Green cover
-
ఇలాంటి వసతులు..ఎక్కడైనా ఉన్నాయా?
సాక్షి, హైదరాబాద్: దేశంలోని మరే నగరంలోనైనా హైదరాబాద్ స్థాయిలో మెరుగైన మౌలిక సదుపాయాలు, వసతులు ఉన్నాయో చెప్పాలని ఇతర రాష్ట్రాల ప్రతినిధులకు పరిశ్రమలు, ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. ఓవైపు హైదరాబాద్‌కు ‘ట్రీ సిటీ’గా ఐక్యరాజ్యసమితి నుంచి గుర్తింపు వచ్చిందని.. మరోవైపు సులభతర వాణిజ్య విధానంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందని చెప్పారు. ఐదేళ్లలోనే గ్రీన్ కవర్‌ను 24 శాతం నుంచి 31.7 శాతానికి పెంచగలిగామని తెలిపారు. కచ్చితమైన లక్ష్యాలతో పాటు అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ రెండింటినీ సమతూకం చేసుకుని తెలంగాణ విజయం సాధించగా లేనిది ఇతర రాష్ట్రాలు ఎందుకు చేయలేకపోతున్నాయని ప్రశ్నించారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆధునిక, సాంకేతిక పద్ధతుల్లో అటవీ శాఖ నిర్వహణ, కంపా నిధులు సద్వినియోగం, అటవీ పునరుద్ధరణ పనులపై జాతీయ వర్క్ షాప్‌ను రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, కేంద్ర అటవీ శాఖ డైరెక్టర్ జనరల్ సీపీ గోయల్‌లతో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. కేటీఆర్ మాట్లాడుతూ.. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పరిశ్రమలు, అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని అనుమతుల విషయాన్ని కేంద్రం, అటవీ, పర్యావరణ శాఖలు సులభతరం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల సమస్యలు, అభివృద్ధి అంశాలను పక్కనబెట్టి గుడ్డిగా ఒక్క చెట్టునూ కొట్టేయనివ్వమనే పంథాలో అటవీ శాఖ వ్యవహరించడం సరికాదన్నారు. ఈ ఆలోచనా విధానంలో మార్పు రావాలని కోరుకుంటున్నామని చెప్పారు. గ్రీన్ ర్యాంకింగ్స్ ఇవ్వండి ఫ్లైఓవర్ నిర్మాణం వల్ల వంద చెట్లను ట్రాన్స్‌లొకేషన్ లేదా తొలగింపు గురించే ఆలోచిస్తున్నారని.. సిగ్నల్ వద్ద వాహనాల నిలిపివేత వల్ల ఎంతశాతం కర్బన ఉద్గారాలు వెలువడి పర్యావరణానికి నష్టం జరుగుతుందనేది చూడాలని కేటీఆర్ చెప్పారు. సరళతర వాణిజ్య విధానం తరహాలో గ్రీన్ ర్యాంకింగ్స్ తీసుకొచ్చి రాష్ట్రాల మధ్య పోటీ పెంచాలని సూచించారు. జంగల్ బచావో–జంగల్ బడావో నినాదం అమలు చేస్తున్న తొలి రాష్ట్రం తెలంగాణ అని, హరిత నిధి ఏర్పాటు సీఎం కేసీఆర్ వినూత్న ఆలోచన అని ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. పచ్చదనం పెంపులో రాష్ట్రాలకు ర్యాంకులు ఇవ్వాలన్న కేటీఆర్ సూచన బాగుందని.. కేటీఆర్ సూచనలపై కేంద్రంతో చర్చిస్తామని అటవీ శాఖ డీజీ సీపీ గోయల్ తెలిపారు. కార్యక్రమంలో సీఎస్ సోమేశ్ కుమార్, నేషనల్ కాంపా సీఈఓ సుభాష్ చంద్ర, అటవీ శాఖ స్పెషల్ సీఎస్ శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు. -
మెట్రో నగరాల్లో హైదరాబాద్ సిటీ టాప్
సాక్షి, హైదరాబాద్: దేశంలోని మెట్రో నగరాల్లో 2011– 2021 మధ్య దశాబ్ద కాలంలో పచ్చదనం విస్తీర్ణం గ్రేటర్లో అత్యధికంగా (48.66 చ.కి.మీ) పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో 19.91 చదరపు కి.మీ పెరగగా.. ఇదే సమయంలో అహ్మదాబాద్‌లో 8.55 చ.కి.మీ, బెంగళూరులో 4.98 చ.కి.మీ తగ్గింది. జీహెచ్ఎంసీ విస్తీర్ణం 634.18 చ.కి.మీ పరిధిలో 2011లో కేవలం 33.15 చ.కి.మీ మేర పచ్చదనం ఉండగా అది 2021లో 81.81 చ.కి.మీటర్లకు పెరిగింది. నగరంలో పచ్చదనం శాతం 5.23 శాతం నుంచి 12.9 శాతానికి పెరిగింది. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ అంశాల్ని ప్రస్తావించింది. పచ్చదనంపై శ్రద్ధతో.. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న శ్రద్ధ, హరితహారం వంటి కార్యక్రమాలతో నగరంలో పచ్చదనం క్రమేపీ పెరుగుతోంది. గ్రేటర్ నగరంలో ఇప్పటి వరకు నిర్వహించిన హరితహారం కార్యక్రమాల్లో భాగంగా దాదాపు నాలుగు కోట్ల మొక్కలు ప్రభుత్వం తరపున నాటడం, ప్రజలకు పంపిణీ చేయడం వంటివి చేశారు. ► లేఔట్లలోని ఖాలీస్థలాల్లో, ప్రభుత్వ కా ర్యాలయాలు, సంస్థల ప్రాంగణాల్లో, చెరువులు, సరస్సుల వెంబడి, కాలనీల్లో ఖాలీగా ఉన్న స్థలాల్లో విరివిగా నాటారు. అవెన్యూ ప్లాంటేషన్ పేరిట రోడ్ల వెంబడి, ఇతరత్రా బహిరంగ ఖాలీ ప్రదేశాల్లో పెద్ద చెట్లుగా ఎదిగే మొక్కలు నాటారు.ఈ కార్యక్రమాల కోసం ఇప్పటి వరకు దాదాపు రూ. 50 కోట్లు ఖర్చు చేశారు. ► ఇటీవలి కాలంలో ఎక్కడా ఖాళీ ప్రదేశమన్నది కనిపించకుండా మొక్కలు నాటేందుకు కొన్ని కాలనీల్లో ఇప్పటికే చర్యలు చేపట్టారు. జీహెచ్ఎంసీ బడ్జెట్లోనూ గ్రీన్ బడ్జెట్ పేరిట పది శాతం నిధుల్ని పచ్చదనం పెంపు కార్యక్రమాలకు కేటాయించారు. గ్రేటర్ నగరంలో దాదాపు 4850 కాలనీలున్నాయి. ► ఆయా కాలనీలన్నింటిలోనూ ఎక్కడా ఖాళీ స్థలం కనిపించకుండా, ఇక నాటేందుకు ఎక్కడా జాగాలేదు అనే విధంగా మొక్కలు నాటే చర్యలకు సిద్ధమయ్యారు. చిట్టడవులుగా పెరిగే మియావాకీ విధానానికీ తగిన ప్రాధాన్యతనిచ్చారు. పార్కులతోపాటు ఫ్లైఓవర్ల కింద, రోడ్ల వెంబడి సెంట్రల్ మీడియన్లలో పెద్దయెత్తున మొక్కలు నాటారు. -
కళ్లకు గంతలు కట్టి..
పాత పథకాలను తవ్వితీస్తున్న టీడీపీ ప్రభుత్వం నీటి నిల్వకు 4500 పనులకు ప్రణాళికలు {Xన్కవర్ పేరిట పండ్ల తోటల పెంపకం కార్యకర్తల కోసమే మార్పులంటూ విమర్శలు కొత్త ప్రభుత్వం పాత పథకాలకు ఊపిరిలూదుతోంది. తన పాలనలో తవ్విన పచ్చ గుంతలకు చంద్రబాబు మళ్లీ ప్రాణం పోయబోతున్నారు. దీని కోసం వేల సంఖ్యలో పనులు చేపట్టి తెలుగు తమ్ముళ్లకు ఉపాధి కల్పించేందుకు ప్రణాళికల సిద్ధం చేయిస్తున్నారు. ప్రజల కళ్లకు గంతలు కడుతున్నారు. నూతన ప్రభుత్వం కొలువు తీరడంతోనే తన మార్కు పథకాలను తెరమీదకు తెస్తోంది. గతంలో ప్రాధాన్యం ఇచ్చిన ‘ఇంకుడుగుంతలు’ కార్యక్రమాన్ని తెలుగుదేశం ప్రభుత్వం మళ్లీ తెర పైకి తెచ్చింది. దీనికి సంబంధించిన ప్రణాళికను సత్వరం తయారు చేయాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు అధికారులు జిల్లాలోని ఆరు క్లస్టర్లలో నీటిని నిల్వ చేసే పనులకు సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. గుంటూరు, తెనాలి, సత్తెనపల్లి, మాచర్ల, వినుకొండ, నరసరావుపేట ఇలా ఆరు క్లస్టర్లలో నీటి నిల్వ చేసే కార్యక్రమంలో భాగంగా 4,500 పనులను చేపట్టేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.ఇందులో రూ.50 వేల మొదలు రూ.5 లక్షల లోపు పనులు ఉన్నట్లు సమాచారం. గ్రీన్ కవర్ పేరుతో.... పండ్ల తోటల పెంపకం పేరు కాస్తా మార్చి గ్రీన్ కవర్ పేరిట మొక్కల పెంపకం చేపట్టి పచ్చదనాన్ని పెంపొందించేందుకు కొత్త ప్రభుత్వం రెండవ ప్రాధాన్యం ఇచ్చింది.దీనికి సంబంధించి అధికారులు ఓ ప్రణాళికను సిద్ధం చేశారు. ఇందులో భాగంగా వెయ్యి ఎకరాల్లో పండ్ల తోటల పెంపకం చేపట్టనున్నారు.24 మండలాలు, 106 గ్రామ పంచాయతీల్లో రైతులకు లబ్ధి కలగనుంది. పొలాల గట్ల వెంట 8 లక్షల మొక్కలను పెంచాలని లక్ష్యంగా నిర్ణయించారు. 3.72 లక్షల విస్తీర్ణం కవర్ కానుంది.మూడవ ప్రాధాన్యం కింద వ్యక్తిగతంగా లబ్ధి కలిగే పథకాలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఈ ఏడాది నిర్మల్ భారత్ అభియాన్ పథకం కింద 30 వేల వ్యక్తిగత మరుగు దొడ్లు నిర్మించనున్నారు.కొత్త ప్రభుత్వం తన మార్కు ఉండేలా పథకంలో మార్పులు తెస్తుండటంతో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులపై వీటి ప్రభావం పడుతుందేమోననే ఆందోళన లబ్ధిదారుల్లో నెలకొంది.దీనికి తోడు టీడీపీ కార్యకర్తలకు లబ్ధి చేకూర్చేందుకే పథకంలో మార్పులు తెస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంచనాలు రూపొందించాం.. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రాధాన్యతా క్రమంలో ఈ ఆర్థిక సంవత్సరానికి పనులకు సంబంధించి ప్రణాళికలను సిద్ధం చేశాం. నీటిని నిల్వ చేసే పనులకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నాం. రెండో ప్రాధాన్యం కింద గ్రీన్‌కవర్ పేరుతో పచ్చదనాన్ని పెంపొందించే పనులు చేపట్టనున్నాం. వ్యక్తిగత పనులకు మూడో ప్రాధాన్యం ఇస్తున్నాం. ఈ పనులన్నీటి కీ అంచనాలు రూపొందించాం. - ఢిల్లీరావు, డ్వామా పీడీ