Community Health Center
-
పేదలకు ఫిజియోథెర‘ఫ్రీ’
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) క్రీడాకారులతో పాటు సామాన్యుల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యమిస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రతి బుధవారం పేద, మధ్య తరగతి ప్రజల కోసం ఉచిత ఫిజియో వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలోని ఫిజియోథెరపీ కేంద్రంలో ఉదయం 10.30 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు సీనియర్ ఫిజియో పర్యవేక్షణలో కార్పొరేట్ స్థాయి చికిత్స అందించనుంది. అత్యాధునిక వైద్య పరికరాలు అత్యాధునిక వైద్య పరికరాల సాయంతో శాప్ ఆధ్వర్యంలోని ఫిజియోథెరపీ కేంద్రం ఇప్పటి వరకు క్రీడాకారులకు మాత్రమే వైద్య సేవలందించింది. అనారోగ్యంతో బాధపడుతూ ఖర్చుతో కూడుకున్న ఫిజియో వైద్యం చేయించుకోలేని వారి కోసం ఒక రోజు ఉచిత సేవలకు శ్రీకారం చుట్టింది. ఈ కేంద్రంలో దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేని వెన్నుముక సంబంధిత నొప్పుల చికిత్సకు వినియోగించే కేడీటీ ట్రాక్షన్ పరికరం అందుబాటులో ఉంది. దీనిని అమెరికా నుంచి క్రీడాకారుల కోసం ప్రత్యేక తీసుకొచ్చారు. కండర గాయాలను తగ్గించే షాక్వేవ్ థెరపీ పరికరాన్ని స్విజ్జర్లాండ్ నుంచి రప్పించారు. శీతల వైద్యం (క్రయో థెరపీ) యూనిట్, ఎముకలు, నరాల చికిత్స కోసం బీటీఎల్ – ఎలక్ట్రోథెరపీ, కీళ్ల నొప్పులు, క్రయో, ఐస్ వాక్స్ థెరపీ, వాటర్, ఎలక్ట్రిక్ హీట్, స్టిములైజర్స్, అల్ట్రా సౌండ్, జిమ్ పరికరాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ప్రజల సౌకర్యార్థం 98764 17999, 85558 47798 నంబర్లతో హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశారు. ఇవి వైద్య సేవలు: ఎముకలు, కీళ్ల నొప్పులు, నరాలు, స్పోర్ట్స్ ఇంజ్యూరీస్, కండర, అన్ని రకాల కార్డియో రెస్పిరేటరీ చికిత్సలు అందించనున్నారు. సమాజ ఆరోగ్యం దృష్ట్యా.. ఫిజియోథెరపీ వైద్యం చాలా ఖర్చుతో కూడుకున్నది. నిరుపేదలు ఫిజియో వైద్యం చేయించుకోవాలంటే ఆలోచిస్తారు. ఏళ్లు తరబడి వ్యాధులతో బాధపడుతుంటారు. శాప్‌కు క్రీడాకారుల ఆరోగ్యంతో పాటు సమాజ ఆరోగ్యం కూడా ముఖ్యమే. అందుకే శాప్ ఆధ్వర్యంలోని అత్యాధుని ఫిజియోథెరపీ సెంటర్లో వారంలో ఒక రోజు ఉచిత సేవలను అందిస్తున్నాం. అవసరమైన వారు ఈ సేవలను వినియోగించుకోవాలి. – ఎన్.ప్రభాకరరెడ్డి, శాప్ ఎండీ -
మాకు కరోనా ఉంటే మీకు వస్తుంది
తిరువనంతపురం : కరోనా వైరస్ మాటేమో గాని తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బందికి మాత్రం ప్రాణ సంకటంగా మారింది. తమ వాళ్లను వదిలి మరీ కరోనా సేవలకు అంకితమైన వైద్య సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించడం తరచుగా చూస్తున్నాం. తాజాగా కేరళలోని తిరువనంతపురంలో ఉన్న కంటైన్మెంట్ జోన్లో విధులు నిర్వహించడానికి వెళ్లిన వైద్య సిబ్భందికి శుక్రవారం చేదు అనుభవం ఎదురైంది. కంటైన్మెంట్ జోన్లో ఉన్న ప్రజలు చేసిన పనికి వారంతా క్వారంటైన్ సెంటర్‌కు వెళ్లాల్సి వచ్చింది. (కరోనా భారత్: ఒకే రోజు రెండు రికార్డులు) వివరాలు.. తిరువనంతపురంలో కంటైన్మెంట్ జోన్లో 25 ఏళ్ల ఒక డాక్టర్ తన సిబ్బందితో కలసి కరోనా విధులు నిర్వహిస్తున్నారు. నలుగురు సిబ్బందితో కూడిన ఆమె బృందం పీహెచ్సీ సెంటర్ నుంచి కారులో బయలుదేరారు. కారు కస్లర్ ఏర్పాటు చేసిన ప్రాంతంలోకి చేరుకోగానే కారులోని వైద్య సిబ్బంది తమతో పాటు తెచ్చుకున్న పీపీఈ కిట్లు ధరించి పరికరాలతో దిగేందుకు సిద్దమయ్యారు. ఇంతలో కారును 50 మంది ఒక్కసారిగా చుట్టుముట్టి ఆందోళన చేయడం ప్రారంభించారు. ఏం జరుగుతుంది అని తెలసుకునేలోపే ఇంకా పెద్ద ఎత్తున జనం గూమిగూడి అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ గట్టిగా అరుస్తూ కారు అద్దాలను ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. ఇంతలో కారు డ్రైవర్ ముందుకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ కారు అద్దాలను దించడంతో ఒక వ్యక్తి తన తలను లోపల పెట్టి గట్టిగా దగ్గుతూ .. ఒకవేళ మాకు కరోనా ఉంటే కచ్చితంగా మీకు కూడ వస్తుంది అంటూ గట్టిగా అరిచాడు. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన సిబ్బంది ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకొని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు ముందుజాగ్రత్త చర్యగా డాక్టర్‌తో పాటు మిగిలిన నలుగురిని కరోనా పరీక్షల కోసం క్వారంటైన్ సెంటర్లో ఉంచారు. (కరోనా : 3 రోజుల్లోనే.. లక్ష కేసులు) ఈ సంఘటనపై 25 ఏళ్ల యువ డాక్టర్ మీడియాతో పంచుకున్నారు. 'నా ఎంబీబీఎస్ సంవత్సరం కింద పూర్తయింది. ఇంటర్న్‌షిప్‌లో భాగంగా విధులు నిర్వహిస్తున్న నాకు కరోనా విధులు అప్పగించారు. నాతో పాటు ఇద్దరు స్టాఫ్ నర్సులు, ఒక టెక్నీషియన్‌ను జతచేసి టీంగా రూపొందించి తిరువనంతపురంలోని క్లసర్కు కేటాయించారు. రోజువారిలానే విధులు నిర్వహించడానికి శుక్రవారం కూడా కారులో బయలుదేరాము. పీపీఈ కిట్లు ధరించేలోపే మా కారును 50 మంది చుట్టుముట్టి ఇక్కడినుంచి వెళ్లిపోవాలంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కారు డ్రైవర్‌ను ఎట్టి పరిస్థితుల్లో కారు విండోను ఓపున్ చేయొద్దని చెప్పా. కాని అనుకోని పరిస్థితుల్లో కారు విండో ఓపెన్ చేయడంతో ఒక వ్యక్తి తన తలను లోపలికి పెట్టి గట్టిగా దగ్గుతూ.. మాకు కరోనా ఉంటే మీకు కూడా వస్తుంది అంటూ తెలిపాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాం. కారులో నాతో పాటు వచ్చిన ఒక నర్సు కంటతడి పెట్టింది. అక్కడినుంచి ఎలాగోలా బయటపడ్డాం. ఇప్పుడు మేమంతా క్వారంటైన్లో ఉన్నాం. కరోనా పరీక్షల్లో నెగిటివ్ వస్తే మళ్లీ విధులకు హాజరవుతాం. చూద్దాం ఏం జరుగుతుందో ' అంటూ డాక్టర్ కన్నీటి పర్యంతమయ్యారు. మరోవైపు ఈ ఘటనపై కేరళ ప్రభుత్వం విచారం వ్యక్తం చేసింది. విధుల్లో ఉన్న వైద్య సిబ్బందిని ఇలా అవమానపరచడం దారుణమని పేర్కొంది. కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కెకె. శైలతో పాటు జిల్లా కలెక్టర్ నవజోత్ ఖోసా సంఘటనపై ఆరా తీశారు. వైద్య సిబ్బందిపై ఇలా ప్రవర్తించడం దారుణమని, కరోనా నేథ్యంలో అంకితభావంతో సేవలందిస్తున్న వైద్యులపై ఇలాంటివి జరగకూడదని కెకె. శైలజ పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టాలని ఇప్పటికే పోలీసులకు సూచించామని ఆమె తెలిపారు. గత రెండు నెలలుగా ఆ ప్రాంతం కంటైన్మెంట్ జోన్లో ఉండడంతో అక్కడి ప్రజలు స్వేచ్చగా తిరిగే అవకాశం లేకుండా పోయింది. కేవలం నిత్యవసరాల సరుకులు మినహా మరెక్కడికి వెళ్లకుండా ఆంక్షలు విదించడంతో వారంతా ఇలా తమ అసహనం వ్యక్తం చేశారని మంత్రి శైలజ మరో ప్రకటనలో పేర్కొన్నారు. -
బతికున్న మనిషిని చంపేశారు.. కానీ
రాంచీ : కరెంట్ షాక్‌కు గురైన వ్యక్తిని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకురాగా అక్కడి వైద్యులు అతన్ని పరీక్షించి చనిపోయాడని నిర్థారించారు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఆ వ్యక్తికి పోస్టుమార్టం నిర్వహిస్తుండగా అతను బతికే ఉన్నట్లు తెలియడంతో ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ వింత ఘటన జార్ఖండ్ రాజధాని రాంచీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. లోహర్దాగా జిల్లాకు చెందిన వ్యక్తి మంగళవారం కరెంట్ షాక్‌కు గురవ్వడంతో రాంచీలోని చానాహో కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. అక్కడి వైద్యులు ఆ వ్యక్తిని పరీక్షించి చనిపోయాడని నిర్థారించారు. పోస్టుమార్టం కొరకు రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్‌కు సిఫార్సు చేశారు. కాగా రిమ్స్ అధికారులు వ్యక్తి శరీరానికి పోస్టుమార్టం నిర్వహిస్తుండగా అతను బతికే ఉన్నట్లు తెలిసింది. దీంతో వెంటనే అతన్ని ఎమర్జెన్సీ వార్డుకి తరలించారు. అయితే ఆ తర్వాత అతడికి చికిత్స అందిస్తున్న సమయంలో చనిపోవడం గమనార్హం. ఈ ఘటనపై జార్ఖండ్ ఆరోగ్య శాఖ మంత్రి బన్నా గుప్తా సీరియస్ అయ్యారు. బతికున్న మనిషిని చచ్చిపోయాడంటూ తప్పుడు రిపోర్టు ఇచ్చిన చానాహో కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌పై సీరియస్ యాక్షన్ తీసుకోనున్నట్లు తెలిపారు. -
మానవత్వం పరిమళించిన వేళ
సాక్షి, పాచిపెంట(విజయనగరం) : మానవ సేవే మాధవ సేవగా భావించారు. అందరూ సహకరించి ఓ గర్భిణికి పురుడుపోశారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉండడంతో సంతోషించిన ఘటన సాలూరులో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. సాలూరు మండలంలోని పట్టుచెన్నేరు పంచాయతీ కోమటివలస గ్రామానికి చెందిన కొర్ర రాములమ్మ నాలుగు నెలల గర్భిణిగా ఉన్న సమయంలో భర్త, కుటుంబంతో కలిసి పనుల కోసం తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంకు వలస వెళ్లిపోయారు. రాములమ్మకు ప్రసవ తేదీ దగ్గర పడడంతో బుధవారం స్వగ్రామానికి బయల్దేరారు. ఈ క్రమంలో విశాఖపట్నంలో దిగి సాలూరు వస్తున్న ఆర్టీసీ బస్సు ఎక్కారు. రాత్రి సుమారు 10 గంటల సమయంలో బస్సు రామభద్రపురానికి చేరుకునే సరికి రాములమ్మకు నొప్పులు అధికమయ్యాయి. బిడ్డ ప్రసవమయ్యే పరిస్థితి రావడంతో వెంటనే రాములమ్మ భర్త నాగేశు కోమటివలస ఏఎన్ఎం సంగీతకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. బస్సును ఆపకుండా సాలూరు వచ్చేయాలని, సాలూరులో సిద్ధంగా ఉంటానని తెలి పింది. డ్రైవర్‌కు సైతం బస్సును సాలూరు తీసుకరావాలని, మధ్యలో నిలిపివేయవద్దని ఏఎన్ఎం విన్నవించింది. మానవత్వం చాటుకున్న ప్రయాణికులు, బస్సు డ్రైవర్, కండక్టర్ అందరి సహకారంతో రాములమ్మను సాలూరుకు తీసుకొచ్చారు. అప్పటికే బిడ్డ సగం బయటకు వచ్చేసింది. స్థానిక తహసీల్దార్ కార్యాలయ సెంటర్ వద్ద ఏఎన్ఎం బస్సులోకి ఎక్కి గర్భిణి పరిస్థితిని గుర్తించింది. బిడ్డ బయటకు రావడం, పేగులు కోయడం వల్ల తల్లికి ప్రమాదమని భావించింది. అంబులెన్స్‌కు ఫోన్ చేసినా రాలేదు. వెంటనే ఏఎన్ఎం స్థానిక సీహెచ్‌సీ స్టాఫ్ నర్స్‌కు ఫోన్‌చేసి ఇద్దరూ కలిసి అదే బస్సులో ఆర్టీసీ కాంప్లెక్స్ వెళ్లి అక్కడ బస్సులోనే రాములమ్మకు పురుడుపోశారు. రెండో కాన్పులో పండంటి మగబిడ్డకు రాములమ్మ జన్మనిచ్చింది. అనంతరం తల్లీబిడ్డలను అర్ధరాత్రి సాలూరు సీహెచ్‌సీకి ఆటోలో తరలించారు. తల్లీ, బిడ్డ క్షేమంగా ఉండడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
ప్రత్తిపాడు సీహెచ్‌సీలో నో డాక్టర్
ప్రత్తిపాడు : ప్రత్తిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రం(సీహెచ్‌సీ) కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. నిన్నటి వరకు స్పెషలిస్టు పోస్టులన్నీ ఖాళీగా ఉన్నప్పటికీ, జనరల్ ఎంబీబీఎస్ డాక్టర్ ఒక్కరే ఆస్పత్రిలో రోగులకు వైద్యసేవలు అందిస్తూ ఆస్పత్రికి ఆయువుపోస్తూ ఊపిరి పోకుండా కాపాడుతూ వస్తున్నారు. మంగళవారం నుంచి ఉన్న ఒక్క డాక్టర్ కూడా అత్యవసర సెలవు పెట్టడంతో రోగుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. రోగులకు ప్రాణం పోయాల్సిన ఫస్ట్ రిఫరల్ సెంటర్లోనే ైవైద్యులు లేని దుస్థితి ఎదురవడంతో, డెప్యూటేషన్‌పై ఇతర పీహెచ్‌సీల నుంచి వైద్యులను పిలిపిస్తున్నారు. గుంటూరుకు కూత వేటు దూరంలో ఉన్న నియోజకవర్గ కేంద్రం, రాష్ట్ర మంత్రి రావెల కిషోర్‌బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రత్తిపాడులోని సామాజిక ఆరోగ్య కేంద్రం దుర్గతి ఇది.. ప్రత్తిపాడు సామాజిక ఆరోగ్యకేంద్రం 30 పడకల ఆస్పత్రి. ఆస్పత్రిలో గైనకాలజిస్ట్, చిన్న పిల్లల వైద్యనిపుణులు, మత్తుడాక్టర్ వంటి మూడు స్పెషలిస్టు పోస్టులు, ఒక డెంటల్ డాక్టర్, ఒక జనరల్ ఎంబీబీఎస్ డాక్టర్.. ఇలా మొత్తం ఐదు పోస్టులు ఉండాలి. కానీ మూడు స్పెషలిస్టు పోస్టులు నెలల కాలంగా ఖాళీగానే ఉంటున్నాయి. డెంటల్ డాక్టర్ హమీద్ ఉన్నప్పటికీ ఆయన జనరల్ ఓపీని చూడలేని పరిస్థితి. దీంతో మిగిలిన ఒక్క జనరల్ ఎంబీబీఎస్ డాక్టర్ టీవి చలపతిరావు ఆస్పత్రిని నెట్టుకుంటూ వస్తున్నారు. మంగళవారం నుంచి ఆయ న కూడా సెలవులో ఉండటంతో పరిస్థితి దారుణంగా తయారైంది. ఇది కేవలం సామాజిక ఆరోగ్య కేంద్రం మాత్రమే కాదు. ఫస్ట్రిఫరల్ సెంటర్, క్లస్టర్ హెడ్‌క్వార్టర్. అంటే క్లస్టర్ పరిధిలో ఉన్న ఎనిమిది పీహెచ్‌సీల్లో ఎక్కడ అత్యవసర కేసు నమోదైనా వారిని తొలుత రిఫ ర్ చేయవలసిన ఆస్పత్రి. ఇలాంటి ప్రాధాన్యత ఉన్న ఆస్పత్రిలోనే ‘నో డాక్టర్’ పరిస్థితి చోటుచేసుకుంది. మంత్రి ఉన్నా ఫలితం సున్నా.. ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే రావెల కిషోర్బా బు మంత్రి కావడంతో ప్రజలంతా ప్రత్తిపాడు సీహెచ్‌సీపై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. ఆస్పత్రి పెద్దాసుపత్రిని తలపిస్తుందని భావించారు. రావెల మంత్రి అయ్యే నాటికి సీహెచ్‌సీలో ఒక గైనకాలజిస్ట్, ఒక పిడియాట్రిషియన్, ఒక అనస్థిషియా స్పెషలిస్టు, ఇద్దరు జనరల్ ఎంబీబీఎస్ డాక్టర్లుతో ప్రత్తిపాడు సా మాజిక ఆరోగ్య కేంద్రం కళకళలాడుతూ ఉండేంది. కానీ ఇప్పు డు ఒక్క జనరల్ ఎంబీబీఎస్ డాక్టరూ లేని దుర్గతి ప ట్టింది. డాక్టర్ల కొరత విషయమై వైద్యాధికారుల నుం చి ప్రజాప్రతినిధుల వరకు ఎంతమంది ఎన్నిసార్లు మంత్రికి మొరపెట్టుకున్నా ఫలితంమాత్రం శూన్యమే. రోగులకు ఇబ్బంది కలగనివ్వం ... ప్రత్తిపాడు సీహెచ్‌సీలో వైద్యుల కొరత తీవ్రంగా ఉన్న మాట వాస్తవమే. గతం నుంచీ స్పెషలిస్టు పోస్టలు ఖాళీగా ఉన్నాయి. ఒక్క జనరల్ ఎంబీబీఎస్ డాక్టర్ ఉన్నప్పటికీ, ఆయన కూడా మంగళవారం నుంచి సెలవులో ఉన్నారు. రోగులకు సేవలందించేందుకు క్లస్టర్‌లోని వేరే పీహెచ్సీ నుంచి డాక్టర్‌ను పిలిపిస్తాం. -సీహెచ్ రత్నమన్మోహన్, డిప్యూటీ డీఎంహెచ్‌వో -
అమరేశ్వరుని సన్నిధిలో భక్తురాలి మృతి
అమరావతి ప్రసిద్ధ శైవక్షేత్రమైన గుంటూరు జిల్లా అమరావతి అమరేశ్వరుని కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని దర్శించేందుకు వచ్చిన ఓ భక్తురాలు పుణ్యలోకాలకేగిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం అదివారం రాత్రి తూర్పుగోదావరి జిల్లా కొమరగిరి గ్రామానికి చెందిన అల్లూరి పార్వతీదేవి మరో ఆరుగురు బంధువులతో కలిసి కాకినాడ అర్టీసీ డిపో బస్సులో పంచారామాల యాత్రకు బయలు దేరింది. సోమవారం తెల్లవారుజామున మూడు గంటలకు పవిత్ర కృష్ణానదిలో పుణ్య స్నానాలు అచరించి అమరేశ్వరుని దర్శనం కోసం వచ్చిన ఆమె క్యూలైన్లో రద్దీ ఎక్కువగా ఉండటంతో సుమారు ఆరు గంటలకు అలయంలోని ధ్వ జ స్తంభం వరకు రాగానే ఒక్కసారిగా తీవ్ర అనారోగ్యానికి గురై అపస్మారకస్థితికి చేరటంతో ఆలయ సిబ్బంది, పోలీసుల సహాయంతో స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించింది. ఇక్కడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విచారణ అనంతరం పార్వతీదేవి మృతదేహాన్ని దేవాలయ అధికారులు ప్రత్యేకంగా అంబులెన్స్ ఏర్పాటు చేసి కొమరవోలు గ్రామానికి పంపించారు. తొక్కిసలాటవల్లేనా..?: కార్తీక మాసం మూడవ సోమవారం సందర్భంగా తెల్లవారుఝాముకు రాష్ట్రం నలుమూలలనుంచి పంచారామ యాత్ర చేయటానికి సుమారు 400 బస్సుల్లో వచ్చిన 20వేల మంది భక్తులతోపాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు ఏడువేల మంది భక్తులతో ఆలయం కిటకిటలాడింది. వీరి తాకిడికి ఆలయంలో ఏర్పాటు చేసిన బారికేడ్లు కూడా విరిగి పోవటంతో భక్తులు ఎటువెళ్లాలో తెలియక చిన్నపాటి తోపులాట చోటు చేసుకుంది. పంచారామాల బస్సుల్లో వచ్చిన యాత్రికులంతా మిగిలిన నాలుగు క్షేత్రాల సందర్శనకు త్వరగా వెళ్లాలనే ఆతృతతో క్యూలైన్లలో హడావుడి చేయటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. -
తిండిలోనూ కక్కుర్తి..
ఉట్నూర్ : మండలంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పెట్టే తిండిని పలువురు గద్దల్లా దోచుకెళ్తున్నారు. వైద్యం కోసం వచ్చే రోగులకు మెనూ ప్రకారం భోజనం పెట్టాలనే నిబంధనలు ఉన్నా.. నీళ్ల సాంబార్‌తో పెట్టి చేతులు దులుపుకుంటున్నారు. భోజనంలో గుడ్డు, అరటిపండు, పెరుగు, కూరగాయలు కనిపించడం లేదు. అదీకాక వైద్యం కోసం వచ్చే రోగి వెంట వచ్చిన మరొకరికి భోజనం పెట్టాలనే నిబంధన ఉన్నా.. ఒకరికే అందిస్తూ దోచుకుంటున్నారు. ఇదీ ఉట్నూర్ పరిధిలోని సీహెచ్‌సీ ఆస్పత్రిలో కొనసాగుతున్న తంతు. 80 వరకు ఇన్‌పేషెంట్లు.. సామాజిక ఆరోగ్య కేంద్రంలో నిత్యం 30 నుంచి 80 మంది వరకు ఇన్‌పేషెంట్లు ఉంటారు. సమస్యాత్మక మండలాల్లో నివాసం ఉండే గిరిజనులకు సీహెచ్సీనే పెద్ద దిక్కు. మండల వాసులే కాకుండా సిర్పూర్(యు), ఇంద్రవెల్లి, నార్నూర్, జైనూర్ మండలాలకు చెందిన గిరిజనులు ఇక్కడికి వైద్యం కోసం వస్తుంటారు. అలా వచ్చిన వారిలో ఇన్పేషెంట్లుగా ఉండే రోగికి, వెంబడి వచ్చే మరొకరికి ప్రభుత్వం భోజన వసతి కల్పిస్తోంది. ఇందుకు భోజనం వడ్డించే నిర్వాహకుడికి ఒక్కరికి ప్రభుత్వం రోజుకు రూ.45 చొప్పున చెల్లిస్తోంది. జరుగుతోందిదీ.. సీహెచ్‌సీలో నిత్యం అన్నం, నీళ్ల సాంబారే పెడుతున్నారని రో గులు వాపోతున్నారు. మెనూ ప్రకారం ఉదయం అల్పాహారం కింద కప్పు టీ, 50 గ్రాముల పాలు, 100 గ్రాముల బ్రెడ్తోపా టు ఇడ్లీ, కిచిడి, ఉప్మా, పొంగల్ ఇలా ఏదో ఒకటి వడ్డించాలి. కానీ.. రోజూ నీళ్ల పాటు, బ్రెడ్ మాత్రమే ఇస్తున్నారని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇడ్లీ, ఉప్మా, కిచిడి వారంలో రెండు లేదా మూడు సార్లు మాత్రమే అందిస్తున్నారని చెబుతున్నారు. ఇక మధ్యాహ్న బోజనం పుల్కలు, ఉడికిన అన్నం, కూరగాయలతో చేసిన కూర, సాంబార్, ఉడకబెట్టిన గుడ్డు, 200 మిల్లీలీటర్ల పెరుగు, అరటి పండు ఇవ్వాల్సి ఉంది. కేవలం అ న్నం, నీళ్ల సాంబార్ ఇస్తూ రోగులను పౌష్టికాహారానికి దూరం చేస్తున్నారు. గుడ్డు అదివారం మాత్రమే పెడుతున్నారు. ఇదే భోజనాన్ని గర్భిణులు, అన్ని రకాల రోగులకు అందిస్తున్నారు. పెట్టెది ఒక్కరికి.. పొందేది ఇద్దరి బిల్లులు.. ప్రభుత్వం ఒకరికి రోజుకు రూ.45 చెల్లిస్తుండగా.. నిర్వాహకులు ఒకరికి మాత్రమే భోజనం పెడుతున్నారు. కానీ.. బిల్లు లో మాత్రం రోజు వారి ఐపీ సంఖ్య, వారి వెంట వచ్చే వారి సంఖ్యతోపాటుగా బిల్లులు కాజేస్తున్నట్లు సమాచారం. ఇలా నెలకు వేలాది రూపాయాలు దోచుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా.. దీనిపై నిర్వాహకుడు ఖానాపూర్‌కు చెందిన లాలా వివరణ కోసం ఫోన్లో ప్రయత్నించగా.. ఆయన ఏం సమాధానం ఇవ్వకుండానే కట్ చేశారు. పర్యవేక్షణ కరువు... సీహెచ్‌సీకి పూర్తిస్థాయి మెడికల్ సూపరింటెండెంట్ లేకపోవడంతో ఆస్పత్రిపై పర్యవేక్షణ కొరవడింది. దీంతో రోగులకు మెనూ ప్రకారం భోజనం అందడం లేదు. ఇలాంటి భోజనం తింటే రోగాలకు తోడు కొత్త రోగాలు తయారవుతారని పలువురు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోగులకు సరైన భోజనం అందేలా చూడాలని కోరుతున్నారు. ఈ విషయమై ఇన్చార్జి డీసీహెచ్ చంద్రమౌళి స్పందిస్తూ సీహెచ్‌సీని సందర్శించి విచారణ చేపడుతామని, మెనూ ప్రకారం పెట్టకుంటే కాంట్రాక్ట్ తీసుకున్న భోజన నిర్వాహకునిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. -
అందని ద్రాక్షలా సర్కార్ వైద్యం
దుబ్బాక, న్యూస్‌లైన్ : ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు సర్కారు వైద్యం అందని ద్రాక్షలా మారింది. అధికారుల నిర్లక్ష్యం మూలం గా 24 గంటల వైద్యం.. కేవలం రెండు గంటలకు మాత్రమే పరిమితమైంది. పేద ప్రజలకు వైద్య సేవలు అందించాలన్న సదుద్దేశంతో పదేళ్ల క్రితం దుబ్బాకలో సీహెచ్‌సీ (కమ్యూనిటీ హెల్త్ సెంటర్) సామాజిక ఆరోగ్య కేం ద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. లక్షలు వెచ్చించి నిర్మించిన భవనంలో ఆపరేషన్ థియేటర్‌తో పాటు గర్భిణులకు, నవజాత శిశువులకు మెరుగైన వై ద్య సేవలు అందించేందుకు ప్రత్యేక సా మగ్రిని కూడా ప్రభుత్వం సమకూర్చింది. సీహెచ్‌సీలో వైద్యాధికారితో పాటు మరో నలుగురు వైద్యులు, నలుగురు స్టాఫ్ నర్సులు ఇక్కడ విధులు నిర్వర్తిం చాల్సి ఉంది. ప్రస్తుతం ఇన్‌చార్జ్‌ల పాల నలో కొనసాగుతోంది. ప్రస్తుతం సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యాధికారిగా పనిచేస్తున్న కృష్ణారావు స్థానిక సీహెచ్‌సీ ఇన్చార్జ్ వైద్యాధికారిగా పనిచేస్తున్నారు. దీనికి తోడు ఇక్కడ ఇద్దురు మాత్రమే వైద్యులు, ఇద్దరు స్టాఫ్ నర్సులు పనిచేస్తున్నారు. ఈ పరిస్థితి రెండేళ్లుగా కొనసాగుతోంది. దీంతో కేవలం సోమవారం నుంచి శనివారం వరకు కేవలం ఉద యం వేళల్లోనే అంటే రెండు గంటల పా టు వైద్యులు అందుబాటులో ఉంటారు. మిగిలిన సమయంలో వైద్యు లు కానీ సిబ్బంది కానీ అందుబాటులో ఉండటం లేదు. ఓపీ (ఔట్ పేషెంట్స్) (బయట రోగులకు) మాత్రమే నామమాత్రంగా వైద్యం అందిస్తున్నారు. ఒక్కొక్క సారి వైద్యులు రాక వెనుతిరుగుతున్నారు. గత నెలలో రెండే..రెండు ప్రసవాలు దుబ్బాక సీహెచ్‌సీలో ఏప్రిల్ నెలలో కేవలం రెండు ప్రసవాలు (డెలివరీ) కేసులున్నాయి. దీన్ని బట్టి ఈ ఆస్పత్రిలో ఎంత మేరకు వైద్యం అందుతుందో అర్థమవుతుంది. కలెక్టర్ స్మితా సబర్వాల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన మార్పు కార్యక్రమంలో కూడా ఈ ఆస్పత్రిలో డెలివరీ కేసులను పెంచకపోవడం గమనార్హం. నిత్యం గ్రామాల నుంచి గర్భిణులు ఈ ఆస్పత్రిలో కాన్పు కోసం వచ్చి విధిలేని పరిస్థితుల్లో తిరిగి వెళుతున్నారు. ఆస్పత్రిలోని కొందరు సిబ్బంది గర్భిణులను సిద్దిపేట ఆస్పత్రికి, తిమ్మాపూర్ పీహెచ్‌సీకి పంపుతున్నారన్న విమర్శలున్నాయి. అంతేగాక స్థానిక ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాలంటూ ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో పాటు 108 అంబులెన్స్ సిబ్బందితో పాటు ఆస్పత్రి సిబ్బంది రోగుల విషయంలో గొడవలు పెట్టుకున్న సందర్భాలు లేకపోలేదు. ఇక్కడికిడెలివరీ కేసులు, రాత్రిళ్లు రోగులను తీసుకురావద్దని బాధితులతో గొడవలు పెట్టుకోవడం ఇక్కడ సాధారణం.