వైఎస్సార్ సీపీలో ప్రముఖుల చేరిక | leaders are going to ysrcp | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ సీపీలో ప్రముఖుల చేరిక

Published Tue, Apr 8 2014 4:22 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

leaders are going to ysrcp

పెద్దేవం (కొవ్వూరు), న్యూస్‌లైన్ : డీసీసీ మాజీ కార్యదర్శి, చిరంజీవి అభిమాన సంఘాల అధ్యక్షుడు తోట రామకృష్ణ ఆధ్వర్యంలో సుమారు 500 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సోమవారం రాత్రి పెద్దేవంలో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత జీఎస్ రావు సమక్షంలో వైసీపీలో చేరారు.
 
రామకృష్ణ స్వగృహం వద్ద  మాజీ సర్పంచ్‌లు గెడ్డం రామారావు, తిగిరిపల్లి సోమయ్య, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు యండపల్లి కృష్ణార్జునుడు, మాజీ ఉప సర్పంచ్ మైలవరపు రాధాకృష్ణ, మలకపల్లి పీఏసీఎస్ డెరైక్టర్ కొలిశెట్టి పరమేశ్వరరావు, వార్డు సభ్యులు బెజవాడ వీర్రాజు, తిగిరిపల్లి పాప, కొలిశెట్టి రాంబాబు, చీకట్ల మంగతాయారు, పీఏసీఎస్ మాజీ డెరైక్టర్ ఇంటి నాగేశ్వరరావు, ఏఎంసీ డెరైక్టర్ తిగిరిపల్లి మరియమ్మలతోపాటు వందలాది మంది కార్యకర్తలు వైఎస్సార్ సీపీలో చేరారు.
 
వీరందరికి జీఎస్ రావుతోపాటు రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు బొడ్డు వెంకట రమణ చౌదరి, జి.శ్రీనివాసనాయుడు, నియోజకవర్గ సమన్వయకర్త తానేటి వనిత తదితరులు కండువాలను వేసి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.

గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, చిరంజీవి అభిమాన సంఘం నాయకులు చింతా వెంకటస్వామి, నల్లాకుల వేణుగోపాలకృష్ణ, కొత్తపల్లి సూర్యారావు, నామన పెదబూరయ్య, సిద్ధా రామకృష్ణ, పేపకాయల చలపతిరావు, తోట చంద్రయ్య, కోడి దుర్గారావు, యండపల్లి బ్రాహ్మానందం, ముప్పనాపల్లి సూర్యచంద్రం, నరాలశెట్టి వీరబాబు, నామన వెంకటేశ్వరరావు, గంగిరాజు అన్నవరం, బొర్రా సూరిబాబు, కేశవరపు కృష్ణలతోపాటు పలువురు నాయకులు పార్టీలో చేరారు.

కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల కృష్ణబాబు, మాజీ ఎమ్మెల్యే జొన్నకూటి బాబాజీరావు, మండల పార్టీ కన్వీనర్ కొమ్మిరెడ్డి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement