group exams
-
రాజకీయాల్లో ‘ప్రవళిక’ కుదుపు!
సాక్షి, వరంగల్: గ్రూప్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న ‘ప్రవళిక’ ఆత్మహత్య రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. ఓవైపు పోటీ పరీక్షలు వాయిదా పడుతుండడాన్ని జీర్ణించుకోలేక దుగ్గొండి మండలం బిక్కాజిపల్లి గ్రామానికి చెందిన మర్రి ప్రవళిక హైదరాబాద్‌లోని బృందావన్ హాస్టల్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని నిరుద్యోగులు, ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటే.. ఆ అమ్మాయి ఎందుకు చనిపోయిందో పోలీసులు చెప్పారని, అది నిజం కాదని రాహుల్ గాంధీ చెప్పగలరా అంటూ మంత్రి కేటీఆర్ అన్న మాటలు మంటలు రేపాయి. దీంతో ఆ అమ్మాయి గ్రూప్స్‌నకు దరఖాస్తు చేయడంతోపాటు పరీక్ష రాసిందంటూ సంబంధిత డాక్యుమెంట్లు వెలుగులోకి రావడంతో రాష్ట్ర ప్రభుత్వం నష్టనివారణ చర్యలకు పూనుకున్నట్టు తెలిసింది. ఇందులో భాగంగానే మంత్రి కేటీఆర్ దూతలు బిక్కాజిపల్లికి సోమవారం ఉదయమే చేరుకొని ప్రవల్లిక తల్లిదండ్రులు లింగయ్య, విజయ, సోదరుడు ప్రణయ్‌లను సిరిసిల్లకు తీసుకెళ్లి మంత్రి కేటీఆర్‌ను కలిపించినట్టుగా తెలిసింది. ‘మీ కుటుంబసభ్యులకు అండగా ఉంటాం’ అని మంత్రి కేటీఆర్ హామీనిచ్చారని పొలిటికల్ సర్కిల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎన్నికల వేళ మంత్రి కేటీఆర్ చొరవ తీసుకొని ఈ వివాదానికి ఇక్కడికే ఫుల్స్టాప్ పెట్టారన్న చర్చ జరుగుతోంది. దరఖాస్తు చేసింది.. పరీక్ష రాసింది ప్రవళిక అసలు టీఎస్పీఎస్సీ నిర్వహించే పరీక్షలకు దరఖాస్తు చేసుకోలేదని, ఎలాంటి పరీక్షలు రాయలేదని ప్రభుత్వ పెద్దలు మాట్లాడడం, ప్రేమ విఫలమై ఆత్మహత్య చేసుకుందని పోలీసులు ఆరోపణలు చేస్తుండడంపై ప్రవళిక బంధువులు, కుటుంబ సభ్యులు, నిరుద్యోగులు మండిపడుతున్నారు. తప్పుడు ఆరోపణలు చేస్తే ప్రవళిక క్యారెక్టర్‌పై నిందలు వేయడాన్ని వారు సహించలేకపోతున్నారు. గీతాంజలి డిగ్రీ కళాశాలలో 2020లో డిగ్రీ పూర్తి చేసింది. అనంతరం పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతూనే ఉంది. టీఎస్పీఎస్సీ నిర్వహించే గ్రూప్–4, గ్రూప్–2 పరీక్షల కోసం ప్రవళిక దరఖాస్తు చేసినట్లు వారు చెబుతున్నారు. గ్రూప్–4 కోసం డిసెంబర్ 1, 2022న నోటిఫికేషన్ రావడంతో ఆమె 2023 జనవరి 10న దరఖాస్తు చేసింది. హాల్ టికెట్ పొంది.. జూలై ఒకటిన సికింద్రాబాద్ ప్యారడైజ్ సమీపంలోని మహర్షి విద్యానికేతన్ పాఠశాలలో గ్రూప్–4 పరీక్ష రాసింది. 2022 డిసెంబర్ 29న గ్రూప్–2కు నోటిఫికేషన్ రాగా.. 2023 ఫిబ్రవరి ఒకటిన దరఖాస్తు చేసింది. -
తెలంగాణలో గ్రూప్-1 పరీక్షపై హైకోర్టులో పిటిషన్
-
ఏపీలో గ్రూప్ వన్ ప్రిలిమ్స్
-
సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో గ్రూప్స్ పరీక్షలకు ఆన్లైన్ కోచింగ్
సాక్షి ఎడ్యుకేషన్: తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్స్ పరీక్షలకు సన్నద్ధమయ్యే నిరుద్యోగులకు గొప్ప శుభవార్త. ఇప్పటికే తెలంగాణలో గ్రూప్–1 నోటిఫికేషన్ విడుదల కాగా, త్వరలోనే గ్రూప్ 2, 3,4 కు పరీక్షలకు కూడా నోటిఫికేషన్లు రానున్నాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా త్వరలో గ్రూప్1, 2నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. ఇలాంటి కీలక సమయంలో కోచింగ్ సెంటర్లకు వెళ్లి కోచింగ్ తీసుకోలేని, ఇంటివద్దనే ఉంటూ గ్రూప్ పరీక్షలకు సన్నద్ధమవ్వాలనుకునే అభ్యర్థులకోసం ప్రత్యేకంగా సాక్షి ఎడ్యుకేషన్, డ్రీమ్స్ ఇన్స్టిట్యూట్ (కేజీహెచ్ అకాడమీ) ఆధ్వర్యంలో ఆన్లైన్ కోచింగ్ ఇవ్వనుంది. అనుభవజ్ఞులైన ప్రముఖ సబ్జెక్ట్ నిపుణులతో ఏపీపీఎస్సీ/టీఎస్పీఎస్సీ గ్రూప్ 1,2,3,4 పరీక్షలకు కోచింగ్ ఇస్తుంది. అత్యంత తక్కువ ధరలకే ఈ కోచింగ్ లభిస్తుంది. ఇందులో ముఖ్యంగా వీడియో క్లాసులు, స్టడీమెటీరియల్, ఆన్లైన్ ఎగ్జామ్స్ మొదలైనవి ఉంటాయి. ఆసక్తిగల అభ్యర్థులు https:// arenaone. in/ sakshieducation/ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ ఆన్లైన్ కోచింగ్ వ్యాలిడిటీ ఒక ఏడాది వరకు ఉంటుంది. మరిన్ని వివరాలకు 9505514424, 9666013544, 9912671555 ఫోన్ నంబర్లను సంప్రదించండి. ఇదీ చదవండి: ఏది గుడ్.. ఏది బ్యాడ్?.. అరవండి.. పరుగెత్తండి.. చెప్పండి -
ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న పేద నిరుద్యోగులకు శుభవార్త!
-
శ్రమించండి.. సాధించండి
’గ్రూప్స్’ అభ్యర్థులకు నిపుణుల సూచన గ్రూప్2, 3 పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ’సాక్షి’ మీడియా గ్రూప్, రాజూస్ ఐఏఎస్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఏలూరులో నిర్వహించిన అవగాహన సదస్సు విజయవంతమైంది. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన అభ్యర్థులు హాజరై సందేహాలను నివృత్తి చేసుకున్నారు. పరీక్షలకు ఎలా సిద్ధపడాలి, ఏయే సబ్జెక్టులపై దృష్టి సారించాలనే విషయమై ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రొఫెసర్లు. సబ్జెక్ట్ నిపుణులు అవగాహన కల్పించారు. పుస్తకాల ఎంపికపై సగం విజయం ఆధారపడి ఉంటుందని, బట్టీ విధానం పనికిరాదని, విశ్లేషణాత్మక దృష్టితో చదవాలని, ప్రాధాన్యతాంశాలను గుర్తించాలని సూచించారు. కఠోర శ్రమ, కసితో చదివితే గ్రూప్-1, 2, 3 ఉద్యోగాలు సాధించడం ఏమంత కష్టం కాదని, సమయపాలన, ప్రత్యేక ప్రణాళిక, నిరంతర సాధన, శిక్షణ తోడైతే విజయం ఖాయం అని వక్తలు ఉద్బోధించారు. శనివారం ‘సాక్షి’ దినపత్రిక ‘రాజూస్’ ఐఏఎస్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ఏలూరు ఆర్ఆర్పేటలో రాజూస్ అకాడమీలో గ్రూప్స్ అభ్యర్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సుకు ముఖ్య అతిథులుగా హాజరైన సబ్జెక్ట్ నిపుణులు, ప్రొఫెసర్లు, అధికారులు తమ ప్రసంగాల ద్వారా ఉద్యోగార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. -ఏలూరు సిటీ /ఆర్‌ఆర్‌పేట/మెట్రో సదస్సుకు రాజూస్ అకాడమీ డైరెక్టర్ రత్నరాజు అధ్యక్షత వహించగా ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రాంతీయ పర్యవేక్షణాధికారి ఎస్ఏ ఖాదర్, సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు ఆఫీసర్ వి.బ్రహ్మానందరెడ్డి, సర్ సీఆర్ఆర్ పీజీ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ ఎల్.వెంకటేశ్వరరావు, పీజీ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ తేరా రాజేష్, ఇంగ్లిష్ విబాగాధిపతి ఎంఎస్సీ సోఫియా, ఏలూరు టూటౌన్ సీఐ ఉడతా బంగార్రాజు హాజరయ్యారు. గ్రూప్స్‌కు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ప్రిపరేషన్‌పై అవగాహన కల్పించడంతో పాటు ఉచితంగా ప్రిలిమినరీ మోడల్ పేపర్‌ను అందజేశారు. అభ్యర్థులు ఏ విధంగా పరీక్షలకు సిద్ధమవ్వాలి, ప్రణాళికలు ఎలా రూపొందించుకోవాలి అనే అంశాలపై అవగాహన కల్పించారు. అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేశారు. అంతేకాదు తాము ఉద్యోగాలు సాధించే నాటికి, నేడు ఉన్న సామాజిక పరిస్థితులను బేరీజు వేస్తూ వివరణాత్మక సందేశాలను అందించారు. సదస్సుకు అభ్యర్థుల నుంచి అనూహ్య స్పందన లభించింది. జిల్లావ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి అభ్యర్థులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ‘సాక్షి’ అభినందనీయం ‘సాక్షి’ దినపత్రిక సామాజిక బాధ్యతలో భాగంగా ఉద్యోగార్థులకు ఇటువంటి అవగాహన సదస్సులు నిర్వహించటం అభినందనీయమని ఆర్ఐవో ఖాదర్ అన్నారు. ఈ సదస్సు ద్వారా అభ్యర్థుల్లో భయాన్ని పోగొట్టి స్ఫూర్తిని నింపిందన్నారు. ఎప్పటికప్పుడు ప్రజలకు తాజా వార్తాల సమాచారం అందించటమే కాకుండా యువతకు, విద్యార్థులకు ప్రయోజనం కలిగించేలా ‘భవిత’ ద్వారా ఉద్యోగాల నోటిఫికేషన్లు, మెటీరియల్స్, నిపుణుల విశ్లేషణలు ఇస్తూ ప్రోత్సహిస్తోందన్నారు. యువత కేవలం గ్రూప్స్ ఉద్యోగాలకే పరిమితం కాకూడదన్నారు. రోజూ అనేక ఉద్యోగాలకు నోటిఫికేషన్లు పడుతుంటాయని, వాటిని జాగ్రత్తగా గమనిస్తూ ప్రిపేరవ్వాలని సూచించారు. సదస్సుకు హాజరైన గ్రూప్్స అభ్యర్థులు మాట్లాడుతూ ‘సాక్షి’ నిర్వహించిన ఈ అవగాహన సదస్సు తమలో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని కృతజ్ఞతలు తెలిపారు. ఇతరులకన్నా మీరేమీ తక్కువ కాదు చాలామందిలో తాము సాధించగలమా అనే సందేహం ఉంటుంది. అటువంటి వారందరూ ఇతరులకన్నా తామేమీ తక్కువ కాదు అనే విషయాన్ని గుర్తించాలి. సివిల్స్, గ్రూపులు సాధించిన వారు కాస్త ఎక్కువ కష్టపడతారు. అలాంటి కష్టం మీరు కూడా పడితే మీ లక్ష్యాలు సాధించడం చాలా సులభం. అన్నింటికంటే ముఖ్యంగా సమాజంలో ఇతరులకంటే ఉన్నతంగా జీవించాలనే లక్ష్యం ప్రతి ఒక్కరిలో ఉన్నప్పుడే తమ లక్ష్యాలు సాధించగలుగుతారు. స్వామి వివేకానంద చెప్పినట్టు అందరూ ఉక్కు నరాలు, ఇనుపకండరాలు కలిగి ఉండాలి. ఫొటో నంబర్ 504 -పి.రత్నరాజు, రాజూస్ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ పుస్తకాల ఎంపికతోనే సగం విజయం ఉద్యోగార్థులు తాము ఏ ఉద్యోగానికి సన్నద్ధమౌతున్నారో, దానికి ఏ పుస్తకాలు అవసరమౌతాయో సరిగ్గా ఎంచుకుంటే సగం విజయం సాధించినట్టే. ఉద్యోగం రాకపోతే జీవితం లేదు, సమాజంలో తలెత్తుకు తిరగలేం అనే కసితో చదవాలి. కోరికలను సాఫల్యం చేసుకునే చిత్తశుద్ధి ఉండాలి. మీలో ఉన్న శక్తిని మీరే గుర్తించాలి. సమాజంతో సంబంధంలేకుండా ఎక్కువ సమయం చదువుపై దృష్టి కేంద్రీకరిస్తే ఉద్యోగం మీ పాదాక్రాంతమౌతుంది. ఫొటో నంబర్ 505 : -ఎస్ఏ ఖాదర్, ఆర్ఐవో బట్టీ విధానం పనికిరాదు ప్రస్తుత పరిస్థితుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రధాన సవాలుగా నిలుస్తోంది. చదువులో ఎంత గొప్ప ప్రతిభ కనబరిచినా భావ వ్యక్తీకరణలో వెనుకబడడం వల్ల అనుకున్న లక్ష్యాలు సాధించలేకపోతున్నారు. వాటిని మరింతగా మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది. మీ తెలివితేటలు భవిష్యత్ తరాలకు కూడా ఉపయోగపడే విధంగా మీరు అభివృద్ధి సాధించాలి. బట్టీ పట్టే విధానం నేటి రోజుల్లో అస్సలు పనికి రావడం లేదు. రాత్రి 10 గంటల తరువాత నుంచి చదివితే అప్పటి ప్రశాంత వాతావరణానికి చదివింది మెదడులో నాటుకుపోతుంది. ఫొటో నంబర్ 506 : -వి.బ్రహ్మనందరెడ్డి, ఎస్ఎస్ఏ పీవో కోచింగ్ తప్పనిసరి ఏదో ఒక చిన్న ఉద్యోగం వస్తే చాలని సరిపెట్టుకోవద్దు. పెద్దపెద్ద ఉద్యోగాలు సాధించాలనే ఉన్నత లక్ష్యాల వైపు పయనించండి. మీకు ఉద్యోగం తప్పనిసరి ఐతే ఖచ్చితంగా కోచింగ్ తీసుకోవాలి. మనకు తెలియని సబ్జెక్టుపై పట్టు సాధించాలంటే కోచింగ్ ఉండాలి. సాఫ్ట్‌వేర్‌లో జీతాలు ఎక్కువని చాలామంది వాటిపై ఆకర్షితులౌతున్నారు. వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా జీతాలు అధికం. పైగా ఉద్యోగ భద్రత ఎక్కువ. ఒక్కసారి కోచింగ్ తీసుకుని వదిలేయవద్దు ఉద్యోగం సాధించే వరకూ కోచింగ్ తీసుకుంటూనే ఉండండి. ఫొటో నం : 507 : -ఉడతా బంగార్రాజు, టూటౌన్ సీఐ విశ్లేషణాత్మకత అవసరం ఉద్యోగాలకు సిద్ధమయ్యే వారు తాము ఏ పుస్తకం చదివినా ఏ సబ్జెక్ట్ చదివినా అందులో విశ్లేషణాత్మకతను జోడించండి. అటువంటప్పుడే ఒక ప్రశ్నను ఏ కోణంలో అడిగినా జవాబు ఇవ్వడం సులభతరమౌతుంది. ఉద్యోగాలు ఉన్నాయి. కానీ వాటిని చేరుకోవడానికి దగ్గర మార్గాలు లేవని తెలుసుకోవాలి. ఆలోచించడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టకండి. సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన ఈ రోజుల్లో ప్రపంచం కుగ్రామమైంది. మీ అరచేతిలోనే సమాచారమంతా అందుబాటులో ఉంటోంది, దానిని సద్వినియోగం చేసుకోండి. ఫొటో నం : 508 : -ఎల్.వెంకటేశ్వరరావు, సీఆర్ఆర్ పీజీ కాలేజీ, అసోసియేట్ ప్రొఫెసర్ ప్రాధాన్యతాంశాలను గుర్తించండి పరీక్షల్లో వచ్చే ప్రాధాన్యతాంశాలను గుర్తించడం అభ్యర్థులకు ముఖ్యం. సిగ్గు, బిడియం, భయాలను ఈ సమయంలోనే విడిచిపెట్టండి. మిమ్మల్ని మీరు మార్చుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టండి. పోటీ పరీక్షలకు సిద్ధమౌతున్న ఇతర అభ్యర్థులతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకోండి. వారి ద్వారా మరింత జ్ఞాన సముపార్జన సాధ్యమౌతుంది. సబ్జెక్టుపై చర్చిస్తే దానిపై మనకు తెలియని సందేహాలకు సమాధానలు దొరికే అవకాశముంది. మనసును ప్రశాంతంగా ఉంచుకుని ప్రణాళికాబద్ధంగా చదివితే లక్ష్యం సాధించవచ్చు. ఫొటో నం 509 : -డాక్టర్ తేరా రాజేష్, సీఆర్ఆర్ పీజీ కాలేజ్ ఫ్రొఫెసర్ సందేహాలను నివృత్తి చేసుకోండి కోచింగ్ సెంటర్లలో అధ్యాపకులు చెప్పే విషయాలు నిశితంగా గ్రహించండి. ఎటువంటి సందేహాన్నైనా అడిగి తెలుసుకోండి. పక్కవాళ్లు నవ్వుతారనే భావన ముందుగా మీలోంచి తొలగించుకోండి. 99 శాతం కష్టపడేవాళ్లే ఏదైనా సాధించగలుగుతారు. మీలో కూడా నైపుణ్యం ఉంది. దానిని మీరే మరింత మెరుగుపరుచుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం అవసరం. దానిపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. మీ తరువాత తరాలకు మీరు రోల్ మోడల్‌గా ఉండాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకోండి. ఫొటో నం 510 : -ఎంఎస్సీ సోఫియా, సీఆర్ఆర్ పీజీ కాలేజ్, ఇంగ్లిష్ విభాగాధిపతి ప్రశ్న- జవాబు ప్రశ్న : ఇంజనీరింగ్ విద్యార్థి గ్రూప్స్‌కు ఎలా సిద్ధపడాలి? వి.నిఖిత, గ్రూప్స్ అభ్యర్థి, ఏలూరు నిపుణుల జవాబు : బీటెక్ చదివిన విద్యార్థులకు సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టులపై ఎక్కువ అవగాహన ఉంటుంది. అయితే పోటీ పరీక్షల్లో అన్ని సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు. వీటిని అంచనా వేసుకుని నిపుణుల సలహాలతో సిద్ధపడితే విజయం తథ్యం. ప్రశ్న : నెగిటివ్ మార్కుల విధానాన్ని ఎలా అధిగమించాలి టిఎస్ఎస్కె పవన్, గ్రూప్స్ విద్యార్థి నిపుణుల జవాబు : నూతన గ్రూప్స్ విధానంలో మైనస్ మార్కుల విధానాన్ని ప్రవేశపెట్టారు. అయితే విద్యార్థి సరైన జవాబును గుర్తించి మాత్రమే ఆన్సర్ చేయాలి. అంచనాతో జవాబును గుర్తించే విధానాన్ని మానుకోవాలి. గ్రూప్-2 పరీక్షల్లో ఈ నెగిటివ్ విధానం లేదు. గ్రూప్-1లో మాత్రమే నూతనంగా ప్రవేశపెట్టారు. ప్రశ్న : పోలీస్ పరీక్షలకు, గ్రూప్స్‌కు తేడా ఏమిటి? అనిత, గృహిణి, గ్రూప్స్ అభ్యర్థిని నిపుణుల జవాబు : పోలీస్ పరీక్షలకు చేస్తున్న ఫిజికల్ ఈవెంట్స్‌కు కాస్త పోటీ పరీక్షల సిలబస్‌ను జోడిస్తే తప్పక విజయం సాధించవచ్చు. అలాగే పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకుని, ఫిజికల్ పరీక్షలకు శిక్షణ తీసుకోకుంటే పోలీస్ ఉద్యోగం సాధించడం కష్టం. రెండు అంశాలపైనా దృష్టిసారిస్తే విజయం సాధించవచ్చు. ప్రశ్న : తక్కువ సమయంలో విజయం సాధించడం ఎలా? ఎన్.సుస్మిత, గ్రూప్స్ అభ్యర్థిని నిపుణుల జవాబు : సమయం తక్కువ ఉన్నందున గ్రూప్స్ అభ్యర్థులు ప్రస్తుతం పూర్తిగా ప్రిలిమినరీపైనే దృష్టి కేంద్రీకరించాలి. మెయిన్స్ సిలబస్‌పై ప్రిలిమ్స్ అయిన మరుక్షణం దృష్టి సారించాలి. ప్రశ్న : ఎగ్జామ్‌లో సమయాన్ని ఎలా కేటాయించాలి? వెంకటేశ్వరరావు, గ్రూప్స్ విద్యార్థి, చోడవరం, నల్లజర్ల నిపుణుల జవాబు : గ్రూప్స్ ప్రిలిమ్్స ఎగ్జామ్ పేపర్లో 150 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో బిట్‌కు 30 సెకన్ల నుంచి ఒక నిమిషం కేటాయిస్తే సమయం సరిపోతుంది. లేకుంటే చివరిలో తీవ్ర గందరగోళంగా ఉండి ఏ ప్రశ్నకూ సరైన సమాధానం గుర్తించలేం. పోటీ పరీక్షల్లో సమయ పాలన అనేది చాలా ముఖ్యం. -
ఏపీపీఎస్సీ గ్రూప్ పరీక్షలకు సిలబస్ ఖరారు!
