government record
-
‘ఆటో’ బతుకులు అస్తవ్యస్థం
సాక్షి, అమరావతి: ‘అటో డ్రైవర్ కె.శివారెడ్డి ఊర్మిళనగర్ రెండో లైనులో అద్దె ఇంటిలో నివసిస్తున్నాడు. ఇటీవల వచ్చిన బుడమేరు వరదలకు ఆ ఇల్లు మునిగిపోయింది. జీవనాధారమైన ఆటోతో పాటు ద్విచక్రవాహనం పూర్తిగా పాడైపోయాయి. సచివాలయ సిబ్బంది వచ్చి వివరాలు నమోదు చేసుకుని వెళ్లారు. కానీ ఇంత వరకూ ఒక్క రూపాయి కూడా పరిహారం రాలేదు. అప్పు చేసి ఆటోకు మరమ్మతులు చేయించుకుంటే రూ.45 వేలు ఖర్చయింది. ఇంటికిగానీ, వాహనాలకు గానీ పరిహారం ఇప్పించాలంటూ కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నాడు.పదహారేళ్లుగా ఇదే ప్రాంతంలో ఆటో నడుపుతున్న నా పేరు ఎందుకు జాబితాలో లేదని ఎవరిని అడిగినా సమాధానం చెప్పడంలేదని వాపోతున్నాడు.’’...ఇది బుడమేరు వరదల్లో ఆటోలను కోల్పోయిన వేలాది మంది డ్రైవర్ల ఆవేదన. నగరంలో తిరిగే ఆటోలలో అతకధికం సింగ్ నగర్, ఇందిరానాయక్ నగర్, పాయకాపురం, కండ్రిగ, వాంబేకాలనీ, మిల్క్ ప్రాజెక్ట్, డాబా కోట్లు సెంటర్, రాజరాజేశ్వరిపేట, నందమూరి కాలనీ, భరతమాత కాలనీ, ఊరి్మళనగర్ల నుంచే వస్తున్నాయి. అక్కడి నిరుద్యోగులు డ్రైవర్లుగా మారి జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు వారందరి జీవితాలు అస్తవ్యస్ధంగా మారాయి. ఈ నేపధ్యంలో ఆ ప్రాంతాల్లో పర్యటించి బాధితుల బతుకు చిత్రంపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్ ఇది.మరమ్మతులకు కొత్త అప్పులురోజుల తరబడి ముంపులోనే ఉండటంతో ఆటోలు పూర్తిగా దెబ్బతిన్నాయి. బయట మెకానిక్ దగ్గర నుంచి కంపెనీ షోరూమ్ వరకూ ఒక్కో దాని మరమ్మతులకే రూ.12 వేల నుంచి రూ.75 వేల వరకూ వ్యయం అవుతోంది. రేడియేటర్, ఇంజిన్, బ్యాటరీతో పాటు బీఎస్ 6 వాహనాల్లో సెన్సార్లు పాడవ్వడంతో ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఇన్ని వాహనాలకు మరమ్మతులు చేసేందుకు మెకానిక్‌ల కొరత ఉండటంతో రోజుల తరబడి మోటార్ షెడ్ల వద్దే ఆటోలు పడి ఉంటున్నాయి. ఒకసారి మరమ్మతు చేసినా మళ్లీ మళ్లీ కొత్త లోపాలు బయటపడుతున్నాయి. దీంతో కొత్త అప్పులు చేసి మరమ్మతులకు వెచి్చస్తున్నారు. ఉపాధి లేక, కుటుంబాలను పోషించుకోలేక, వాయిదాలు కట్టలేక అవస్థలు పడుతున్నామని డ్రైవర్లు నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారు. ఓట్లేయించుకున్న రాష్ట్ర ప్రభుత్వంగానీ, స్థానిక ప్రజాప్రతినిధులుగానీ తమను అసలు పట్టించుకోవడం లేదని కన్నీరుమున్నీరవుతున్నారు.బీమా సంస్థల కొర్రీలువరద నీటిలో మునిగిన ఆటోలకు క్లెయిమ్‌లు ఎగవేసేందుకు బీమా సంస్థలు ఉన్న అన్ని అవకాశాలనూ వాడుకుంటున్నాయి. బీమా చేసే సమయంలో డ్రైవర్ల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారికి తెలియని షరతులను పొందుపరిచి వాటిని ఇప్పుడు సాకుగా చూపిస్తున్నాయి. ఒక ఆటోకి బీమా రావాలంటే సుమారు రెండు నెలలు సమయం పడుతుందని తప్పించుకుంటున్నాయి. అదికూడా వరద వచి్చనప్పటి నుంచి ప్రతి దశలోనూ తీసిన ఫొటోలు, వీడియోలు ఉంటేనే బీమా వర్తిస్తుందని మెలికపెడుతున్నాయి.ప్రాణాలే కాపాడుకుంటామా, ఫొటోలు తీస్తామా అంటూ బాధితులు అడుగుతుంటే బీమా సంస్థలు సమాధానం చెప్పడం లేదు. రెండు వారాల్లోనే క్లెయిమ్‌లు పూర్తి చేసేలా బీమా సంస్థలతో మాట్లాడామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది. ఆచరణలో మాత్రం అది శూన్యం. బీమా సంస్థలు కనీసం 45 రోజుల పాటు ఆటోను ఉన్న చోటు నుంచి కదపకుండా ఉంచాలని చెప్పాయి. అప్పటి వరకూ మరమ్మతు చేయకపోతే మొత్తానికే పనికిరాదని, ప్రభుత్వం ఈ విషయంలో పట్టించుకోవడం లేదని డ్రైవర్లు ఆవేదన చెందుతున్నారు.పరిహారం లేదురాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా సెప్టెంబర్ 1న విజయవాడలో వదర విలయం సృష్టించింది. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వారి జీవనాధారాలైన ఆటోలు, మోటార్ సైకిళ్లు వరద నీటిలో పూర్తిగా మునిపోయాయి. రోజుల తరబడి బురద నీటిలోనే నానిపోవడంతో ఇంజిన్, సెన్సార్లు,కార్బొరేటర్ వంటి ముఖ్యమైన భాగాలు దెబ్బతిన్నాయి. ఆటోకి రూ.10 వేలు, ద్విచక్ర వాహనానికి రూ.3 వేలు చొప్పున పరిహారం ఇస్తామన్న ప్రభుత్వం రకరకాల కొర్రీలతో మూడొంతుల మందిని మోసం చేసింది. ఆటో నడిపితేగానీ పూటగడవని నిరుపేదలు వాటిని బాగు చేసుకోలేక, కుటుంబాన్ని పోషించుకోలేక ప్రభుత్వ కార్యాలయాలు,అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. బుడమేరు వరదల వల్ల దాదాపు 15 వేలకుపైగా అటోలు నీట మునిగితే ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం కేవలం 6,515 మాత్రమే ఉన్నట్టు రవాణా శాఖ అధికారులు వెల్లడించారు. వీటిలో 4,348 ఆటోలకు పరిహారం అందించినట్లు ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేశారు. కానీ వాస్తవానికి మొత్తం బాధితుల్లో దాదాపు 80 శాతం మంది ఆటోవాలాలకు నష్టం పరిహారం అందలేదని బాధితులు చెబుతున్నారు. చాలా మంది పేర్లు బాధితుల జాబితాలోనే లేవు..కొందరి పేర్లు ఉన్నా వారికి డబ్బులు పడలేదు.ఎవరూ పట్టించుకోవట్లేదు‘‘వరదల్లో ఇల్లు మునిగిపోయింది. ఆటో బాగా బెబ్బతింది. ప్రస్తుతానికి నడిచేలా చేయడానికి రూ.8 వేలు ఖర్చయ్యింది. ప్రభుత్వం రూ.10 వేల ఇస్తామని చెప్పింది. కానీ మా వివరాలను నమోదు చేయడానికి కూడా ఎవరూ రాలేదు. సచివాలయంలో అడిగితే కలెక్టరేట్‌కు వెళ్లమని చెప్పారు. అక్కడికి వెళితే ఎవరూ పట్టించుకోవడం లేదు.’’ –లింగయ్య, ఆటో డ్రైవర్, రాజీవ్‌నగర్ కాలనీజీవనాధారం పోతే పరిహారం రాదా?‘‘ఆటో నడిపితేగానీ మా కుటుంబం నడవదు. వరదల వల్ల ఆటో మునిగిపోయి జీవనాధారాన్ని కోల్పోయాం. బీమా రావాలంటే 45 రోజులు ఆటోను వాడకూడదంటున్నారు. బాగు చేయించుకునే స్తోమత కూడా లేదు. అయినా జాబితాలో మా పేరు లేదంటున్నారు. సచివాలయానికి వెళ్లి అడిగితే తమకేమీ తెలియని చెబుతున్నారు. మా గోడును ఎవరికి చెప్పుకోవాలి. మమ్మల్ని ఆదుకునేవారెవరు.’’ –బాబ్జి, ఆటో డ్రైవర్, రాజరాజేశ్వరిపేటఅద్దె ఆటోనే ఆధారం‘‘నేను ఆటోను అద్దెకు తీసుకుని నడుపుతున్నాను. వరదకు ఆటో మునిగిపోయింది. ఎలాంటి పరిహారం రాలేదు. ఎవరిని అడిగినా ఎలాంటి ఉపయోగం లేదు.ఏం చేయాలో తెలియడం లేదు.’’ –దుర్గారావు, ఆటో డ్రైవర్, వాంబేకాలనీ.చాలా ఖర్చవుతోంది‘ఇంటర్ చదివి ఆటో నడుపుతున్నాను. మా నాన్న కూడా ఆటో డ్రైవరే. రెండు ఆటోలూ వరదలో మునిగిపోయాయి.ఒక సారి రిపేరుకి రూ.12 వేలు ఖర్చయ్యింది. కానీ మళ్లీ రేడియేటర్ పాడయ్యింది. నాలుగు రోజులుగా మెకానిక్ దగ్గరే పెట్టి బాగుచేయిస్తున్నాం.’’ –వై.సాయి, ఆటో డ్రైవర్, పాయకాపురం. -
మందబయలు భూముల్లో నిర్మాణాలొద్దు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ రికార్డుల్లో మందబయలుగా వర్గీకరించిన భూముల్లో గ్రామ పంచాయతీలు ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. మందబయలుగా వర్గీకరించిన భూమిని కేవలం పశువులను మేపడం వంటి సామాజిక ప్రయోజనాలకే ఉపయోగించాలి తప్ప, ఇతరత్రా వినియోగించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. మందబయలుగా వర్గీకరించిన భూమిని బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్(బీఎస్‌వో) ప్రకారం ‘అసెస్డ్ వేస్ట్ డ్రై’గా రికార్డుల్లో మార్చకుండా దానిని ఇతర ప్రయోజనాలకు ఉపయోగించరాదని, బీఎస్‌వో ప్రకారం భూమి వర్గీకరణను మార్చిన తరువాత ఆ భూమిని సంబంధిత పంచాయతీకి బదలాయిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడం తప్పనిసరి తెలిపింది. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం ముత్యాలపల్లి సర్వే నంబర్ 74/3లో మందబయలు భూమిని తమకు పట్టాలుగా కేటాయించారని, ఆ భూమిలోని 24 సెంట్లలో అధికారులు గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం వంటి నిర్మాణాలు చేపడుతున్నారని, ఆ భూమిలో నిర్మాణాలు చేపట్టకుండా ఆదేశాలివ్వాలని గ్రామానికి చెందిన కొల్లాటి ఏడుకొండలు, మరో ముగ్గురు హైకోర్టును ఆశ్రయించారు. తమ స్థలం విషయంలో అధికారులు జోక్యం చేసుకుంటున్నారంటూ మరికొందరూ మరో రెండు వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన జస్టిస్ సత్యనారాయణమూర్తి ఇటీవల తీర్పు వెలువరించారు. పిటిషనర్లు చెబుతున్న 74/3లోని భూమి ‘మందబయలు’ అని మొగల్తూరు తహసీల్దార్ దాఖలు చేసిన కౌంటర్లో పేర్కొన్న విషయాన్ని న్యాయమూర్తి ప్రస్తావించారు. అప్పటి ఎమ్మార్వో సంతకాన్ని ఫోర్జరీ చేసి పిటిషనర్లు పట్టాలు పొందినట్టు తహసీల్దార్, పంచాయతీ అధికారులు చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు చూపాల్సిన బాధ్యత వారిదేనని స్పష్టం చేశారు. అధికారులు తమ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు చూపలేకపోయారని, రికార్డులను బట్టి చూస్తే ఆ భూమి పిటిషనర్ల స్వాధీనంలో ఉందని పేర్కొన్నారు. ఆ భూమిని అసెస్డ్ వేస్ట్ డ్రైగా మార్చకుండా, ఆ భూమిని పంచాయతీకి బదలాయించకుండా గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం వంటి నిర్మాణాలు చేపట్టడం చట్ట విరుద్ధమని తన తీర్పులో పేర్కొన్నారు. -
18 నెలల్లో 8 మంది పిల్లలు!
పట్నా: ఇదెలా సాధ్యమని ఆశ్చర్యపోతున్నారా? బిహార్ ప్రభుత్వ రికార్డుల ప్రకారం సాధ్యమే. 18 నెలల కాలంలో ఏకంగా ఒక మహిళ 8 మంది పిల్లలకు జన్మనిచ్చిందని రికార్డుల్లో రాసి డబ్బులు దండుకున్నారు. ఇంతకీ ఆమె వయసెంతో తెలుసా? 65 ఏళ్లు. జాతీయ ఆరోగ్య మిషన్ కింద ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు జరిగితే ప్రోత్సాహకంగా సదరు మహిళకు రూ.1,400, సాయపడిన ఆశ కార్యకర్తకు రూ.600 అందజేస్తారు. అక్రమార్కులు ఈ నిధులనూ వదల్లేదు. ముజఫర్‌పూర్‌లో చోటి కొతియా గ్రామానికి చెందిన లీలాదేవి (65)కి నలుగురు సంతానం. 21 ఏళ్ల కిందట ఆమె తన నాలుగో సంతానానికి జన్మనిచ్చింది. అయితే, గత ఏడాదిన్నరలో లీలాదేవి 8 మంది పిల్లలను కన్నట్లు రికార్డుల్లో రాసి పారేశారు. ప్రోత్సాహక డబ్బును మింగేశారు. విషయం తెలిసిన లీలాదేవి తన ఖాతా ఉన్న కస్టమర్ సర్వీసు పాయింట్‌కు వెళ్లి నిలదీయగా.. డ్రా చేసిన డబ్బును తిరిగి ఇస్తాం, ఫిర్యాదు చేయవద్దని కోరారు. మరో మహిళ శాంతిదేవి (66) 10 గంటల వ్యవధిలో ఇద్దరికి జన్మనిచ్చినట్లు చూపించారు. ఇలా 50 మందికి పైగా మహిళల పేరిట డబ్బు కాజేసినట్లు తేలడంతో కలెక్టర్ చంద్రశేఖర్ సింగ్ ఎంక్వైరీకి ఆదేశించారు. -
