group -1 exams
-
గ్రూప్ 1 పరీక్షకు లైన్ క్లియర్
-
తెలంగాణ గ్రూప్-1 నోటిఫికేషన్‌కు లైన్‌క్లియర్
గ్రూప్ 1 నోటిఫికేషన్‌పై కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణలో గ్రూప్ 1 నోటిఫికేషన్‌కు లైన్ క్లియర్ అయ్యింది. గతంలో టీఎస్పీఎస్సీ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. దీంతో త్వరలో కొత్త గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉంది. కాగా రెండేళ్ల కిందట తొలిసారి నిర్వహించిన గ్రూప్ 1 పరీక్ష పేపర్ లీక్ కావడంతో ఆ పరీక్షను రద్దు చేశారు. రెండోసారి నిర్వహించిన పరీక్షలో కొందరి బయోమెట్రిక్ హాజరు తీసుకోలేదని కేసు వేయడంతో హైకోర్టు గ్రూప్-1 పరీక్షను రద్దు చేసింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ.. అప్పటి ప్రభుత్వం ఆదేశాల మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సుప్రీంకోర్టు కోర్టుకు వెళ్లింది. అయితే తాజాగా గ్రూప్ 1పై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. ఇక గతంలోని 503 ఖాళీలకు అదనంగా మరో 60 పోస్టులను పెంచుతూ ఇటీవల ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో మొత్తం ఖాళీల సంఖ్య 563కి చేరుకుంది. ఈ పోస్టుల భర్తీకి అనుబంధ నోటిఫికేషన్ విడుదల కానుంది. గతంలో 503 పోస్టుల భర్తీకి TSPSC నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా గ్రూప్ 1 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు వయోపరిమితిని 46 ఏళ్ల వరకు సడలిస్తామని అసెంబ్లీలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. దీంతో వీలైనంత త్వరగా నోటిఫికేషన్ విడుదల కానుంది. -
TSPSC : గ్రూప్-1 పరీక్షల నిర్వహణకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: TSPSC నిర్వహించనున్న గ్రూప్-1 పరీక్షలపై తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల నిర్వహణకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో జూన్ 11వ తేదీన గ్రూప్-1 పరీక్ష జరుగనుంది. అయితే, గ్రూప్-1 పరీక్షను రద్దు చేయాలని హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ క్రమంలో పిటిషనర్ పేపర్ లీక్ అంశాన్ని ప్రస్తావించారు. పేపర్ లీక్‌కు కారణమైన సిబ్బందితోనే పరీక్ష నిర్వహిస్తున్నారని వాదనలు వినిపించారు. అలాగే, పేపర్ లీకేజీపై దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, ఏ కమిషన్‌లో అయితే పేపర్ లీక్ అయిందో అదే కమిషన్ ఇప్పుడు గ్రూప్-1 నిర్వహిస్తోందని వాదించారు. థర్డ్ పార్టీ ఏజెన్సీ లేదా యూపీఎస్సీతో పరీక్షలు నిర్వహించాలని, 11 సంవత్సరాల తర్వాత జరుగుతున్న గ్రూప్-1 పరీక్ష ఇదని, పారదర్శకత లేకపోతే అభ్యర్థులు నష్టపోతారని తెలిపారు. TSPSC తలపెట్టిన మిగతా పేపర్లు కూడా లీక్ అయ్యాయని, ఆ పరీక్షలను ఇంకా నిర్వహించలేదు. కానీ, వెంటనే గ్రూప్-1 పరీక్షను నిర్వహిస్తున్నారని హైకోర్టుకు వివరించారు. విచారణ పూర్తి కాకుండా పరీక్షను నిర్వహించకూడదని, దానికి అనుగుణంగా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. దీనిపై హైకోర్టు.. కొన్ని ప్రశ్నలు అడిగింది. నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు కదా?, ఇదే సమయంలో పేపర్ లీక్‌లో అరెస్ట్ అయిన వారు ఇంకా సర్వీస్ కమిషన్ లో కొనసాగుతున్నారా అని హైకోర్ట్ ప్రశ్నించింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున ఏజీ వాదనలు వినిపించారు. "కమిషన్‌లో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశాం. ఈ కేసులో ఇప్పటి వరకు 50 మంది అరెస్ట్ అయ్యారు. దర్యాప్తుతో పిటిషనర్లకు ఎలాంటి సంబంధం లేదు. పరీక్ష రాసేందుకు అభ్యర్థులు ఎంతోగానో ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ముగ్గురిని నియమించి కేసు మానిటర్ చేస్తోంది. కమిషన్‌లో కొత్త సిబ్బందిని నియమించారు. 3.8 లక్షల మంది అభ్యర్థులు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారు. 995 సెంటర్లలో పరీక్ష నిర్వహిస్తున్నారు. రానున్న 6 నెలలో కమిషన్ నుండి 26 పరీక్షలు నిర్వహించబోతున్నారు. పేపర్ లీక్ వ్యవహారం బయటకు రాగానే కమిషన్ పరీక్షలను రద్దు చేసింది. పరీక్షకు వారం రోజుల ముందు ఇలాంటి పిటిషన్లు వేయడం సరికాదు" అంటూ వాదించారు. ఇక, ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం.. దర్యాప్తు తీరుపై కోర్టులు నిర్ణయం తీసుకుంటాయని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ క్రమంలో పరీక్షల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ 11న జరగనున్న పరీక్షకు 3 లక్షల 80 వేల 202 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 503 పోస్టులు ఉన్నాయి. ఇప్పటికే పరీక్షకు పగడ్బందిగా ఏర్పాట్లు చేశారు. అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే పరీక్ష కేంద్రం లోకి అనుమతిస్తారు. అభ్యర్థి గుర్తింపు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన -
గ్రూపు-1 ఫలితాల్లో నమ్మలేని నిజాలు.. బాంబు పేల్చిన బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీలో పేపర్ లీకు వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ సర్కార్‌పై ప్రతిపక్ష నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా గ్రూపు-1 ఫలితాలపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. కాగా, బండి సంజయ్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘గ్రూపు-1లో నమ్మలేని నిజాలు బయటకు వస్తున్నాయి. గ్రూపు-1లో బీఆర్ఎస్ నేతల పిల్లలు, బంధువులు క్వాలిఫై అయ్యారు. ఒకే మండలం నుంచి 50 మందికిపైగా క్వాలిఫై అవడమే కాకుండా ఒక చిన్ని గ్రామంలో ఆరు క్వాలిఫై అయ్యారు. దీనికి మంత్రి కేటీఆరే బాధ్యులు. కేసీఆర్ నియమించిన సిట్ విచారణ ఎలా చేయగలదు?. సిట్టింగ్ జడ్జి విచారణతోనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. మంత్రి కేటీఆర్‌ను బర్తరఫ్ చేయాల్సిందే’ అని డిమాండ్ చేశారు. -
దసరా సెలవుల్లోపే గ్రూప్–1పై నిర్ణయం