వెబ్సైట్లో అప్లోడ్ చేసిన అధికారులు.. ఈసారి గ్రూప్-3కీ సిలబస్ రూపకల్పన సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ గ్రూప్ పరీక్షలకు సంబంధించిన సిలబస్‌ను కమిషన్ దాదాపు ఒక కొలిక్కి తెచ్చింది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పరీక్షలకు తుది ముసాయిదా సిలబస్‌ను కమిషన్ అధికారులు దాదాపు ఖరారు చేశారు. ఈ సిలబస్‌ను కమిషన్ శుక్రవారం తన అధికారిక వెబ్సైట్ ‘పీఎస్సీ.ఏపీ.జీఓవీ.ఐఎన్’లో అప్లోడ్ చేసింది. వెబ్సైట్లో ఫైనల్ సిలబస్‌గా పేర్కొన్నప్పటికీ దీనికి స్వల్పంగా కొన్ని మార్పులు చేర్పులు చేసి తుది సిలబస్‌ను అభ్యర్థులకు అందుబాటులోకి తేనున్నామని ఏపీపీఎస్సీ వర్గాలు వివరించాయి. 2011 గ్రూప్1 పోస్టుల్లో కోత!: 2011 గ్రూప్1 నోటిఫికేషన్లో పేర్కొన్న వాటిల్లోని దాదాపు 30 పోస్టులకు కోతపెట్టాలని ఏపీపీఎస్సీ చూస్తోందని ఆ గ్రూప్ పరీక్షలు రాసిన అభ్యర్థులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. -
నాలుగు భాగాలుగా తెలంగాణ చరిత్ర
* ‘సాక్షి’తో టీఎస్పీఎస్సీ సిలబస్ కమిటీ సభ్యుడు * ప్రొఫెసర్ అడపా సత్యనారాయణ * సిలబస్‌ను విభజించుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మేలు * గ్రూప్స్ పరీక్షల్లో ఎక్కువ ప్రశ్నలు తెలంగాణ కోణం నుంచే.. * తెలంగాణ చరిత్ర, పోరాటాలు, ఉద్యమాలు, సామాజిక అంశాలపై దృష్టిపెట్టాలి * రాజవంశాలు, యుద్ధాలు, వాటి కాలాలకు ప్రాధాన్యం తగ్గించాం * తెలంగాణేతర అంశాలకూ పెద్దగా ప్రాధాన్యం ఉండదు * ప్రిపరేషన్‌కు ప్రామాణిక గ్రంథాలను ఎంచుకోవాలి * తెలుగు అకాడమీ, యూనివర్సిటీ ప్రొఫెసర్లు రాసిన పుస్తకాలైతే ఉత్తమం హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ నిర్వహించే పరీక్షల్లో ప్రశ్నలు ఎక్కువగా తెలంగాణ కోణంలోనే ఉండనున్నాయి. గ్రూప్-1, గ్రూప్-2లో తెలంగాణ రాష్ట్ర చరిత్ర, ఉద ్యమం నుంచి రాష్ట్ర ఆవిర్భావం వరకు ప్రత్యేకంగా పెట్టిన పేపర్లలోనే కాదు వేరే పోటీ పరీక్షల జనరల్ స్టడీస్, ఇతర పేపర్లలోనూ తెలంగాణ కోణంలో ప్రశ్నలు ఉండనున్నాయి. గెజిటెడ్, నాన్ గెజిటెడ్, గ్రూప్-3, గ్రూప్-4 వంటి పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్ష పేపర్లలోనూ తెలంగాణకు సంబంధించిన అంశాలకు పెద్దపీట వేసి ప్రశ్నపత్రాలు రూపొందించే అవకాశం ఉంది. వాటిపై అభ్యర్థులు ప్రత్యేక దృష్టి పెట్టాలి. తెలంగాణ చ రిత్ర, సామాజిక, ఆర్థిక స్థితిగతులు, నైసర్గిక స్వరూపం, వివిధ పోరాటాలు, ఉద్యమాలు.. ఇలా అన్నింటిపై ప్రత్యేకంగా నోట్స్ ప్రిపేర్ చేసుకొని చదువుకోవాల్సిందే. ఈ క్రమంలో ఏయే పుస్తకాలను ప్రామాణికంగా తీసుకోవాలి.. నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.. అన్న అంశాలను టీఎస్పీఎస్సీ సిలబస్ కమిటీ సభ్యుడు, హిస్టరీ ప్రొఫెసర్ అడపా సత్యనారాయణ ‘సాక్షి’కి వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. రాష్ట్రంపై సంపూర్ణ అవగాహన అవసరం తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు అయ్యే ఉద్యోగులకు తమ ప్రాంతంపై సంపూర్ణ అవగాహన ఉండాలి. ముఖ్యంగా ఇప్పుడు ఉద్యోగాల్లో చేరి... వచ్చే 20-30 ఏళ్ల పాటు రాష్ట్రానికి సేవలందించే వారికి రాష్ట్ర స్థితిగతులు, భవిష్యత్తు అభివృద్ధిపై స్పష్టమైన వైఖరి ఉండాలి. గతాన్ని వదిలేయకుండా చరిత్రను తెలుసుకుంటేనే భవిష్యత్తుకు బాటలు వేయగలుగుతారు. అందుకే పోటీ పరీక్షల్లో తెలంగాణ చరిత్ర, పోరాటాలు, ఉద్యమాలు, ఇక్కడి సామాజిక ఆర్థిక పరిస్థితులపై ప్రశ్నలు ఉండబోతున్నాయి. ఈ దిశగా అభ్యర్థులు పరీక్షలకు సిద్ధం కావాలి. వాటికి ప్రాధాన్యం తగ్గించాం.. అకడమిక్, పోటీ పరీక్షల మధ్య మౌలికమైన తేడా ఉంటుంది. అక్కడ పాఠ్య పుస్తకంలోని ప్రశ్నలే అడుగుతారు. కానీ పోటీ పరీక్షల్లో పాఠ్య పుస్తకాల్లోని అంశాలతో పాటు సామాజిక, చారిత్రకాంశాలపై అవగాహన ఉండాలి. అందుకే హిస్టరీ అనగానే బీఏలో (డిగ్రీ) హిస్టరీ చదువుకున్న వారికే సులభం అనే అపోహ అక్కర్లేదు. ఆర్ట్స్, సైన్స్, టెక్నికల్, వృత్తి విద్యా కోర్సులు.. ఇలా అన్ని రకాల కోర్సులు చేసినవారికీ తగ్గట్టుగా అందరూ చదువుకునేలా సిలబస్‌ను రూపొందించాం. ఇందులో ప్రధానంగా రాజకీయాలు, రాజ వంశాలు, యుద్ధాలు, వాటి తేదీల (కాలం) ప్రాధాన్యాన్ని చాలా వర కు తగ్గించాం. ఉదాహరణకు శాతవాహనుల కాలం తీసుకుంటే వారి పరిపాలన క్రమం (తేదీలు), రాజుల వంశ క్రమంపై చరిత్రకారుల్లోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అలాంటి వాటికి ప్రాధాన్యం తగ్గించాం. ఇలా విభజించుకోండి.. తెలంగాణకు సంబంధించిన సిలబస్‌ను అర్థం చేసుకునేందుకు నాలుగు భాగాలుగా విభజించుకొని సిద్ధమైతే ఉపయోగంగా ఉంటుంది. 1. ప్రాచీన తెలంగాణ చరిత్ర-సంస్కృతి 2. మధ్యయుగ తెలంగాణ చరిత్ర 3. ఆధునిక తెలంగాణ చరిత్ర 4. సమకాలీన తెలంగాణ చరిత్ర(1948-2014)గా సిలబస్‌ను విభజించుకోవాలి. ప్రాచీన తెలంగాణ చరిత్ర ఇందులో శాతవాహనుల నుంచి చాళుక్య యుగం వరకు ఉంటుంది. అభ్యర్థులు పరీక్షలకు సిద్ధమయ్యేటప్పుడు శాతవాహనుల కాలానికి సంబంధించి తేదీలు, రాజ వంశీయుల క్రమంపై టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వాటిపై చరిత్రకారులు ఒకరకంగా రాస్తే శాసనాల్లో మరో రకంగా ఉంది. కానీ ఆనాటి సామాజిక, ఆర్థిక పరిస్థితులు, వర్తక వ్యాపారాలు, సాహిత్య వికాసం వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి సారిస్తే ఉపయోగం. తెలంగాణ మధ్యయుగ చరిత్ర ఇందులో కాకతీయ, పద్మనాభ, కుతుబ్‌షాహీల వరకు చరిత్ర ఉంటుంది ఇందులో ఆనాటి సామాజిక, వర్తక, వాణిజ్య అంశాలపై దృష్టి పెట్టాలి. ప్రజా సంక్షేమం, విద్యా రంగం వంటి అంశాలను చదువుకోవాలి. ముఖ్యంగా నాటి నీటిపారుదల వ్యవస్థ గురించి తెలుసుకోవాలి. ఆధునిక తెలంగాణ చరిత్ర ఇందులో అసఫ్‌జాహీల కాలం నుంచి ఉంటుంది. 1724 నుంచి 1948 వరకు జరిగిన అన్ని చారిత్రక అంశాలు ఉంటాయి. ముఖ్యంగా నిజాం కాలం నాటి సంస్కరణలు, వ్యవసాయ రంగంలో భూమిశిస్తు విధానం, విద్యారంగం, రోడ్డు రవాణా, పారిశ్రామిక అభివృద్ధి వంటి అంశాలపై దృష్టి పెట్టాలి. అసఫ్‌జాహీల కాలంనాటి సామాజిక, సాంస్కృతిక ఉద్యమాలు.. ప్రధానంగా ఆర్య సమాజ్, ఆది హిందూ ఉద్యమాలు, ఆంధ్ర మహాసభ నిర్వహించిన రాజకీయ ఉద్యమాలు, వందేమాతరం ఉద్యమం, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ చేపట్టిన రాజకీయ ఉద్యమాలు, తెలంగాణ సాయుధ పోరాటంపై దృష్టి పెట్టాలి. తెలంగాణ ఆదివాసీల సమస్యలు.. ఆదివాసీ ఉద్యమాలు, ఆంధ్ర మహిళా సభ నిర్వహించిన మహిళా ఉద్యమాలు కూడా కీలకాంశాలే. సమకాలీన తెలంగాణ చరిత్ర తెలంగాణ ఉద్యమ తీరుతెన్నులు.. రాష్ట్ర అవతరణ క్రమంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. గ్రూప్-1లో ఆరో పేపరు, గ్రూప్-2లో నాలుగో పేపరు దీనిపైనే ప్రత్యేకంగా ఉంటాయి. వీటిని చదువుకునే క్రమంలో అభ్యర్థులు అకడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే అర్థం చేసుకోవాలి. ఉద్యమ క్రమాన్ని భావోద్వేగాలతో కూడిన ధోరణిలో చదవొద్దు. ఇందులో ఉద్యమానికి దోహదం చేసిన సామాజిక, ఆర్థిక కారణాలు, అస్తిత్వ పోరాటం, ఆకాంక్షల కోసం వివిధ సంస్థలు ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాయన్న కోణంలో చదువుకోవాలి. 1952లో మొదటిసారిగా జరిగిన ముల్కీ ఉద్యమం.. 1969-70లో వచ్చిన జైఆంధ్ర ఉద్యమం, 1990వ దశకంలో ప్రత్యేక రాష్ట్రం కోసం కృషి చేసిన రాజకీయ, రాజకీయేతర , పౌరసంఘాలు, విద్యార్థి, ఉద్యోగ, మేధావి వర్గాలు స్థాపించిన సంస్థలు, సంఘాలు, వాటి పాత్రను పరిగణనలోకి తీసుకోవాలి. మలిదశ ఉద్యమం..: 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపన తర్వాత జరిగిన వివిధ ఘట్టాలను మలిదశ ఉద్యమంలోకి తీసుకోవాలి. ఇందులో వివిధ పార్టీలు, సం ఘాలు, ఉద్యోగులు, కళాకారులు తెలంగాణ ఉద్యమాన్ని సమష్టి ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లిన క్రమాన్ని అర్థం చేసుకోవాలి. ప్రజా ఉద్యమంగా మారిన తీరు.. అందులో వివిధ పక్షాల పాత్ర తెలుసుకోవాలి. ఈ సిలబస్‌లో ఏ ఒక్క రాజకీయ పార్టీ, వాటి భావజాలం ప్రధానం కాదు. తెలంగాణ రాష్ట్ర సాధనకు దోహదపడిన అందరి పాత్ర గురించి ఉంటుంది. ఇందులో ఉద్యమం కొనసాగిన తీరు, వివిధ సంఘాలు, మేధావులు, ఉద్యోగులు, రాజకీయేతర సంఘాలు, సంస్థలపైనా ప్రశ్నలు ఉంటాయి. మరిన్ని ప్రధాన అంశాలు ప్రాచీన చరిత్ర నుంచి సమకాలీన చరిత్ర వరకు అన్నింటిలో సాంస్కృతిక వికాసం, సామాజిక ఆర్థిక వ్యవస్థ, వాస్తు శిల్పం, కళలు, సాహిత్య వికాసం వంటి అంశాలను ప్రధానంగా పరిగణనలోకి తీసుకోవాలి. వివిధ కాలాల్లో విశిష్ట అంశాల గురించి ప్రత్యేకంగా చదువుకోవాలి. ⇒ ఉదాహరణకు నీటిపారుదల వ్యవస్థ తీసుకుంటే కాకతీయుల కాలంలో ప్రారంభమై అసఫ్‌జాహీల కాలం వరకు వికాసం పొందిన తీరు తెన్నులు. ⇒ శాతవాహనుల నుంచి కుతుబ్‌షాహీల వరకు జరిగిన సాహిత్య వికాసం. ప్రముఖ కవులు, రచయితలు, గ్రంథాలపై అవగాహన అవసరం. ఉదాహరణకు బమ్మెర పోతన, పండిత రాజ చరిత్రం వంటివి. ⇒ కుతుబ్‌షాహీల కాలంలో సాహితీవేత్తలు, వారి రచనలపై అవగాహన పెంచుకోవాలి. కుతుబ్షాహీలతోపాటు అసఫ్‌జాహీల కాలంనాటి ప్రముఖ కట్టడాలు, వారు ప్రవేశపెట్టిన సామాజిక, ఆర్థిక, విద్యా సంస్కరణలు. ఉదాహర ణకు వర్తక, వ్యాపార అభివృద్ధి, గోల్కొండను సందర్శించిన విదేశీ వర్తకులు, వారి కాలంలో జరిగిన ఆర్థిక వికాసం, పారిశ్రామిక విధానం తదితర అంశాలపై దృష్టి పెట్టాలి. శాతవాహనుల రాజధాని కోటిలింగాల నాలుగు భాగాలుగా తెలంగాణ చరిత్రహనుమంతరావు రాసిన పుస్తకంలో శాతవాహనుల తొలి రాజధాని కృష్ణా జిల్లా శ్రీకాకుళం అని ఉంది. అందుకే ఆంధ్రప్రదేశ్ చరిత్రకారులు రాసిన అలాంటి అంశాలను మార్చుతున్నార . దేశ చరిత్రలో భాగంగా ఏపీ అంశాలు తెలంగాణలో తెలంగాణేతర అంశాలకు ప్రాధాన్యం తక్కువ. ఇందులో విజయనగర చరిత్ర ఉండదు. అయితే భారత దేశ చరిత్ర, స్వాతంత్య్రోద్యమంలో భాగంగా ఏపీ చరిత్ర, సంస్కృతి, అక్కడి సంఘ సంస్కరణ ఉద్యమాలు, స్వాతంత్య్రోద్యమ ఘట్టాలు ఉంటాయి. అభ్యర్థులు ఈ విషయాలను గమనించాలి. పోటీ పరీక్షను బట్టి కొన్ని ఆబ్జెక్టివ్ విధానంలో, మరికొన్ని డిస్క్రిప్టివ్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి. అందుకే ప్రైవేటు పబ్లిషర్లు రూపొందించే ప్రశ్నల నిధిపైనే ఆధారపడవద్దు. దానివల్ల సబ్జెక్టుపై అవగాహన రాదు. అందుకే అభ్యర్థులు ప్రామాణిక గ్రంథాల ఆధారంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ప్రామాణిక గ్రంథాలుగా వేటిని తీసుకోవాలి? పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యే క్రమంలో అభ్యర్థులు ప్రామాణిక గ్రంథాల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తెలుగు అకాడమీ పుస్తకాలు, యూనివర్సిటీల ప్రొఫెసర్లు రాసినవి, బీఎన్ శాస్త్రి వంటి వారి రచనలు, ప్రభుత్వ సంస్థలు ప్రచురించినవి ప్రామాణికంగా తీసుకోవాలి. అలాగనీ ప్రైవేటు రచనలను పట్టించుకోవద్దని కాదు. సాధ్యమైనంతవరకు ప్రభుత్వ పుస్తకాలను తీసుకుంటే మంచింది. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రచురించినవి ఉన్నాయి. తెలుగు అకాడమీ నుంచి తెలంగాణ చరిత్ర, ఆర్థిక శాస్త్రం, రాజకీయ శాస్త్రం పుస్తకాలు రాబోతున్నాయి. అలాగే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రచురించిన ఆంధ్రప్రదేశ్ చరిత్ర-సంస్కృతి పుస్తకంలోని అంశాలను తీసుకోవచ్చు. అందులో తెలంగాణ చరిత్ర, సంస్కృతి అంశాలు ఉన్నాయి. ఏపీ కాంగ్రెస్ ప్రచురించిన సమగ్ర ఆంధ్ర దేశ చరిత్ర-సమస్యలు గ్రంథాన్ని చదువుకోవచ్చు. ఇలాంటి వాటి ఆధారంగానే నోట్స్ సిద్ధం చేసుకోవాలి. అయితే కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ ముద్రణలు, కొన్ని సందర్భాల్లో ప్రైవేటు ముద్రణలు ప్రామాణికం అవుతాయి. విషయ వాస్తవికతను బట్టి ఎంచుకోవాలి. హైదరాబాద్ బుక్ ట్రస్టు, విశాలాంధ్ర, ప్రజాశక్తి ప్రచురణల్లో తెలంగాణ అంశాలు బాగానే ఉన్నాయి. -
గ్రూప్స్‌పై సాక్షి భవిత అవగాహన సదస్సు
-
పోటీ పరీక్షలపై అవగాహన సదస్సు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా భర్తీ చేయనున్న గ్రూప్-1, గ్రూప్-2 తదితర పోటీ పరీక్షలు, సిలబస్‌పై త్వరలోనే అభ్యర్థులకు అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు గ్రూప్-1 అధికారుల సంఘం అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్ తెలిపారు. అభ్యర్థులు పోటీ పరీక్షలకు సిద్ధం కావాల్సిన తీరుపై క్షుణ్నంగా వివరిస్తామన్నారు. సోమవారం టీఎస్పీఎస్సీ సిలబస్ ప్రకటన అనంతరం సంఘం ప్రతినిధులు టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణిని, కమిషన్ సభ్యులను కలసి నిరుద్యోగ అభ్యర్థుల తరపున ధన్యవాదాలు తెలియజేశారు. ముందుగానే సిలబస్ ప్రకటించడం వల్ల అభ్యర్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. అభ్యర్థులు కోచింగ్లపైనే ఆధారపడకుండా.. సిలబస్‌కు అనుగుణమైన ప్రామాణిక గ్రంథాలు, ఆర్టికల్స్ చదువుకుంటూ పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. -
సిలబస్ మార్పులపై కమిటీ
* పోటీ పరీక్షల విషయంలో టీఎస్పీఎస్సీ కసరత్తు సాక్షి, హైదరాబాద్: గ్రూప్-1, గ్రూప్-2 తదితర పోటీ పరీక్షల సిలబస్‌లో మార్పులపై తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) దృష్టిసారించింది. దీనిపై రెండు మూడు రోజుల్లో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. పరీక్షల సిలబస్‌లో చేయాల్సిన మార్పులను సూచిస్తూ ఈ కమిటీ వారంలోగా నివేదిక ఇచ్చేలా చర్యలు చేపడుతోంది. అందులోని సిఫారసులను పరిశీలించిన తర్వాత సిలబస్ మార్పులపై తుది నిర్ణయం తీసుకుని ఫైలును ప్రభుత్వామోదం కోసం పంపించాలని కమిషన్ భావిస్తోంది. ప్రస్తుత సిలబస్‌లో గ్రూప్-1లో 25 శాతం వరకు, గ్రూప్-2 తదితర పోటీ పరీక్షల్లో 50 శాతం వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన సమాచారమే ఉన్నట్లు సమాచారం. ఈ సిలబస్‌ను తెలంగాణ రాష్ట్రానికే పరిమితం చేయాలని కమిషన్ భావిస్తోంది. ఏపీకి సంబంధించిన చాలావరకు సమాచారం అవసరం లేదని, భౌగోళిక, సామాజిక, ఆర్థిక పరిస్థితులు, చరిత్రకు సంబంధించిన అంశాల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వివరాలనే సిలబస్‌లో పెట్టాలని భావిస్తోంది. తద్వారా ప్రస్తుతం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు నష్టం ఉండదని కమిషన్ వర్గాలు పేర్కొన్నాయి. పైగా నోటిఫికేషన్ల తర్వాత విద్యార్థులకు కొంత సమయం ఉంటుంది కనుక వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నాయి. ఇక వచ్చే నెల మొదటి వారంలో టీఎస్పీఎస్సీ వెబ్‌సైట్‌ను ప్రారంభించేందుకు కూడా కసరత్తు జరుగుతోంది. ఈ మేరకు సంబంధిత ఐటీ విభాగం అధికారులతో కమిషన్ సంప్రదింపులు జరుపుతోంది. మరోవైపు ఒకట్రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్‌లో(ఏపీపీఎస్సీ) పని చేస్తున్న తెలంగాణ సిబ్బందిని తెలంగాణకు కేటాయించే ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశాలున్నాయి. నోటిఫికేషన్ల జారీలో తప్పని జాప్యం! రాష్ట్ర విభజనలో భాగంగా వివిధ శాఖల్లో సిబ్బంది విభజనే పూర్తి కానందున కొత్త నోటిఫికేషన్ల జారీపై ప్రభావం పడుతోంది. ప్రభుత్వ శాఖలు తమ అవసరాల మేరకు ఉద్యోగ నియామకాల కోసం ఇండెంట్లు(ప్రతిపాదనలు) ఇస్తే తప్ప నోటిఫికేషన్లు జారీ చేయడం టీఎస్పీఎస్సీకి సాధ్యం కాదు. శాఖలవారీగా ఖాళీ పోస్టులు, కేడర్లవారీగా అర్హతల వివరాలను ఆయా శాఖలే కమిషన్‌కు అందజేయాలి. అలాగే ఆయా పోస్టుల భర్తీకి సర్ప్లస్ మ్యాన్‌పవర్ సెల్(ఎస్ఎంపీసీ), ఆర్థిక శాఖలు అనుమతివ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఏ శాఖలోనూ ఉద్యోగుల విభ జన పూర్తి కాలేదు. అది పూర్తయితేనే శాఖలవారీ అవసరాలపై స్పష్టమైన సమాచారం వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ ఇప్పటికిప్పుడు ఉద్యోగాల భర్తీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇటు టీఎస్పీఎస్సీలోనూ చైర్మన్, ముగ్గురు సభ్యులు, కార్యదర్శి మినహా మరే సిబ్బంది లేరు. కమిషన్‌లో పోస్టులను మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆ పోస్టుల్లోకి ఏపీపీఎస్సీలో పనిచేస్తున్న సిబ్బంది రావాల్సి ఉంది. ఉద్యోగుల విభజన పూర్తయితేనే ఈ పరిస్థితి చక్కబడుతుంది. అప్పటివరకు ఇతర అంశాలపై కమిషన్ దృష్టి సారించే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు మరింతకాలం వేచి చూడక తప్పదు. కమిషన్‌కు పోస్టుల మంజూరు టీఎస్పీఎస్సీకి 121 పోస్టులను సృష్టిస్తూ ఆర్థికశాఖ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. అదనపు కార్యదర్శి స్థాయి నుంచి ఆఫీస్ సబార్డినేట్ వరకు పోస్టులను మంజూరు చేసింది. ఉద్యోగుల విభజనలో భాగంగా ఏపీపీఎస్సీ నుంచి కమిషన్‌కు వచ్చే ఉద్యోగులు మినహా మిగతా పోస్టులను భర్తీ చేసుకోవాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. కమిషన్‌కు అదనపు కార్యదర్శి-1, డిప్యూటీ కార్యదర్శి-2, అసిస్టెంట్ సెక్రటరీ-6, అసిస్టెంట్ సెక్రటరీ(అకౌంట్స్)-1, సెక్షన్ ఆఫీసర్-26, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్-26, జూనియర్ అసిస్టెంట్-26, ష్రాఫ్-1, రికార్డు అసిస్టెంట్-5, రెనో ఆపరేటర్-2, జామేదార్-1, దఫేదార్-2, డ్రైవర్-2, ఆఫీస్ సబార్డినేట్-20 పోస్టులు కొత్తగా వచ్చాయి.