అందని ద్రాక్షలా సర్కార్ వైద్యం | doctors not available in dubbaka community health center | Sakshi
Sakshi News home page

అందని ద్రాక్షలా సర్కార్ వైద్యం

Published Wed, May 14 2014 12:52 AM | Last Updated on Sat, Sep 2 2017 7:19 AM

doctors not available in dubbaka community health center

దుబ్బాక, న్యూస్‌లైన్ : ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు సర్కారు వైద్యం అందని ద్రాక్షలా మారింది. అధికారుల నిర్లక్ష్యం మూలం గా 24 గంటల వైద్యం.. కేవలం రెండు  గంటలకు మాత్రమే పరిమితమైంది. పేద ప్రజలకు వైద్య సేవలు అందించాలన్న సదుద్దేశంతో పదేళ్ల క్రితం దుబ్బాకలో సీహెచ్‌సీ (కమ్యూనిటీ హెల్త్ సెంటర్) సామాజిక ఆరోగ్య కేం ద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. లక్షలు వెచ్చించి నిర్మించిన భవనంలో ఆపరేషన్ థియేటర్‌తో పాటు గర్భిణులకు, నవజాత శిశువులకు మెరుగైన వై ద్య సేవలు అందించేందుకు ప్రత్యేక సా మగ్రిని కూడా ప్రభుత్వం సమకూర్చింది.

సీహెచ్‌సీలో వైద్యాధికారితో పాటు మరో నలుగురు వైద్యులు, నలుగురు స్టాఫ్ నర్సులు ఇక్కడ విధులు నిర్వర్తిం చాల్సి ఉంది.  ప్రస్తుతం ఇన్‌చార్జ్‌ల పాల నలో కొనసాగుతోంది. ప్రస్తుతం సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యాధికారిగా పనిచేస్తున్న  కృష్ణారావు స్థానిక సీహెచ్‌సీ ఇన్‌చార్జ్ వైద్యాధికారిగా పనిచేస్తున్నారు. దీనికి తోడు ఇక్కడ ఇద్దురు మాత్రమే వైద్యులు, ఇద్దరు స్టాఫ్ నర్సులు పనిచేస్తున్నారు. ఈ పరిస్థితి రెండేళ్లుగా కొనసాగుతోంది. దీంతో కేవలం  సోమవారం నుంచి శనివారం వరకు కేవలం ఉద యం వేళల్లోనే అంటే రెండు గంటల పా టు వైద్యులు అందుబాటులో ఉంటారు. మిగిలిన సమయంలో వైద్యు లు కానీ సిబ్బంది కానీ అందుబాటులో ఉండటం లేదు. ఓపీ (ఔట్ పేషెంట్స్) (బయట రోగులకు) మాత్రమే నామమాత్రంగా వైద్యం అందిస్తున్నారు. ఒక్కొక్క సారి వైద్యులు రాక వెనుతిరుగుతున్నారు.

 గత నెలలో రెండే..రెండు ప్రసవాలు
 దుబ్బాక సీహెచ్‌సీలో ఏప్రిల్ నెలలో కేవలం రెండు ప్రసవాలు (డెలివరీ) కేసులున్నాయి. దీన్ని బట్టి ఈ ఆస్పత్రిలో ఎంత మేరకు వైద్యం అందుతుందో అర్థమవుతుంది. కలెక్టర్ స్మితా సబర్వాల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన మార్పు కార్యక్రమంలో కూడా ఈ ఆస్పత్రిలో డెలివరీ కేసులను పెంచకపోవడం గమనార్హం. నిత్యం గ్రామాల నుంచి గర్భిణులు ఈ ఆస్పత్రిలో కాన్పు కోసం వచ్చి విధిలేని పరిస్థితుల్లో తిరిగి వెళుతున్నారు. ఆస్పత్రిలోని కొందరు సిబ్బంది గర్భిణులను సిద్దిపేట ఆస్పత్రికి, తిమ్మాపూర్ పీహెచ్‌సీకి పంపుతున్నారన్న విమర్శలున్నాయి. అంతేగాక స్థానిక ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాలంటూ ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో పాటు 108 అంబులెన్స్ సిబ్బందితో పాటు ఆస్పత్రి సిబ్బంది రోగుల విషయంలో గొడవలు పెట్టుకున్న సందర్భాలు లేకపోలేదు. ఇక్కడికిడెలివరీ కేసులు, రాత్రిళ్లు రోగులను తీసుకురావద్దని బాధితులతో గొడవలు పెట్టుకోవడం ఇక్కడ సాధారణం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement