governments decision
-
2017 జూన్ 2లోపు ఏపీకి వచ్చిన వారికే...స్థానిక హోదా
- రాష్ట్ర మంత్రివర్గంలో కీలక నిర్ణయం సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్రంలో స్థానికత నిబంధన సడలింపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2017 జూన్ రెండో తేదీలోపు ఏపీకి వచ్చిన వారికే స్థానికత వర్తిస్తుందని ప్రకటించింది. తెలంగాణలో చదువుతున్న విద్యార్థులు, ఉద్యోగులు, ఇతరులెవరైనా ఈలోపు ఇక్కడకు వచ్చి నివాస ధ్రువపత్రాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వచ్చిన వారికి ఇక్కడి స్థానికత వర్తించదు. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకూ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత స్థానికత నిబంధనల ప్రకారం నాలుగేళ్లపాటు ఎక్కడ ఉంటే ఆ ప్రాంతానికే స్థానికులు అవుతారు. రాష్ట్ర విభజన జరిగిన ప్రత్యేక నేపథ్యంలో ఉద్యోగులు స్థానికత విషయంలో అసంతృప్తితో ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రంలో ఆ నిబంధనకు ప్రభుత్వం సడలింపు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం 2017 జూన్ 2లోపు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన వారికి వెంటనే స్థానికత వర్తిస్తుంది. అయితే, ప్రస్తుత నిబంధనను మార్చాలంటే ఏపీ స్టేట్ రీ-ఆర్గనైజేషన్ ప్రకారం.. కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై కేంద్రం అనుమతితోపాటు రాష్ట్రపతి ఆమోదం పొందాలి. కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు నారాయణ, పల్లె రఘునాథ్‌రెడ్డి, అచ్చెన్నాయుడు, దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు, సిద్ధా రాఘవరావు మీడియాకు వెల్లడించారు. ఏపీ కొత్త రాజధాని అమరావతికి ఈనెల 22న శంకుస్థాపన చేయాలని గతంలోనే నిర్ణయించిన ప్రభుత్వం ముహూర్తాన్ని కూడా ఖరారు చేసింది. → ఈ నెల 22న మధ్యాహ్నం 12.35-12.45 మధ్య ఉద్దంరాయునిపాలెం, తాళ్లాయపాలెం, మందడం మధ్య సీడ్ రాజధాని నిర్మించే ప్రాంతంలో శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుంది. కృష్ణా నది నుంచి కరకట్టవైపు 50 ఎకరాలను ఇందుకు సిద్ధం చేస్తున్నారు. → 3వేల ఎకరాల్లో తొలి దశ రాజధాని నిర్మాణం ఉంటుంది. భూమిని సీఆర్డీఏ పేరిట ఉంచి సింగపూర్ సంస్థల భాగస్వామ్యంతో స్విస్ చాలెంజ్ పద్ధతిలో నిర్మిస్తారు. సచిత్తూరు జిల్లా కుప్పంలో 3కేఆర్ ప్రాజెక్టు కోసం బ్యాంకుల నుంచి తీసుకున్న 13,035మంది రైతులకు చెందిన రూ.13.24 కోట్ల రుణాల మాఫీ. → కృష్ణపట్నం పోర్టు అభివృద్ధి కోసం ఇచ్చిన 1,398 ఎకరాల లీజును 30 ఏళ్లకుపొడిగింపు. సవిశాఖపట్నం జిల్లా రాయవరం, రాంబిల్లి మండల్లాలో 1,965.57 ఎకరాలను నేవల్ ఆల్టర్నేట్ బేస్ ప్రాజెక్టు కోసం డిఫెన్స్ ఎస్టేట్‌కు ఎకరం రూ.5 లక్షల చొప్పున అప్పగింత. → లక్ష మంది పిల్లలకు భోజనం సరఫరా చేసేందుకు ముందుకొచ్చిన అక్షయపాత్ర ఫౌండేషన్‌కు గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులో 2 ఎకరాల 20 సెంట్ల స్థలాన్ని ఎకరా రూ.54 వేల చొప్పున 30 ఏళ్లపాటు లీజుకివ్వాలని నిర్ణయం. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో డీఆర్డీఓకు 2,721 ఎకరాల కేటాయింపు. → పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.30 వేల కోట్లకు పెరగడంపై చర్చ. ఈ నెల 22 నుంచి ఎర్త్‌వర్క్ పనుల్ని ప్రారంభించాలి. ఈ పనులు ప్రారంభించడానికి వీలుగా రెండు గ్రామాలను ఖాళీ చేయించాలి. ఐటీ కంపెనీలకు భారీ రాయితీలు... → ఐటీ టెక్నాలజీ పార్కులో కార్యాలయం ఏర్పాటు చేసుకునే సంస్థలకు లీజు అద్దెలో 50 శాతం రీయింబర్స్మెంట్ (ఏడాదికి రూ.10 లక్షలకు లోబడి) సదుపాయం కల్పించడం. → ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్‌కు కంపెనీలు చెల్లించే బ్యాండ్ విడ్త్ చార్జీల్లో 25 శాతం(రూ.15 లక్షల పరిమితికి లోబడి) రీయింబర్స్మెంట్. కార్యకలాపాలు ప్రారంభించిన నాటి నుంచి మూడేళ్లపాటు ఈ అవకాశం. → కార్యకలాపాలు ప్రారంభించిన నాటి నుంచి ఐదేళ్లపాటు నిర్ణీత కరెంటు చార్జీలు యూనిట్ ఒక్కింటికి రూ.10 చొప్పున రీయింబర్స్మెంట్. ఐటీ, ఐటీఈఎస్ యూనిట్లు కార్యకలాపాలు ప్రారంభించిన నాటి నుంచి ఐదేళ్లపాటు విద్యుత్ సుంకాల్లో నూరు శాతం మినహాయించి పరిశ్రమలకు వర్తింపచేసే టారీఫ్. → రిజిస్ట్రేషన్, స్టాంపు డ్యూటీలో సబ్ రిజిస్ట్రార్‌కు చెల్లించిన స్టాంపు డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుపై నూరుశాతం రీయింబర్స్మెంట్. → ఐటీ కార్యాలయాలకు స్థానిక మున్సిపాల్టీలకు చెల్లించే ఆస్తి పన్నులో 50 శాతం రీయింబర్స్మెంట్. ఐటీ కంపెనీల కోసం నిర్మించే భవనాలకు 50 శాతం బీమా. నిర్వహణ చార్జీల్లో 50.4 శాతం రీయింబర్స్‌మెంట్‌కు అవకాశం. ఆడియో, వీడియో సిస్టమ్స్, ప్రొజెక్షన్, సర్వర్ రూమ్, కెఫెటేరియాలతో ఉన్న కాన్ఫరెన్స్ హాలు ఏర్పాటుకు వన్ టైమ్ విలువతో రూ.10 లక్షలకు మించకుండా 50 శాతం రీయింబర్స్మెంట్. ఐటీ భవనాలు నిర్మించే మౌలిక వసతుల ప్రొవైడర్లు, డెవలపర్లు, బిల్డర్లు, లీజుదారులకు ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న రుణాల్లో పది శాతం రీయింబర్స్మెంట్. → కొత్తగా ఏర్పాటు చేసే ఐటీ కంపెనీల్లో రెండేళ్లపాటు ఉద్యోగికి రూ.2 వేల చొప్పున పీఎఫ్ రీయింబర్స్మెంట్ (రెండేళ్లు ఉద్యోగంలో కొనసాగి ఉంటే) -
చెంపపెట్టు..!
లబ్ధిదారుల ఎంపిక కమిటీలకు హైకోర్టు బ్రేక్ ప్రజాప్రతినిధులను పరిగణలోకి తీసుకోవాలని ఆదేశాలు ఎమ్మెల్యే ఆది చొరవతో న్యాయపోరాటం సాక్షి ప్రతినిధి, కడప: ప్రజాపాలనను అందించాల్సిన ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలకు ఒడిగట్టింది. తెలుగుతమ్ముళ్లకు దొడ్డిదారిన అధికారిక పెత్తనం చలాయించే అవకాశం కల్పించింది. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులను కాదని సామాజిక కార్యకర్తల ముసుగులో టీడీపీ వర్గీయులను నియమించింది. ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి హైకోర్టు పుల్‌స్టాప్ పెట్టింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జమ్మలమడుగు ప్రతినిధులు హైకోర్టులో వేసిన రిట్‌కు పిటీషన్ అనుగుణంగా తీర్పు వెలుబడింది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఏకపక్ష పాలనకు శ్రీకారం చుట్టింది.ప్రతి నిర్ణయానికి తెలుగుతమ్ముళ్లు కీలక వ్యక్తులుగా మారారు. ప్రభుత్వ నిర్ణయం కారణంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఉత్సవ విగ్రహాలయ్యారు. విపక్ష పార్టీ సభ్యులను కట్టడి చేయాలనే లక్ష్యంతో సామాజిక కార్యకర్తల పేరుతో టీడీపీ వర్గీయులకు అగ్రపీఠం వేశారు. రాష్ట్ర మంత్రి సూచించిన వారినే ఎంపిక కమిటీ సభ్యులుగా చేరుస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. ఈపరిణామంపై స్థానిక సంస్థల ప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించడంతో ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ ప్రజాప్రతినిధులకు అండగా హైకోర్టు తీర్పు వెలువరించింది. ఎమ్మెల్యే ‘ఆది’ చొరవతో ప్రభుత్వం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను కాదని ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల ఎంపికకు టీడీపీ కార్యకర్తలకు అగ్రస్థానం కల్పించింది. మండల పరిధిలో ఏర్పాటైన కమిటీ సూ చించిన అభ్యర్థులు మాత్రమే రుణాలు పొం దేందుకు అర్హులుగా నిర్ణయించింది. ఈ పరి ణామాన్ని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి దృష్టికి జమ్మలమడుగు స్థానిక సంస్థల ప్రతినిధుల తీసుకెళ్లారు. ప్రభుత్వ అక్రమ, అడ్డగోలు నిర్ణయంపై ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. జమ్మలమడుగు మున్సిపల్ చైర్పర్సన్ తాతిరెడ్డి తులశమ్మ, ఎంపీపీ ద్వారకచర్ల అరుణ, కొండాపురం జెడ్పీటీసీ యల్లాల సుబ్బలక్షుమ్మతో పాటు మరో ఐదుగురు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు హైకోర్టులో రిట్‌పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర, జిల్లా ఎస్సీ,ఎస్టీ కులాల కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్, జిల్లా కలెక్టర్‌ను ప్రతివాదులుగా చేరుస్తూ దాఖలైన రిట్‌పిటీషన్‌ను విచారణకు హైకోర్టు స్వీకరించింది. రాజ్యంగంలోని ఆర్టికల్ 226కు విరుద్ధంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని హైకోర్టుకు ప్రతివాదులు విన్నవించారు. హైకోర్టు ఛీప్ జస్టీస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, జస్టీస్ సంజయ్‌కుమార్ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధుల ద్వారానే లబ్దిదారుల ఎంపిక చేపట్టాలని హైకోర్టు పేర్కొంది. రాజకీయ పార్టీలకు చెందిన వారిని సభ్యులుగా చేపట్టడాన్ని రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు హైకోర్టు ఉత్తర్వులు ఇప్పటికే ప్రజాప్రతినిధులతోపాటు ప్రభుత్వ వర్గాలకు చేరాయి. -
సర్పంచులకే చెక్ ‘పవర్’
సాక్షి, మచిలీపట్నం : పంచాయతీల్లో చెక్ పవర్‌ను పూర్తిగా సర్పంచులకే కట్టబెడుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. జిల్లాలో 970 పంచాయతీలకు గాను ఇటీవల 968 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడంతో కొత్త పాలకవర్గాలు ఏర్పడిన సంగతి తెలిసిందే. కృత్తివెన్ను మండలం చినపాండ్రాక పంచాయతీ ఎన్నికలకు సుమారు ఆరు నెలల గడువు ఉండడంతో పాత పాలకవర్గమే కొనసాగుతోంది. కంచికచర్ల మండలం పెండ్యాల పంచాయతీ రిజర్వేషన్ ఖరారులో వివాదం నెలకొనడంతో ఎన్నిక నిలిచిపోయింది. దాదాపు రెండేళ్లకు పైగా ఎన్నికలు నిర్వహించని ప్రభుత్వం పంచాయతీలను ప్రత్యేక అధికారుల పాలనకే వదిలేసింది. 2006లో ఏర్పడిన పంచాయతీల పాలకవర్గాలకు 2011తో పదవీకాలం పూర్తికావడంతో అప్పటి నుంచి ఇటీవల కొత్త పాలకవర్గాలు ఏర్పడే వరకు ప్రత్యేక అధికారుల పాలన కొనసాగిన సంగతి విదితమే. నిధులు లేక, ఆలనాపాలన లేక పంచాయతీలు నిర్వీర్యమయ్యాయి. ఇదే సమయంలో జిల్లాలో పంచాయతీలకు రావాల్సిన రూ.40 కోట్ల నిధులు నిలిచిపోయాయి. ఈ క్రమంలో కోటి ఆశలతో పదవులు చేపట్టిన కొత్త పాలకవర్గాలకు చెక్ పెడుతూ సర్పంచ్‌తోపాటు కార్యదర్శికి కూడా చెక్ పవర్ (జాయింట్ సంతకం) ఉండేలా ప్రభుత్వం నిబంధన పెట్టింది. దీనికితోడు సమైక్య ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడడంతో ఉద్యోగులు ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్ 17వరకు సమ్మెబాట పట్టారు. నిధులు మంజూరులోను జాప్యం జరిగింది. ఉద్యోగులు సమ్మె విరమించిన అనంతరం జిల్లాకు రూ. 20 కోట్లు మంజూరయ్యాయి. 13వ ఆర్థిక సంఘం నిధులు రూ.15 కోట్లు, స్టేట్ ఫైనాన్స్ నిధులు రూ.5 కోట్లు కేటాయించారు. తీరా వాటితో పంచాయతీల్లో అభివృద్ధి పనులు చేపడదామంటే కార్యదర్శుల జాయింట్ సంతకం కొత్త పాలకవర్గాలకు ఇబ్బందికరంగా మారింది. దీనిపై రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆందోళన చేసింది. ప్రభుత్వ నిర్ణయంపై కొత్త పాలకవర్గాలు సైతం తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. ఎట్టకేలకు దిగివచ్చిన ప్రభుత్వం జాయింట్ సంతకం నిబంధనను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ తాజా నిర్ణయంపై ఒక మేరకు ఆనందం వ్యక్తం చేస్తున్న సర్పంచ్‌లు ఆర్థికపరమైన విషయాలపై ఆంక్షలు పెట్టడంపై పెదవి విరుస్తున్నారు. ఆర్థిక పరమైన లావాదేవీలపై ఎటువంటి ఆక్షలు లేకుంటే నిధులు సైతం దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందని పలువురు సీనియర్ కార్యదర్శులు చెబుతుండడం కొసమెరుపు. ఉత్తర్వులు రావాలి సర్పంచులకే చెక్ పవర్ కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అధికారి కంగా ఉత్తర్వులు అందలేదు. కొత్త పాలకవర్గాలు ఏర్పడిన అనంతరం ఉద్యోగులు సమ్మె బాట వీడి విధుల్లోకి చేరిన తరువాత జాయింట్ చెక్ పవర్ ఆదేశాలను అమల్లోకి తెచ్చాం. ఇటీవల జిల్లాకు ప్రభుత్వం విడుదల చేసిన నిధుల వినియోగం, పలు అభివృద్ధి పనులు, బిల్లుల చెల్లిం పులు అన్నీ జాయింట్ సంతకంతోనే జరుగుతున్నాయి. సర్పంచులకే చెక్ పవర్ ఉత్తర్వులు మాకు అందాకే అమల్లోకి తెస్తాం, - ఆనంద్, జిల్లా పంచాయతీ అధికారి ప్రజాసమస్యల పరిష్కారానికి ఊతం.. చెక్ పవర్‌పై జాయింట్ సంతకం పద్ధతి తొలగించడం మంచి పరిణామం. సర్పంచులకే చెక్ పవర్ ఇవ్వడం వల్ల స్వేచ్ఛగా అభివృద్ధి పనులు చేయడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ప్రజాసమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించడానికి మార్గం సుగమం అవుతుంది. -తలారి రామవెంకటలక్ష్మి, తుమ్మలచెరువు సర్పంచ్ జాయింట్ సంతకం ఇబ్బందే.. జాయింట్ చెక్ పవర్ వల్ల అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపులో ఇబ్బందులు ఎదురవుతాయి. దీనిపై సర్పంచులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ప్రభుత్వం దిగివచ్చింది. సర్పంచులకే చెక్ పవర్ ఇవ్వడం వలన అప్పటికప్పుడు పంచాయతీల్లో కావాల్సిన పనులు త్వరితగతిన చేపట్టవచ్చు. -మేకా లవకుమార్, పోతిరెడ్డిపాలెం సర్పంచ్ పేదలకు ఆసరాగా... సర్పంచిగా గెలిచి, నెలలు గడుస్తున్నా వ్యక్తిగతంగా చెక్ పవర్‌ను ప్రభుత్వం ఇవ్వలేదు. వ్యక్తిగతంగా సర్పంచులకు ఇచ్చిన చెక్‌పవర్‌తో గ్రామంలో పేదలకు అవసరమైన పనుల్ని చేసేందుకు ఆసరాగా నిలుస్తా. నమ్మి సర్పంచిగా గెలిపించిన గ్రామానికి అభివృద్ధిని అందిస్తా. - పడమటి సుజాత, కౌతవరం సర్పంచి (గుడ్లవల్లేరు మండలం) బాధ్యత తప్పింది... సర్పంచులతో పాటు మాకూ జాయింట్ చెక్ పవర్ ఇచ్చారు. కానీ అది కాదని సర్పంచ్ ఒక్కరికే ఇవ్వడం వలన మాకు బాధ్యత తప్పింది. మాకు సంబంధం లేకుండా చెక్కుల జారీలో సర్పంచులే నిర్ణయాలు తీసుకుంటారు. నిధుల విషయంలో అనుకోకూడనివి జరిగితే మాకు సంబంధం లేకుండా పోయింది. - జి.టి.వి.రమణ, గుడ్లవల్లేరు గ్రామ కార్యదర్శి -
కుదిరిన ముహూర్తం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: సుదీర్ఘ విరామం తర్వాత పట్టణ ప్రాంత జిల్లా సమీక్షా మండలి (పట్టణ డీఆర్సీ) సమావేశానికి ముహూర్తం ఖరారైంది. పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్న పట్టణ డీఆర్సీ ఎట్టకేలకు సోమవారం భేటీ కానుంది. దాదాపు ఏడు నెలల తర్వాత సమావేశమవుతున్న డీఆర్సీకి జిల్లా ఇన్చార్జ్ మంత్రి డి.శ్రీధర్‌బాబుతో పాటు మంత్రి ప్రసాద్‌కుమార్.. పట్టణ ప్రాంత ప్రజాప్రతినిధు లు హాజరుకానున్నారు. గతంలో జరిగిన సమావేశంలో చర్చ తాలూకు పురోగతితో పాటు పట్టణ ప్రాంతాల్లోని సమస్యలు ప్రస్తావించనున్నారు. వాస్తవానికి ఈ సమీక్ష రెండు నెలల క్రితమే నిర్ణయించారు. అయితే జిల్లాలోని పలు శివా రు పంచాయతీలను జీహెచ్ఎంసీలో కలుపుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం.. అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ ఘాటుగా స్పందించిన నేపథ్యంలో సమీక్షను చివరి నిమిషంలో వాయిదా వేసిన విషయం తెలి సిందే. శివారులోని 35 పంచాయతీలను జీహెచ్ఎంసీలో విలీనంచేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో.. పలు పార్టీలు. గ్రామస్తులు కోర్టును ఆశ్రయించారు. దీంతో 16 పంచాయతీలకు సంబంధించి విలీన ప్రక్రియ చట్ట ప్రకారం చేపట్టలేదం టూ విలీనాన్ని ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో ఆ 16 గ్రామ పంచాయతీల్లో యథావిధిగా పాలన సాగుతుండ గా.. మిగిలిన 19 పంచాయతీలు గ్రేటర్ పరిధిలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్లో జరిగే పట్టణ డీఆర్సీలో ఈ అంశం చర్చకు వచ్చే అవకా శం ఉంది. వీటిని పంచాయతీలుగానే ఉం చాలా, లేక నగర పంచాయతీలుగా మార్చాలా, గ్రేటర్లో విలీనం చేయాలా అనే విషయంపై చర్చించే అవకాశముంది.