GS Rao
-
అలా... ‘పేరు’ గాంచారు
సాక్షి, కొవ్వూరు : జిల్లాలో రాజకీయంగా చక్రం తిప్పిన నేతలకు, పలువురు ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులుగా చలామణిలో ఉన్న వారికి అసలు పేరు కంటే నిక్ నేమ్స్, ముద్దుపేర్లే బాగా ప్రాచూర్యం పొందాయి. నాని.. బాబు.. బుజ్జి వంటి పేర్లు కలిగిన నాయకులు ప్రస్తుతం జిల్లాలో ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలకు పోటీలో ఉన్నారు. కొందరు పొడవాటి పేర్లు కలిగిన నాయకులను చిన్నపేర్లు పెట్టి పిలవడం పరిపాటి. ఇలా ఆ పేర్లే ఎక్కువగా వాడుకలోకి వచ్చాయి. కొందరికైతే అసలు పేరు కంటే ముద్దుపేర్లు చెబితే గాని తెలియని పరిస్ధితి ఉంది. ఏలూరుకి చెందిన వైఎస్సార్ సీపీ నేత, ఎమ్మెల్సీ ఆళ్ల నాని పూర్తి పేరు కాళీకృష్ణ శ్రీనివాస్. అయినా జిల్లా వాసులకు ఆయన నానిగానే సుపరిచితులు. ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు పూర్తి పేరు వెంకటేశ్వరరావు. జిల్లా నాయకులతోపాటు రాష్ట్ర పార్టీ నాయకులంతా ఆయన్ను బాబుగానే పిలుస్తుంటారు. పూర్తి పేరు కొద్ది మందికి మాత్రమే తెలుసు. తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే ఈలి నాని పూర్తి పేరు ఈలి వెంకట మధుసూదనరావు. నాని అనే పేరు ఎక్కువగా వాడుకలో ఉంది. మాజీ రాజ్యసభ సభ్యుడు యర్రా నారాయణస్వామి జిల్లావాసులకు సుపరితులు. ఆయన్ను బెనర్జీగా పిలుస్తుంటారు. అత్తిలి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం ఆచంట వైఎస్సాఆర్ సీపీ సమన్వయకర్త చెరుకువాడ రంగరాజు పూర్తిపేరు శ్రీరంగనాథరాజు. సన్నిహితులు రంగరాజుగా పిలుస్తుంటారు. ఉండి నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి కలిదిండి రామచంద్రరాజును ఎక్కువ మంది అబ్బాయిరాజుగా పిలుస్తుంటారు. వైఎస్సార్ సీపీ నేత, కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల వెంకట కృష్ణారావును ఈ ప్రాంత వాసులు కృష్ణబాబుగా పిలుస్తుంటారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు జీఎస్ రావు రాష్ట్ర ప్రజలందరికీ సుపరిచితుడు. ఆయన పూర్తి పేరు మాత్రం గెడ్డం సూర్యారావు. డీసీసీ మాజీ అధ్యక్షుడు గోకరాజు రామరాజును సన్నిహితులంతా రామంగా పిలుస్తుంటారు. మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజును సన్నిహితులు మీసాల బాపిరాజుగా పిలుస్తారు. భీమవరం మాజీ ఎమ్మెల్యే పీవీఎల్ నరసింహరాజును యండగండి నరసింహరాజుగా పిలుస్తారు. ఉంగుటూరు వైఎస్సార్ సీపీ సమన్వయకర్త వుప్పాల శ్రీనివాసరావుని వాసుబాబుగా పిలుస్తారు. జిల్లా వాసులందరికీ వాసుబాబుగానే సుపరిచితులు. -
వైఎస్సార్ సీపీలో ప్రముఖుల చేరిక
పెద్దేవం (కొవ్వూరు), న్యూస్‌లైన్ : డీసీసీ మాజీ కార్యదర్శి, చిరంజీవి అభిమాన సంఘాల అధ్యక్షుడు తోట రామకృష్ణ ఆధ్వర్యంలో సుమారు 500 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సోమవారం రాత్రి పెద్దేవంలో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత జీఎస్ రావు సమక్షంలో వైసీపీలో చేరారు. రామకృష్ణ స్వగృహం వద్ద మాజీ సర్పంచ్‌లు గెడ్డం రామారావు, తిగిరిపల్లి సోమయ్య, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు యండపల్లి కృష్ణార్జునుడు, మాజీ ఉప సర్పంచ్ మైలవరపు రాధాకృష్ణ, మలకపల్లి పీఏసీఎస్ డెరైక్టర్ కొలిశెట్టి పరమేశ్వరరావు, వార్డు సభ్యులు బెజవాడ వీర్రాజు, తిగిరిపల్లి పాప, కొలిశెట్టి రాంబాబు, చీకట్ల మంగతాయారు, పీఏసీఎస్ మాజీ డెరైక్టర్ ఇంటి నాగేశ్వరరావు, ఏఎంసీ డెరైక్టర్ తిగిరిపల్లి మరియమ్మలతోపాటు వందలాది మంది కార్యకర్తలు వైఎస్సార్ సీపీలో చేరారు. వీరందరికి జీఎస్ రావుతోపాటు రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు బొడ్డు వెంకట రమణ చౌదరి, జి.శ్రీనివాసనాయుడు, నియోజకవర్గ సమన్వయకర్త తానేటి వనిత తదితరులు కండువాలను వేసి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, చిరంజీవి అభిమాన సంఘం నాయకులు చింతా వెంకటస్వామి, నల్లాకుల వేణుగోపాలకృష్ణ, కొత్తపల్లి సూర్యారావు, నామన పెదబూరయ్య, సిద్ధా రామకృష్ణ, పేపకాయల చలపతిరావు, తోట చంద్రయ్య, కోడి దుర్గారావు, యండపల్లి బ్రాహ్మానందం, ముప్పనాపల్లి సూర్యచంద్రం, నరాలశెట్టి వీరబాబు, నామన వెంకటేశ్వరరావు, గంగిరాజు అన్నవరం, బొర్రా సూరిబాబు, కేశవరపు కృష్ణలతోపాటు పలువురు నాయకులు పార్టీలో చేరారు. కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల కృష్ణబాబు, మాజీ ఎమ్మెల్యే జొన్నకూటి బాబాజీరావు, మండల పార్టీ కన్వీనర్ కొమ్మిరెడ్డి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
నేను... నా ఫ్రెండ్స్
రచయిత జీఎస్ రావు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘నేను... నా ఫ్రెండ్స్’. సందీప్, సిద్దార్థ్‌వర్మ, హరీష్, రవి, అంజన, విష్ణుప్రియ, హారిక, కృతిక, సంగీత ఇందులో హీరో హీరోయిన్లు. పరుచూరి గోపాలకృష్ణ ఇందులో ప్రధాన పాత్ర పోషించారు. తెలుగు సినిమా క్రియేషన్స్ పతాకంపై గండెల హరిత సమర్పణలో వి.మధుసూదన్, సాయిమేథ రమణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ఇది యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ అని, సింగిల్ షెడ్యూల్లో షూటింగ్ పూర్తి చేశామని, అతి త్వరలో పాటలను, చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: పరుచూరి బ్రదర్స్, సంగీతం: చిన్ని చరణ్, సహనిర్మాతలు: మోహన్‌రెడ్డి, చాగూరు రవి, సి.శ్రీనివాసరావు, కిశోర్.