grap
-
ఢిల్లీలో ఊపిరాడని మరోరోజు.. 500 వద్ద ఏక్యూఐ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో తలెత్తిన వాయు కాలుష్యం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఢిల్లీలో గాలి నాణ్యత సూచీ(ఏక్యూఐ) గత ఏడు రోజులుగా ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. మంగళవారం ఉదయం ఆనంద్ విహార్‌తో సహా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఏక్యూఐ 500కి చేరుకుంది.ఢిల్లీలోని విషవాయువు స్థానికుల ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతోంది. ఈ నేపధ్యంలో ఢిల్లీవాసులు ఎయిర్ ప్యూరిఫైయర్లు, మాస్క్‌లను ఆశ్రయిస్తున్నారు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) తెలిపిన వివరాల ప్రకారం సోమవారం ఢిల్లీలోని ఏక్యూఐ ‘చాలా తీవ్రమైన’ కేటగిరీకి చేరుకుంది. ఏక్యూఐ 484గా నమోదైంది.కాలుష్యాన్ని తగ్గించడానికి గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లా(గ్రాప్)-4 కింద ఆంక్షలను తక్షణమే విధించాలని జాతీయ రాజధాని ప్రాంతంలోని అన్ని రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరిన నేపధ్యంలో ఢిల్లీ ప్రభుత్వం 10, 12 తరగతులు మినహా మిగిలిన తరగతుల వారికి తరగతులను నిలిపివేయాలని నిర్ణయించింది.వీరికి ఆన్లైన్లో తరగతులు నిర్వహించనున్నారు. ప్రమాదకరమైన విషపూరిత గాలి నుండి విద్యార్థులను కాపాడేందుకే ఆన్లైన్ తరగతులను నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 10, 12వ తరగతి బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం పాఠశాలలు పనిచేయనున్నాయి. అయితే వీరికి కూడా ఆన్లైన్లో తరగతులు నిర్వహించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.ఇది కూడా చదవండి: భారత్ దౌత్య విజయం.. ఏకాభిప్రాయం అమలుకు చైనా సిద్ధం -
రాజధానిలో నేటి నుంచి ‘గ్రాప్-1’ అమలు
న్యూఢిల్లీ: ఈ ఏడాది చలికాలం ప్రారంభానికి ముందే రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం పెరిగింది. రాజధానిలో గాలి నాణ్యత వరుసగా రెండో రోజు ‘పూర్’ కేటగిరీలో నమోదైంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీపీబీ) తెలిపిన వివరాల ప్రకారం దసరా తర్వాత ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 224 కు చేరుకుంది.దీనిని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీలో ఈ ఏడాది కూడా గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్(గ్రాప్) అమలు చేస్తున్నారు. దీనిలో భాగంగా గ్రాప్-1ని నేటి నుంచి అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అవి నేటి నుంచి(మంగళవారం) నుంచి అమలు కానున్నాయి. గ్రాప్-1 దశలో బహిరంగ ప్రదేశాల్లో చెత్తను కాల్చడం, డీజిల్ జనరేటర్ల వినియోగాన్ని పరిమితం చేయడం, రెస్టారెంట్లలో బొగ్గు లేదా కట్టెల వినియోగాన్ని నిషేధించడం వంటివి ఉంటాయి. నగరంలో ఏక్యూఐ 200 దాటినప్పుడు గ్రాప్-1 అమలు చేస్తారు.గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అంటే గాలి నాణ్యత క్షీణతను నిరోధించడానికి అమలు చేసే విధానం. ఢిల్లీ-ఎన్సీఆర్లో గాలి నాణ్యత ఆధారంగా గ్రాప్ విధానాన్ని నాలుగు దశలుగా విభజించారు. మొదటి దశలో ఢిల్లీకి 300 కి.మీ. పరిధిలో కాలుష్యం కలిగించే పారిశ్రామిక యూనిట్లు, థర్మల్ పవర్ ప్లాంట్లపై చర్యలు తీసుకుంటారు. రెండవ దశలో వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించే లక్ష్యంతో సీఎన్జీ/ఎలక్ట్రిక్ బస్సు మెట్రో సేవలను ప్రోత్సహిస్తారు.మూడవ దశలో ఢిల్లీ, గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజియాబాద్, గౌతమ్ బుద్ధ నగర్లలో పెట్రోల్‌తో నడిచే బీఎస్-3 ఫోర్-వీలర్లు, డీజిల్‌తో నడిచే బీఎస్-4 ఫోర్-వీలర్ల వినియోగాన్ని నిషేధించనున్నారు. నాల్గవ దశలో అన్ని రకాల నిర్మాణ, కూల్చివేత పనులను నిషేధిస్తారు. పాఠశాల విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల సిబ్బందికి ఇంటి నుంచే పని చేసే అవకాశాన్ని కల్పిస్తారు.ఇది కూడా చదవండి: రసవత్తర పోరు.. ‘అంకెల్లో’ అమెరికా అధ్యక్ష ఎన్నికలు -
‘గ్రాప్- 3’ అంటే ఏమిటి? ప్రభుత్వం ఎందుకు అమలు చేస్తోంది?
దేశరాజధాని ఢిల్లీలో కాలుష్యం అంతకంతకూ పెరిగిపోతోంది. దీన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం సకల ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపధ్యంలోనే తాజాగా గ్రాప్- 3ని కూడా అమలులోకి తీసుకువచ్చారు. దేశ రాజధానిలో కాలుష్య స్థాయి ‘తీవ్రమైన’ కేటగిరీకి చేరుకోవడంతో ఢిల్లీ-ఎన్సీఆర్లో పలు నిర్మాణ పనులను కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాల మేరకు నిలిపివేశారు. డీజిల్‌తో నడిచే ట్రక్కులను దేశ రాజధానిలోకి ప్రవేశించకుండా నిషేధిస్తూ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ (సీఏక్యూఎం) ఉత్తర్వులు జారీ చేసింది. కాలుష్య నియంత్రణలో గ్రాప్-3 అనేది మూడవ దశలో భాగం. ఇది చలికాలంలో ఢిల్లీ అంతటా అమలు చేసేందుకు కేంద్రం నిర్ణయించిన వాయు కాలుష్య నిర్వహణ వ్యూహం. శనివారం సాయంత్రం ఐదు గంటలకు ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 402గా ఉంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా కాలుష్య స్థాయిలు మరింత పెరిగే అవకాశం ఉందని సంబంధిత అధికారులు అంచనా వేస్తున్నారు. ఢిల్లీ-ఎన్సీఆర్లో గాలి నాణ్యత పరిస్థితిని పరిశీలించడానికి జరిగిన సమావేశంలో ఈ ప్రాంతంలోని కాలుష్యాన్ని పరిష్కరించడానికి చర్యలను రూపొందించే బాధ్యత చేపట్టిన సీఏక్యూఎం ఏజెన్సీ అధికారులు ఈ విషయాన్ని తెలిపారు. గ్రాప్ అనేది నాలుగు దశలుగా విభజించిన విధానం. వీటిని ‘పూర్’ (ఏక్యూఐ 201-300), ‘వెరీ పూర్’ (ఏక్యూఐ 301-400), ‘తీవ్రమైన’ (ఏక్యూఐ 401-450), ‘మరింత తీవ్రమైన’ (ఏక్యూఐ >450)వర్గాలుగా పేర్కొన్నారు. గ్రాప్ స్టేజ్-3లో కీలకమైన ప్రభుత్వ ప్రాజెక్టులు, ముఖ్యమైన మైనింగ్, స్టోన్ బ్రేకింగ్ కార్యకలాపాలు మినహా అన్ని నిర్మాణ, కూల్చివేత కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తారు. ఢిల్లీకి బయట రిజిస్టర్ అయిన వాణిజ్య వాహనాలతో పాటు డీజిల్‌తో నడిచే ట్రక్కులు, మధ్యస్థ, భారీ కంటెయినర్ వాహనాలు ఢిల్లీలోకి ప్రవేశించడాన్ని కూడా నిషేధించారు. ఇది కూడా చదవండి: కాలుష్య భూతం: టెక్ కంపెనీల కీలక చర్యలు -
రాజధానికి కాలుష్యం కాటు
న్యూఢిల్లీ/చండీగఢ్: దేశ రాజధాని ఢిల్లీని ఈ ఏడాది కూడా వాయు కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేయనుంది. పొరుగునే ఉన్న పంజాబ్, హర్యానా రైతులు తమ పొలాల్లో వ్యర్థాలను తగులబెట్టడం ప్రారంభించారు. దీంతో ఢిల్లీలో వాయు నాణ్యత ప్రస్తుతం మధ్యస్థం నుంచి అత్యల్పస్థాయికి పడిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో ‘గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్(జీఆర్ఏపీ)’లో భాగంగా నేటి నుంచి అత్యవసర కార్యాచరణను అమలు చేయనున్నట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (సీపీసీబీ) తెలిపింది. వాయు నాణ్యత స్వల్ప నుంచి మధ్యస్థ స్థాయి వరకు ఉన్నట్లు గుర్తిస్తే గుంతలు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలకు నిప్పుపెట్టడాన్ని అధికారులు నిషేధిస్తారు. -
గ్రేప్ క్రాప్
తగరపువలస : దక్కను ప్రాంతానికి పరిమితమైన ద్రాక్ష ఇటీవల ఇంటిపంటగా మారిపోయింది. మొదట్లో స్టేటస్ సింబల్‌గా అక్కడక్కడ ద్రాక్షపాదులను పెంచడం మొదలుపెట్టేవారు. ఇటీవల అన్నిచోట్ల ద్రాక్షను తమ పెరట్లో వేసి మురిసిపోతున్నారు. చాలాచోట్ల తెగుళ్లు, సస్యరక్షణ లేక పోవడం తదితర కారణాలతో ఫలించకపోయినా కొన్నిచోట్ల దిగుబడిని ఇస్తున్నాయి. ఇప్పుడు కాంక్రీట్ వనంలో గుత్తులు మురిపిస్తున్నాయి. స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా భీమిలి బ్రాంచ్‌లో విధులు నిర్వర్తిస్తున్న బండారు ఎల్లాజి తగరపువలసలో పాతలోకల్ ఆఫీసు వీధిలోని తన ఇంట్లో ద్రాక్షమొక్కను నాటారు. ఇటీవల మొదటి దిగుబడిగా పులుపు,తీపి కలగలిపిన గుత్తులను ఇచ్చిన ద్రాక్షపాదు మళ్లీ నిండా విరగకాసింది. పాదునిండా సొగసైన గుత్తులతో ఈ ప్రాంతంలోనే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. -
జేఎన్టీయూ భూములు కబ్జా
6 ఎకరాల జేఎన్టీయూ భూములు కాజేసేందుకు ఎత్తుగడ కబ్జాదారులతో కుమ్మక్కైన ముగ్గురు వర్సిటీ ఉద్యోగులు జేఎన్టీయూ: అనంతపురం జేఎన్టీయూకు చెందిన రూ. 36 కోట్ల విలువ చేసే 6 ఎకరాలపై భూ రాబందుల కన్ను పడింది. వీరితో వర్సిటీకి చెందిన ముగ్గురు ఉద్యోగులు కుమ్మక్కుకావడంతో ఆ స్థలంలో గుడిసెలు వేసి కబ్జా చేసేందుకు యత్నించారు. వివరాల్లోకి వెళితే.. జేఎన్టీయూ క్యాంపస్ కళాశాలతో పాటు వర్సిటీకి 350 ఎకరాలు భూమి ఉంది. ఇందులో 100 ఎకరాలు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు ధారాదత్తం చేశారు. తక్కిన 250 ఎకరాల్లో 36 ఎకరాలను రాష్ట్రప్రభుత్వానికి సంబంధించిన వివిధ సంస్థలకు అప్పగించారు. ఇందులో 6 ఎకరాల స్థలం మిగిలింది. ఈ భూమిని ఆక్రమించుకోవడానికి రాజకీయ నాయకులు ఎత్తుగడ వేశారు. ఇందులో భాగంగా వర్సిటీ ఉద్యోగులు ఆ స్థలం జేఎన్టీయూకు సంబంధించినది కాదని ప్రచారం మొదలుపెట్టారు. ఈ ఆరు ఎకరాల స్థలంలో జేఎన్టీయూ అధికారులు గతంలో ఎలాంటి ఫెన్సింగ్ వేయకపోవడం వీరి ప్రచారానికి బలం చేకూరుతోంది. జేఎన్టీయూ అధికారులు 36 ఎకరాలను రాష్ర్టప్రభుత్వానికి బదలాయించగా, మిగిలిన ఆరు ఎకరాలు జేఎన్టీయూకు సంబంధం లేదన్న వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. చిన్న , చిన్న గుడిసెలు వేసి స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నించారు. జేఎన్టీయూ ఉన్నతాధికారుల మెతకవైఖరి కారణంగానే ఆక్రమాలకు బరితెగిస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వర్సిటీకి సంబంధించిన 6 ఎకరాల భూమిని ఆక్రమించుకోవడానికి కొందరు అక్రమార్కులు ప్రయత్నాలు చేసింది నిజమే. ఇందులో పాత్రధారులైన ఉద్యోగుల గుర్తించాం. వారిపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడం. స్థల ఆక్రమణను నిరోధించేందుకు కంచె ఏర్పాటు చేస్తున్నాం. - ఆచార్య ఎస్. కృష్ణయ్య, రిజిస్ట్రార్, జేఎన్టీయూ.