gowthami putra shatakarni
-
రెండొందల రోజులు ఆడాలి
- తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ‘‘నా అభిమాన నటులు ఎన్టీ రామారావుగారు. ఆయన తనయుడు బాలకృష్ణ అంటే నాకు ప్రీతిపాత్రులు. ఒకప్పుడు మనల్ని ‘మదరాసీయులు’ అని పిలిచేవారు. తెలుగువారిని అలా పిలవకూడదంటూ తెలుగు జాతికి గుర్తింపు తెచ్చిన ఘనత ఆయనది. ఎన్టీఆర్ ఒక తరం నటులు కారు, తెలుగుజాతి గర్వించదగ్గ బిడ్డ. ఆయన్ని ప్రతి ఒక్కరూ గుండెల్లో పెట్టుకుంటారు. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అనే విభజన ఉన్నా, శాతవాహన చక్రవర్తి వచ్చిన తర్వాత మనకంటూ ఒక శకం మొదలైంది. ఆ కథాంశంతో సినిమా తీయడం అభినందనీయం. బాలకృష్ణగారి వందో చిత్రం రెండొందల రోజులు ఆడాలి. ఈ సినిమా పూర్తయిన తర్వాత మొదటి ఆటను నా కుటుంబంతో కలిసి చూసేందుకు వస్తా’’ అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అన్నారు. నందమూరి బాలకృష్ణ వందో చిత్రంగా క్రిష్ దర్శకత్వంలో బిబో శ్రీనివాసరావు సమర్పణలో ఫస్ట్ ఫ్రేం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్న ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ప్రారంభోత్సవం శుక్రవారం హైదరాబాద్ అన్నపూర్ణా స్టూడియోలో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నటుడు చిరంజీవి కెమేరా స్విచ్చాన్ చేయగా, సీఎం కేసీఆర్ క్లాప్ ఇచ్చారు. ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు గౌరవ దర్శకత్వం వహించారు. దాసరి మాట్లాడుతూ- ‘‘బాలకృష్ణ వందో చిత్రంగా తెలుగుజాతి మొదటి చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి కథను ఎంచుకోవడం తెలుగుజాతి గర్వించదగ్గ విషయం. ఈ కథ ఆలోచన క్రిష్‌కు రావడం, దానిలో నటించేందుకు బాలయ్య ఒప్పుకోవడం గొప్ప విషయం’’ అని అభినందించారు. చిరంజీవి మాట్లాడుతూ ‘‘ఈ కథను, దర్శకునిగా క్రిష్‌ను బాలకృష్ణ ఎంచుకున్నప్పుడే బాలకృష్ణ సక్సెస్ అయ్యారు. ఇలాంటి పాత్రలు బాలకృష్ణ అవలీలగా చేయగలరు. ఓ సినిమా వందరోజులు ఆడటం గగనమైపోతున్న ఈ రోజుల్లో ఈ చిత్రం సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘బాలకృష్ణగారి వందో చిత్రం రెండొందల రోజులు, వెయ్యి థియేటర్లలో ఆడాలి’’ అని హీరో వెంకటేశ్ ఆకాంక్షించారు. బాలకృష్ణ మాట్లాడుతూ- ‘‘ఎన్టీఆర్ వారసుడిగా వైవిధ్యమైన చిత్రాల్లో నటించాలన్నది నా తపన. 1973లో మా నాన్నగారు నటుడిగా నా నుదుట తిలకం దిద్దారు. ఈ 43 ఏళ్లలో నేను 99 చిత్రాల్లో నటిస్తే, 71 సినిమాలు శతదినోత్సవం జరుపుకొన్నాయి. ఇందుకు నా తల్లితండ్రుల దీవెన, నా ఆత్మబలం, తెలుగు ప్రేక్షకుల ఆశీర్వాదం, నా అభిమానులే కారణం. నా ఈ ప్రయాణంలో నాతో నడిచిన నిర్మాతలు, దర్శకులు, నటీనటులకు ధన్యవాదాలు. తెలుగు వారందరికీ ఈ వందో చిత్రం అంకితం’’ అని చెప్పారు. ‘‘కథ విన్న మరుక్షణం నుంచీ నన్ను ముందుకు నడిపిస్తున్న బాలకృష్ణగారికి కృతజ్ఞతలు’’ అని దర్శకుడు క్రిష్ తెలిపారు. భారీయెత్తున జరిగిన ఈ ప్రారంభ వేడుకకు హాజరైనవారిలో ప్రముఖులు తెలంగాణ మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాసయాదవ్, దర్శకులు సింగీతం శ్రీనివాసరావు, కె. రాఘవేంద్ర రావు, ఎ. కోదండరామిరెడ్డి, ఎన్.శంకర్, తమ్మారెడ్డి భరద్వాజ్, శ్రీవాస్, సినీ రచయితలు విజయేంద్రప్రసాద్, ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి తదితరులు ఉన్నారు. -
బాలకృష్ణ సినిమా హిట్ ఖాయం: చిరంజీవి
హైదరాబాద్: బాలకృష్ణ నటిస్తున్న 100వ సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణి సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ జరుపుకుంటుందని ప్రముఖ నటుడు చిరంజీవి అన్నారు. షూటింగ్ ప్రారంభ కార్యక్రమానికి వచ్చిన ఆయన మాట్లాడారు. 100వ సినిమా చాలా ప్రతిష్టాత్మకమని, మైలు రాయిగా ఉండిపోతుందని చెప్పారు. బాలకృష్ణ గౌతమి పుత్ర శాతకర్ణి చరిత్రను సినిమా కథగా నిర్ణయం తీసుకోవడమే తొలి విజయం అని చెప్పారు. బాలకృష్ణ జీవిత చరిత్రలో ఇది అపూర్వ ఘట్టంగా ఉంటుందని అన్నారు. ఈ సినిమా బాధ్యత క్రిష్ కు ఇచ్చారంటేనే దాదాపు విజయం ఖాయమైనట్లేనని, సరైన దర్శకుడు క్రిష్ అని చెప్పారు. ఎలాంటి పాత్రనైనా బాలకృష్ణ చేస్తారని ఈ పాత్రలో మాత్రం మరింత ఒదిగిపోతారని చెప్పారు. -
కేసీఆర్ మైకు అందుకోగానే నాన్ స్టాప్ విజిల్స్..
హైదరాబాద్: ఎక్కడికి వెళ్లినా ముఖ్యమంత్రి కేసీఆర్ తన వాగ్దాటికి తిరుగులేదనిపించుకున్నారు. ఆయన ప్రసంగానికి మరోసారి విజిల్స్ మోతమోగాయి. బాలకృష్ణ నటిస్తున్న వందో సినిమా 'గౌతమీ పుత్ర శాతకర్ణి' షూటింగ్ ప్రారంభ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడారు. ఆయనలా మైకు అందుకొని నటరత్న రామారావుగారంటే అని అనగానే నాన్ స్టాప్‌గా విజల్స్, చప్పట్లు మోతమోగాయి. దాంతో కాసేపు మాట్లాడకుండా వారి సంతోషాన్ని గమనించిన కేసీఆర్ తనకు ఎన్టీఆర్ అంటే ఎంతో అభిమానం అని, ఆయనను ఇష్టపడని కుటుంబం, తెలుగువారు లేరే లేరని అన్నారు. శకయుగాన్ని ప్రారంభించిన గౌతమీ పుత్ర శాతకర్ణి కథతో తన వందో సినిమా తీయాలని బాలకృష్ణ తీసుకున్న నిర్ణయం గొప్పదని అన్నారు. బాలకృష్ణకు ఈ చిత్రం విజయవంతం కావాలని నా దీవెనలు అందిస్తున్నానని చెప్పారు. ఈ వందో సినిమా 200 రోజులు ఆడుతుందని చెప్పారు. నందమూరి కుటుంబం అంటే తెలుగువారికి ఎంతో ప్రేమ అని, మద్రాసీలు అనే పేరు పొగొట్టి ఆంధ్రావారు, తెలుగువారు అని పేరును తెచ్చిన గొప్ప వ్యక్తి రామారావు అని అన్నారు. ఎన్టీఆర్ గార్డెన్ ఎప్పటికీ అలాగే ఉంటుందని, ఆయన ఏ జ్ఞాపకాన్నైనా పదిలంగా కాపాడుకుంటామని చెప్పారు. ఎన్టీఆర్ అంటే ఒకే తరం నటుడు కాదని చెప్పారు. తెలుగు జాతి గొప్ప బిడ్డ అని కొనియాడారు. వందో సినిమా షూటింగ్ ప్రారంభం కాగానే తొలిసారి తొలి ఆట చూసే అవకాశం తమకు ఇవ్వాలని, కుటుంబ సమేతంగా చిరంజీవి, వెంకటేశ్ తో కలిసి ఈ సినిమా చూస్తానని చెప్పారు. -
బాలయ్య సినిమాకు.. కేసీఆర్ క్లాప్
హైదరాబాద్: క్రిష్ దర్శకత్వం వహిస్తున్న నందమూరి నట వారసుడు బాలకృష్ణ వందో సినిమా 'గౌతమీ పుత్ర శాతకర్ణి' షూటింగ్ అట్టహాసంగా మొదలైంది. అతిరథ మహారథుల మధ్య అన్నపూర్ణ స్టూడీయోలో అంగరంగ వైభవంగా పదిగంటల ప్రాంతంలో పూజ కార్యక్రమాలతో షూటింగ్ మొదలైంది. బాలకృష్ణ చేస్తున్న సెంచరీ సినిమా కావడంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని టాలీవుడ్ వర్గాలు, అభిమానులు, ప్రేక్షకులు భావిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసినిమా షూటింగ్ కు హాజరుకావాల్సిందిగా ప్రత్యేక ఆహ్వాన పత్రికలు కూడా అందించారు. ఈ చిత్ర షూటింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరై కొబ్బరి కాయ కొట్టారు. మంత్రులు హరీశ్ రావు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్ రెడ్డి కూడా హాజరై కొబ్బరి కాయలు కొట్టారు. ఇక దాదాపు తెలుగు చిత్ర సీమలోని అగ్ర దర్శకులు, హీరోలంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. శుక్రవారం ఉదయం పదిగంటల ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ సందడి మొదలైంది. ముహుర్తపు సన్నివేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్ క్లాప్ కొట్టారు. గౌరవ దర్శకత్వం దాసరి నారాయణరావు వహించగా నటులు చిరంజీవి, వెంకటేశ్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు.