Governor of AP
-
అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం
-
గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు సీఎం జగన్ పరామర్శ
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. మంగళవారం మధ్యాహ్నం తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రికి వెళ్లి గవర్నర్ ఆరోగ్య స్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారాయన. తీవ్ర కడుపు నొప్పితో సోమవారం మణిపాల్ ఆస్పత్రిలో గవర్నర్ నజీర్ చేరిన సంగతి తెలిసిందే. ఆపై వైద్య పరీక్షల్లో అపెండిసైటిస్‌గా నిర్ధారణ కావడంతో వైద్యులు సర్జరీ చేశారు. ఆపై ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని బులిటెన్ విడుదల చేశారు వైద్యులు. ఇక తిరుమల బ్రహ్మోత్సవాలతో పాటు తిరుపతిలో పలు అభివృద్ధి పనుల్లో సోమవారం బిజీగా ఉన్న సీఎం జగన్.. అధికారుల ద్వారా ఎప్పటికప్పుడు గవర్నర్ నజీర్ ఆరోగ్యంపై ఆరా తీస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఇవాళ డోన్ పర్యటన ముగించుకుని నేరుగా ఆస్పత్రికే చేరుకున్నారాయన. -
జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాకు ఏపీ ప్రభుత్వం సత్కారం
-
ఢిల్లీకి పయనమైన ఏపీ గవర్నర్
సాక్షి, అమరావతి : గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఢిల్లీకి పయనమయ్యారు. ఏపీ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా ఆయన ఢిల్లీకి వెళ్తున్నారు. బుధవారం రాత్రి గన్నవరం విమానాశ్రయం నుంచి ఆయన బయలుదేరారు. ప్రోటోకాల్ అధికారులు హరిచందన్‌కు వీడ్కోలు పలికారు. గవర్నర్ వెంట కార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనా, ఏడీసీ మాధవరెడ్డి, సెక్యూరిటీ అధికారులు ఉన్నారు. మూడు రోజుల పర్యటనలో ఆయన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌షాను కలవనున్నారు. శనివారం సాయంత్రం తిరిగి విజయవాడలోని రాజ్‌భవన్‌కు చేరుకుంటారు. -
ఓటుకు నోటు వ్యవహారంపై నో కామెంట్
-
ఓటుకు నోటు వ్యవహారంపై నో కామెంట్ : నరసింహన్
న్యూఢిల్లీ: తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో చోటు చేసుకున్న ఓటుకు నోటు వ్యవహారంపై స్పందించేందుకు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ నిరాకరించారు. మంగళవారం న్యూఢిల్లీ చేరుకున్న గవర్నర్ నరసింహన్ ఎయిర్పోర్ట్ వద్ద విలేకర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాలకు కుదిపేస్తున్న ఓటుకు నోటు వ్యవహారంపై స్పందించాలని విలేకర్లు గవర్నర్‌ను కోరారు. అందుకు నో కామెంట్ అంటూ సున్నితంగా తిరస్కరించారు. న్యూడిల్లీ పర్యటన అందుకేనా అని ప్రశ్నించగా... రాష్ట్ర విభజన జరిగి ఏడాది పూర్తి అయింది.. ఇరు రాష్ట్రాల వివరాలు వివరించేందుకే ఢిల్లీ వచ్చినట్లు చెప్పారు. డిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని మోదీతోపాటు కేంద్ర హోంశాఖ మంత్రి రాజనాథ్ సింగ్ తో భేటీ కానున్నట్లు నరసింహన్ వివరించారు. వీందరతో తన భేటీ మర్యాద పూర్వకమేనని నరసింహన్ వివరించారు.