ఖానాపూర్ ను దత్తత తీసుకున్న సీవీ ఆనంద్
హైదరాబాద్ : 'గ్రామ జ్యోతి' కార్యక్రమంలో భాగంగా ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రతి మండలానికో ఊరును దత్తత తీసుకోవాలన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుకు అనూహ్యంగా స్పందన వస్తోంది. తాజాగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ....రాజేంద్రనగర్ మండలం ఖానాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని ఆయన తెలిపారు. కాగా తెలంగాణ ప్రభుత్వం సోమవారం నుంచి (ఆగస్టు 17) 'గ్రామ జ్యోతి' కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విషయం తెలిసిందే.