బోరుబావి నుంచి క్షేమంగా బయటపడిన బాలిక
గండేడు: రంగారెడ్డి జిల్లాలో గండేడు మండలం గోవింద్‌పల్లి తండాలో బోరుబావిలో పడిన ఆరేళ్ల బాలిక అంజలి క్షేమంగా బయటపడింది. ఆమెను సహాయక బృందాలు సురక్షితంగా బయటకు తీశారు. 108 వాహనంలో ఆమెను ఆస్పత్రికి తరలించారు.
సాయంత్రం 6 గంటల సమయంలో ఆడుకుంటూ చిన్నారి 10 అడుగుల లోతున్న బోరు బావిలో పడిపోయింది. బోరుబావి లోతు తక్కువ ఉండడంతో పాపకు ప్రమాదం తప్పింది. పాప క్షేమంగా బయటపడడంతో ఆమె తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.