రికార్డుల్లో పేరు.. కాలగర్భంలో ఊరు
ఊరి పేరు గొప్పగా ఉంటుంది.. భూ రికార్డుల్లోనూ ఆ ‘పేరు’ వెలిగిపోతుంటుంది.. ఎవరైన కొత్తవాళ్లు భూ రికార్డులు తిరగేస్తూ ‘ఓసారి ఆ ఊరెళ్లి చూసొద్దాం పదా’ అంటే తల పట్టుకోవాల్సిందే.. ఎందుకంటే భౌతికంగా ఆ ఊరే ఉండదు మరి.. అవును రెవెన్యూ రికార్డుల్లో పేరు ఉన్నా భౌతికంగా కనిపించని గ్రామాలు జిల్లాలో వందల సంఖ్యలో ఉన్నాయి. నీటి వసతి లేక కొన్ని.. ఉపాధి లేక ఇంకొన్ని.. పాలేగాళ్ల దాడులతో కొన్ని.. ఫ్యాక్షన్ గొడవలతో మరికొన్ని కాలగర్భంలో కలిసిపోయాయి. పేర్లు ఉన్నా.. ఊర్లు లేని గ్రామాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. సాక్షి ప్రతినిధి కడప:జిల్లా వ్యాప్తంగా ఓ వెలుగు వెలిగిన గ్రామాలు రెండు వందల ఏళ్ల క్రితమే శిథిల శకలాలుగా మిగిలి కాలగర్భంలో కలిసిపోయినట్లు చరిత్ర చెబుతోంది. అప్పట్లో బందిపోట్లు, దివిటి దొంగల వరుస దాడులతో తట్టుకోలేక అటవీ ప్రాంతాల శివారు గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఊర్లు వదిలిపెట్టగా మరోవైపు పాలేగాళ్ల దాడులు, ఒత్తిళ్లతోనూ మరికొన్ని గ్రామాలు ఖాళీ అయ్యాయి. కలరా, ధూము లాంటి జబ్బులతో మృత్యువాతపడి వాటి నుంచి తప్పించుకునేందుకు సెంటిమెంటుగా ఖాళీ అయిన గ్రామాలు కొన్ని కాగా, సాగు, తాగునీరు అందక, వ్యవసాయం వీలుకాక ఉపాధిని వెతుక్కొంటూ ఖాళీ అయిన ఊర్లు మరికొన్ని. ఇక ఫ్యాక్షన్ గొడవలతో జనం ఖాళీ చేసిన ఊర్లు ఇంకొన్ని. మొత్తంగా 200 ఏళ్ల క్రితం వరకు వెలుగు వెలిగిన చాలామటుకు గ్రామాలు ఇప్పుడు భౌతికంగా కనుమరుగయ్యాయి. జిల్లాలోని బద్వేలు, జమ్మలమడుగు, రైల్వేకోడూరు, రాయచోటి, కమలాపురం, మైదుకూరు తదితర ప్రాంతాలలో ఇలా కనుమరుగైన గ్రామాల జాబితా చాంతాడంత ఉంది. ఇప్పటికీ ఆ గ్రామాల పేర్లతోనే పంచాయతీ కేంద్రాలు, రెవెన్యూ గ్రామాలు కొనసాగుతున్నాయి. రెవెన్యూ భూ రికార్డులు సైతం కనుమరుగైన గ్రామాల పేరుతోనే ఉండడం మరో విశేషం. వాసుదేవపురం గుర్తులు రైల్వేకోడూరు మండలంలోని రాఘవరాజపురం పంచాయతీ వాసుదేవపురం మాయమైనా రెవెన్యూ రికార్డులలో మాత్రం నిక్షిప్తమై ఉంది. రాఘవరాజపురం ప్రధాన రహదారి గంగరాజపురం మీదుగా ఒక కిలోమీటరు ప్రయాణిస్తే వాసుదేవపురం ఉండేది. 50 సంవత్సరాల క్రితం కొందరు గిరిజనులు ఇక్కడ నివాస ముంటుండేవారు. కాలానుగుణంగా వారు ఇతర ప్రాంతాలకు, చుట్టుపక్కల ఊర్లలోని వ్యవసాయ భూములలో కాపలా ఉంటూ నివాసాలు మార్చుకోవడంతో ఈ వాసుదేవపురం మరుగున పడిపోయింది. గతంలో మా పూర్వీకులు ఉండేవారు నాపేరు తుపాకుల గంగయ్య, నేను రాఘవరాజపురం రాజీవ్ గిరిజన కాలనీ, రైల్వేకోడూరులో నివాస ముంటున్నాను. మా బంధువుల పూర్వీకులు వాసుదేవ పురంలో నివాసముండేవారు. వారు అక్కడ దబ్బరగా ఉండే తోటలలో ఉంటూ పనులు చేసుకొంటూ జీవనం సాగించేవారు. దూరంగా ఉండడంవల్ల ఉపాధి కోసం అందరూ నివాససాలు మార్చుకొన్నారు. ఇంకా వాసుదేవపురం గుర్తుందంటే ఆనందంగా ఉంది. తుగూట్ల పల్లికి సజీవ సాక్ష్యంగా నిలిచిన బురుజు జమ్మలమడుగు మండల పరిధిలోని అంబవరం పంచాయతీలో తూగుట్లపల్లి, గొరిగేనూరు పంచాయతీ పరిధిలో పాత కొండాపురం గ్రామాలు ఉండేవి. దోపిడీ దొంగల దాడులతో కాల క్రమేణ గ్రామాలు పూర్తిగా తుడుకు పెట్టుకుపోయాయి. గ్రామాలలో నివాసం ఉన్న వారందరూ వివిధ ప్రాంతాలలో స్థిరపడిపోయారు. ప్రస్తుతం ఆయా గ్రామాల ఇండ్లకు సంబంధించిన ఆనవాళ్లు కూడా కనిపించకుండపోయాయి. దొంగల నుంచి కాపాడుకునేందుకు నిర్మించుకున్న బురుజులు, గంగమ్మ దేవాలయాలు నేటి తరానికి సాక్ష్యాలుగా నిలిచాయి. కాల గర్భంలో కలిసిన గ్రామం చింతకొమ్మదిన్నె మండలంలోని బుగ్గలపల్లి పంచాయతీ పరిధిలో దాదాపు 90 ఏళ్ల క్రితం రుద్రయ్యగారిపల్లి అనే గ్రామం ఉండేది. ఈ గ్రామంలోని కుటుంబాలు అన్ని కలరా వ్యాధికి గురవ్వడంతో గ్రామస్తులు గ్రామాన్ని వదిలి చుట్టుపక్కల గల వివిధ గ్రామాల్లో చేరారు. అనంతరం తిరిగి గ్రామంలోకి ఎవరూ ప్రవేశించకపోవడంతో అక్కడ ఉన్న కట్టడాలు, ఇళు, ఆనవాళ్లు కరుమరుగయ్యాయి. రికార్డులకు మాత్రమే పరిమితం వల్లూరు మండలంలో కోదండరామాపురం, ఓబన సోయయాజులపల్లె, అంకాయపల్లె, యాదవాపురం గ్రామాలు రెవెన్యూ గ్రామాలుగా పిలువబడుతూ రికార్డుల్లో మాత్రమే మనకు కనిపిస్తాయి. ఒకప్పుడు అగ్రహారాలుగా చలామణిలో వున్న ఈ గ్రామాలు కాల క్రమంలో కనుమరుగయ్యాయి. ప్రస్తుతం ఆయా గ్రామాల భూములు మాత్రమే రికార్డుల్లో మనకు కనిపిస్తాయి. కవ్వపు చప్పుళ్ల మధ్య.. 18వ శతాబ్దపు చివరలో దివిటి దొంగల దోపిడీతో అదృశ్యమైన పోయిన చాలా గ్రామాల్లో కాశినాయన మండలంలోని అక్కెంగుండ్ల ఒకటి. 13వ శతాబ్దం నుంచి ఉన్న గ్రామాల్లో చాలా పెద్దది. ఇది ఆకులనారాయణపల్లె సమీపంలో ఉన్న గుండోని కుంట పరిసరాల్లో ఉండేది. ఆనాడే రెండువేలకు పైగా గడపలు ఉన్న ఊరు. చుట్టూ ఎతైన రక్షణగోడ కట్టుకుని నాలుగువైపులా బురుజులు నిర్మించి, గ్రామ రక్షక దళం ఏర్పడి దోపిడి దొంగల నుంచి తమను కాపాడుకునేవారు. పంటలు, ఆవులతో ఇంటింటా ఉండి పాడిపంటలతో సమృద్ధిగా ఉండేది. తెల్లవారుజామున ఊరంతా మజ్జిగ చిలికే సవ్వడులు చాలా దూరం వినిపించేవి. దోపిడీ దొంగలు ఎన్ని పర్యాయాలు దాడులు చేసినా వారి గుర్రాల కాలి గిట్టల చప్పుడుతో రక్షకదళం అప్రమత్తమై వడిసెల రాళ్లతో వారిని తరిమేవాళ్లు. ఎలాగైనా ఊరిని కొల్లగొట్టాలని దొంగలు యోచించి తెల్లవారుజామున మజ్జిగ కవ్వపు చప్పుల్లో ఉనికి పసిగట్టకుండా గుర్రాలతో వచ్చి ఊరిమీద దాడి చేసి మగాళ్లందరనీ ఊచకోత కోశారు. ఈ బీభత్సంతో ఆడవాళ్లంతా మాన రక్షణకు గ్రామంలో ఉన్న ఊరబావిలో దూకడంతో నిండుగా ఉన్న నీళ్లంతా పొంగిపోర్లాయని స్థానికులు ఇప్పటికీ చెప్పుకుంటుంటారు. ఈ గ్రామం అనవాళ్లు కూడా లేవు. సంచర్ల కథ పోరుమామిళ్ల మండలంలోని సంచర్ల 200 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న గ్రామం. ఒకప్పుడు ఇక్కడ బ్రాహ్మణుల అధిపత్యం ఉన్న గ్రామం. వీరికి వందల ఎకరాలు మాన్యాలు కూడా ఉండేవి. చుట్టుపక్కల గంగిరెద్దుల వాళ్లు, యానాదులు వంటి సంచార జాతులు గ్రామంలో ఉండేవారు. వీరి పేరు మీద సంచారాల అని పేరు ఉండగా ఇది వాడుకలో సంచర్లగా మారింది. పక్కగ్రామంతో అధిపత్యపోరుతో బ్రాహ్మణులు వలస పోగా కొన్నాళ్ల తరువాత సంచార జాతులు కూడా ఇతర గ్రామాలకు వలస వెళ్లారు. దీంతో ప్రస్తుతం గ్రామంలో పది కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. ఇప్పటికీ పంచాయతీ పేరు సంచర్ల మీదనే ఉండగా పంచాయతీ కేంద్రం మాత్రం నాగలకుంట్లకు మారింది. కత్తెరగండ్ల ప్రస్తుత శ్రీ అవధూత కాశినాయన మండలంలోని కత్తెరగండ్ల ఒక పురాతన గ్రామం. కృష్ణదేవరాయుల కాలంలో ఇక్కడ కుటీరపరిశ్రమలతో పాటు వాణిజ్య కార్యకలాపాలు జోరుగా సాగేవి. నల్లమల కొండల్లోని ‘ఇనుపసరూట్ల’ వద్ద తీసిన ఇనుపఖనిజాన్ని ఎర్రబట్టిల గ్రామం వద్ద కాల్చి ఇనుము తయారు చేసి వ్యాపారం చేసేవారని, దీనికి కూడా ‘దారికాపు’(నేటి టోల్గేట్లు) పన్నులూ వసూలు చేశారని ఆధారాలున్నాయి. దాదాపు పదో శతాబ్దం కంటే ముందు నుంచే గ్రామమున్నట్లు చారిత్రకం. ఈ గ్రామం ఏ కారణంతో శిథిలమైందనే విషయానికి సరైన ఆధారాల్లేవు. ఊరు శిథిలమైనా పంచాయతీ పేరు మాత్రం కత్తెరగండ్లగా ఉంది. దీనికి పంచాయతీ కేంద్రంగా చెన్నవరం ఉంది. 13వ శతాబ్దంలో జనమేయ కాలంలో నిర్మించిన చెన్నకేశవ స్వామి పేరున చెన్నవరం ఏర్పడింది. భార్యాభర్తల పేరు మీద.. బద్వేలు మండలంలోని లక్ష్మిపాలెం ఆధ్యాత్మిక క్షేత్రంగా ఉంది. ఈ గ్రామానికి ఉన్న చరిత్ర చాలా గొప్పది. 400 ఏళ్ల కిందట సిద్ధవటంను పాలించే మట్టి అనంతరాజుల కాలంలో భర్త అనంతరాజు పేరు మీద అనంతరాజుపురం, భార్య లక్షుమ్మ పేరు మీద లక్ష్మిపాలెం ఏర్పాటు చేశారు. కాలక్రమేణా రికార్డుల్లో ఇప్పటికీ అనంతరాజుపురం అని ఉన్నా ప్రజల వాడుకలో లక్ష్మిపాలెంగా ఉంది. మట్లి రాజుల కాలంలో నిర్మించిన లక్ష్మివెంకటేశ్వర స్వామి గుడి, బద్వేలు పెద్దచెరువు ఆ గ్రామానికి గొప్ప చరిత్రను తెచ్చాయి. కనిపించని టి.శేషంపల్లె పోరుమామిళ్ల మండలం టి.శేషం పల్లె రెవెన్యూ గ్రామం ఇప్పటికీ రికార్డుల్లో ఉన్నా గ్రామం లేదు. ఇది ప్రస్తుతం ఉన్న దమ్మనపల్లె సమీపంలో ఉండేదని చరిత్ర. కొండ దిగువున ఉన్న ఈ ఊరు వరదలు, భారీ తుఫాన్లతో ఎప్పుడూ నష్టపోయేదని, దీంతో ఇక్కడ నివసిస్తున్న వడ్డెరలు, ముదిరాజ్ సామాజిక వర్గం ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారని పెద్దలు చెబుతున్నారు. రంపాడు చరిత్ర 13వ శతాబ్దలో ఉన్న పెద్ద గ్రామాల్లో రంపాడు ఒకటి. కాశినాయన మండలంలో పారే సగిలేటి నది ఒడ్డున ఉండేది. అసలు పేరు ధర్మారం. దండుబాటల కారణంతో దోపిడీకి గురై గ్రామం చతికిలపడిపోయింది. గ్రామస్తులు చాలా ఏళ్లు తరువాత పునర్నిర్మింరించుకోవడంతో ధర్మారంపాడుగా మారింది. కాలక్రమేణా వాడుకలో రంపాడుగా మారింది. వ్యాధులు, దోపిడీ కారణంగా మళ్లీ దెబ్బతిని పాపిరెడ్డిపల్లె, కొండపేట, లక్ష్మిగారిపల్లె తదితర గ్రామాలుగా మార్పు చెందింది. ప్రస్తుతం రంపాడు ఇప్పటికీ పంచాయతీ పేరుగా ఉండగా పంచాయతీ కేంద్రంగా పాపిరెడ్డిపల్లె మారింది. బద్వేలు ప్రాంతంలో... నల్లమల కొండల పాదాల నుంచి సగిలేటి వరకు విస్తరించిన కాశినాయన, కలసపాడు, పోరుమామిళ్ల ప్రాంతమంతా శిథిల గ్రామాల నేల. రెండు దశాబ్దాలలో దాదాపు 50 గ్రామాలు అదృశ్యమైన విషాదగడ్డ. అవి చిన్న పల్లెలు అనుకుంటే పొరపాటు. రెవెన్యూ కార్యకలాపాలకు నిలయాలైన పెద్దగ్రామాలే. అలాంటి వాటిలో 24 గ్రామాలకు మజరాగ్రామంగా ఉన్న కత్తెరగండ్ల కూడా ఉంది. గ్రామం చుట్టూ రక్షణగోడ కట్టుకున్న అక్కెంగుండ్ల ఉంది. సగిలేటి ఒడ్డున విరాజిల్లిన రంపాడు, పోరుమామిళ్ల మండలంలో సంచర్లతోపాటు పలు గ్రామాలు కాలగర్భంలో కలిసిపోయాయి. ఆనవాళ్లు కనిపించకుండా చరిత్రలో మిగిలిపోయాయి దోపిడీలతోనే గ్రామాలు ఖాళీ జిల్లాలో చాలామటుకు గ్రామాలు కనుమరుగయ్యాయి. 200 సంవత్సరాల క్రితం ఎక్కువ గ్రామాలు కాలగర్భంలో కలిసిపోయాయి. బందిపోట్లు, దివిటి దొంగల దాడులతో అటవీ శివారు గ్రామాలు ఖాళీ కాగా, జబ్బులు, నీటి వసతి కరువై మరికొన్ని గ్రామాలు ఖాళీ అయ్యాయి.జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పంచాయతీ కేంద్రాలు, రెవెన్యూ గ్రామాలు కనుమరుగైనట్లు చరిత్ర చెబుతుంది. – తవ్వా ఓబుల్‌రెడ్డి, రచయిత, చరిత్ర పరిశోధకులు, మైదుకూరు -
పేరు సరే.. ఊరేది?
సాక్షి ప్రతినిధి కడప: ఆ పంచాయతీ పేరు రెవెన్యూ రికార్డుల్లో ఉంటుంది. పంచాయతీ కార్యాలయం కూడా ఉంటుంది. కానీ భౌతికంగా ఆ ఊరు మాత్రం కనపడదు. ఆ ఊరికే ప్రస్తుతం వేరే పేరు స్థిరపడిపోయి ఉంటుంది. కొత్త పేరునే స్థానికులు వినియోగిస్తుంటారు. గతంలో ఓ వెలుగు వెలిగిన వందలాది గ్రామాలు శిథిల శకలాలుగా మిగిలి నేడు కనుమరుగైపోయాయి. ఆనాటి గ్రామాల్లో నివసించిన వారు కొత్తగ్రామాలను ఏర్పాటు చేసుకోవడమో, ఇతర గ్రామాలకు వలసవెళ్లిపోవడమో, పేరు మార్చుకోవడమో జరిగింది. ఇలాంటి గ్రామాలు వైఎస్సార్ జిల్లాలో వందలాదిగా ఉన్నాయి. ఉదాహరణకు కత్తెరగండ్ల అనే పెద్ద గ్రామం పూర్వం ఉండేది. కాలక్రమంలో ఆ గ్రామం కనుమరుగైపోయి చిన్న గ్రామాలుగా విడిపోయింది. ప్రస్తుతం రికార్డుల్లో కత్తెరగండ్ల ఉన్నా.. ఆ పంచాయతీ కార్యాలయం చెన్నవరం అనే గ్రామంలో ఉంటుంది. కత్తెరగండ్లకు బదులుగా చెన్నవరం పేరునే స్థానికులు వినియోగిస్తారు. బందిపోట్లు, దివిటి దొంగల దాడులు, పాలెగాళ్ల ఒత్తిళ్లు, ఫ్యాక్షన్ గొడవలు, కలరా లాంటి వ్యాధులు, సాగు, తాగునీరు లేకపోవడం తదితర కారణాలతో ఆనాటి ఊళ్లు ఖాళీ అయిపోయాయని చరిత్రకారులు చెబుతున్నారు. రికార్డుల్లో ఉండి భౌతికంగా లేని ఊళ్లు జిల్లాలో 100కు పైగా ఉంటే.. రికార్డుల్లో లేకుండా పూర్తిగా కనుమరుగైన ఊళ్లు దాదాపు 500 ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఒక్కో ఊరిది ఒక్కో కథ.. ► కాలగర్భంలో కలసిపోయిన ఒక్కో ఊరిది ఒక్కో కథ.. ► బద్వేలు ప్రాంతంలో దాదాపు 50 గ్రామాలు అదృశ్యమైపోయాయి. ► శ్రీఅవధూత కాశినాయన మండలంలోని కత్తెరగండ్ల కృష్ణదేవరాయల కాలంలో కుటీరపరిశ్రమలతో అలరారింది. ఈ ఊరు ఇప్పుడు శిథిలమైపోయింది. ఆ పేరు ఇప్పటికీ కొనసాగుతోంది. ► 13వ శతాబ్ది నుంచి రంపాడు అనే గ్రామం ఉంది. దండుబాటల కారణంతో దోపిడికి గురై గ్రామం కిలపడిపోయింది. కాలక్రమంలో ధర్మారంపాడు, పాపిరెడ్డిపల్లె, కొండపేట, లక్ష్మిగారిపల్లె తదితర గ్రామాలుగా మార్పు చెందింది. ఇప్పటికీ రంపాడు పేరుతోనే రికార్డులు ఉన్నాయి. ► గతంలో సిరులతో అలరారిన అక్కెంగుండ్ల గ్రామం దొంగల దాడులతో కాలగర్భంలో కలసిపోయింది. ► వాసుదేవాపురం, పగడాలపల్లె, నీలాపురం, టి.శేషంపల్లె, సంచర్ల, అనంతరాజుపురం గ్రామాల పేర్లు ఉన్నా ఊళ్లు మాత్రం కనబడవు. ► జమ్మలమడుగు మండలంలో తూగుట్లపల్లి, పాత కొండాపురం గ్రామాలు దోపిడీ దొంగల దాడులతో పూర్తిగా తుడిచి పెట్టుకునిపోయాయి. ఆనాటి బురుజులు, గంగమ్మ దేవాలయం మాత్రమే నేటి తరానికి సాక్ష్యాలు. ► రైల్వేకోడూరు, కమలాపురం నియోజకవర్గాల్లో పలుగ్రామాలు అంతరించి పోయినా పేర్లు మాత్రం ఇంకా కొనసాగుతున్నాయి. చాలా పెద్దవి కాశినాయన మండలంలోని రంపాడు, కత్తెరగండ్ల, అక్కెంగుండ్ల, వాసుదేవపురం తదితర ఐదు రెవెన్యూ గ్రామాలు చరిత్రలో కలిసిపోయాయి. కొన్ని దోపిడి దొంగల దాడులు, వ్యాధులు, క్రూరమృగాల కారణంగా కిలపడిపోయాయి. కత్తెరగండ్ల, అక్కెంగుండ్ల గ్రామాలు చాలా పెద్దవి. ఒక్కో ఊరిలో వెయ్యికిపైగా కుటుంబాలుండేవి. వ్యవసాయం, పశుపోషణ, పరిశ్రమలతో కళకళలాడేవి. నేడు అవి పేర్లకే పరిమితయ్యాయి. – సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి, నవల, కథా రచయిత, కాశినాయన మండలం రెవెన్యూ రికార్డుల్లోనే ఉంది అంబవరం పంచాయతిలో తూగుట్లపల్లి గ్రామం ఉంది. ఆ గ్రామానికి సంబంధించిన పొలాల వివరాలు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం గ్రామం ఆనవాలు ఎక్కడ కనిపించదు. ఒక్క ఇల్లు కూడాలేదు. – శ్రీనివాసులు, వీఆర్వో, అంబవరం పంచాయతి. దోపిడీలతోనే గ్రామాలు ఖాళీ బందిపోట్లు, దివిటి దొంగల దాడులతో అటవీ శివారు గ్రామాలు ఖాళీ కాగా, జబ్బులు, నీటి వసతి లేక, ఫ్యాక్షన్ గొడవలు, పాలెగాళ్ల దాడులతో కొన్ని గ్రామాలు కనుమరుగయ్యాయి. బందిపోట్లను ఎదుర్కొని నిలిచిన కొన్ని గ్రామాలు మాత్రమే కొండ ప్రాంతాల్లో ఉండిపోయాయి. జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో గ్రామాలు కనుమరుగైనట్లు చరిత్ర చెబుతుంది. – తవ్వా ఓబుల్‌రెడ్డి, చరిత్ర పరిశోధకులు, మైదుకూరు -
బరి తెగింపు
అనంతపురం సెంట్రల్/ శింగనమల : ఇసుకాసురులు బరి తెగించారు. ప్రభుత్వ నిబంధనల్లో లొసుగులను ఆసరాగా చేసుకొని రూ.కోట్లు కొల్లగొట్టారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని నయా మోసాలకు తెగబడ్డారు. అధికారుల సంతకాలను సైతం ఫోర్జరీ చేసి మరీ లూటీకిపాల్పడ్డారు. ఆలస్యంగా మేల్కొన్న ఉన్నతాధికారులు కూపీ లాగే పనిలో నిమగ్నమయ్యారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. శింగనమల మండలం ఉల్లికల్లు రీచ్ నుంచి దాదాపు రూ. కోటి విలువైన ఇసుక దారి మళ్లిందని కలెక్టర్, డీఆర్డీఏ అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వస్తున్నారు. ఇటీవల ఈ రీచ్‌ను కలెక్టర్ కోన శశిధర్ తనిఖీ చేశారు. అక్కడ ఉన్న పరిస్థితికి, రికార్డుల్లో ఉన్న వివరాలకు పొంతన లేకపోవడాన్ని గుర్తించారు. వెంటనే రికార్డులన్నీ తెప్పించాలని ఆదేశించారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం 6,848 ఆర్డర్లకు గాను 24,910 క్యూబిక్ మీటర్ల ఇసుక విక్రయించారు. ప్రభుత్వానికి రూ.1,55,05,625ల ఆదాయం సమకూరింది. అయితే..రీచ్ వద్ద పరిస్థితిని గమనిస్తే భారీగా ఇసుకను రవాణా చేసినట్లు తెలుస్తోంది. దాదాపు 40 వేల క్యూబిక్ మీటర్ల మేర తవ్వకాలు చేపట్టారు. రీచ్‌లోనే కాకుండా నదీ పరివాహక ప్రాంతాల్లో కూడా తవ్వకాలు సాగించారు. ఆనవాళ్లు లేకుండా చేసేందుకు చాగల్లు ప్రాజెక్టుకు వదులుతున్న నీటిని మళ్లించారు. దీంతో రీచ్ ప్రాంతం చెరువును తలపిస్తోంది. పది అడుగులకు పైగా ఇసుకను తవ్వినట్లు అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వస్తున్నారు. అక్రమంగా తవ్విన ఇసుకను బెంగళూరు, బళ్లారి, ఉవరకొండ, నంద్యాల, గుత్తి, గుంతకల్లు, కదిరి తదితర ప్రాంతాలకు తరలించినట్లు తెలుస్తోంది. వెలుగులోకి నకిలీ బిల్లుల కథ ఇసుక అక్రమ రవాణాకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా నకిలీ బిల్లులు సృష్టించారు. ఓ ప్రజాప్రతినిధి తమ్ముడు, నగరంలో ప్రాతినిథ్యం వహిస్తున్న మరో ప్రజాప్రతినిధి దగ్గర బంధువులు, ఏడుగురు టీడీపీ చోటా నాయకులు కలిసి ఇసుక దందా సాగించినట్లు సమాచారం. వీరికి వెలుగు ప్రాజెక్టు ఏరియా కో ఆర్డినేటర్, ఏపీఎంలు పూర్తి సహకారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇసుక రవాణా కోసం ప్రత్యేకంగా ‘ఫారం ఈ ట్రాన్సిట్ పాస్’ రసీదు పుస్తకాలను తయారు చేయించారు. వీటి ద్వారా రోజూ వాహనాలలో అక్రమంగా ఇసుకను నింపుకొని ఇతర ప్రాంతాలకు తరలించారు. రోజూ 30-40 లోడ్ల ఇసుకను అక్రమ రవాణా చేసినట్లు తెలుస్తోంది. ఇసుకాసురులు నగరంలోని ప్రధాన కూడలిలో ఉన్న టీడీపీ నాయకునికి చెందిన ఓ లాడ్జిలో మకాం వేసి వ్యవహారాన్ని నడిపారు. ఉల్లికల్లు రీచ్ వద్ద నాలుగు జేసీబీలు, 70 ట్రాక్టర్లు, 30 టిప్పర్లు పనిచేశాయి. దాదాపు సగం వాహనాల ద్వారా అక్రమ రవాణా చేశారు. రోజూ రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకూ ఆదాయాన్ని తీసుకున్నారు. రీచ్ ప్రారంభం నుంచి నెలన్నర రోజుల పాటు ఈ దందా కొనసాగింది. అలా వచ్చిన మొత్తాన్ని అందరూ సమానంగా పంచుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో కొందరు అధికారులకు కూడా వాటాలు వెళ్లినట్లు సమాచారం. కలెక్టర్‌గా కోన శశిధర్ బాధ్యతలు తీసుకున్న వెంటనే ఇసుక వ్యాపారంపై దృష్టి సారించారు. జిల్లాలోని అన్ని రీచ్‌ల సమాచారాన్ని తెలుసుకున్నారు. ఆయన తనిఖీకి వస్తారని ముందుగానే పసిగట్టిన అక్రమార్కులు ఉల్లికల్లు రీచ్ వద్ద పనులు చేస్తున్న జేసీబీల సహాయంతో అటుగా వెళుతున్న నీటిని మళ్లించి ఆనవాళ్లు చెరిపేశారు. అయితే.. కలెక్టర్ రికార్డులు తన కార్యాలయానికి తెప్పించుకొని పరిశీలిస్తుండడంతో అక్రమార్కుల్లో వణుకు పుడుతోంది. మరీ ముఖ్యంగా వెలుగు ప్రాజెక్టు ఏరియా కోఆర్డినేటర్, ఏపీఎంలు ఇసుక అక్రమ వ్యాపారం వెనుక ఉన్న ప్రజాప్రతినిధుల చెంతకు చేరి తమను రక్షించాలంటూ వేడుకుంటున్నారు.