
న్యూఢిల్లీ/చండీగఢ్: దేశ రాజధాని ఢిల్లీని ఈ ఏడాది కూడా వాయు కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేయనుంది. పొరుగునే ఉన్న పంజాబ్, హర్యానా రైతులు తమ పొలాల్లో వ్యర్థాలను తగులబెట్టడం ప్రారంభించారు. దీంతో ఢిల్లీలో వాయు నాణ్యత ప్రస్తుతం మధ్యస్థం నుంచి అత్యల్పస్థాయికి పడిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో ‘గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్(జీఆర్‌ఏపీ)’లో భాగంగా నేటి నుంచి అత్యవసర కార్యాచరణను అమలు చేయనున్నట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (సీపీసీబీ) తెలిపింది. వాయు నాణ్యత స్వల్ప నుంచి మధ్యస్థ స్థాయి వరకు ఉన్నట్లు గుర్తిస్తే గుంతలు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలకు నిప్పుపెట్టడాన్ని అధికారులు నిషేధిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment