బాలకృష్ణ సినిమా హిట్ ఖాయం: చిరంజీవి
హైదరాబాద్: బాలకృష్ణ నటిస్తున్న 100వ సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణి సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ జరుపుకుంటుందని ప్రముఖ నటుడు చిరంజీవి అన్నారు. షూటింగ్ ప్రారంభ కార్యక్రమానికి వచ్చిన ఆయన మాట్లాడారు. 100వ సినిమా చాలా ప్రతిష్టాత్మకమని, మైలు రాయిగా ఉండిపోతుందని చెప్పారు.
బాలకృష్ణ గౌతమి పుత్ర శాతకర్ణి చరిత్రను సినిమా కథగా నిర్ణయం తీసుకోవడమే తొలి విజయం అని చెప్పారు. బాలకృష్ణ జీవిత చరిత్రలో ఇది అపూర్వ ఘట్టంగా ఉంటుందని అన్నారు. ఈ సినిమా బాధ్యత క్రిష్ కు ఇచ్చారంటేనే దాదాపు విజయం ఖాయమైనట్లేనని, సరైన దర్శకుడు క్రిష్ అని చెప్పారు. ఎలాంటి పాత్రనైనా బాలకృష్ణ చేస్తారని ఈ పాత్రలో మాత్రం మరింత ఒదిగిపోతారని చెప్పారు.