
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఢిల్లీకి పయనమయ్యారు. ఏపీ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా ఆయన ఢిల్లీకి వెళ్తున్నారు.
సాక్షి, అమరావతి : గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఢిల్లీకి పయనమయ్యారు. ఏపీ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా ఆయన ఢిల్లీకి వెళ్తున్నారు. బుధవారం రాత్రి గన్నవరం విమానాశ్రయం నుంచి ఆయన బయలుదేరారు. ప్రోటోకాల్ అధికారులు హరిచందన్‌కు వీడ్కోలు పలికారు. గవర్నర్ వెంట కార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనా, ఏడీసీ మాధవరెడ్డి, సెక్యూరిటీ అధికారులు ఉన్నారు. మూడు రోజుల పర్యటనలో ఆయన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌షాను కలవనున్నారు. శనివారం సాయంత్రం తిరిగి విజయవాడలోని రాజ్‌భవన్‌కు చేరుకుంటారు.