Government report
-
అడుగడుగునా ఉల్లంఘనలే..
సాక్షి, హైదరాబాద్: ఎల్బీనగర్లోని షైన్ ఆస్పత్రి యాజమాన్యం అడుగడుగునా నిబంధనల్ని ఉల్లఘించినట్లు రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ స్వరాజ్యలక్ష్మి బృందం గుర్తించింది. భవనంతో సహా అందులోని వార్డులు, ఐసీయూ విభాగాలు పూర్తిగా లోపభూయిష్టంగా ఉన్నాయని తేల్చింది. ఈ మేరకు ప్రభుత్వానికి గురువారం ఆమె తుది నివేదికను అందజేశారు. ఘటన తర్వాత మంగళవారం ఎల్బీనగర్ పోలీసుల సహకారంతో ఆస్పత్రిలో వైద్య ఆరోగ్యశాఖ అధికారుల బృందం తనిఖీ నిర్వహించింది. సెల్లార్ సహా జీ+3తో కూడిన ఈ భవనం లో అత్యవసర ద్వారం లేకపోవడమే కాకుండా ప్రమాదం జరిగిన మూడో అంతస్తు పైకప్పు నిబంధనలకు విరుద్ధం గా థర్మాకోల్ షీట్స్తో ఏర్పాటు చేసినట్లు గుర్తిం చింది. 20 పడకలకు అనుమతి పొందిన ఈ ఆస్పత్రిలో అనధికారికంగా 58 పడకలు ఏర్పాటు చేసినట్లు నివేదికలో పేర్కొంది. 12 ఇంక్యూబేటర్లు, రెండు ఫొటో థెరపీ యూనిట్లు ఉండగా.. వీటిలో ఆరు ఇంక్యూబేటర్లు, రెండు ఫొటో థెరపీ యూనిట్లు పాడైపోయినట్లు గుర్తించింది. ఇప్పటి వరకు ఫైర్మాక్ డ్రిల్స్ నిర్వహించిన దాఖలాలు కూడా లేనట్లు పేర్కొంది. సీఈఐజీ ప్రాథమిక విచారణ నిర్వహణ లోపం వల్లే రిఫ్రిజిరేటర్లో పేలుడు సంభవించి షైన్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగినట్లు తెలంగాణ ప్రధాన విద్యుత్ తనిఖీ అధికారి కార్యాలయం(సీఈఐజీ) ధృవీకరించింది. ఎల్బీనగర్లోని షైన్ ఆస్పత్రిని సీఈఐజీ అధికారులు తనిఖీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదికను అందజేయనున్నట్లు ప్రకటించారు. -
అభివృద్ధికి ఆమడ దూరంలో పల్లెలు
తమ నాలుగేళ్ల పాలనలో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందనీ, గ్రామాలు సకల సదుపాయాలతో అలరారుతున్నాయని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చెప్పుకుంటోంది. అయితే, క్షేత్ర స్థాయిలో వాస్తవాలు మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉన్నాయని ఇండియా స్పెండ్ అనే సంస్థ తెలిపింది. అభివృద్ధికి చాలా పల్లెలు ఇంకా ఆమడదూరంలో ఉన్నట్లు స్వయంగా ప్రభుత్వ నివేదికలే చెబుతున్నాయని పేర్కొంది. విద్యుత్ ఏదీ? దేశంలోని 5,97,608 గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించడం ద్వారా 100 శాతం విద్యుదీకరణ సాధించామని కేంద్రం ప్రకటించింది. కానీ వాస్తవానికి గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా 2.3 కోట్ల కుటుంబాలకు విద్యుత్ సౌకర్యం లేదు. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో కేవలం 89 శాతం మాత్రమే విద్యుదీకరణ జరిగింది. మొబైల్ సేవలు మొబైల్ ఫోన్ సేవలు ప్రారంభమై ఇప్పటికి 23 ఏళ్లు గడిచినా ఇంకా 43,000 గ్రామాలకు మొబైల్ నెట్వర్క్ అందుబాటులోకి రాదు. నెట్వర్క్ ఉన్నచోట్ల సరైన విద్యుత్ సరఫరా లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తాగునీరు దేశంలోని 2.89 లక్షల గ్రామాల్లో స్వచ్ఛమైన తాగు నీరు పాక్షికంగానే అందుబాటులో ఉందని ఇటీవల కేంద్రం పార్లమెంటుకు తెలిపింది. ప్రస్తుతం 62,582 గ్రామాల్లోని ప్రజలు కలుషిత నీటినే తాగుతున్నట్లు చెప్పింది. గ్రామీణ రహదార్లు కేంద్రం 2000లో ప్రారంభించిన ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కింద 1,78,184 గ్రామాల రహదార్లను అనుసంధానించాలన్నది లక్ష్యం. వీటిలో 31,022 గ్రామాలకు రహదారులనే వేయలేదు. విద్య గ్రామీణ ప్రాంతాల్లో 14–18 ఏళ్ల మధ్య వయసున్న విద్యార్థుల్లో 25% (8 కోట్ల మంది) మాతృభాషలోని పాఠ్య పుస్తకాలనే చదవలేకపోతున్నారు. సగం మందికిపైగా లెక్కలు (మూడంకెల సంఖ్యను ఒక అంకెతో గుణించడం) కూడా రాదు. ఆస్పత్రులు 2017 మార్చి నాటికి దేశవ్యాప్తంగా ఆరోగ్య ఉప కేంద్రాల్లో 19 శాతం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో(పీహెచ్సీ)22 శాతం, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల్లో(సీహెచ్సీ) 30 శాతం సిబ్బంది కొరత ఉంది. 30 వేల మందికి ఒక పీహెచ్సీ, 1.20 లక్షల మందికి ఒక సీహెచ్సీ ఉన్నాయి. పీహెచ్సీల్లో డాక్టర్ల కొరత 12% ఉంది. నర్సుల కొరత 60% దాకా ఉంది. 73% ఉప ఆరోగ్య కేంద్రాలు శివారు గ్రామాలకు 3 కి.మీ. పైగా దూరంలో ఉన్నాయని కాగ్ నివేదిక స్పష్టం చేసింది. ► ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద గ్రామాల్లో 99 లక్షల ఇళ్లు లక్ష్యంగా పెట్టుకోగా, కేవలం 45 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయింది. -
ఎనిమిది రంగాల్లో పెరిగిన ఉపాధి
* 2014-15పై ప్రభుత్వ నివేదిక * 5.21 లక్షల మందికి ఉద్యోగాలు న్యూఢిల్లీ: ఉపాధి కల్పన గడచిన ఆర్థిక సంవత్సరం (2014 ఏప్రిల్ నుంచి 2015 మార్చి వరకూ) గణనీయంగా పెరిగింది. ఇందుకు సంబంధించి ప్రధానంగా ఎనిమిది రంగాల వివరాలను తెలుపుతూ కార్మిక విభాగం మంగళవారం ఒక నివేదికను విడుదల చేసింది. ‘ఉపాధి సంబంధ అంశాల్లో మార్పులపై 25వ త్రైమాసిక నివేదిక’ పేరుతో విడుదలైన నివేదికలో ముఖ్యాంశాలు చూస్తే.. * ఐటీ/బీపీఓ, ఆటోమొబైల్, రత్నాలు- ఆభరణాలు, జౌళి, నేత, తోలు, రవాణా, మెటల్ రంగాల్లో కొత్త ఉద్యోగాలు గతేడాది 5.21 లక్షలు పెరిగాయి. * ఈ 8 రంగాల్లో చివరి త్రైమాసికం(జనవరి-మార్చి)లో కొత్త ఉద్యోగాల సంఖ్య కేవలం 64,000. అయితే మూడు త్రైమాసికాలనూ తీసుకుంటే... ఉపాధి కల్పన 1.82 లక్షలు, 1.58 లక్షలు, 1.17 లక్షల మేర పెరిగింది. (అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికాలతో పోల్చిచూస్తే). * మరో ముఖ్య విషయం ఏమిటంటే... చివరి త్రైమాసికంలో ఐటీ-బీపీఓ, జౌళి, ఆటోమొబైల్, మెటల్స్ నియామకాలు కొంత మెరుగుపడితే... తోలు, రత్నాలు-ఆభరణాలు, రవాణా, నేత రంగాల్లో ఉపాధి కల్పనలో అసలు వృద్ధిలేకపోగా క్షీణిత నమోదయ్యింది. * 2013-14లో మొత్తంమీద ఉపాధి కల్పన సంఖ్య 2.76 లక్షలు. 2012-13లో మాత్రం 5.21 లక్షలు. 2008 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికం నుంచీ కార్మిక విభాగం త్రైమాసికం ప్రాతిపదికన ఉపాధికి సంబంధించి సర్వే నిర్వహిస్తోంది. -
సీమాంధ్ర నివేదికలా రాష్ట్ర ప్రభుత్వ నివేదిక: కోదండరామ్
ఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మంత్రుల బృందం(జిఓఎం)కు ఇచ్చిన నివేదికలు సీమాంధ్రకు సంబంధించిన నివేదికల్లా ఉన్నాయని తెలంగాణ రాజకీయ జెఏసి చైర్మన్ కోదండ రామ్ అన్నారు. ఆ నివేదికలు పూర్తి రాష్ట్రానికి సంబంధించిన నివేదికలులా లేవన్నారు. తెలంగాణ ప్రాంతం అనేక వివక్షలకు గురవుతూ వచ్చిందని తెలిపారు. తెలంగాణ ఇచ్చినట్లే ఇచ్చి సీమాంధ్రులకు అధికారాలు ఇస్తే రాష్ట్రం ఇచ్చినా ప్రయోజనం ఉండదని చెప్పారు. తెలంగాణకే పూర్తి అధికారాలు దక్కాలని కోదండరామ్ కోరారు. తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసగౌడ్ కూడా కోదండరామ్ వ్యక్తం చేసిన అభిప్రాయాలనే వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నివేదిక కేవలం సీమాంధ్ర అవసరాలకే పరిమితమైందని విమర్శించారు. హెచ్ఎండిఏను కామన్ క్యాపిటల్ చేయాలనడంలో ఆంతర్యం ఏంటి? అని ఆయన ప్రశ్నించారు. దానివల్ల సీమాంధ్రులకు కలిగే ప్రయోజనం ఏంటి? అని అడిగారు. ఇదిలా ఉండగా, టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు, కోదండరామ్, ఉద్యోగ సంఘాల నాయకులు ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరారు.