Government Support
-
ఇథనాల్ ఉత్పత్తికి ప్రభుత్వ మద్దతు కావాలి
న్యూఢిల్లీ: ఇథనాల్ ఉత్పత్తిని పెంచాలంటే చక్కెర పరిశ్రమకు ప్రభుత్వ మద్దతు అవసరమని ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ (ఐఎస్ఎంఏ) ప్రెసిడెంట్ ఆదిత్య ఝున్‌ఝున్‌వాలా తెలిపారు. అప్పుడే 2025 నాటికి పెట్రోల్‌లో ఇథనాల్ పరిమాణాన్ని 20 శాతానికి (ఈ20) పెంచాలన్న లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యపడగలదని పేర్కొన్నారు. ఈ20 లక్ష్య సాధన కోసం 1,000 కోట్ల లీటర్ల ఇథనాల్ అవసరమవుతుందని నీతి ఆయోగ్ అంచనా వేసిందని భారతీయ ఆటోమొబైల్ తయారీ సంస్థల సమాఖ్య సియామ్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో దేశీయంగా చెరకు, చక్కెర ఉత్పత్తిని పెంచేందుకు మరింత అధిక తయారీ సామర్థ్యాలు, మరిన్ని డిస్టిలరీలు అవసరమవుతాయని ఆదిత్య చెప్పారు. ఇందుకు ప్రభుత్వ విధానాలపరమైన తోడ్పాటు కావాల్సి ఉంటుందన్నారు. పరిశ్రమ ఇప్పటికే పూర్తి ఉత్పత్తి సామర్థ్యాలతో పనిచేస్తోందని, కొత్తగా మరిన్ని ప్రాజెక్టులను ప్రారంభించాల్సి ఉంటుందని ఆదిత్య వివరించారు. చక్కెర పరిశ్రమ ఇథనాల్ ఉత్పత్తిని పెంచేందుకు మరిన్ని పెట్టుబడులు పెడుతోందని, దీనికి ప్రభుత్వం నుంచి కూడా కొంత మద్దతు అవసరమని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, చెరకు పంటకు నీరు ఎక్కువగా అవసరం అవుతుంది కాబట్టి వ్యవసాయ వ్యర్ధాల్లాంటి వనరుల నుండి ఇథనాల్ ఉత్పత్తిని పెంచడంపై దృష్టి పెట్టాలని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ పురి చెప్పారు. ప్రత్యామ్నాయ ఇంధనాలకు స్పష్టమైన విధానాలు కీలకం హెచ్ఎంఎస్ఐ సీఈవో ఒగాటా దేశీయంగా ప్రత్యామ్నాయ ఇంధన మార్గదర్శ ప్రణాళికను అమలు చేయాలంటే స్పష్టమైన, స్థిరమైన విధానాల ప్రణాళిక కీలకమని ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హోండా మోటర్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) ప్రెసిడెంట్ అత్సుషి ఒకాటా చెప్పారు. ప్రభుత్వ విజన్‌ను అమలు చేయడానికి తాము కట్టుబడి ఉన్నామని, అయితే ఇంధన సరఫరా, ధర వంటి సవాళ్లను పరిష్కారం కావాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్రణాళిక విజయవంతంగా అమలయ్యేందుకు తగిన విధానం అవసరమన్నారు. -
దేవుడిలా ఆదుకున్నావన్నా..
సాక్షి, తిరుపతి/ సాక్షి ప్రతినిధి, కడప: సీఎం వైఎస్ జగన్: ఏమ్మా తల్లీ బాగున్నావా? కలెక్టర్ హరి బాగా చూసుకున్నారా? ప్రభుత్వ సాయం అందిందా? బియ్యం ఇచ్చారా? పప్పు, నూనె, ఉల్లిగడ్డలు, రెండు వేలు ఇచ్చారా? ఇంటి పట్టా ఇచ్చారా? మునెమ్మ: మా కుటుంబాలను దేవుడిలా ఆదుకున్నావన్నా. మాకు అన్నీ ఇచ్చారు. ఇంటి పట్టా కూడా ఇచ్చారన్నా.. ఇల్లు కావాలన్నా.. సీఎం: ఇక్కడ వద్దమ్మా.. పక్కనే కాలువ ఉంది. మళ్లీ వరదొస్తే ఇబ్బంది అవుతుంది. వేరే చోట శాశ్వతంగా ఉండేలా పక్కా ఇళ్లు కట్టిస్తాను తల్లీ. మునెమ్మ, ఇతర బాధితులు: సంతోషం అన్నా. చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం వెదళ్లచెరువు ఎస్టీ కాలనీలో వరద బాధితులు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మధ్య జరిగిన సంభాషణ ఇది. గురువారం సాయంత్రం వైఎస్సార్ జిల్లా నుంచి ఇక్కడికి చేరుకున్న ముఖ్యమంత్రి.. కాలనీలో నడుచుకుంటూ.. బాధితులు దేశమ్మ, మునెమ్మ, అమ్ములు, గంగమ్మ, నాగమ్మ, మునిరత్న, జరతమ్మ, ఆదిలక్ష్మి, శివరంజని తదితరుల నివాసాలకు వెళ్లి పలకరించారు. దెబ్బతిన్న నివాసాలను పరిశీలించారు. సాయం అందిందా? లేదా? అని ఆరా తీశారు. ఈ సందర్భంగా మునెమ్మ స్పందిస్తూ... ‘వరదలకు నష్టపోయిన మా కుటుంబాలను దేవుడిలా ఆదుకున్నావన్నా. మీ మేలు మర్చిపోలేమన్నా’ అంటూ రెండు చేతులెత్తి నమస్కరించారు. వెదళ్లచెరువు గిరిజన కాలనీ వాసులు అడవి పుష్పాలతో గుచ్ఛం తయారు చేసి, దానిని ఓ చెంబులో పెట్టి సీఎంకు అందజేశారు. ఇల్లు లేదని చెప్పిన పలువురికి మంజూరు చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. చిన్నారికి పెన్ను తూకివాకం గ్రామానికి చెందిన ఊహ అనే మహిళ తన బిడ్డతో సీఎం వద్దకు వచ్చింది. ఆ సమయంలో ఏడుస్తున్న పాపను సీఎం తన భుజంపై పడుకోబెట్టుకుని ‘ఏమ్మా తల్లీ’ అంటూ ఓదార్చేందుకు ప్రయత్నించారు. చిన్నారి సీఎం జేబుకు ఉన్న పెన్నును లాగుతుండడం గమనించి.. ‘పెన్ను కావాలా?’ అంటూ తీసి ఆ చిన్నారి చేతికి అందించారు. జగన్ మామయ్యా.. కాలు బాగుందా? గుత్తివారిపల్లె జిల్లా పరిషత్ విద్యార్థినులు ‘జగన్ మామయ్యా.. మీ కాలుకు దెబ్బ తగిలింది కదా? ఎలా ఉంది’ అని అడిగారు. ‘తల్లీ బాగుందమ్మా. థ్యాంక్యూ తల్లీ’ అంటూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా పలువురు సీఎంతో సెల్ఫీ దిగారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు వినతి పత్రాలు అందజేశారు. ఆ వీఆర్వోను సస్పెండ్ చెయ్యండి తన భూమిని స్థానిక వీఆర్వో చలపతి వేరొకరికి పట్టా చేసి ఇచ్చారని వరదయ్యపాళెం మండలం ఇందిరానగర్‌కు చెందిన సుజాత సీఎం వైఎస్ జగన్‌ను కలిసి విన్నవించారు. ఆ వీఆర్వోను సస్పెండ్ చేసి బాధితురాలికి న్యాయం చేయాలని సీఎం కలెక్టర్ హరినారాయణన్‌ను ఆదేశించారు. ఆపదలో ఆదుకున్న యువకులకు అభినందన ► అన్నమయ్య కట్ట తెగగానే గ్రామంలోకి వరద ఎలా వచ్చిందో గంధం శివప్రసాద్ అనే యువకుడు సీఎంకు వివరించాడు. ఆరేడు నిమిషాలు పూర్తిగా అందరం నీటిలో ఉండిపోయామని, తర్వాత కొద్దిగా నీటిమట్టం తగ్గడంతో ఏడుగురు బతికామని, మిగిలిన ఇద్దరు ఊపిరి ఆడక మరణించారని చెప్పాడు. వరదల్లో తల్లిదండ్రులను కోల్పోయిన సుజయ్, తల్లిని కోల్పోయిన అశోక్‌లను సీఎం పరామర్శించారు. ► ఇద్దరు కుటుంబ సభ్యులను కోల్పోయినప్పటికీ బాధితులను ఆదుకోవడంలో గ్రామ సర్పంచ్ కుమారుడు భీం జగన్మోహన్రెడ్డి మంచి పని తీరు కనబరిచారంటూ గ్రామస్తులు చెప్పగా, సీఎం అతన్ని అభినందించారు. పులపత్తూరులో తనను కలిసిన, ఇటీవల గుండె చికిత్స చేయించుకున్న ప్రతాప్‌రెడ్డి అనే వృద్ధుడికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సహాయం అందించాలని ఆదేశించారు. ► పులపత్తూరుకు సమీపంలోని చింతలకోన గ్రామంలో అంగన్వాడీ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ► తాత్కాలిక పునరావాస కేంద్రాలలో ఆశ్రయం పొందుతున్న వారితో, ఏఎన్ఎంలతో, గ్రామ సచివాలయ ఉద్యోగులతో మాట్లాడారు. కొత్తగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనం ఎంతోమందిని కాపాడిందని ఉద్యోగులు సీఎంకు వివరించారు. ► ఎగువ మందపల్లెలో 9 మంది కుటుంబ సభ్యులను కోల్పోయిన పూజారి కొర్రపాటి రామ్మూర్తి కుటుంబాన్ని సీఎం పరామర్శించారు. ఇదే గ్రామంలో కుటుంబ సభ్యులను కోల్పోయిన ఈశ్వరయ్య, రమణలను పరామర్శించారు. ► దిగువ మందపల్లె దళిత కాలనీ వాసులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోçహన్‌రెడ్డి పలకరించారు. జవహర్ నవోదయ విద్యాలయం విద్యార్థినులు అందించిన చిత్రపటాన్ని స్వీకరించారు. ఇంకా ఏమైనా సమస్యలున్నాయా? వైఎస్సార్ జిల్లా పులపత్తూరు, ఎగువ మందపల్లె, దిగువ మందపల్లె గ్రామాల్లో సీఎం వైఎస్ జగన్ కలియదిరిగారు. పులపత్తూరులో వరద కారణంగా దెబ్బతిన్న ఇళ్లు, విధ్వంసానికి గురైన రోడ్లు, ఇతర ప్రాంతాలను పరిశీలించారు. ఇల్లు కూలిపోవడంతో నిరాశ్రయులైన నాగేశ్వరమ్మ, సుబ్బరాయమ్మ, లక్ష్మిదేవి, శ్రీనివాసరావు, ఆదిలక్ష్మిలతో మాట్లాడారు. వరద కారణంగా ప్రాణాలు కోల్పోయిన వెంకటరాజు, శంకరమ్మ, ఆదెమ్మ కుటుంబాలను కలుసుకున్నారు. అధికారులు ఎలా స్పందించారు? సహాయం అందిందా? ధ్వంసమైన ఇళ్లకు పరిహారం అందిందా? ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. సాయం అందిందని.. ప్రభుత్వ యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు బాగా స్పందించారని బాధితులు సీఎంకు వివరించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. -
శిరీష కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ సర్కారు అండ
బద్వేలు అర్బన్: వైఎస్సార్ జిల్లా బద్వేలు మండలం చింతలచెరువు గ్రామంలో ఈ ఏడాది జూన్ 18న ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన గొడుగునూరు శిరీష కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. శిరీష కుటుంబానికి రూ.5 లక్షల చెక్కు అందించడంతోపాటు ఆమె సోదరుడు నాగేంద్రకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించింది. చింతలచెరువు గ్రామానికి చెందిన గొడుగునూరు సుబ్బయ్య, సుబ్బమ్మ దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మొదటి కుమార్తె శిరీష (19) బద్వేలులోని ఓ డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అట్లూరు మండలం మాడపూరు పంచాయతీ చిన్నరాజుపల్లె గ్రామానికి చెందిన చరణ్ అనే యువకుడు ఏడాది కాలంగా శిరీషను ప్రేమ పేరుతో వేధించేవాడు. ఆమె నిరాకరించడంతో చరణ్ కత్తితో విచక్షణా రహితంగా శిరీష గొంతు కోయడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మృతురాలి కుటుంబానికి రూ.5 లక్షలు ఆర్థిక సహాయంతో పాటు శిరీష సోదరుడైన నాగేంద్రకు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు గురువారం బద్వేలులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో శిరీష కుటుంబ సభ్యులకు చెక్కును, ఉద్యోగ నియామక పత్రాన్ని మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, నాయీబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ యానాదయ్య అందజేశారు. టీడీపీవి నీచ రాజకీయాలు ఈ సందర్భంగా నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ యానాదయ్య మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో మహిళలపై ఎన్నో దాడులు, హత్యలు జరిగినా చూసీచూడనట్టు వ్యవహరించిన ఆ పార్టీ నేతలు శిరీష హత్య విషయంలో అనవసర రాద్ధాంతం చేసి నీచ రాజకీయాలకు దిగుతున్నారని విమర్శించారు. చంద్రబాబు హయాంలో ప్రకాశం జిల్లాలో నాయీబ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన జాతీయ కబడ్డీ క్రీడాకారుడు నరేష్‌ను హత్య చేస్తే ఏమాత్రం స్పందించని టీడీపీ నాయకులు నేడు రాజకీయ లబ్ధి కోసం శవ రాజకీయాలు చేయడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని అన్నారు. శిరీష కుటుంబ సభ్యులు టీడీపీ అభిమానులైనప్పటికీ పార్టీ చూడకుండా ఆర్థిక సహాయం చేయడంతో పాటు ఉద్యోగం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కిందన్నారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ వాకమళ్ల రాజగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బంద్‌కు ఏపీ ప్రభుత్వం సంఘీభావం
-
బంద్‌కు ప్రభుత్వ మద్దతు
సాక్షి, అమరావతి: విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్‌పరం చేయాలన్న కేంద్ర నిర్ణయంపై వెల్లువెత్తుతున్న ప్రజా ఉద్యమానికి వైఎస్సార్సీపీ బాసటగా నిలుస్తుందని రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని చెప్పారు. కార్మిక సంఘాలు శుక్రవారం తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు తమ ప్రభుత్వం సంఘీభావం తెలుపుతోందన్నారు. సచివాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న జనవాణిని కేంద్రానికి వినిపించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధిగా ప్రయత్నిస్తోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం మొదట్నుంచీ వ్యతిరేకిస్తోందన్నారు. నేలకొరిగిన తెలుగువారి త్యాగాల ఫలితమే విశాఖ ఉక్కు అన్న నిజాన్ని కేంద్రం ముందు నిక్కచ్చిగా చెబుతామన్నారు. కోట్లాది మంది ప్రజల మనోభీష్టానికి సంపూర్ణంగా మద్దతునిస్తున్నామని చెప్పారు. కదం తొక్కుతున్న ప్రజాస్ఫూర్తిని నాని ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన ఇంకేమన్నారంటే... ప్రజలకు అసౌకర్యం కలిగించకుండా బంద్ చేపట్టాలన్నది ప్రభుత్వ ఆలోచన. ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఆర్టీసీ బస్సులు మధ్యాహ్నం తర్వాత తిరిగేలా ఏర్పాట్లు చేశాం. ప్రజా వ్యతిరేకతను గుర్తించి ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పునరాలోచించాలని సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. విశాఖ ఉక్కును లాభాల్లోకి తేవచ్చని, నష్టాల నుంచి గట్టెక్కించే మార్గాలను సీఎం సూచించారు. ఆర్టీసీని ప్రజల ఆస్తిగా మార్చిన సీఎం జగన్ కృషి అందరికీ ఆదర్శం. రాష్ట్ర ప్రయోజనాల కోసం అప్పులు చేస్తుంటే విపక్షం గగ్గోలు పెట్టడం అర్థరహితం. ప్రజలపై పన్నుల భారం మోపే ఆలోచన సీఎంకు లేదు. చదవండి: 'ఉక్కు' పిడికిలి బిగిసింది -
కొత్త పెట్టుబడులు కష్టమే..
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ రంగం అత్యంత గడ్డుకాలం ఎదుర్కొంటోందని, కొత్తగా అమల్లోకి రాబోయే నిబంధనలకు అనుగుణంగా మరిన్ని పెట్టుబడులు పెట్టే పరిస్థితిలో లేదని వాహనాల తయారీ సంస్థల సమాఖ్య సియామ్ ప్రెసిడెంట్ రాజన్ వధేరా వ్యాఖ్యానించారు. భారత్ అమలు చేస్తున్న ఉద్గార ప్రమాణాలు ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వాటికి సరిసమాన స్థాయిలోనే ఉంటున్నాయని.. నిబంధనల డోసేజీని అతిగా పెంచేయరాదని సియామ్ 60వ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా వధేరా చెప్పారు. ఈ నేపథ్యంలో 2022 నుంచి అమల్లోకి వచ్చే కార్పొరేట్ సగటు ఇంధన సామర్థ్యం (సీఏఎఫ్ఈ) మొదలైన నిబంధనలకు అనుగుణంగా తయారీ చేసేందుకు కావాల్సిన పెట్టుబడులు పెట్టే స్తోమత పరిశ్రమకు లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం తోడ్పాటునివ్వాలి.. ఆటోమోటివ్ మిషన్ ప్లాన్ 2026 (ఏఎంపీ)లో నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించాలంటే ప్రభుత్వ మద్దతు అవసరమని వధేరా చెప్పారు. ఆటోమోటివ్, ఆటో పరికరాల పరిశ్రమ 2026 నాటికి ఏ స్థాయిలో ఉండాలి, దేశ ఆర్థిక వృద్ధిలో ఏ స్థాయిలో తమ వంతు పాత్ర పోషించాలి తదితర అంశాలపై ప్రభుత్వం, పరిశ్రమ కలిసి రూపొందించుకున్న ప్రణాళిక ఏఎంపీ 2026. దీని ప్రకారం ప్రస్తుతం జీడీపీ 7%గా ఉన్న ఆటో పరిశ్రమ వాటాను 12%కి పెంచుకోవాలని, ఇప్పటికే ఉన్న 3.7 కోట్ల ఉద్యోగాలకు అదనంగా 6.5 కోట్ల ఉద్యోగాలు కల్పించాలని నిర్దేశించుకున్నారు. అలాగే, 2026 నాటికి వాహన ఉత్పత్తిని 6.6 కోట్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జీఎస్టీ రేట్ల కోత సంకేతాలు: సియామ్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా వాహనాలపై జీఎస్టీ రేటును తగ్గించే అవకాశాలు ఉన్నట్లుగా భారీ పరిశ్రమల మంత్రి ప్రకాశ్ జవదేకర్ సంకేత మిచ్చారు. ఆటోమోటివ్ పరిశ్రమ త్వరలోనే ’శుభ వార్త’ వింటుందని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రస్తుతం ద్విచక్ర వాహనాలపై 28 శాతం జీఎస్టీ అమలవుతోంది. మరోవైపు ఆటోమొబైల్ పరిశ్రమకు కావల్సిన పూర్తి మద్దతు ఇస్తామని కేంద్ర మంత్రి నితిని గడ్కరీ చెప్పారు. ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించే విధంగా ఫ్లెక్స్–ఫ్యూయల్ ఇంజిన్లను భారత్‌లో తయారు చేయడంపై కంపెనీలు దృష్టి సారించాలని ఆయన సూచించారు. కాగా, భారత ఆటో పరిశ్రమ చరిత్రలోనే అత్యంత కష్టకాలం ఎదుర్కొంటోందని మారుతీ ఎండీ కెనిచి అయుకవ పేర్నొన్నారు. జీఎస్టీని తగ్గించడం, ప్రోత్సాహకాల ఆధారిత స్క్రాపేజీ విధానం తదితర మార్గాల్లో ప్రభుత్వం తోడ్పాటు అందించాలని ఆయన కోరారు. సియామ్ కొత్త అధ్యక్షుడిగా మారుతీ సీఈఓ మారుతీ సుజుకీ కంపెనీ సీఈవో కెనిచి ఆయుకవ సియామ్ కొత్త ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. ఈయన 2 ఏళ్ల పాటు అధ్యక్ష పదవిలో కొనసాగుతారు. అలాగే వైస్ ప్రెసిడెంట్‌గా అశోక్ లేలాండ్ ఎండీ, సీవోఓ విపిన్ సోంధి ఎన్నికయ్యారని, ట్రెజరర్‌గా ఐషర్ మోటర్ ఎండీ వినోద్ అగర్వాల్ కొనసాగుతారని సియామ్ పేర్కొంది. -
చెంచుల సంక్షేమానికి కృషి
కలెక్టర్ సుజాతశర్మ యర్రగొండపాలెం: గిరిజన చెంచుల సంక్షేమం కోసం ప్రభుత్వ శాఖలన్నీ కలసికట్టుగా పనిచేయాలని కలెక్టర్ సుజాతశర్మ అధికారులకు సూచించారు. మండలంలోని వెంకటాద్రిపాలెంలో కలెక్టర్ అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చెంచులు నివసించే ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. నల్లమల అడవుల్లోని పాలుట్ల గిరిజన గూడేనికి ప్రతినెలా 5, 20 తేదీల్లో వైద్యాధికారులు వెళ్లి వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. గిరిజన గూడెంలో నీటి వసతి కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆర్‌డబ్లూ్యఎస్ అధికారులను ఆదేశించారు. చెన్నుపల్లి(అల్లిపాలెం) చెంచు గూడెంను రెవెన్యూ గ్రామంగా మార్చి అన్ని సదుపాయాలు కల్పించాలని స్థానికులు కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. అటవీ హక్కుల చట్టం కింద 350 ఎకరాల మేరకు సాగుభూమికి పట్టాలిచ్చారని, అక్కడే నివాసం ఉండి వ్యవసాయం చేసుకుంటున్నామని వారు తెలిపారు. నివాస స్థలాలకు పట్టాలు ఇవ్వకుండా ఫారెస్ట్ అధికారులు అడ్డు పడుతున్నారన్నారు. నల్లమల అడవుల్లో నివసించే చెంచులకు ఆర్ఏపీ, టీఏపీ, డబ్ల్యూపీ కింద 170 రేషన్ కార్డులు ఇచ్చారని, ఈ కార్డులకు ఒక్కొక్క దానికి కేవలం 4 నుంచి 10 కిలోల బియ్యం ఇస్తున్నారని, ఈ కార్డులను అంత్యోదయ అన్న యోజన కింద మార్పుచేసి కార్డుకు 35 కిలోల ప్రకారం బియ్యం పంపిణీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని గిరిజన చెంచు సంక్షేమ సంఘం నాయకులు చెవుల అంజయ్య, ఎన్.ఈదన్న, మంతన్న కోరారు. పునరావాస కాలనీలో శ్మశాన lవాటికకు స్థలం చూపించాలని, పక్కా గృహాలు ఏర్పాటు చేయాలని చెంచులు కోరారు. వేలి ముద్రలు పడటంలేదని డీలర్ రేషన్ ఇవ్వడం లేదని వారు ఆరోపించారు. పునరావాస కాలనీకి రోడ్డు వేయాలని, డీప్‌వెల్ బోరువేసి మంచినీరు సరఫరా చేయాలని మినీ అంగన్వాడీ భవన నిర్మాణం చేపట్టాలని ఆయా శాఖల అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ముందుగా వెంకటాద్రిపాలెం, పునరావాస కాలనీల్లోని అంగన్వాడీ కేంద్రాలను ఆమె సందర్శించారు. మెుక్కలు నాటారు. యర్రగొండపాలెంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలలను ఆమె పరిశీలించారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ డి.శ్రీనివాసరావు, మార్కాపురం ఆర్డీవో చంద్రశేఖరరావు, నియోజకవర్గ ప్రత్యేకాధికారి పి.కొండయ్య, డ్వామా ఏపీడీ రమేష్‌బాబు, జిల్లా వైద్యాధికారిణి యాస్మిన్, డీపీవో ఎస్ఎస్వీ ప్రసాద్, డీటీడబ్ల్యూ ప్రేమానందం, పంచాయతీరాజ్ ఎస్ఈ చంద్రశేఖరయ్య, ఐసీడీఎస్ పీడీ జి.విశాలాక్ష్మి, హౌసింగ్ ఈఈ తారకరామారావు, ఆర్డబ్ల్యూఎస్ డీఈ కె.వెంకటేశ్వర్లు, ఏఈ ఆరె భవాని, తహశీల్దార్ ఎం. రత్నకుమారి, ఎంపీడీవో టి.హనుమంతరావు, ఎన్ఆర్ఈజీఎస్ ఏపీడీ టి.వెంకటేశ్వర్లు, ఏడీఏ డి.బాలాజీనాయక్ పాల్గొన్నారు. -
మత్స్యకారులకు అండగా సర్కార్
ప్రభుత్వ నిధులతో చేపల పెంపకం ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సంగారెడ్డి మున్సిపాలిటీ: మత్స్యకారుల కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న ప్ర«ధాన ఉద్దేశంతో టీఆర్ఎస్ ప్రభుత్వం సొసైటీలపై భారం వేయకుండానే ఎమ్మెల్యే నిధులతో చేప పిల్లల పెంపకం చేపట్టిందని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. సోమవారం ఆయన పట్టణంలోని మహబూబ్‌సాగర్ చెరువులో 1.80 లక్షల చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మిషన్ కాకతీయ కార్యక్రమం విజయవంతమైందన్నారు. ఫలితంగా చెరువులు, కుంటల్లో సమృద్ధిగా నీరు చేరిందన్నారు. కుల వృత్తిపైనే ఆధార పడిన వారిని ఆదుకోవాలనే ప్రధాన ఉద్దేశంతో కేసీఆర్ చెరువుల్లో ఉచితంగా చేప పిల్లలను పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. గతంలో చెరువులో చేప పిల్లలను వదలాంటే కనీసం ఒక సొసైటీకి రూ.12,500 చెల్లించాల్సి ఉండేదని, ఇప్పుడు వారు పైసా చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. నియోజకవర్గంలోని 32 చెరువుల్లో 28.98 లక్షల చేప పిల్లలను వదలడం జరిగిందన్నారు. నియోజకవర్గంలోని మల్కాపూర్, కల్పగూర్ సొసైటీలకు సొంత భవనాలు నిర్మించేందుకు రూ.10 లక్షల చొప్పున నిధులు మంజూరై టెండర్ దశలో ఉన్నాయని ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మత్స్య కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మంచి అవకాశం ఇచ్చిందని, దీన్ని సద్వనియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గొంగుల విజయలక్ష్మి, జెడ్పీటీసీ మనోహర్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ కొండల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మాస్టర్ అథ్లెట్స్‌కి ప్రభుత్వ సహకారం అందించాలి
నెల్లూరు(బృందావనం) : అంతర్జాతీయస్థాయిలో తమ వయోభారాన్ని సైతం ఖాతరు చేయకుండా యువతలో స్ఫూర్తి నింపేలా అథ్లెటిక్ పోటీల్లో పాల్గొని పతకాలు సాధిస్తున్న మాస్టర్ అథ్లెట్స్‌కు ప్రభుత్వ సహకారం అందించాలని ఆంధ్రప్రదేశ్ మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ టీవీ రావు అన్నారు. నెల్లూరులోని కిలారి తిరుపతినాయుడు కల్యాణమండపంలో ఆదివారం జరిగిన అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం నుంచి అంతర్జాతీయస్థాయి మాస్టర్ అథ్లెటిక్ పోటీల్లో పాల్గొంటూ పఽతకాలు సాధిస్తున్న వారికి ఆర్థిక సాయం చేయాన్నారు. చివరివారంలో రాష్ట్రస్థాయి అథ్లెట్ మీట్ ఈ ఏడాది డిసెంబరు చివరి వారంలో రాష్ట్రస్థాయి మాస్టర్ అథ్లెటిక్మీట్ను విజయవాడలో జరుగుతుందని టీవీ రావు వెల్లడించారు. ఇందులో విజేతలుగా నిలిచిన వారు జాతీయస్థాయిలో 2017 మార్చి 25 నుంచి 28 వరకు అహ్మదాబాద్‌లో జరుగనున్న పోటీల్లో పాల్గొనే అర్హత సాధిస్తారన్నారు. త్వరలో జిల్లాస్థాయి పోటీలను సైతం నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు. సమావేశంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి టి.సుబ్బారావు, వైస్ ప్రెసిడెంట్ ఎన్.సాంబశివరావు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవి, జిల్లా అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నిర్మల నరసింహారెడ్డి, వై.కోటేశ్వరమ్మ, చీఫ్ ప్యాట్రన్ హైటెక్ రమణారెడ్డి, రత్నం పాల్గొన్నారు. -
తీజ్ పండుగకు ప్రభుత్వం చేయూత
చిట్యాల : బంజారులు ఏటా జరుపుకునే తీజ్ పండుగ నిర్వహణకు ప్రభుత్వం చేయూతనందిస్తుందని శాసన lసభాపతి సిరికొండ మధుసూదనాచారి అన్నారు. మండలంలోని ఒడితల గ్రామ శివారు పాశిగడ్డతండాలో గురువారం గిరిజనులు తీజ్ ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతూ తీజ్ పండుగ గిరి జన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. రానున్న రోజుల్లో తీజ్ పండుగను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేందుకు చర్య లు తీసుకుంటుందన్నారు. అనంతరం గిరిజన యువతులు తీజ్‌బుట్టలను తండా సమీపంలోని చెరువులు, బావుల్లో నిమజ్జనం చేశారు. కాగా, ఉత్సవాల్లో స్పీకర్ దరువేసి ప్రజలను ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు కాట్రేవుల సాయిలు, టీఆర్ఎస్ యూత్ రాష్ట్ర నాయకుడు సిరికొం డ ప్రశాంత్, మండల అధ్యక్షుడు కుంభం రవీందర్‌రెడ్డి, యూత్ అధ్యక్ష, కార్యదర్శులు కత్తి సంపత్, జన్నె యుగేంధర్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు ఓరంగంటి సధాకర్, నాయకులు శ్రీనివాసరావు, గణపతి, శంకర్, పాపిరెడ్డి, శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
’సర్కారీ కొలువు కోసం ఎదురు చూస్తున్నా’
-
ఇప్పటికైనా ‘టాప్’లో చేర్చండి!
ప్రభుత్వ మద్దతు కోరుతున్న గుత్తా జ్వాల తమ ప్రదర్శనను గుర్తించాలంటున్న షట్లర్ సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది జరిగే రియో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించే లక్ష్యంతో ఆటగాళ్లకు ఆర్థిక సహకారం అందిస్తూ ఇటీవల భారత ప్రభుత్వం టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్) పేరుతో భారీ పథకాన్ని ప్రారంభించింది. ఇందులో బ్యాడ్మింటన్ ప్లేయర్లు ఆరుగురికి అవకాశం కల్పించగా... డబుల్స్ స్పెషలిస్ట్‌లు గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్పలకు స్థానం లభించలేదు. అయితే తాజాగా కెనడా గ్రాండ్‌ప్రి టోర్నీ నెగ్గిన అనంతరం గుత్తా జ్వాల ఇప్పటికైనా తమను గుర్తించాలని, ప్రభుత్వ సహకారం ఉంటే తామూ ఒలింపిక్స్‌లో పతకం సాధిస్తామని చెప్పింది. విజయానంతరం స్వస్థలం తిరిగొచ్చిన జ్వాల, బుధవారం మీడియాతో మాట్లాడింది. ‘సింగిల్స్ ఆటగాళ్లలాగే మాకూ ప్రభుత్వం సహకారం అందించాలి. అది దక్కితే నేను, అశ్విని కచ్చితంగా ఒలింపిక్స్‌లో పతకం గెలుస్తాం. సంబంధిత వ్యక్తులు ఇప్పటికైనా మేల్కొనాలి. వారు మా గురించీ ఆలోచిస్తారని ఆశిస్తున్నా. డబుల్స్‌లో భారత్ తరఫున మాది అత్యుత్తమ జోడి. కాబట్టి అన్ని రకాల మద్దతు అవసరం. రెండు, మూడు రోజులు ఢిల్లీలో ఉండి పైరవీలు చేసుకోకుండా ఆటపై దృష్టి పెడుతున్నాం కాబట్టి మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదేమో. కెనడా ఓపెన్ తర్వాతైనా కేంద్ర క్రీడా శాఖ ఆలోచన మారాలి’అని జ్వాల ఘాటుగా వ్యాఖ్యానించింది. మా జోడీ సూపర్ : చాలా కాలం తర్వాత అంతర్జాతీయ టైటిల్ గెలవడం పట్ల గుత్తా జ్వాల సంతోషం వ్యక్తం చేసింది. ఒలింపిక్స్ సన్నాహక సంవత్సరంలో ఇది రావడం తమ ఆత్మ విశ్వాసాన్ని పెంచిందని, అశ్వినితో సమన్వయం బాగా కుదిరిందని చెప్పింది. ‘గత కొన్నేళ్లుగా మేం కలిసి ఆడుతున్నా... ఇటీవల కోర్టులో మా మధ్య సమన్వయం పెరగడం పట్ల ఇద్దరం సంతృప్తిగా ఉన్నాం. ఆటగాళ్లుగా ఇద్దరం ఎంతో పరిణతి సాధించాం. అనుభవం వల్లే కెనడా ఓపెన్‌లో విజయం దక్కింది. భవిష్యత్తులోనూ మంచి ఫలితాలు సాధిస్తాం. అయితే అంతిమ లక్ష్యం ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే’ అని జ్వాల వెల్లడించింది. టైటిల్ నెగ్గిన తర్వాత దేశ ప్రధాని మోది అభినందనలు అందుకోవడం గర్వంగా అనిపించిందని, ఇది తమ శ్రమకు దక్కిన గుర్తింపుగా భావిస్తున్నట్లు జ్వాల పేర్కొంది. -
వి‘పత్తి’!
పరిగి: ఆరుగాలం కష్టించిన అన్నదాతకు ప్రభుత్వ ‘మద్దతు’ కరువైంది. పత్తి రైతుకు చివరికి పుట్టెడు దుఃఖం తప్ప ఏమీ మిగలని పరిస్థితి ఎదురవుతోంది. రైతులకు అందుబాటులో ఉండేలా సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాలు మూణ్నాళ్ల ముచ్చటే అవుతున్నాయి. దీంతో దళారులను ఆశ్రయించి నష్టపోవాల్సి వస్తోంది. పరిగి వ్యవసాయ మార్కెట్లో గత నెల మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి ఆర్భాటంగా పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. మరుసటిరోజే కొనుగోలు కేంద్రం అడ్డా మార్చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా కొందుర్గు మండలం లాల్‌పహాడ్‌లోని ఓ ప్రైవేటు జిన్నింగ్ మిల్లులో కొనుగోళ్లు జరుపుతున్నారు. రైతులు తమ పంటను అంత దూరం తీసుకెళ్లేందుకు వ్యయప్రయాసలు పడాల్సి వస్తోంది. ఒకవేళ కష్టపడి అక్కడి వరకు పత్తి తీసుకెళ్లినా. మిల్లు వద్ద ట్రాక్టర్లతో రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఈ అవస్థలు పడలేని రైతులు గత్యంతరం లేక గ్రామాల్లోకి వచ్చే దళారులకే పత్తిని విక్రయిస్తున్నారు. దళారులు, జిన్నింగ్ మిల్లు యాజమాన్యంతో సీసీఐ అధికారులు కుమ్మక్కై కొనుగోలు కేంద్రాన్ని మార్చారని ఆరోపిస్తున్నారు. సీసీఐ తీరును నిరసిస్తూ సోమవారం పరిగి మార్కెట్‌కు చేరుకున్న రైతులు మార్కెట్ సెక్రటరీ చంద్రశేఖర్‌ను నిలదీశారు. కొనుగోళ్లు పరిగిలోనే జరపాలని డిమాండ్ చేశారు. నష్టపోతున్న రైతులు.. పత్తి కొనుగోలు ప్రక్రియ అంతా గందరగోళంగా మారింది. లాల్‌పహాడ్ జిన్నింగ్ మిల్లులో స్థలం లేదంటూ వారానికి మూడు రోజులు సెలవు ప్రకటిస్తున్నారు. పత్తి తీసుకుని మిల్లుకు వెళ్లాక సీసీఐ సిబ్బంది రైతుల నుంచి తీసుకోవడానికి నిరాకరిస్తుండటంతో దిక్కుతోచని పరిస్థితి తలెత్తుతోంది. జిన్నింగ్‌మిల్లు యజమానులు క్వింటాలుకు రూ.3,500 నుంచి 3,600 చెల్లించి పత్తిని కొనుగోలు చేస్తున్నారు. రైతులు అంతదూరం పత్తిని తీసుకెళ్లి తిరిగి రాలేక అయిన కాడికి అక్కడే ప్రైవేటు వ్యాపారులకు విక్రయిస్తున్నారు. దీంతో క్వింటాలుకు రూ. 400 నుంచి రూ.500 వరకు నష్టపోతున్నారు. రోజుల తరబడి నిరీక్షణ.. పత్తి కొనుగోలు కేంద్రం పరిగిలో ఏర్పాటు చేసి తూకాలు మహబూబ్‌నగర్ జిల్లా లాల్‌పహాడ్ వద్ద చేస్తుండడం పలు విమర్శలకు తావిస్తోంది. కొనుగోలు కేంద్రం బోర్డును మాత్రం పరిగి వ్యవసాయ మార్కెట్లో తగిలించారు. అక్కడికి రైతులు పత్తి తీసకువస్తే ఇక్కడ కాదు లాల్‌పహాడ్‌కు వెళ్లమంటున్నారు. అంతదూరం వెళ్లాక పంటతో తిరిగి వెనక్కి వెళ్లలేరు కాబట్టి ఏం చేసినా నడుస్తుందులే అనుకుని తేమ సాకుతో ధర నిర్ణయిస్తున్నారు. మిల్లులోనే తూకాలు వేసి పత్తిని కొనుగోలు చేస్తున్నారు. రైతులు వాహనాలు వెతుక్కుని.. అందులో పత్తి నింపి.. ఆ తరువాత పరిగిలోని కొనుగోలు కేంద్రానికి, అక్కడి నుంచి లాల్‌పహాడ్‌కు వెళ్లి.. తేమ చూపించుకుని.. తూకాలు వేయించుకుని విక్రయించటం తతంగా మారింది. మరోవైపు రోజుల తరబడి ఉండాల్సి రావడంతో తీసుకెళ్లిన వాహనకిరాయి తడిసి మోపెడవుతోంది. ఇంత చేసినా పత్తి కొనుగోలు చేశాక మరోవారం రోజులకు గానీ చెక్కులలివ్వడంలేదు. ఇవేం తిప్పలు..? గత శనివారం పత్తి ట్రాక్టర్లో నింపుకుని పరిగికి వస్తే లాల్‌పహాడ్ వెళ్లమన్నారు. అక్కడికి వెళ్లాక తీసుకునేందుకు సీసీఐ వారు ఒప్పుకోలేదు. ఇదేమని నిలదీస్తే స్థలం లేదు.. అందుకే మూడు రోజులు సెలవులిచ్చామన్నారు. చేసేదిలేక అక్కడే జిన్నింగ్ మిల్లు యజమానులకు విక్రయించాం. ఇంత దూరం వచ్చాక ఎలాగూ తిరిగి వెళ్లలేరు కదా అని క్వింటాలుకు రూ.3,600కు కొనుగోలు చేశారు. దళారులు తీసుకువస్తే మాత్రం వెంటనే కొనుగోలు చేస్తున్నారు. - హన్మంతురెడ్డి, రైతు, రాఘవాపూర్ -
నిర్మాణరంగ కార్మికులకు సర్కారు చేయూత
వీరు అర్హులు నిర్మాణ రంగంలో మట్టిపని, గుంతలు తీయటం, చదును చేయటం, ఫిట్టర్లు, తాపీ మేస్త్రీలు, తాపీ కూలీలు, కార్పెంటర్లు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, మార్బుల్, గ్రానైట్, టైల్స్ మొదలగు ఫ్లోరింగ్ పనిచేయువారు పాలిషింగ్, సెంట్రింగ్, సీలింగ్ వర్క్, పెయింటింగ్, రోడ్డు నిర్మాణ కార్మికులు, సూపర్ వైజర్లు, అకౌంటెంట్స్, ఇటుకల తయారీకార్మికులు, చెరువులు, బావులు పూడిక తీయుట, తవ్వుట మొద లైన పనులు చేసే వారు నమోదు ఇలా.. 90 రోజుల పాటు భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేసి ఉండాలి. దరఖాస్తు ఫారంతో పాటు రేషన్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు జిరాక్సులను జతపరిచి, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలను ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని లేబర్ కార్యాల యంలో సంబంధిత సర్కిల్ లేబర్ అసిస్టెంట్ అధికారికి అందించాలి. బ్యాంకులో రూ.62తో కార్మిక శాఖ పేరు మీద చలాన్ చెల్లించాలి. ఈ మొత్తం ఒక సంవత్సరానికి మాత్రమే. రెండో సంవత్సరం రెన్యువల్ కోసం రూ.12 బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లించాలి. సదుపాయాలు ఇవీ.. భవన నిర్మాణ కార్మికుడిగా నమోదు చేయించుకున్న కార్మికుడు ప్రమాదవశాత్తు మృతి చెందినా, శాశ్వత అంగవైకల్యానికి గురైనా ప్రభుత్వం వారికి రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందిస్తుంది. {పమాదం వలన 50 శాతం అంగవైకల్యం కలిగితే రూ. లక్ష వరకు ఆర్థిక సహాయం అందిస్తుంది. కార్మికురాలి ప్రసూతి సహాయార్థం రూ.5000, కార్మికుడు/కార్మికురాలు సాధారణంగా మరణిస్తే రూ.30 వేలు ప్రభుత్వం ద్వారా పొందవచ్చు. నిర్మాణ రంగంలోని వారికి జాతీయ నిర్మాణ శిక్షణ ద్వారా శిక్షణ కార్యక్రమాలను అందిస్తుంది. -
పొరుగు రాష్ట్రం ద్రాక్షే దిక్కు!
గజ్వేల్, న్యూస్‌లైన్: స్థానికంగా లభించే ద్రాక్ష పండ్ల రుచిని ఆస్వాదించిన జనం ఇక పొరుగు రాష్ట్రాల సరుకుపై ఆధార పడక తప్పదు. ప్రభుత్వ చేయూత లేకపోవడంతో ఇక్కడి తోటలు క్రమంగా కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. మహారాష్ట్రలో మాత్రం అక్కడి ప్రభుత్వం రైతులను వెన్నుతట్టి ప్రోత్సహిస్తోండడంతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. ఫలితంగా అక్కడినుంచే ‘ద్రాక్ష’ను దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇప్పటికే మార్కెట్లోకి ఉత్పత్తులు వెల్లువలా వస్తున్నాయి. పొరుగు రాష్ట్రానికి చెందిన సరుకు కావడంతో ఇప్పటికే ధరలు మండిపోతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో కిలో రూ.70కిపైగానే పలుకుతుండగా ప్రత్యేకించి సామాన్యులకు ఇక అందని‘ద్రాక్ష’గానే మారింది. రాష్ట్రంలో ద్రాక్ష సాగుకు సంబంధించి ఒకప్పుడు మెదక్, రంగారెడ్డి జిల్లాలే ఆధారం. ప్రత్యేకించి మెదక్ జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గం ద్రాక్ష సాగులో సింహభాగాన్ని ఆక్రమించేది. విదేశాలకు ఎగుమతి చేసేం దుకు దోహదపడే సీడ్లెస్ రకాలే ఇక్కడి రైతులు ప్రధానంగా సాగుచేసేవారు. విదేశాలకే కాకుండా కర్ణాటక, తమిళనాడు, ఒడిషా, పశ్చిమబెంగాల్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు కూడా ద్రాక్ష ఎగుమతి అయ్యేది. సాధారణంగా ఎకరా ద్రాక్ష తోట సాగు చేయాలంటే కూలీలు, ఎరువులు, ఫంగీసైడ్స్, ఇతర అవసరాలు కలుపుకొని రూ.1.8 లక్షల వరకు పెట్టుబడి అవసరముంటుంది. ఇంత భారీ పెట్టుబడి పెట్టినా 2006 వరకు రైతులు లాభాలను బాగానే గడించారు. 2007లో ద్రాక్ష తోటల సాగుకు సంబంధించి ఒక్కసారిగా సీను మారింది. ద్రాక్ష తోటలు సాధారణంగా జనవరి రెండో వారం నుంచి ఏప్రిల్ నెల వరకు కోతకు వస్తుంటాయి. ఈ క్రమంలో 2007, 2008 సంవత్సరాల్లో సరిగ్గా కోతల సమయాల్లోనే అకాల వర్షాలు కురిశాయి. 2008 సంవత్సరంలో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో గజ్వేల్, ములుగు, వర్గల్ తదితర మం డలాల్లో సాగులో ఉన్న ద్రాక్ష తోటలకు ఫంగస్ సోకి పళ్లన్నీ విషతుల్యమయ్యాయి. దీంతో రైతులు కోట్లల్లో నష్టపోయారు. గణనీయంగా పడిపోయిన విస్తీర్ణం.. 2007, 2008వ సంవత్సరాల్లో వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉండడంతో కోట్లా ది రూపాయల నష్టాన్ని చవిచూడడంతో ద్రాక్ష సాగంటేనే రైతులు జంకుతున్నారు. కూరగాయల సాగుపై దృష్టి సారించారు. ఫలితంగా గజ్వేల్, ములుగు, వర్గల్, కొండపాక, తూప్రా న్ మండలాల్లో 2008లో వెయ్యి ఎకరాల్లో ద్రాక్ష సాగులో ఉండగా 2009, 2010వ సంవత్సరాల్లో 150 ఎకరాలకు తగ్గిపోయింది. 2013-14లో 20 ఎకరాలకు పడిపోవడం ఆం దోళన కలిగిస్తున్నది. జిల్లాలో ఐదేళ్లక్రితం మూడు వేల ఎకరాల్లో ‘ద్రాక్ష’ సాగైతే ప్రస్తుతం 200 ఎకరాలకు పడిపోయిందంటే అతిశయోక్తి కాదు. నష్టాల బారినపడ్డ రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం చొరవచూపకపోవడంతో ద్రాక్షసాగు పడిపోయే ప్రమాదం ఉంది. మహారాష్ట్ర నుంచే.. మన రాష్ట్ర అవసరాల కోసం మహారాష్ట్ర నుంచే ద్రాక్షను దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. అక్కడ జనవరి మొదటి వారం నుంచి తోటలు కోతకు వస్తుంటాయి. తెలంగాణ జిల్లాల్లో ఫిబ్రవరి చివరి వారంలో తోటలు కోతకు వస్తా యి. కానీ సాగు గణనీయంగా పడిపోవడంతో మహారాష్ట్ర సరుకుపైనే ఆధారపడాల్సిన పరిస్థి తి. ఇప్పటికే మార్కెట్లోకి అక్కడి సరుకు వెల్లువలా రావడం ఆరంభమైంది. ప్రస్తుతం కిలో ధర రూ.70కిపైగానే పలకడం ఆందోళన కలిగిస్తున్నది. మహారాష్ట్రలో సర్కార్ ప్రోత్సాహం.. ద్రాక్ష సాగుకు మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడి రైతులను వెన్ను తట్టి ప్రోత్సహిస్తోంది. కొత్తగా ద్రాక్ష సాగుకు సిద్ధమయ్యే రైతులకు అక్కడి ప్రభుత్వం బ్యాంకు రుణంతోపాటు ఫంగీ సైడ్స్, పెస్టిసైడ్స్, ఆధునిక పరికరాలు, పందిరి అల్లడానికి వైరు, డ్రిప్ తదితర సౌకర్యాలను కల్పిస్తోంది. ఒక వేళ రైతులు అకాల నష్టాలతో నష్టపోతే ఎకరాకు రూ.80 వేల వరకు నష్టపరిహారాన్ని చెల్లిస్తుంది. అంతేగాక బ్యాంకుల్లో పంట రుణాలను రెన్యువల్ చేస్తుంది. కానీ మన రాష్ట్రంలో పరిస్థితి భిన్నంగా ఉంది. అకాల వర్షాలతో రైతులు నష్టపోతే వారిని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఇక్కడి ప్రభుత్వం కొత్తగా ద్రాక్ష సాగు చేసే రైతులకు అందిస్తున్న సాయం అరకొరేనని చెప్పవచ్చు.