఆగకుండా చెరువులను చేపల పెంపకానికి లీజుకిచ్చి మరీ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ తరహా ఆర్జన అద్దంకి, కొరిశపాడు మండలాల్లో యథేచ్ఛగా ఇప్పటికీ టీడీపీ నేతలు కొనసాగిస్తున్నారు. పట్టించుకోవాల్సిన మత్స్య, ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులు తమకేమీ తెలియదన్నట్లు వ్యహరిస్తున్నారు. దీంతో వారి అక్రమ తవ్వకాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. 130 ఎకరాల ప్రభుత్వ భూముల్లో చెరువులు చెరువుల్లో నీరు–చెట్టు పేరుతో గత ప్రభుత్వ హయాంలో మట్టి, ఇసుకను విక్రయించిన టీడీపీ నేతలు గుండ్లకమ్మ ముంపు భూములనూ వదల్లేదు. గుండ్లకమ్మ రిజర్వాయర్ నిర్మాణంతో మంపునకు గురైన భూములను ఆక్రమించి సొమ్ము చేసుకుంటున్నారు. నియోజకవర్గంలోని అద్దంకి, కొరిశపాడు మండలాల్లో ధేనువుకొండ, మణికేశ్వరం, అనమనమూరు, తమ్మవరం గ్రామాల పరిధిలో సుమారు 130 ఎకరాలకుపైగా ముంపు భూమిని ఆక్రమించారు, ఆక్రమణ భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా చెరువులు తవ్వారు. చెరువులను తవ్వే క్రమంలో వచ్చిన మట్టి, ఇసుకను వదలకుండా ట్రక్కు రూ.600 నుంచి రూ.1000కి విక్రయించి జేబులు నింపుకున్నారు. లీజుతో రూ.లక్షలు అక్రమార్జన రెండు మండలాల్లో కలుపుకుని ముంపు భూముల్లో 40 నుంచి 45 చెరువులు తవ్వారు. ఆ చెరువులను లీజుకిచ్చారు. లీజుకు తీసుకున్న వారు చెరువుల్లో చేపల పెంపకం చేపట్టారు. ఇలా ఒక్కో చెరువును ఆక్రమణదారులు ఏడాదికి రూ. 20 నుంచి రూ.25 వేల వరకు లీజు దారుల నుంచి వసూలు చేస్తున్నారు. ఈ చెరువుల్లో లీజుదారులు ఎలాంటి అనుమతులు లేకుండా చేపల పెంపకం చేపడుతున్నారు. పెరుగుతున్న కాలుష్యం ప్రభుత్వ భూముల్లో ఆక్రమంగా ఏర్పాట చేసిన చెరువుల్లో లీజుదారులు చేపల పెంపకం చేపట్టి చేపలకు ఆహారంగా కోళ్ల వ్యర్థాలతో పాటు మాంస వ్యర్థాలు వేస్తున్నారు. ఈ నీటిని సమీపంలోని గుండ్లకమ్మ నీటిలో వదులు తుండటంతో నీరు కలుషితం అవుతోంది. ఇంజిన్‌తో చెరువులకు తరలిస్తున్న గుండ్లకమ్మ నీరు సాగు,తాగు నీరు చేపల చెరువులకు మళ్లింపు చేపల పెంపకం కోసం అనుమతులు లేకుండా తాగు, సాగు నీటిని యథేచ్ఛగా గుండ్లకమ్మ నది నీటిని మోటార్లతో తోడి చెరువులు నింపుకుంటున్నారు. దీంతో తాగు,సాగు నీటికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. వాస్తవంగా చేపల చెరువుల యజమానులు చెరువులు నింపుకోవడం కోసం ముందుగానే సంబంధిత అధికారుల నుంచి ఏ నీటితో చెరువులు నింపుతారో తెలియజేసి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. పట్టించుకోని అధికారులు ముంపు భూముల్లో అనుమతులు లేకుండా కట్టడాలు, మట్టి తవ్వకాలు జరపవద్దనే నిబంధన ఉన్నా ఆక్రమణదారులు లెక్క చేయడం లేదు. వందల ఎకరాల ముంపు భూములను ఆక్రమించుకుని చెరువుల ఏర్పాటుతో మట్టి ఇసుక, అమ్మకాలతో పాటు చేపల పెంపకానికి లీజుకిచ్చి దబ్బు దండుకుంటున్నా తమకేమీ తెలియదన్నట్లు అధికారులు వ్య్వహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత శాఖల అధికారులు స్పందించి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
క్వారీల్లో ఉపాధికి ఘోరి..
సాక్షి, దాచేపల్లి(గురజాల) : ఉదయం నుంచి సాయంత్రం వరకు కండలను కరిగించి రాళ్లను బద్దలుకొట్టేవారు. వచ్చే ఆదాయంతో ఇంటిల్లిపాదీ చీకూచింతా లేకుండా హాయిగా జీవించేవారు. కాలేజీ విద్యార్థులు సైతం అప్పుడప్పుడు క్వారీల్లో పనులకు వెళ్లి వచ్చే డబ్బులను చదువుకోసం ఖర్చుచేసేవారు. హాయిగా సాగుతున్న వారి జీవితాలను తెలుగుదేశం పార్టీ నాయకులు అక్రమ మైనింగ్ దెబ్బతీసింది. అక్రమ మైనింగ్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేయడంతో క్వారీలన్నీ మూతపడ్డాయి. వడ్డెరలకు పనికరువైంది. చేసేదేమీలేక ఇళ్లకు తాళాలు వేసి పనులు వెతుక్కుంటూ వలసబాట పట్టారు. కండలు కరిగించి రాళ్లు బద్దలు కొట్టి జీవనం సాగించే వడ్డెర కార్మికుల బతుకుల్లో టీడీపీ నాయకులు చీకట్లు నింపారు. ఒకప్పుడు దర్జాగా బతికిన వడ్డెర కార్మికులు నేడు దయనీయ పరిస్థితుల్లో జానెడు పొట్టనింపుకొనేందుకు కొందరు వలస బాట పట్టగా, మరికొంత మంది వ్యవసాయ కూలీలుగా మారారు. నిత్యం సమ్మెట చప్పుళ్లు, వడ్డెర కార్మికుల కబర్లతో సందడిగా కనిపించే క్వారీలు ఇప్పుడు నిర్మానుష్యంగా మారాయి. కార్మికులు ఉపాధి కోసం వలస వెళ్లడంతో క్వారీలతోపాటు, గ్రామాలు సైతం నిర్మానుష్యంగా మారాయి. మరోవైపు అక్రమంగా క్వారీలను నిర్వహించిన తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం కోట్ల రూపాయలకు పడగలెత్తారు. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, ఆయన అనుచరులు సాగించిన అక్రమ మైనింగ్‌తో దాచేపల్లి మండలంలోని నడికుడి, కేసానుపల్లి, పిడుగురాళ్ల మండలంలోని కొనంకి గ్రామాల్లో క్వారీలు మూతపడ్డాయి. దీంతో వడ్డెర కార్మికులు వలసబాట పట్టారు. రెక్కల కష్టంతో కట్టుకున్న ఇళ్లకు తాళాలు వేసి తట్టాబుట్ట సర్దుకుని ఉపాధిని వెతుక్కుంటూ వలసబాట పట్టారు. వడ్డెర కార్మికులు అధికంగా నివసించే నడికుడి పంచాయతీ పరిధిలోని అంజనాపురం కాలనీ నిర్మానుషంగా ఉంది. క్వారీల్లో యరపతినేని అనుచరుల పాగా నడికుడి, కేసానుపల్లి, కోనంకి గ్రామాల్లో క్వారీపై ఆధారపడి ఈ మూడు గ్రామాల్లోనే మూడు వేల మందికి పైగా వడ్డెర కార్మికులు జీవించేవారు. జంగా కృష్ణమూర్తి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో వడ్డెర కార్మికులు నిర్భయంగా క్వారీ పనులు చేసుకుని నాలుగు రూపాయలు సంపాదించుకున్నారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వడ్డెర కార్మికుల బతుకులు పూర్తిగా మారాయి. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆయన అనుచరులు క్వారీలను బలవంతంగా లాగేసుకున్నారు. నడికుడిలో వడ్డెర సొసైటీకి ఉన్న రెండున్నర ఎకరాల లీజును రద్దు చేయించి ఆ భూమిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ భూములు, ఓ సిమెంట్ కంపెనీ సొంత భూముల్లో సైతం అక్రమంగా మైనింగ్‌కు పాల్పడి రాయిని తవ్వి తరలించేశారు. కేసానుపల్లిలో ప్రభుత్వ భూములతో పాటుగా ప్రైవేట్ వ్యక్తుల భూముల్లో కూడా అక్రమంగా క్వారీ పనులు చేసి కోట్ల రూపాయలు వెనకేసుకున్నారు. వడ్డెర కార్మికుల శ్రమ దోపిడీ క్వారీలను లాగేసుకున్న టీడీపీ నాయకులు వారి శ్రమను సైతం దోచుకున్నారు. గతంలో ట్రక్కు రాయి కొడితే రూ.600లకు పైగా కూలి వచ్చేది. టీడీపీ నాయకులు మాత్రం రూ.450 చొప్పున సరిపెట్టారు. వడ్డెర సామాజిక వర్గానికి చెందిన పెద్దలు కూడా కార్మికుల శ్రమ దోపిడీలో భాగస్వాములుగా మారడంతో కార్మికుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. రోజూ వేల టన్నుల తెల్లరాయిని రవాణాచేసి కోట్ల రూపాయలు సంపాదిస్తున్న టీడీపీ నాయకులు తమకు రావాల్సిన కూలిలో సైతం కోత విధించారని కార్మికులు ఆరోపించారు. వలసబాట పట్టిన కార్మికులు అక్రమమైనింగ్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేయటంతో నడికుడి, కేసానుపల్లి, కోనంకి గ్రామాల్లో అక్రమమైనింగ్ నిలిచిపోయింది. గతంలో చట్టప్రకారం రాయల్టీ చెల్లించి క్వారీలను నడిపేవారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాయల్టీ చెల్లించకుండా ఇష్టానుసారంగా క్వారీలను నిర్వహిస్తుండటంతో హైకోర్టులో పిల్ దాఖలైంది. అక్రమమైనింగ్‌లో హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో క్వారీలు నిలిచిపోయాయి. దీంతో రెక్కల కష్టంతో కట్టుకున్న ఇంటికి తాళాలు వేసి ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. ఇంటి వద్ద వృద్ధ తల్లిదండ్రులను వదిలిపెట్టి అతికష్టం మీద వలసలకు పయనమయ్యారు. క్వారీ పనులు లేకపోవటంతో కొంతమంది వడ్డెర కుటుంబాల్లోని పిల్లల చదువులు కూడా ఆగాయి. క్వారీని వదిలి.. డ్రైవర్‌గా కుదిరి.. ఈ ఫొటోలోని వ్యక్తి పేరు చల్ల అమరలింగేశ్వరరావు. 17 సంవత్సరాల వయస్సు నుంచే క్వారీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. అతనికి భార్య, ఇద్దరుకుమార్తెలు, ఒకకుమారుడు ఉన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత క్వారీలను అక్రమించుకున్నారు. టీడీపీ నాయకులు కొంతకాలం అమరలింగేశ్వరరావుతో పనులు చేయించినా, వైఎస్సార్ సీపీ సానుభూతిపరుడంతో పనులకు రాకుండా అడ్డుకున్నారు. ఆ తరువాత బతుకుదెరువు కోసం జేపీ సిమెంట్ ఫ్యాక్టరీకి వెళ్తే అక్కడా పని కల్పించకుండా యజమాన్యంపై టీడీపీ నాయకుడు బత్తుల రాంబాబు వత్తిడిచేశాడు. చేసేదేమీలేక ఇప్పుడు కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. క్వారీ పనుల్లో రూ.800 ఆదాయం వచ్చేది. ఇద్దరు పిల్లలను చక్కగా చదివించుకునేవాడు. ఇప్పుడు డ్రైవర్‌గా వెళ్లడం వల్ల ఆదాయం తగ్గిపోయింది. వచ్చే ఆదాయంతో కుటుంబ పోషణభారంగా మారింది. కష్టపడితే నాలుగు రూపాయలు వచ్చే క్వారీ పనులు మానుకుని డ్రైవర్‌గా వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నారు. నాకు వచ్చిన కష్టం పగవాడికి కూడా రాకూడదు. టీడీపీ నాయకులు తాను క్వారీ పనులు చేయకుండా అడుగడుగునా అడ్డుకుని పంతం నెగ్గించుకున్నారు. తాపీ పనులు చేస్తున్నా క్వారీ పనులు నిలిచిపోవటం వలన పొట్టచేతపట్టుకుని విజయవాడకు వెళ్లి తాపీ పనులు చేసుకుని బతుకుతున్నా. అక్కడ కూడా పనులు అడపా దడపా మాత్రమే లభిస్తున్నాయి. నాకు ఇచ్చే కూలి తినటానికి, ఉండటానికే సరిపోతుంది. అంతా దూరం వెళ్లి నేను సంపాదించిందేమీలేదు. క్వారీ పనులు ఉంటే కుటుంబంతో కలిసి హాయిగా పనిచేసుకుని ఇక్కడే ఉండేవాళ్లం. ఇప్పుడు నేను విజయవాడలో, నా కుటుంబం అంజనాపురంలో ఉంటోంది. –వేముల క్రిష్టయ్య చదువులకు అటంకం నేను డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నా. క్వారీ పనులు ఉంటే రోజూ ఉదయం పనికి వెళ్లి ట్రక్కురాయి కొడితే రూ.600 వచ్చేవి. ఆ డబ్బును చదువు కోసం ఉపయోగించుకునేవాడిని. ఇప్పుడు క్వారీ పనులు లేవు. చదువుకు ఆటంకంగా మారింది. చదువుకోవటం ఇబ్బందిగా ఉంది. పరిస్థితులు ఇలానే ఉంటే చాలామంది చదువు ఆగిపోయే ప్రమాదం ఉంది. – బత్తుల చిన్నపరాజు -
ప్రభుత్వ భూమి ఆక్రమణ..నలుగురిపై కేసు నమోదు
బెల్లంపల్లి ఆదిలాబాద్ : బెల్లంపల్లి కన్నాలబస్తీ వ్యవసాయ మార్కెట్ శివారు ప్రాంతంలో ప్రభుత్వ భూమి ఆక్రమణకు కొందరు సిద్ధపడ్డ సంఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగు చూసింది. గుట్టుచప్పుడు కాకుండా బుధాకలాన్ శివారు సర్వే నంబర్ 170లోని ప్రభుత్వ భూమిపై కన్నేసిన ఆక్రమణదారులు వారం రోజుల నుంచి భూమిని చదును చేయిస్తున్నారు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు వెంటనే రంగంలోకి దిగి ఆ భూమిని పరిశీలించారు. సదరు భూమి సర్వే నంబర్ 170 పీపీ అని నిర్ధారించారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని చదును చేయించడం సరికాదని, వెంటనే పనులను నిలిపి వేయాలని ఆక్రమణదారులను ఆదేశించారు. అయినా వారు వినలేదు. ఈ విషయాన్ని తహసీల్దార్ కె.సురేశ్.. సబ్ కలెక్టర్ పీఎస్ రాహుల్‌రాజ్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన సోమవారం ఘటనాస్థలికి వెళ్లి భూ ఆక్రమణను పరిశీలించారు. తక్షణమే నిలుపుదల చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. అక్కడ ప్రభుత్వ భూమి అని బోర్డు పాతి పెట్టాలని, తమ ఆదేశాలను ఆక్రమణదారులు అతిక్రమిస్తే పోలీసు కేసు పెట్టాలని హుకూం జారీ చేశారు. దీంతో ఆక్రమణదారులకు వీఆర్వో నచ్చచెప్పిన కబ్జా పనులు మానుకోలేదు. యథావిధిగా చదును చేయించే పనులు ముమ్మరం చేయడంతో మంగళవారం వీఆర్వో లక్ష్మయ్య ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది ఆక్రమిత భూమివద్ద ప్రభుత్వ భూమి అని బోర్డు పెట్టారు. సదరు ఆక్రమిత భూమిని వన్‌టౌన్ ఎస్సై ప్రేమ్ కుమార్, వీఆర్వోతో కలిసి సందర్శించారు. నలుగురిపై కేసు నమోదు ప్రభుత్వ భూమి కబ్జాకు పాల్పడిన బెల్లంపల్లి మధునన్న నగర్‌కు చెందిన నలుగురిపై పోలీసు కేసు నమోరైంది. అక్రమంగా భూ ఆక్రమణకు పాల్పడిన దండెబోయిన భాస్కర్ రెడ్డి, నీలమ్మ, ఎండీ సలీమా, ధోని, రాజేశ్వరిపై తహసీల్దార్ కె.సురేశ్ ఆదేశాల మేరకు వీఆర్వో ఎస్.లక్ష్మయ్య వన్‌టౌన్‌లో ఫిర్యాదు చేయడంతో సదరు ఆక్రమణదారులపై కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ ఎస్సై ప్రేమ్‌కుమార్ తెలిపారు. -
పేదల జాగాలో పెద్దల పాగా
జిల్లాలో ప్రభుత్వ భూముల ఆక్రమణకు కేంద్ర బిందువుగా మారిన పీలేరులో గూడులేని నిరుపేదల ఆవాసం కోసం సేకరించిన స్థలంలో రూ. పెద్దలు పాగా వేశారు. రూ.మూడుకోట్ల విలు వైన భూములను దర్జాగా ఆక్రమించేశారు. పేదల ఇళ్ల నిర్మాణానికి రెండుసెంట్లు భూమి చూపడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే రెవెన్యూ అధికారులు కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నా నోరుమెదపకపోవడం విమర్శలకు తావిస్తోంది. పీలేరు: చాలీచాలనీ కూలితో అద్దె ఇళ్లలో మగ్గుతున్న నిరుపేదల కోసం ఇందిరమ్మ కాలనీ నిర్మించాలని నిర్ణయించిన చిత్తూరు మార్గంలోని కోళ్లఫారం మిట్టన ఉన్న స్థలం పెద్దల చేతిలోకి వెళ్లిపోయింది. కోళ్లఫారం మిట్టన సర్వే నంబర్లు 1076, 1078, 1079/1, 1131/4, 1136, 1137, 1138, 1139, 1140/1, 1144/2, 1145, 1146/4లో 86.35 ఎకరాల స్థలాన్ని రైతుల నుంచి సేకరించి ప్రభుత్వం 2007లో స్వాధీ నం చేసుకుంది. ఇక్కడ 2,322 ఇళ్ల నిర్మాణానికి లేఅవుట్ తయారు చేశారు. మొదటి విడతగా 2006–07లో 1,700 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. కాలనీ నిర్మాణం కోసం అప్పటి పీలేరు ఎమ్మెల్యే, ప్రస్తుతం పుంగనూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 2007 అక్టోబర్ 25వ తేదీన శిలాఫలకం వేశారు. ఒక్కో రెండు సెంట్ల చొప్పున 1,700 ఇళ్లకు 34 ఎకరాలు ఇచ్చారు. 632 పట్టాలకు సంబంధించి సుమారు 12 ఎకరాల స్థలం ఖాళీగా ఉంచారు. కమ్యూనిటీ అవసరాల కోసం 7.80 ఎకరా లు, కాలనీ రోడ్ల నిర్మాణానికి 10 నుంచి 15 ఎకరాలు కేటాయిం చారు. అనంతరం మారిన సమీ కరణల నేపథ్యంలో ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు భవిష్యత్ అవసరాల కోసం కేటాయించిన స్థలంలో 3 సెంట్లు చొప్పున సుమారు 600 పట్టాలు అక్రమంగా ఇచ్చి నట్లు ఆరోపణలున్నాయి. గృహ నిర్మాణ శాఖ ఆధీనంలో ఉన్న ఖాళీ స్థలం నిబంధనల మేరకు ఇళ్లు మంజూరైన లబ్ధిదారులకు మాత్రమే కేటాయించాలి. రూ.లక్షలు తీసుకుని స్థలాన్ని సంతర్పణ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా సర్వే నంబర్ 1136/5లో భారీగా అక్రమాలు జరిగినట్టు సమాచారం. కాలనీ కోసం రైతుల నుంచి సేకరించిన 86.35 ఎకరాల స్థలానికి ఇప్పటివరకు సరిహద్దులు నిర్ధారించకపోవడంతో మూడు కోట్ల విలువ గల సుమారు 10 నుంచి 14 ఎకరాల స్థలం ఆక్రమణకు గురైంది. సరిహద్దులు నిర్ణయించాలని పలుమార్లు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సర్వేలు, విచారణ పేరిట 2007 నుంచి కాలయాపన చేస్తున్నారు. ఇందిరమ్మ కాలనీ నిర్మాణం కోసం సేకరించిన స్థలాన్ని ఇప్పటి వరకు రెవెన్యూ అధికా రులు హౌసింగ్ అధికారులకు స్వాధీనం చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. పీలేరు పట్టణానికి అన్ని వైపులా 5 కిలోమీటర్ల లోపు సుమారు 100 కోట్లకు పైగా విలువ గల ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైనట్లు సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు బీడీ.నారాయణరెడ్డి లోకాయుక్త కోర్టులో ఫిర్యాదు చేయడం గమనార్హం. కాలనీ స్థలం ఆక్రమణపై భారీ ఎత్తున ముడుపులు చేతులు మారడం వల్లే రెవెన్యూ అధికారులు విచారణ పేరిట కాలయాపన చేస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. రెవెన్యూ అధికారులు మాత్రం కాలనీలో సర్వే నిర్వహించామని, ఒకటిన్నర ఎకరా ఆక్రమణకు గురైనట్లు గుర్తించి, ఇందులో గోడౌన్ నిర్మాణానికి ఎకరా స్థలం కేటాయించామని తెలు పుతున్నారు. హౌసింగ్ అధికారులు మాత్రం కాలనీ స్థలం ఇప్పటివరకు రెవెన్యూ ఆధీనంలోనే ఉందని చెబుతున్నారు. -
బరితెగింపు!
సాక్షి, విశాఖపట్నం: పెందుర్తి మండలం చీమలాపల్లి సర్వే నంబరు 23లో ప్రభుత్వ భూమి ఉంది. అందులో స్థానిక టీడీపీ నాయకుడు దాదాపు వెయ్యి గజాల ప్రభుత్వ (కొంత భాగం సింహాచలం దేవస్థానం పరిధి కూడా ఉంది) స్థలాన్ని హస్తగతం చేసుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నాడు. ఇందుకోసం మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్‌బాబు, బండారు సత్యనారాయణమూర్తిలతో దిగిన ఫొటోలను ఆయా స్థలంలో ఫ్లెక్సీలుగా ఏర్పాటు చేశాడు. రూ.2 కోట్లు విలువైన ఈ స్థలంలో చిన్నపాటి బడ్డీలు, షెడ్లు నిర్మించేస్తున్నాడు. పక్కా ‘పచ్చ’ స్కెచ్ ఆ నాయకుడు జీవీఎంసీ అధికారులను ‘మేనేజ్’ చేసి ఇంటిపన్ను, ఇతర పన్నులు సంపాదించాడు. వీటిని ఆసరాగా చేసుకుని ఇటీవల 296 జీవో ద్వారా క్రమబద్దీకరణకు దరఖాస్తులు చేయగా అధికారులు తిరస్కరించారు. దీంతో తాజాగా సదరు షెడ్ల ముందు టీడీపీ ప్రజాప్రతినిధుల ఫ్లెక్సీలు పెట్టి ఎలాగైనా దాన్ని కొట్టేయడానికి స్కెచ్ వేశాడు. మరోవైపు ఇక్కడ కబ్జా జరుగుతున్న విషయం రెవెన్యూ అధికారులకు తెలుసు. కానీ అధికారపార్టీ నాయకుడు కావడంతో ఈ ఆక్రమణపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. తాజాగా కింది స్థాయి రెవెన్యూ అధికారులు వెళ్లి ఓ షెడ్‌ను తొలగించినా రాత్రికి రాత్రే మళ్లీ దాన్ని నిర్మించేశాడు. ఉన్నతాధికారులు స్పందించి ఈ ఆక్రమణలను అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు. పరిశీలించి చర్యలు తీసుకుంటాం.. సర్వే నెంబర్ 23 ప్రభుత్వభూమి. ఇందులో ఆక్రమణలను సహించం. ఇక్కడ ఆక్రమణలపై ఫిర్యాదులు అందుతున్నాయి. ఇప్పటికే విషయం ఉన్నతాధికారుల దృష్టిలో ఉంది. ఆక్రమణలు ఉంటే పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం. – రవికృష్ణ, రెవెన్యూ ఇన్స్పెక్టర్, పెందుర్తి -
20 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణ
ఆ తర్వాత యథేచ్ఛగా విక్రయంఆపైన చెరువుల తవ్వకానికి శ్రీకారం కన్నెత్తి చూడని రెవెన్యూ అధికారులు 20 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణ మచిలీపట్నం : బందరు మండలంలో అధికార పార్టీ నాయకుల కబ్జా పరంపర కొనసాగుతూనే ఉంది. కరగ్రహారం పంచాయతీ పరిధిలో క్యాంప్‌బెల్‌పేట సమీపంలో 20 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉంది. ఏడెనిమిది సంవత్సరాల కిందట ఈ భూమిలో ఉప్పు పండించేవారు. కాలక్రమంలో ఉప్పు పండించడాన్ని నిలిపివేయడంతో ఖాళీగా ఉంటోంది. దీనిపై కన్నేసిన తెలుగుదేశం పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధి ఒకరు ఈ భూమి తనదేనని ప్రచారం చేసుకుంటూ వచ్చాడు. 15 రోజుల క్రితం ఈ భూమిని ఎకరం రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు కరగ్రహారం గ్రామానికి చెందిన మరో వ్యక్తికి, ఆ తర్వాత మరో ఇద్దరికి విక్రయించేశాడు. ఈ భూమిని చెరువుగా తవ్వుకునేందుకు తాను అండదండగా ఉంటానని వారికి భరోసా ఇచ్చాడు. అనుకున్నదే తడవుగా మంగళవారం ఈ భూమిని రొయ్యల చెరువుగా మార్చేందుకు మార్కింగ్ ఇచ్చారు. ప్రభుత్వ భూమిని యథేచ్ఛగా ఆక్రమించి చెరువులుగా తవ్వేందుకు ప్రయత్నిస్తున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానిక అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన భూసేకరణ నోటిఫికేషన్లో సర్వే నంబరు 248లో ఈ భూమిని కూడా చేర్చారని స్థానికులు చెబుతున్నారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకోవటమే కాక విక్రయించి చెరువులుగా తవ్వేందుకు స్థానిక ప్రజాప్రతినిధి ప్రయత్నాలు ప్రారంభించారని, దీన్ని అడ్డుకుంటామని క్యాంప్‌బెల్‌పేట మత్స్యకారులు అంటున్నారు. అవసరమైతే ఈ విషయంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఇటీవల భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసిన సమయంలో ప్రజాప్రతినిధి ఆక్రమించుకున్న భూమి ప్రభుత్వానికి చెందినదని పంచాయతీ కార్యాలయం వద్ద నోటీసు బోర్డులోనూ ఉంచారని గ్రామస్తులు పేర్కొన్నారు. -
ప్రభుత్వ భూమిలో ప్లాట్ల దందా
♦ అక్రమార్కులతో కుమ్మక్కైన ఓ ప్రజాప్రతినిధి? ♦ పక్షం రోజులుగా సాగుతున్న పనులు బెల్లంపల్లి : బెల్లంపల్లి మునిసిపాలిటీ శివార్లలోని విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు రంగం సిద్ధమైంది. కొందరు వ్యాపారులు ఈ పనికి పాల్పడుతూ ఓ ప్రజాప్రతినిధిని తమతో కలుపుకున్నారనే విమర్శలు వస్తున్నాయి. బెల్లంపల్లి శివారులోని బుధాకలాన్ గ్రామ సర్వే నంబర్ 170లో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాల వెనకాల ఉన్న విలువైన ఖాళీ భూమిని ఆక్రమించేందుకు యత్నాలు జరుగుతున్నాయి. ఈ భూమిని ఇప్పటికే కొందరు నిరుపేదలకు ఇందిరమ్మ పథకం కింద కేటాయించగా పలువురు ఇళ్లు నిర్మించుకున్నారు. అలాగే, మరోపక్క గురి జాలకు వెళ్లే ప్రధాన రహదారిని ఆనుకుని ఐటీడీఏ ఆధ్వర్యంలో యూత్ ట్రైనింగ్ సెంటర్ నిర్మించారు. దీని పక్కనే తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల భవన నిర్మాణ పనులు సాగుతుండగా, ఇంకోపక్క ఏఆర్ పోలీసు హెడ్‌క్వార్టర్స్ ఉన్నాయి. ఇలా ప్రభు త్వ కార్యాలయాల నడుమ ఉన్న విలువైన ఖాళీ స్థలాన్ని ఆక్రమించేందుకు కబ్జాదారులు సిద్ధం కాగా.. పక్షం రోజులుగా ట్రాక్టర్లతో భూమి చదును చేయిస్తున్నాయి. అంతేకాకుండా గుంటన్నర చొప్పున ప్లాట్లు వేసి రూ. 20వేల చొప్పున వసూలు చేసి విక్రయాలకు తెర లేపినట్లు తెలుస్తోంది. మంజూరు కాకముందే ఆక్రమణ? బెల్లంపల్లిలోని ఓ సామాజికవర్గం ఇళ్ల స్థలాల కోసం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసినట్లు తెలిసింది. అయితే, ఈ విషయంలో కలెక్టర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయినప్పటికీ ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి ఆధ్వర్యంలో దరఖాస్తు చేసుకున్న సదరు సామాజికవర్గం నాయకులు ఎలాగూ మంజూరు చేస్తారనే ధీమాతో ప్రస్తుతం ఆక్రమణకు గురైన సర్వే నం.170లోని మి గతా ఖాళీ భూమిని కబ్జా చేశారు. ఆ భూమి చుట్టూరా ఫెన్సింగ్ కూడా వేశారు. అంతేకాకుండా 40మంది కుల స్తులకు ప్లాట్లు కేటాయించి కందకాలు తవ్వడం గమ నార్హం. ఇది పోను పునాది నిర్మాణానికి ఇసుక, బండరాయి తెప్పించడం గమనార్హం. ఈ విషయమై రెవెన్యూ యంత్రాంగం మేల్కొని ప్రభుత్వ భూమి ఆక్రమణలను అడ్డుకోవాలని పలువురు కోరుతున్నారు. స్థలం మంజూరు కాలేదు ఇళ్ల స్థలాల మంజూరు కోసం ఓ సామాజిక వర్గం నాయకులు కలెక్టర్‌కు వినతిపత్రం పంపించారు. అయితే, కలెక్టర్ నుంచి ఉత్తర్వులు రాకముందే భూమి ఆక్రమించుకున్నారు. ఆ స్థలంలో నిర్మాణాలు చేయకుండా చర్యలు తీసుకుంటాం. ఈ మేరకు రెవెన్యూ సిబ్బందిని అక్కడికి పంపించి పనులు నిలుపుదల చేయిస్తాం. - కె.శ్యామలదేవి, తహశీల్దార్, బెల్లంపల్లి