సాక్షి, రంగారెడ్డి జిల్లా: సుదీర్ఘ విరామం తర్వాత పట్టణ ప్రాంత జిల్లా సమీక్షా మండలి (పట్టణ డీఆర్సీ) సమావేశానికి ముహూర్తం ఖరారైంది. పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్న పట్టణ డీఆర్సీ ఎట్టకేలకు సోమవారం భేటీ కానుంది. దాదాపు ఏడు నెలల తర్వాత సమావేశమవుతున్న డీఆర్సీకి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి డి.శ్రీధర్‌బాబుతో పాటు మంత్రి ప్రసాద్‌కుమార్.. పట్టణ ప్రాంత ప్రజాప్రతినిధు లు హాజరుకానున్నారు. గతంలో జరిగిన సమావేశంలో చర్చ తాలూకు పురోగతితో పాటు పట్టణ ప్రాంతాల్లోని సమస్యలు ప్రస్తావించనున్నారు.
వాస్తవానికి ఈ సమీక్ష రెండు నెలల క్రితమే నిర్ణయించారు. అయితే జిల్లాలోని పలు శివా రు పంచాయతీలను జీహెచ్‌ఎంసీలో కలుపుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం.. అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ ఘాటుగా స్పందించిన నేపథ్యంలో సమీక్షను చివరి నిమిషంలో వాయిదా వేసిన విషయం తెలి సిందే. శివారులోని 35 పంచాయతీలను జీహెచ్‌ఎంసీలో విలీనంచేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో.. పలు పార్టీలు. గ్రామస్తులు కోర్టును ఆశ్రయించారు.
దీంతో 16 పంచాయతీలకు సంబంధించి విలీన ప్రక్రియ చట్ట ప్రకారం చేపట్టలేదం టూ విలీనాన్ని ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో ఆ 16 గ్రామ పంచాయతీల్లో యథావిధిగా పాలన సాగుతుండ గా.. మిగిలిన 19 పంచాయతీలు గ్రేటర్ పరిధిలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్‌లో జరిగే పట్టణ డీఆర్సీలో ఈ అంశం చర్చకు వచ్చే అవకా శం ఉంది. వీటిని పంచాయతీలుగానే ఉం చాలా, లేక నగర పంచాయతీలుగా మార్చాలా, గ్రేటర్‌లో విలీనం చేయాలా అనే విషయంపై చర్చించే అవకాశముంది.
కుదిరిన ముహూర్తం
Published Mon, Oct 28 2013 3:18 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
Advertisement
Advertisement