సాక్షి, అమరావతి: గ్రూప్–1 ప్రాథమిక పరీక్షపై దాఖలైన వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు కొన్ని వ్యాజ్యాల్లో తీర్పును వాయిదా వేసింది. మరికొన్ని వ్యాజ్యాలపై విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందనరావు సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. దసరా సెలవులకు ముందే ఈ వ్యాజ్యాల్లో నిర్ణయాన్ని వెలువరిస్తానని స్పష్టం చేశారు. 169 గ్రూప్–1 పోస్టుల భర్తీ నిమిత్తం ఏపీపీఎస్సీ 2019లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది. ఇందులో 51 తప్పులు దొర్లాయంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. తెలుగు అనువాదంలో తప్పులున్నాయని తెలిపారు. దీనిపై విచారించిన సింగిల్ జడ్జి పరీక్ష ఫలితాలపై తొలుత స్టే విధించి, సర్వీస్ కమిషన్ కౌంటర్‌ను పరిశీలించి స్టేను ఎత్తివేశారు. స్టే ఎత్తివేతపై అభ్యర్థులు అప్పీల్ చేశారు. అప్పీల్‌ను విచారించిన సీజే నేతృత్వంలోని ధర్మాసనం.. ఈ మొత్తం వ్యవహారంపై సింగిల్ జడ్జే విచారణ జరపడం మేలని పేర్కొంది. దీంతో ఈ వ్యాజ్యాలపై సోమవారం జస్టిస్ రఘునందన్‌రావు విచారణ జరిపారు. ఏపీపీఎస్సీ న్యాయవాది మల్లికార్జునరావు వాదనలు వినిపిస్తూ 25 ప్రశ్నలకు కీలో తప్పులు దొర్లినందున ఆ ప్రశ్నలను పరిగణనలోకి తీసుకోవడంలేదని, తెలుగు అనువాదంలో తప్పుంటే, ఇంగ్లిష్‌లో ఉన్న ప్రశ్న ఆధారంగా సమాధానం ఇచ్చే వెసులుబాటు ఉందన్నారు. తర్వాత విచారణ వాయిదా పడింది. -
మహిళా చైతన్యమే లక్ష్యం
పేదల సేవతో పాటు మహిళలను చైతన్యవంతులుగా చేయాలనే లక్ష్యమే ఆమెను ఉన్నతాధికారిని చేసింది. ఆర్థిక స్వావలంబన సాధించిననాడే మహిళలకు కుటుంబంలో, సమాజంలో సముచిత స్థానం దక్కుతుందని విశ్వసించారామె. మూడుసార్లు సివిల్స్ మెయిన్స్ పరీక్షలు రాసి ఇంటర్వ్యూ వరకూ వెళ్లారు. కానీ అనుకున్న లక్ష్యాన్ని అందుకోలేకపోయారు. అయినా ఆమె నిరుత్సాహపడలేదు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తూనే గ్రూప్-1 పరీక్షలు రాశారు. పోలీస్ శాఖలో డీఎస్పీ పోస్టును సాధించారు సీహెచ్. సౌజన్య. ప్రస్తుతం ఆమె చేవెళ్లలో ప్రొబేషనరీ డీఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ సందర్భంగా సౌజన్య తన మనోగతాన్ని ‘న్యూస్‌లైన్’తో పంచుకున్నారు. - న్యూస్‌లైన్, చేవెళ్ల ఇదీ నా ఫ్యామిలీ నాన్న కామేశ్వరరావు. సహకార శాఖలో అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. అమ్మ విజయకుమారి ఎండోమెంట్లో డిప్యూటీ కమిషనర్‌గా పని చేస్తున్నారు. ఇద్దరు చెల్లెళ్లు మృధుల, మౌనిక. చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజినీర్లు. నా భర్త శ్రీనివాస్. సీఐడీలో డీఎస్పీగా పనిచేస్తున్నారు. నేను గ్రూప్-1 సాధించడానికి తల్లిదండ్రులతోపాటు భర్త ప్రోత్సాహం ఎంతో ఉంది. కాకినాడలో అక్షరాభ్యాసం మా సొంతూరు తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ. ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాల విద్యాభ్యాసమంతా అక్కడే సాగింది. కళాశాల విద్యకూడా అక్కడే. కాకినాడ జేఎన్టీయూ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ పూర్తిచేశాను. చిన్నప్పటినుంచి ఐఏఎస్ కావాలన్నదే నా కోరిక. కానీ 2006-07లో సివిల్ సర్వీస్ రాశాను. మెయిన్స్ దాటి ఇంటర్వ్యూ వరకు వెళ్లాను. ఇంటర్వ్యూలో కొద్దిలో తప్పిపోయాను. 2009లో గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షలు రాశాను. మొదటి ప్రయత్నంలోనే గ్రూప్-2 లో ఉత్తీర్ణత సాధించడంతో పశ్చిమగోదావరి జిల్లాలోని చింతలపూడి ఏజెన్సీలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎస్ఐగా చేరాను. అదే సంవత్సరం రాసిన గ్రూప్-1లో కూడా ఉత్తమ ప్రతిభ కనబరచడంతో డీఎస్పీగా ఎంపికయ్యాను. 2011లో ఉద్యోగంలో చేరి అప్పాలో ఒక సంవత్సరంపాటు శిక్షణ పొందాను. అనంతరం జిల్లాలో శిక్షణకోసం చేరాను. దీంతో చేవెళ్ల పోలీస్‌స్టేషన్‌లో ఎస్హెచ్ఓగా విధులు నిర్వర్తిస్తున్నాను. వైఎస్సార్ నా రోల్ మోడల్ పేద ప్రజలకు సేవ చేయడంలో రాజకీయ నాయకుడు ఎలా ఉండాలనే విషయంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖరరెడ్డి నాకు రోల్‌మోడల్. ఆయన పేదప్రజలకు ఎన్నో పథకాలను అందించి మాస్‌లీడర్‌గా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. కాగా పరిపాలనా పరంగా (అడ్మినిస్ట్రేషన్)లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆదర్శం. షారుక్‌ఖాన్ నటన బాగుంటుంది. సినిమాలు చూడడం పెద్దగా ఇష్టంలేకపోయినా అప్పుడప్పుడూ మంచి సినిమాలు వస్తే చూస్తాను. యువత సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలి యువత అవసరం దేశానికి ఎంతో ఉంది. సేవ చేసే దృక్పథాన్ని యువత అలవర్చుకోవాలి. జ్ఞానం, సాంకేతికపరంగా దేశానికి ఉపయోగపడే లక్ష్యాన్ని ఏర్పరుచుకొని కృషి చేసి సఫలీకృతులు కావాలి. సమయాన్ని వృథా చేయకుండా ఆశయసాధనకు కష్టపడాలి. చెడు అలవాట్లకు బానిసలు కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అదే మహాభాగ్యం. నేటి ఆధునిక సమాజంలో నైపుణ్యం ఉన్నవారికి మంచి అవకాశాలు, ఉజ్వల భవిష్యత్తు ఉంది. చాలా బాధపడ్డా.. 2008-07లో ఐఏఎస్ కావాలనే ఆశయంతో సివిల్స్ పరీక్షలు రాశాను. జాగ్రఫీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సబ్జెక్టులను ఆప్షన్లుగా ఎంచుకొని ప్రయత్నంచేశాను. మొదటి ప్రయత్నంలోనే మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూ వరకు వెళ్లాను, కొద్దిలో తప్పిపోవడంతో జీవితంలో ఎప్పుడూ పడనంత బాధపడ్డాను. కలెక్టర్‌గానో, ఆర్డీఓగానో ఉద్యోగం వస్తే పేద ప్రజలకు మరింత సేవచేసే అవకాశం లభించేది. కానీ అది మిస్సయింది. ఆర్థిక స్వావలంబనతోనే మహిళలకు గౌరవం గ్రామీణ ప్రాంతాల మహిళల్లో అధికశాతం మంది నిరక్షరాస్యులే. చిన్నపాటి విషయాలకే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మహిళల అక్షరాస్యత పెంపునకు, ఆత్మహత్యల నివారణకు కృషిచేస్తా. మహిళలు తమ కాళ్లపై తాము నిలబడి ఆర్థికంగా స్వావలంబన సాధించినప్పుడే వారికి గౌరవం. చేవెళ్ల ప్రాంతంలో రో డ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. వీటి నివారణకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలి.