government medical
-
ప్రభుత్వ వైద్యంపై నమ్మకం కలిగించాలి
సంస్థాన్ నారాయణపురం : ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో నమ్మకం కలిగించాలని కలెక్టర్ అనితా రామచంద్రన్ పేర్కొన్నారు. ఈ నెల 15న సాక్షి దినపత్రికలో పీహెచ్సీలో ప్రసవ వేదన అనే శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందించిన కలెక్టర్ బుధవారం పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్సీలో రోగుల గదులను, ఆపరేషన్ థియేటర్, ప్రసవ గదిని, వివిధ గదులను, రికార్డులను పరిశీలించారు. ప్రసవ వేదనతో ఒక గర్భిణి వస్తే, ప్రసవం చేయకుండా ఇలానే చూసేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ కుటుంబ సభ్యులు ఎవరైనా వస్తే, ఇలానే చేస్తారా అని ప్రశ్నించారు. ఆ సమయంలో ఉండాల్సిన సిబ్బంది ఎవరని, ఎక్కడ ఉన్నారని, ఏం చేస్తున్నారని, 24గంటలు వైద్య సేవలు అందుతాయని ప్రజలు వస్తే, మీరు ఇలా పనిచేస్తే ప్రజల్లో ప్రభుత్వ వైద్యంపై నమ్మకం కలుగుతుందా అని హెచ్చరించారు. సిబ్బంది ఏదో చెప్పబోతుండగా, తన సెల్లో సంస్థాన్ నారాయణపురంలోని పీహెచ్సీలో మహిళ ప్రసవం ఫొటోలను వైద్యులకు, సిబ్బందికి చూపించారు. ఇలాంటి సాకులు చెప్పొద్దని, బాధ్యతాయుతంగా, క్రమశిక్షణతో నిర్వహించాలన్నారు. పేదవాళ్లు వస్తే ఇంత అలుసుగా చూస్తారా అని ఆవేదన వ్యక్తం చేశారు. రిసెప్షన్లో ఏఎంసీ రిజిస్ట్రర్ రాయకపోవడంపై, మీ పనితీరు తెలుస్తుందన్నారు. ఈడీడీ రిజిస్ట్రర్ కూడా 2సంవత్సరాల నుంచి నిర్వహించకపోవడంపై వైద్యాధికారిపై అసహనం వ్యక్తం చేశారు. మీ రికార్డుల నిర్వహణ తీరు చూస్తుంటేనే తెలుస్తుందన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పీహెచ్సీలో అన్ని వైద్య సౌకర్యాలు ఉన్నాయన్నారు. ఇతర సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పనిచేయని వారికి శిక్షలు వేయడం ఒక్కటే జవాబు కాదని, వారిలో మార్పు తీసుకొచ్చి క్రమశిక్షణతో బాధ్యతలు నిర్వహించాలన్నారు. సమయపాలన ప్రకారం వైద్యులు, సిబ్బంది వచ్చి సేవలు అందించాలన్నారు. ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని, 24గంటల్లో ఎప్పుడు వైద్యానికి వచ్చినా అందించాలన్నారు. పీహెచ్‌సీలపై తనిఖీలు నిర్వహించి, ప్రజలకు వైద్యం అందేలా చూడాలని ఆర్డీఓను ఆదేశించారు. ఆమె వెంట ఆర్డీఓ మహేందర్‌రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్‌కుమార్, ఎంపీడీఓ జి.రజిత, ఎంపీపీ వాంకుడోతు బుజ్జి, మండల వైద్యాధికారి మోహనయ్య తదితరులున్నారు. -
వైద్యమందకపోతే ఒక్క ఫోన్ కొట్టండి: రాజయ్య
గజ్వేల్: ‘‘ప్రభుత్వ వైద్యం ప్రజలందరికీ అందుబాటులోకి రావాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం.. ఈ ఆశయానికి వైద్యులు, సిబ్బంది తూట్లు పొడిస్తే సహించేదిలేదు. వైద్య సేవలు అందించడంలో ఎవరైనా అలసత్వాన్ని ప్రదర్శిస్తే నా సెల్ నంబర్ 9849790363కు కాల్చేయండి. ఆ తర్వాత కథ నేను చూసుకుంటా’’ అని డిప్యూటీ సీఎం, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి టి.రాజయ్య ప్రజలకు సూచించారు. మంగళవారం గజ్వేల్‌కు వచ్చిన ఆయన స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేశారు. వివిధ వార్డులను పరిశీలించి వైద్య సేవలందుతున్న తీరు గురించి రోగులనే అడిగి తెలుసుకున్నారు. -
అందని ద్రాక్షలా సర్కార్ వైద్యం
దుబ్బాక, న్యూస్‌లైన్ : ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు సర్కారు వైద్యం అందని ద్రాక్షలా మారింది. అధికారుల నిర్లక్ష్యం మూలం గా 24 గంటల వైద్యం.. కేవలం రెండు గంటలకు మాత్రమే పరిమితమైంది. పేద ప్రజలకు వైద్య సేవలు అందించాలన్న సదుద్దేశంతో పదేళ్ల క్రితం దుబ్బాకలో సీహెచ్‌సీ (కమ్యూనిటీ హెల్త్ సెంటర్) సామాజిక ఆరోగ్య కేం ద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. లక్షలు వెచ్చించి నిర్మించిన భవనంలో ఆపరేషన్ థియేటర్‌తో పాటు గర్భిణులకు, నవజాత శిశువులకు మెరుగైన వై ద్య సేవలు అందించేందుకు ప్రత్యేక సా మగ్రిని కూడా ప్రభుత్వం సమకూర్చింది. సీహెచ్‌సీలో వైద్యాధికారితో పాటు మరో నలుగురు వైద్యులు, నలుగురు స్టాఫ్ నర్సులు ఇక్కడ విధులు నిర్వర్తిం చాల్సి ఉంది. ప్రస్తుతం ఇన్‌చార్జ్‌ల పాల నలో కొనసాగుతోంది. ప్రస్తుతం సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యాధికారిగా పనిచేస్తున్న కృష్ణారావు స్థానిక సీహెచ్‌సీ ఇన్చార్జ్ వైద్యాధికారిగా పనిచేస్తున్నారు. దీనికి తోడు ఇక్కడ ఇద్దురు మాత్రమే వైద్యులు, ఇద్దరు స్టాఫ్ నర్సులు పనిచేస్తున్నారు. ఈ పరిస్థితి రెండేళ్లుగా కొనసాగుతోంది. దీంతో కేవలం సోమవారం నుంచి శనివారం వరకు కేవలం ఉద యం వేళల్లోనే అంటే రెండు గంటల పా టు వైద్యులు అందుబాటులో ఉంటారు. మిగిలిన సమయంలో వైద్యు లు కానీ సిబ్బంది కానీ అందుబాటులో ఉండటం లేదు. ఓపీ (ఔట్ పేషెంట్స్) (బయట రోగులకు) మాత్రమే నామమాత్రంగా వైద్యం అందిస్తున్నారు. ఒక్కొక్క సారి వైద్యులు రాక వెనుతిరుగుతున్నారు. గత నెలలో రెండే..రెండు ప్రసవాలు దుబ్బాక సీహెచ్‌సీలో ఏప్రిల్ నెలలో కేవలం రెండు ప్రసవాలు (డెలివరీ) కేసులున్నాయి. దీన్ని బట్టి ఈ ఆస్పత్రిలో ఎంత మేరకు వైద్యం అందుతుందో అర్థమవుతుంది. కలెక్టర్ స్మితా సబర్వాల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన మార్పు కార్యక్రమంలో కూడా ఈ ఆస్పత్రిలో డెలివరీ కేసులను పెంచకపోవడం గమనార్హం. నిత్యం గ్రామాల నుంచి గర్భిణులు ఈ ఆస్పత్రిలో కాన్పు కోసం వచ్చి విధిలేని పరిస్థితుల్లో తిరిగి వెళుతున్నారు. ఆస్పత్రిలోని కొందరు సిబ్బంది గర్భిణులను సిద్దిపేట ఆస్పత్రికి, తిమ్మాపూర్ పీహెచ్‌సీకి పంపుతున్నారన్న విమర్శలున్నాయి. అంతేగాక స్థానిక ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాలంటూ ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో పాటు 108 అంబులెన్స్ సిబ్బందితో పాటు ఆస్పత్రి సిబ్బంది రోగుల విషయంలో గొడవలు పెట్టుకున్న సందర్భాలు లేకపోలేదు. ఇక్కడికిడెలివరీ కేసులు, రాత్రిళ్లు రోగులను తీసుకురావద్దని బాధితులతో గొడవలు పెట్టుకోవడం ఇక్కడ సాధారణం.